మిషన్‌ ముగిసింది | Akshay Kumar Completes Bell Bottom Shooting | Sakshi
Sakshi News home page

మిషన్‌ ముగిసింది

Published Fri, Oct 2 2020 5:51 AM | Last Updated on Fri, Oct 2 2020 5:51 AM

Akshay Kumar Completes Bell Bottom Shooting - Sakshi

లాక్‌డౌన్‌ తర్వాత పెద్ద హీరోల్లో ఫస్ట్‌ షూటింగ్‌లో పాల్గొన్న స్టార్‌ అక్షయ్‌ కుమార్‌. ఆయన హీరోగా ‘బెల్‌బాటమ్‌’ అనే పీరియాడికల్‌ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్రబృందంతో కలసి స్కాట్‌ల్యాండ్‌ వెళ్లారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓ డిటెక్టివ్‌ సురక్షితంగా ఎలా రక్షించాడన్నది చిత్రకథాంశం. రంజిత్‌ యం. తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ, లారా దత్తా, వాణీ కపూర్‌ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. 40 రోజుల్లో మిషన్‌ని పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement