Bell Bottom
-
అక్షయ్ పక్కా ప్లాన్.. 2000 కోట్ల టార్గెట్.. ఏ హీరోకి సాధ్యపడని రికార్డు
2021లో బాలీవుడ్ బాక్సాఫీస్ స్టార్ ఎవరూ అంటే అక్షయ్ కుమార్ పేరు మాత్రమే చెప్పాలి. ఈ ఏడాది రిలీజ్ చేసిన ‘బెల్ బాటమ్’ తో బాలీవుడ్ లో మళ్లీ స్టార్ హీరోలు తమ చిత్రాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడం ప్రారంభించారు. సూర్యవంశీ ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించి ....అదే బాక్సాఫీస్ ను పరుగులు పెట్టించాడు. ఇలా ఈ ఏడాది అక్షయ్ నటించిన రెండు చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ భారీ వసూళ్లను రాబట్టగా.. మరో సినిమా అతరంగీరే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. వచ్చే ఏడాది కూడా ఇదే స్పీడ్ చూపించనున్నాడు అక్షయ్. జనవరిలో పృథ్వీరాజ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత లిస్ట్ లో బచ్చన్ పాండే, రక్షాబంధన్, రామ్ సేతు, మిషన్ సిండ్రెల్ల, ఓమైగాడ్ 2, చిత్రాలు ఉన్నాయి.వీటన్నిటితో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం ది ఎండ్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ అన్ని కూడా 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థ్రియేట్రికల్ రైట్స్, శాటీలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో దాదాపు 2000 వేల కోట్లకు పైగా బిజినెస్ జరగనుంది. ఇంత మొత్తంలో ఒక హీరో వల్ల వ్యాపారం జరగడం ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఎన్నడూ చూడలేదు.మొత్తంగా బాలీవుడ్ కు అక్షయ్ మనీ మెషి న్ గా మారాడు. -
అమెజాన్‌లో ప్రైంలోకి అక్షయ్ ‘బెల్ బాటమ్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ఈ నెల 16న ఈ మూవీని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్లు అక్షయ్‌కుమార్ ట్వీట్ చేశాడు. ఈ మూవీ గత నెల 19న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. 1984లో జరిగిన ఓ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ కథే ఇతివృత్తంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ రా ఏజెంట్‌గా నటించాడు. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాగానే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. ఇక ఓటీటీలో సందడి చేయనుంది. ‘డేట్ మీరు గుర్తుంచుకోండి.. మిషన్ నేను గుర్తు చేస్తా’ అంటూ బెల్ బాటమ్ ఓటీటీ రిలీజ్‌పై అక్షయ్ ట్వీట్ చేశాడు. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన లఢాక్ థియేటర్లోనూ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. Date aap yaad rakhna, mission hum yaad dila denge. #BellBottomOnPrime, releases September 16.@PrimeVideoIN @vashubhagnani @vaaniofficial @humasqureshi @LaraDutta @ranjit_tiwari @jackkybhagnani @honeybhagnani @poojafilms pic.twitter.com/iMbmEjOJDq — Akshay Kumar (@akshaykumar) September 12, 2021 -
పీకల్లోతు కష్టాల్లోకి బాలీవుడ్.. నార్త్ ఆడియెన్స్ కు ఏమైంది?
సినిమాలు తీసేది ఎవరికోసం...ఆడియెన్స్ కోసం....వారి ఆదరిస్తే చాలు, నిర్మాత కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మనగలుగుతుంది. కాని బాలీవుడ్ లో ఇందుకు భిన్నమైన సిచ్యూవేషన్స్ కనిపిస్తున్నాయి. కొత్త సినిమాపై అక్కడి ఆడియెన్స్ ఏమాత్రం కనికరం చూపించడం లేదు. కొత్తగా విడుదల అవుతున్న సినిమాలకు మినిమం వసూళ్ల లేక విలవిల్లాడుతున్నాయి.ఆడియెన్స్ థియేటర్స్ వైపు చూడకపోవడంతో దర్శకనిర్మాతల్లో టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. బెల్ బాటమ్ రూ.20 కోట్ల మార్క్ దాటలేదు అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ రిలీజై 10 రోజులవుతున్నా వసూళ్లు మాత్రం 20 కోట్ల మార్క్ దాటలేదు. చెహ్రే అనే మరో మల్టీస్టారర్ మూవీ కూడా ఇటీవలే విడుదలైంది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హాష్మీ లాంటి స్టార్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు 50 లక్షలు దాటలేదు..ఈ వసూళ్లను చూస్తున్న నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దాదాపు 18 నెలలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ డల్ గా ఉంది. బాలీవుడ్ కు ఎక్కువ శాతం వసూళ్లను అందించే రాష్ట్రం. మహారాష్ట్ర.అక్కడ థియేటర్స్ ఇప్పటికీ తెరుచుకోకపోవడం అనేది హిందీ సినీ పరిశ్రమను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. మినిమం వసూళ్లను కూడా అందుకోలేకపోతోంది. బెల్ బాటమ్, చెహ్రే తర్వాత సెప్టెంబర్ 10న కంగనా నటించిన తలైవి చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీతోనైనా బాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ ఫామ్ అందుకుంటుందా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. -
ఆ స్టార్ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్!
టాలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రకుల్‌ప్రీత్ సింగ్ ఈ మధ్య బ్రేక్ తీసుకుంది. కుటుంబ సభ్యులతో ఈ విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న రకుల్ మళ్లీ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘కొండపొలం, తమిళంలో భారతీయుడు-2, అక్టోబర్ 31 లేడీస్ నైట్, అయలాన్’తో పాటు హిందీలో ‘ఎటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ’ వంటి ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు ప్రస్తుతం సాధారణ స్థితికి రావడంతో థియేటర్లో మళ్లీ సినిమాలు సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మూవీని థియేటర్లో చూసి కన్నీటి పర్యంతరం అయినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. చదవండి: అమితాబ్ నాకంత జీతం ఇవ్వలేదు: బాడీగార్డు అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ తివారీ దర్శకత్వంతో తెరకెక్కిన ‘బెల్ బాటమ్’ మూవీ ఇటీవల థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రకుల్ అతిథి పాత్రలో కనిపించింది. దీంతో చిత్ర మూనిట్‌తో కలిసి ఆమె ‘బెల్ బాటమ్’ను థియేటర్లో చూసిందట. చాలా రోజుల తర్వాత తొలిసారి థియేటర్లో సినిమా చూడటంతో తను ఒక్కసారిగి భావోద్వేగానికి లోనయ్యానని, స్క్రీన్‌పై పేర్లు రాగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సినిమాను థియేటర్లో విడుదల చేసిన మేకర్స్ రకుల్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. కాగా టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రకుల్, రానాలతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. చదవండి: సినిమాలకు సమంత బ్రేక్.. అందుకేనా! టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. నోటీసులు రాలేదంటున్న నటులు! -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్!
Lara Dutta: తెరపై నటీనటులను గుర్తుపట్టలేనంతగా మార్చేయగల మ్యాజిక్ మేకప్‌కు ఉంది. అందుకు తాజా ఉదాహరణ లారా దత్తా. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'బెల్ బాటమ్'లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర చేశారు లారా. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన లారా దత్తా లుక్కు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందిరా గాంధీ గెటప్‌లో ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆమె ఒదిగిపోయారు. తను తనేనా? ఒక మనిషిని మేకప్ ఇంతలా మార్చేయగలదా? ఈవిడ ఎవరో గుర్తుపట్టలేరని పందెం కడుతున్నాం అని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఫొటో చూశారుగా.. నిజంగానే లారా.. లారాలా లేరు కదూ. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన హైజాక్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ మూవీకి రంజిత్ ఎం.తివారీ దర్శకుడు. -
థియేటర్లలోనే అక్షయ్ ‘బెల్‌బాటమ్’, విడుదల తేదీ ఎప్పుడంటే..
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన అభిమానులకు శభవార్తను అందించాడు. ఆయన నటించిన ‘బెల్‌బాటమ్’ చిత్రం జూలై 27వ తేదిన థియేటర్లలోకి రానున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. గతేడాది షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ భారీ చిత్రాన్ని 2020 లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే ఏమైందో కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో బెల్బాటమ్ను స్మాల్ స్క్రీన్‌పై కాకుండా బిగ్స్క్రీన్పైనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. బాలీవుడ్‌కు దాదాపు 60 శాతం రెవెన్యూ ఇచ్చే ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఫస్ట్ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు థియేటర్లు తెరుచుకోలేదు. ఇక ‘బెల్‌బాటమ్’ మూవీ మేకర్స్ తాజా నిర్ణయింతో అక్కడ థియేటర్లు తెరుచుకోనున్నాయని స్పష్టమైంది. ఈ సినిమాతో పాటు మరిన్ని బాలీవుడ్ పెద్ద సినిమాలు ‘సూర్యవంశీ, పృథ్వీరాజ్, జెర్సీ, 83, సత్యమేవ జయతే, గంగూబాయ్, లాల్‌సింగ్ చద్దా, కథియావాడి, పఠాన్ వంటి చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అన్ని కూడా స్టార్ హీరోహీరోయిన్ల చిత్రాలే కావడంతో ఇక బీ-టౌన్ థియేటర్లలో సందడి నెలకొననుంది. కాగా ఇప్పటికే అమెరికాలోని మార్కేట్లన్నీ తెరుచుకోవడంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’, ‘క్వైట్ ప్లేస్ 2’, ‘కంజూరింగ్ 3’ లాంటి హాలీవుడ్ చ్రితాలు విడుదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమాలు ఇండియాకు కూడా రానున్నాయి. -
ఓటీటీలో బెల్ బాటమ్?
కోవిడ్ వల్ల థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్లో ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద స్టార్ హీరో సినిమా అక్షయ్ కుమార్‌దే. ఆయన నటించిన ‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ’ను డిస్నీ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల చేశారు. తాజాగా అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘బెల్‌బాటమ్’ కూడా ఓటీటీలోనే విడుదల కానుందని బాలీవుడ్ టాక్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. థియేటర్లు మళ్లీ ప్రారంభమైనప్పటికీ ఓటీటీలో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారనే చర్చ బాలీవుడ్లో సాగుతోంది. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన హిందీ చిత్రాల్లో ‘బెల్‌బాటమ్’ ముందుంటుంది. ఈ సినిమాలో డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తారు అక్షయ్ కుమార్. -
‘బెల్ బాటమ్’ టీజర్ విడుదల చేసిన అక్షయ్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న చితరం ’బెల్ బాటమ్’. ఇటీవల ఈ చిత్రం స్కాట్లాండ్లో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్షయ్ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను సోమవారం ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నాడు. దీనికి అక్షయ్ ‘గో బెల్ బాటమ్.. త్వరలో 80లోని థ్రిల్లింగ్ మీ ముందుకు వస్తుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. రంజిత్ ఎమ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ రా(ఆర్ఏడబ్ల్యూ) ఎజెంట్‌గా నటిస్తున్నాడు. టీజర్లో అక్షయ్ 1980లోని బెల్ బాటమ్ సూట్ ధరించి.. విమానాశ్రయంలో విమానాల వైపు నడుస్తున్నట్లు కనిపించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో అమలైన లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడింది. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి) తిరిగి జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభం కావడంతో చిత్ర తారాగణం అగష్టులో యూకే వెళ్లింది. అక్కడ షూటింగ్ ముగించుకుని తిరిగి సెప్టెంబర్ 30న ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో అక్షయ్ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ షేర్ చేస్తూ.. ‘ఒంటరిగా మనం చాలా తక్కువ చేస్తాం. అదే ఒక టీంగా కలిస్తే చాలా చేయగలం. మా సినిమా సభ్యులు చాలా కృషి చేశారు. వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు. బెల్ బాటమ్ కంప్లీటెట్’ అంటూ ట్వీట్ చేశాడు. యూకే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంబంధించిన పోస్టు ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 20న విడుదల కానుంది. (చదవండి: మిషన్ ముగిసింది) Go BellBottom! Here’s a thrilling throwback to the 80s. 🙌🏼 Presenting #BellBottomTeaserhttps://t.co/U9KEoyggXj .#BellBottom @vashubhagnani @vaaniofficial @humasqureshi @LaraDutta @ranjit_tiwari @jackkybhagnani @honeybhagnani — Akshay Kumar (@akshaykumar) October 5, 2020 -
మిషన్ ముగిసింది
లాక్డౌన్ తర్వాత పెద్ద హీరోల్లో ఫస్ట్ షూటింగ్లో పాల్గొన్న స్టార్ అక్షయ్ కుమార్. ఆయన హీరోగా ‘బెల్‌బాటమ్’ అనే పీరియాడికల్ చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్రబృందంతో కలసి స్కాట్‌ల్యాండ్ వెళ్లారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఓ డిటెక్టివ్ సురక్షితంగా ఎలా రక్షించాడన్నది చిత్రకథాంశం. రంజిత్ యం. తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హ్యుమా ఖురేషీ, లారా దత్తా, వాణీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. 40 రోజుల్లో మిషన్‌ని పూర్తి చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. -
గూఢచారి అక్షయ్
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘బెల్ బాటమ్’ కోసం గూఢచారిగా మారారు. 80ల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ‘బెల్ బాటమ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు అక్షయ్. రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లారా దత్తా, హ్యూమా ఖురేషీ, వాణీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం అక్షయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి హిందీ చిత్రమిదే. ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హైజాక్ వల్ల విమానంలో ఇరుక్కుపోయిన 200 మంది ప్రయాణికులను అక్షయ్ ఎలా కాపాడాడన్నది చిత్రకథ అని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. -
