బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ వాణీకపూర్ డిజిటల్ ఎంట్రీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘మర్దానీ 2’ ఫేమ్ దర్శకుడు గోపీ పుత్రన్, మానవ్ రావత్ కలిసి దర్శకత్వం వహించనున్న వెబ్‌సిరీస్ ‘మండల మర్డర్స్’. ఇందులో వాణీకపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు.
కాగా వాణీకపూర్‌కు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్. ‘‘యశ్‌రాజ్‌ఫిల్మ్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న క్రైమ్‌థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఇది. నా తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘మండల మర్డర్స్’ కావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొ న్నారు వాణీకపూర్. కాగా ఈ వెబ్‌సిరీస్ తొలి షెడ్యూల్ త్వరలో మధ్యప్రదేశ్‌లో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment