Vani Kapoor
-
ఓటీటీకి స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ వాణీకపూర్ డిజిటల్ ఎంట్రీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘మర్దానీ 2’ ఫేమ్ దర్శకుడు గోపీ పుత్రన్, మానవ్ రావత్ కలిసి దర్శకత్వం వహించనున్న వెబ్‌సిరీస్ ‘మండల మర్డర్స్’. ఇందులో వాణీకపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు. కాగా వాణీకపూర్‌కు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్. ‘‘యశ్‌రాజ్‌ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న క్రైమ్‌థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఇది. నా తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘మండల మర్డర్స్’ కావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొ న్నారు వాణీకపూర్. కాగా ఈ వెబ్‌సిరీస్ తొలి షెడ్యూల్ త్వరలో మధ్యప్రదేశ్‌లో ప్రారంభం కానుంది. చదవండి: అంచనాలు పెంచుతున్న పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ -
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ వాణీ కపూర్. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్ స్పెషల్‌గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది. గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. కాగా కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Meet Sona ✨ Watch how Sona's character came to life.. pic.twitter.com/loe1mbEgUR Shamshera releasing in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. #RanbirKapoor @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf — Vaani Kapoor (@Vaaniofficial) July 9, 2022 -
రణ్‌బీర్ ‘షెంషేరా’ ట్రైలర్ అవుట్, బాహుబలిని తలపిస్తున్న యాక్షన్ సీన్స్
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి ఒక్కొక్కో అప్డేట్ను వదులుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అన్ని లవ్‌స్టోరీస్ చేస్తూ వస్తున్న రణ్‌బీర్ ఇందులో సరికొత్తగ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్లో రణ్‌బీర్ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడే ఓ తెగ యోధుడిగా కనిపించాడు. ఇందులో అతడు ఆంగ్లేయులతో విరోచితం పోరాడే సీన్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇందులోని పలు సీన్స్ చూస్తుంటే బాహుబలి మూవీని గుర్తు చేస్తున్నాయి. ఇక సంజయ్ దత్ మాస్ లుక్ ఆసక్తిగా ఉంది. రణ్‌బీర్, వాణికపూర్లకు సంబంధించిన సీన్స్ సాంతం ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి షెంషేరా ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. -
చండీగఢ్ కరే ఆషికీ..ఈ కథకు ధైర్యం ఎక్కువ
‘నాకు కొడుకువైనా కూతురివైనా నువ్వే’ అని సాధారణంగా అంటూ ఉంటారు. కాని కొడుకు కూతురిగానో కూతురు కొడుకుగానో నిజంగా మారిపోతే? ‘దేవుడు తప్పు చేశాడు... ఆమె సరిదిద్దుకుంది’ అంటుంది ఈ సినిమాలో డాక్టర్. బాలీవుడ్లో విడుదలైన తాజా సినిమా ‘చండీగఢ్ కరే ఆషికీ’ (చండీగఢ్ ప్రేమ). ఇది ‘ట్రాన్స్ గర్ల్’ లవ్ స్టోరీ. అమ్మాయిగా మారిపోయిన అబ్బాయి తన ప్రేమను గట్టి వ్యక్తిత్వంతో సాధించుకున్న కథ. ఇలాంటి కథకు సాహసం కావాలి. దీనిని చర్చకు పెట్టేందుకు మనసు కావాలి. జనవరి 7న ఓటిటిలో విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్షిప్ పొందిన ఈ సినిమా పరిచయం. దేవుడు నిజంగానే ఒక్కోసారి తప్పు చేస్తాడు. అమ్మాయిని అబ్బాయిగానూ అబ్బాయిని అమ్మాయిగానూ పుట్టిస్తాడు. కాని లోక ఆచారం ప్రకారం ఒక్కసారి అబ్బాయిగా పుట్టాక చచ్చినట్టు అబ్బాయిగా బతకాల్సిందే. అమ్మాయిగా పుట్టాక అమ్మాయిగా జీవించాల్సిందే. ‘మా శరీరాలు తప్పుగా ఉన్నాయి. లోపల మా భావాలు వేరుగా ఉన్నాయి. మమ్మల్ని మాలాగా మేము కోరుకున్నలాగా మారనివ్వండి’ అనంటే సమాజం ఊరుకోదు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాని ట్రాన్స్‌జెండర్స్ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తాము కోరుకున్న రూపాలను పొందుతున్నారు. తమ హక్కులను కోర్టులకు వెళ్లి సాధించుకుంటున్నారు. ఇప్పుడు తమ కలలను ఆకాంక్షలను కౌటుంబిక జీవనాన్ని కూడా సాధించే ప్రయత్నాల్లో పడుతున్నారు. అందుకు సంఘాన్ని సిద్ధం చేస్తున్నారు. ‘చండీగఢ్ కరే ఆషికీ’ ఈ ప్రస్తావన చేస్తోంది. ఆ అంశంతో సినిమా గా ముందుకు వచ్చింది. నిజానికి సినిమా అంటే వ్యాపారం. ‘సెంటిమెంట్’ బెడిసి కొడితే అసలుకే ఎసరు వస్తుంది. కాని ఈ సినిమాలో చాలా సున్నితంగా గౌరవంతో సమస్యను చర్చించారు. అందుకే ప్రేక్షకులు కూడా గౌరవిస్తున్నారు. ఏంటి కథ? చండీగఢ్‌లో ఒక దివాలా తీసిన జిమ్‌ను నడుపుతుంటాడు ఆయుష్మాన్ ఖురానా. తను స్వయంగా బాడీ బిల్డర్ అయినా ప్రతి ఏటా చండీగఢ్‌లో జరిగే ‘బలసంపన్నుల పోటీ’లో ఛాంపియన్‌గా నిలువలేక నంబర్ 2లో వస్తున్నా అతని జిమ్‌కు గిరాకీ ఉండదు. ఆ సమయంలో వాణి కపూర్ ఆ జిమ్‌కు జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా వస్తుంది. ఆమె రాకతో జిమ్‌కు కళ వస్తుంది. అమ్మాయిలు చేరడంతో అబ్బాయిలూ రావడం మొదలెడతారు. క్రమంగా ఆయుష్మాన్ ఖురానా, వాణి కపూర్ ప్రేమలోనూ ఆ తర్వాత శారీరక సంబంధంలోనూ వెళతారు. ‘ఇక మనం పెళ్లి చేసుకుందాం’ అంటాడు ఆయుష్మాన్. అప్పుడు వాణి కపూర్ అతి కష్టం మీద తానెవరో చెబుతుంది. ‘నేను అబ్బాయిగా పుట్టాను. అమ్మాయిగా మారాను. నేనొక ట్రాన్స్గర్ల్ని’ అంటుంది. ఆయుష్మాన్‌కు చాలా పెద్ద దెబ్బగా ఇది అనిపిస్తుంది. తనను వాణికపూర్ వంచించినట్టుగా భావిస్తాడు. పైగా ‘సంప్రదాయ ఆలోచన’ ల ప్రకారం తాను సృష్టి విరుద్ధ శృంగారంలో పాల్గొన్నట్టుగా భావించి తనను తాను అసహ్యించుకుంటాడు. వాణికపూర్ను అవమానిస్తాడు. అతడిని మిత్రులు అవమానిస్తారు. ఊరు అవమానిస్తుంది. కాని ఆయుష్మాన్‌లో ఆమె పట్ల ప్రేమ పోదు. ఆమెకు అతని పట్ల కూడా. కాని ఇది ఓడిపోయే ప్రేమ కథ. ఇన్నాళ్లు విన్నటువంటి ప్రేమ కథ కూడా కాదు. చివరకు ప్రేమ గెలుస్తుంది. నిజమైన శౌర్యం ఏమిటి? సినిమాలో ఆయుష్మాన్ వెయిట్ లిఫ్టర్. తన శౌర్యం నిరూపించుకోవాలనుకుంటాడు. కాని నిజమైన శౌర్యం ఏమిటి? సమాజానికి వెరవకపోవడం... తన ప్రేమలోని నిజాయితీని స్వీకరించడం... వాణికపూర్ మారిన అస్తిత్వాన్ని గౌరవించడం. ‘నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తొందరగా ఇలాంటివి అర్థం కావు. టైమ్ పడుతుంది’ అంటాడు పశ్చాత్తాపంతో వాణికపూర్‌తో. అతనే కాదు... ట్రాన్స్‌జెండర్స్ విషయంలో కుటుంబాలు ఎంత కఠినంగా ఉంటాయో ఎన్నో ఉదంతాలు ఉంటాయి. సినిమాలో అబ్బాయిగా పుట్టిన వాణి కపూర్ సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారుతుంది. దీనిని తండ్రి అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తాడు కాని తల్లి అస్సలు సహించదు. చండీగఢ్‌లో ఆయుష్మాన్‌తో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టాక స్నేహితురాలు ‘నువ్వు ఊరు విడిచి నాలుగురోజులు ఎటైనా పోరాదూ’ అంటుంది. దానికి వాణి కపూర్ ‘నా ఇంట్లో అవమానిస్తున్నారని ఇల్లు వదిలాను. ఊళ్లో అవమానిస్తున్నారని నా ఊరైన అంబాలాను విడిచి పెట్టి ఇక్కడకు వచ్చాను. ఇక్కడ అవమానిస్తున్నారని ఎక్కడకు వెళ్లాలి’ అంటుంది. ‘నా తప్పు ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి నన్ను నేను అమ్మాయిగా భావించాను. నాకిష్టం వచ్చినట్టు మారాను’ అంటుంది వాణి కపూర్. కుటుంబం, సమాజం అర్థం చేసుకోవాల్సింది ఈ మానసిక శారీరక అవస్థనే. అందరూ పుట్టినట్టే ట్రాన్స్‌జెండర్స్ కూడా పుడతారు. కాని వారిని హిజ్రాలంటూ గేలి చేసే దుర్మార్గ సంస్కృతి సమాజంలో ఉంది. వారు తాము కోరుకునే అస్థిత్వంతో ప్రేమ, వివాహం, జీవితం సోకాల్డ్ ‘నార్మల్’ వ్యక్తులతో పొందడానికి ఎన్నో అడ్డంకులు. భేషజాలు. అపోహలు. వాటన్నింటిని మెల్లగా దాటాలి అని చెబుతుంది ఈ సినిమా. ‘జెండర్ ఇన్‌క్లూజివిటీ’... అంటే అన్ని జెండర్ల వాళ్లను సమాజం అంతర్భాగం చేసుకోవాలనే సందేశం ఇవ్వడానికే ఈ సినిమా తీశారు. దర్శకుడిదే ఘనత ఈ సినిమా ఇంత సున్నితంగా, ఆలోచనాత్మకంగా, ఒప్పుకోలుగా ఉండటానికి కారణం దర్శకుడు అభిషేక్ కపూర్ తీసిన పద్ధతి. దానికి హీరో హీరోయిన్లు సపోర్ట్ చేసిన పద్ధతి. ఈ సబ్జెక్ట్ చేయడం ఆయుష్మాన్‌కు సాహసం కాదు కాని వాణి కపూర్‌కు సాహసమే. తనను తాను ట్రాన్స్గర్ల్గా బిలీవ్ చేసి ఆ పాత్ర ఆత్మాభిమానం తాలూకు డిగ్నిటీని ప్రదర్శించింది ఆమె. మధ్య మధ్య చెణుకులతో ఈ సినిమా నవ్విస్తుంది. కాని ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకోమంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూడండి. -
జాగ్రత్త అంటోన్న అక్షయ్, అవి కూడా జీవితాన్నిఇస్తాయంటున్నా అరియాన
తక్కువ విచారించండి, ఎక్కువ నవ్వండి: ప్రగ్యా జైస్వాల్ కొన్ని సమయంలో జీవం లేని వస్తువులు కొత్త జీవితాన్ని ఇస్తాయంటున్న అరియాన గ్లోరీ రణ్వీర్ సింగ్‌కు అలియారేఅలియా స్టేప్పులేస్తున్న అక్షయ్ కుమార్. ఈ స్టెప్పులతో జాగ్రత్త అంటూ హెచ్చరిక ‘నేటి ఈ కష్టం రేపటి మీ బంగారు భవిష్యత్తుకు పునాది’ అంటున్న ప్రియమణి View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
పొట్టి గౌనులో పిచ్చెక్కిస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేసిన వాణీ
పొట్టి గౌను వేసుకొని సమ్మర్లో మరింత చెమటలు పట్టిస్తున్న యాంకర్ రష్మీ కన్నుగీటుతో కుర్రకారును కట్టిపడేస్తున్న మోనాల్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోను నటుడు సుధీర్‌బాబు షేర్ చేశారు. డ్యాన్స్ వీడియోని ఫ్యాన్స్‌లో పంచుకుంది అందాల తాల లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
మిషన్ ముగిసింది
లాక్డౌన్ తర్వాత పెద్ద హీరోల్లో ఫస్ట్ షూటింగ్లో పాల్గొన్న స్టార్ అక్షయ్ కుమార్. ఆయన హీరోగా ‘బెల్‌బాటమ్’ అనే పీరియాడికల్ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్రబృందంతో కలసి స్కాట్‌ల్యాండ్ వెళ్లారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓ డిటెక్టివ్ సురక్షితంగా ఎలా రక్షించాడన్నది చిత్రకథాంశం. రంజిత్ యం. తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ, లారా దత్తా, వాణీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. 40 రోజుల్లో మిషన్‌ని పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
గూఢచారి అక్షయ్
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘బెల్ బాటమ్’ కోసం గూఢచారిగా మారారు. 80ల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ‘బెల్ బాటమ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు అక్షయ్. రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లారా దత్తా, హ్యూమా ఖురేషీ, వాణీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం అక్షయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి హిందీ చిత్రమిదే. ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హైజాక్ వల్ల విమానంలో ఇరుక్కుపోయిన 200 మంది ప్రయాణికులను అక్షయ్ ఎలా కాపాడాడన్నది చిత్రకథ అని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
జోడీ కుదిరింది
మాటల్లో చెప్పలేనంత ఆనందంలో ఉన్నారు హీరోయిన్ వాణీ కపూర్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోవడమే ఆ సంతోషానికి కారణం. అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ ఎమ్. తివారి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కన్నడ హిట్ మూవీ ‘బెల్ బాటమ్’కు ఇది హిందీ రీమేక్. ఇందులోనే అక్షయ్ సరసన నటించబోతున్నారు వాణి. గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘అక్షయ్‌కుమార్‌గారికి జోడీగా నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు వాణీ కపూర్. ఇది కాకుండా ‘షంషేర్’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారామె. ఇందులో రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రధారులు. -
గూఢచారి భార్య
బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ భార్యగా నటించే అవకాశం దక్కించుకున్నారు వాణీకపూర్. రంజిత్ తివారీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో ‘బెల్ బాటమ్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం వాణీకపూర్‌ను ఎంపిక చేశారు. ముందుగా ఈ సినిమాలో ఇటీవల అక్షయ్‌కుమార్ సరసన ఓ మ్యూజిక్ వీడియోలో నటించిన కృతీసనన్ సోదరి నూపుర్ సనన్‌ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా చాన్స్ మాత్రం వాణీకపూర్కే దక్కింది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ గూఢచారిగా కనిపించనున్నారు. అక్షయ్ భార్య పాత్రలో కనిపిస్తారు వాణీకపూర్. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ లుక్కు సంబంధించిన కాస్ట్యూమ్ వర్క్స్, ఆ కాలం నాటి సెట్స్‌ను డిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారట చిత్రబృందం. ఈ చిత్రం కన్నడ హిట్ ‘బెల్ బాటమ్’కు రీమేక్ అని టాక్. -
వివాదాస్పదంగా బ్లౌజ్.. నటిపై కేసు
బాలీవుడ్ కథానాయిక వాణీ కపూర్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆమె వేసుకున్న దుస్తులు తమ మత సాంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ముంబైలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఎమ్ఎన్ జోసీ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల ఆమె వేసుకున్న దుస్తులతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుని అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ దిగారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ బ్లౌజ్‌పై రాసున్న అక్షరాలే ఈ వివాదానికి కారణం. ఆ బ్లౌజ్‌పై హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి పేరు రాసుంది. బ్లౌజ్ మొత్తం ఆయన పేరుతో ప్రింట్ అయివుంది. దాంతో వాణీకపూర్ హిందువుల సంప్రదాయాన్ని మంటగలిపిందని, వారి మనోభావాలను దెబ్బతీసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. వారి పోరు తట్టుకోలేక కొంతసమయం తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కాగా తెలుగులో ‘ఆహా కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకులకు వాణీ కపూర్ పరిచయమైన విషయం తెలిసిందే. -
కాస్టింగ్ కౌచ్‌తో భయపడ్డాను..!
యశ్‌రాజ్ ఫిల్మ్ వారి ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’తో బాలీవుడ్‌కు పరిచయమైన వాణీ కపూర్ ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. శ్రుతి సుబ్రమణ్యం పాత్రతో ఆకట్టుకుంది. ఆదిత్యచోప్రా భారీ చిత్రం ‘వార్’తో ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో హృతిక్‌రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి నటించిన వాణి కపూర్ అంతరంగాలు... ఎంత ప్రేమంటే... ఢిల్లీలో పుట్టి పెరిగాను. భోజనప్రియురాలిని. సినిమాలు...కొత్త, పాత, హిట్టు, ఫట్టు అనే తేడా లేకుండా తెగ చూసేదాన్ని. మా ఫామ్‌హౌస్‌లో ఎన్నో జంతువులు ఉండేవి. కుక్కలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు, పిల్లులు..