ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. | Man Cheats Unemployed Youth Over Jobs In Srikakulam | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..

Published Wed, Jun 6 2018 7:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Man Cheats Unemployed Youth Over Jobs In Srikakulam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాజమహేంద్రవరం క్రైం : ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల వద్ద రూ.లక్షలలో సొమ్ము తీసుకొని మోసం చేసిన అంతర్‌ జిల్లా నిందితుడిని టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టూ టౌన్‌ సీఐ ముక్తేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం సలాది రాంజీ నాయుడు, అలియాస్‌ రామదాసు, అలియాస్‌ సుంకర రామకృష్ణ, అనే వివిధ నకిలీ పేర్లతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

టూ టౌన్‌ పరిధిలో ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు రాంజీ నాయుడు నకిలీ పేర్లుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో వందకు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి వారి వద్ద లక్షల్లో నగదు తీసుకొని మోసం చేశాడని టూ టౌన్‌ సీఐ ముక్తేశ్వరరావు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement