![Vaani Kapoor to star opposite Akshay Kumar in Bell Bottom - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/20/Vani-Kapoor-1.jpg.webp?itok=V2-sjilt)
వాణీకపూర్
బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ భార్యగా నటించే అవకాశం దక్కించుకున్నారు వాణీకపూర్. రంజిత్ తివారీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో ‘బెల్ బాటమ్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం వాణీకపూర్‌ను ఎంపిక చేశారు. ముందుగా ఈ సినిమాలో ఇటీవల అక్షయ్‌కుమార్ సరసన ఓ మ్యూజిక్ వీడియోలో నటించిన కృతీసనన్ సోదరి నూపుర్ సనన్‌ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా చాన్స్ మాత్రం వాణీకపూర్‌కే దక్కింది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ గూఢచారిగా కనిపించనున్నారు. అక్షయ్ భార్య పాత్రలో కనిపిస్తారు వాణీకపూర్. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ లుక్‌కు సంబంధించిన కాస్ట్యూమ్ వర్క్స్, ఆ కాలం నాటి సెట్స్‌ను డిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారట చిత్రబృందం. ఈ చిత్రం కన్నడ హిట్ ‘బెల్ బాటమ్’కు రీమేక్ అని టాక్.
Comments
Please login to add a commentAdd a comment