ఇలా ఎన్నో. మినీ జూ అని చెప్పుకోవచ్చు. కుక్కపిల్లలంటే ఎంత ప్రేమంటే..బురదలో పొర్లాడే వాటిని కూడా ఇంటికి తీసుకువచ్చి శుభ్రపరిచేదాన్ని. ఇంట్లో చాలా క్రమశిక్షణగా పెంచారు. స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవాలనిపించేది. టూరిజం స్టడీస్ కోసం మొదటిసారి ఢిల్లీలో హాస్టల్లో ఉన్నాను. నేను మోడలింగ్‌లోకి రావడం మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. మా అక్కకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లయింది. నాకు స్వతంత్రభావాలు ఎక్కువ. మోడలింగ్ ఏజెన్సీలకు ఇంటర్వ్యూలకు వెళుతున్న సమయంలో లావుగా ఉండేదాన్ని. అయినప్పటికీ సెలెక్ట్ అయ్యాను. ఆ తరువాత మాత్రం రకరకాల వ్యాయమాలు చేసి బరువు తగ్గాను. కాస్టింగ్ కౌచ్ భయంతో మొదట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి భయపడ్డాను. గుర్తింపు ఉన్న మోడలింగ్ ఏజెన్సీ నుంచి రావడం వల్ల కావచ్చు...అదృష్టవశాత్తు నాకు అలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇష్టపడే డైరెక్టర్ ఆదిత్య చోప్రాతో కలిసి పని చేయడం ఇష్టం. ఆయనలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఎంతో జ్ఞానం ఉంది. ఏ విషయాన్ని గురించి అడిగినా టక్కుమని చెప్పేస్తారు. ప్రొఫెషనల్‌గా ఉంటారు. స్పష్టమైన దార్శనికత ఉంది. సినిమా షూటింగ్ ముందు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. టైమ్ విషయంలో ఆయన కచ్చితంగా ఉంటారు. సందేహాలు ఏమైనా ఉంటే షూట్‌కు ముందే అడగాలి. కెమెరా ముందుకు వెళ్లాక మాత్రం...బాగా నటించాలి. అందుకే బాగా ప్రిపేరై కెమెరా ముందుకు వెళ్లేవాళ్లం. ఇష్టమైన ప్రదేశం ప్యారిస్ అంటే చాలా ఇష్టం. ఈ సిటీ అందాలను ఆస్వాదించాలంటే కారు ప్రయాణం చెయ్యనేకూడదు. నడవాలి. అక్కడి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. అర్కిటెక్చర్ అద్భుతం. ‘శుద్ధ్దేశీ’ సినిమాలో ప్యారిస్‌లో పుట్టి, పెరిగిన అమ్మాయి పాత్ర చేశాను. షూటింగ్ చేయడానికి ముందు ఎన్నో ఫ్రెంచ్ సినిమాలు చూశాను. ప్యారిస్‌కు వెళ్లి ఫ్రెంచ్ ప్రజలతో చాలా సమయాన్ని గడిపాను. వారి హావభావాలను క్షుణ్ణంగా పరిశీలించాను. -
అమెజాన్‌లో డోడో అండ్ మోవా
గుర్గావ్: దేశీ అతిపెద్ద ఫ్యాషన్ ఏకీకృత సంస్థ జషేడ్ ఫ్యాషన్టెక్ తన మహిళా దుస్తుల బ్రాండ్ డోడో అండ్ మోవాను గురువారం అమెజాన్ ఫ్యాషన్‌లో ప్రారంభించింది. ఢిల్లీలోని అమెజాన్ ఫ్యాషన్ ఇమే జింగ్ స్టూడియోలో బాలీవుడ్ హీరో యిన్ వాణీ కపూర్ ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జషేడ్ సంస్థ సీఈఓ మిథున్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘అమెజాన్ అనేది ఒక విశ్వసనీయ మార్కెట్ ప్లేస్. ఇక్కడ నుంచి మార్కెటింగ్ జరగడం అంటే.. డోడో – మోయా సరైన స్థానంలోనే ఉన్నట్లుగా అనుకుంటున్నాం. కొనుగోలుదారుల నుంచి ఈ ప్లాట్‌ఫాం ద్వారా మంచి స్పందన వస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు. -
ఆహా! ఏమి ఛాన్సు!!
గాసిప్ ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రానున్న ‘బేఫికర్’ సినిమాలో హీరో రణ్వీర్ సింగ్ అనేది సినీప్రియులకు తెలిసిన విషయమే! మరి తెలియని విషయం, కాస్త కన్ఫ్యూజ్కు గురిచేస్తున్న విషయం... ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది! మొదట్లో అనుష్కశర్మను హీరోయిన్గా అనుకున్నారు. ఆదిత్య చోప్రాకి ముక్కు మీదే కోపం. ఆయనతో ఎక్కువ మాట్లాడినా సమస్యే, తక్కువ మాట్లాడినా సమస్యే, అసలు మాట్లాడక పోయినా సమస్యే అంటుంటారు. మరి అనుష్క తక్కువే మాట్లాడిందో, ఎక్కువే మాట్లాడిందో తెలియదుగానీ... మొత్తానికైతే ‘బేఫికర్’లో రణ్వీర్తో కలిసి నటించే అవకాశం ఆమెకు రాలేదు.ఆ తరువాత పరిణితి చోప్రా పేరు తెర మీదికి వచ్చింది. ‘అబ్బే... ఆమె కాదు’ అన్నాయి విశ్వసనీయవర్గాలు. ఇప్పుడు మాత్రం బలంగా వినిపిస్తున్న పేరు ‘వాణీ కపూర్’. ఎక్కడో విన్నట్లుందే పేరు అనుకుంటున్నారా? అవును పాపం... 2013లో ‘శుద్ధ్ దేసి రొమాన్స్’ సినిమాలో తార పాత్రలో మెరిసింది. ఆ తరువాత మన తెలుగులో నాని సరసన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో నటించిందిగానీ ఆ సినిమా హిట్ కాలేదు. ఇక అప్పటి నుంచి ఆమెకు సినిమాలు లేవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘బేఫికర్’ సినిమాలో హీరోయిన్గా బంపర్ ఆఫర్‌ను ఆదిత్య ఇచ్చినట్లు వినికిడి. నేడో రేపో ఆమె పేరును బహిరంగంగా ప్రకటించడం కూడా ఖాయం అంటున్నారు. చూద్దాం మరి ఆమె అదృష్టబలం ఎంత బలంగా ఉందో! -
ఇల్లు దాటాక స్వేచ్ఛ విలువ తెలిసింది!
లైఫ్ బుక్: వాణీకపూర్ మా నాన్నకు జంతువుల హక్కులకు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది. దీంతో మా ఫామ్‌హౌజ్‌లో ఎటు చూసిన బాతులు, శునకాలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు ఉండేవి. బుజ్జికుక్కపిల్లలు బయట ఎక్కడైనా దీనస్థితిలో కనిపించినా, మురికిగా కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. వాటిని శుభ్రంగా ఉంచేదాన్ని. నాకు అలా జంతువులన్నీ ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. మనుషులతో కంటే వాటితో ఆడుకున్నదే ఎక్కువ. చిన్నప్పుడు చాలా నియమనింబంధనల మధ్య పెరిగాను. కొంత కాలానికి నాకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఢిల్లీలో టూరిజం కోర్సు చేసినప్పుడుగానీ నాకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు నేను మొదటి సారిగా హాస్టల్లో ఉన్నాను. స్వేచ్ఛ విలువ ఏమిటో అప్పుడు తెలిసింది. అయినప్పటికీ, పబ్‌లకు, డిస్కోలకు వెళ్లడం కంటే ఇంట్లో జరిగే విందులనే బాగా ఇష్టపడతాను. నాలో ఆధునిక భావాలు ఉన్నప్పటికీ... నా హృదయం మాత్రం పాత ప్రపంచంలోనే ఉంది! కొన్నిసార్లు అడగకుండానే అదృష్టం ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడల్ కావాలనేది నా కోరిక. అయితే నా కోరికకు నా బరువు ప్రతిబంధకంగా కనిపించేది. అయినప్పటికీ ఏదో ఆశ. 75 కిలోల బరువుతో ఢిల్లీలోని ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీకి ఇంటర్వ్యూకు వెళ్లాను. ఎంపికవుతానని పొరపాటున కూడా అనుకోలేదు. అదేం అదృష్టమోగానీ ఎంపికయ్యాను. ఆ తరువాత చాలా బరువు తగ్గాను. ‘ఇది జరగాలి’ ‘అది జరగాలి’ అనే కోరికలు ఏమీ లేవు. జరగాల్సి ఉంటే కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో సినిమాల్లో నటించాలనే ఊహే రాదు. నేను కూడా సినిమాల్లోకి రావాలనే ఎప్పుడు అనుకోలేదు. కానీ విధి ఇలా నిర్ణయించింది! -
గబ్బర్ సింగ్ 2 హీరోయిన్ వాణీకపూర్