చలో స్కాట్‌ల్యాండ్
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వదేశంలో షూటింగ్ అంటేనే రిస్క్.. ఇక విదేశాల్లో షూటింగ్ ఎలా? అని సినిమా ఇండస్ట్రీ ఆలోచిస్తోంది. కానీ విదేశాల్లో షూటింగ్ కి సంబంధించిన ప్లానింగ్ మాత్రమే కాదు.. ప్రయాణం కూడా మొదలెట్టారు అక్షయ్ అండ్ టీమ్. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘బెల్ బాటమ్’. రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వాణీకపూర్ కథానాయిక. లారా దత్, హ్యూమా ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిటెక్టివ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 120 మంది స్కాట్ ల్యాండ్ ప్రయాణమయ్యారు. లాక్ డౌన్ తర్వాత విదేశాల్లో షూట్ చేయనున్న చిత్రమిదే. ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుసరిస్తూ చిత్రీకరణ ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ రిస్ట్ బ్యాండ్లు అందించారట. దీంతో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి బ్లడ్ ప్రెషర్, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లెవెల్.. అన్నీ తెలుసుకోవచ్చు. స్కాట్ ల్యాండ్ వెళ్లిన తర్వాత కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాతే చిత్రీకరణకు సంబంధించిన పనులు మొదలు పెడతారట. ‘‘మళ్ళీ షూటింగ్ తో బిజీ అయ్యే టైమ్ రావడం చాలా బావుంది’’ అన్నారు అక్షయ్ కుమార్. -
జోడీ కుదిరింది
మాటల్లో చెప్పలేనంత ఆనందంలో ఉన్నారు హీరోయిన్ వాణీ కపూర్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోవడమే ఆ సంతోషానికి కారణం. అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ ఎమ్. తివారి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కన్నడ హిట్ మూవీ ‘బెల్ బాటమ్’కు ఇది హిందీ రీమేక్. ఇందులోనే అక్షయ్ సరసన నటించబోతున్నారు వాణి. గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘అక్షయ్‌కుమార్‌గారికి జోడీగా నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు వాణీ కపూర్. ఇది కాకుండా ‘షంషేర్’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారామె. ఇందులో రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రధారులు. -
గూఢచారి భార్య
బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ భార్యగా నటించే అవకాశం దక్కించుకున్నారు వాణీకపూర్. రంజిత్ తివారీ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో ‘బెల్ బాటమ్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం వాణీకపూర్‌ను ఎంపిక చేశారు. ముందుగా ఈ సినిమాలో ఇటీవల అక్షయ్‌కుమార్ సరసన ఓ మ్యూజిక్ వీడియోలో నటించిన కృతీసనన్ సోదరి నూపుర్ సనన్‌ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా చాన్స్ మాత్రం వాణీకపూర్కే దక్కింది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ గూఢచారిగా కనిపించనున్నారు. అక్షయ్ భార్య పాత్రలో కనిపిస్తారు వాణీకపూర్. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ లుక్కు సంబంధించిన కాస్ట్యూమ్ వర్క్స్, ఆ కాలం నాటి సెట్స్‌ను డిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారట చిత్రబృందం. ఈ చిత్రం కన్నడ హిట్ ‘బెల్ బాటమ్’కు రీమేక్ అని టాక్. -
నో క్లాష్
పండగ సీజన్లో రెండుమూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకోవడం సహజం. పండగ సెలవులను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తారు. అలా ఈ ఏడాది క్రిస్మస్కి ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ విడుదలకు సిద్ధమయ్యాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ ఉంటుందని ఊహించారందరూ. అయితే ఈ క్లాష్ తప్పింది. ‘బచ్చన్ పాండే’ టీమ్‌ను ఆమిర్‌ఖాన్ రిక్వెస్ట్ చేయడంతో అక్షయ్ తన సినిమాను జనవరిలో రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నారు. ‘‘కొన్నిసార్లు ఒక్క సంభాషణ చాలు పరిష్కరించుకోవడానికి. నా విన్నపాన్ని మన్నించి వాళ్ల సినిమా విడుదల తేదీ మార్చుకుంటున్నందుకు అక్షయ్ కుమార్, నిర్మాత సాజిద్ నడియాడ్వాలాకి థ్యాంక్స్. వాళ్ల సినిమాకు ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశారు ఆమిర్. ‘‘నీ కోసం ఎప్పుడైనా ఏమైనా చేయడానికి రెడీ ఆమిర్. మనం స్నేహితులం’’ అని సమాధానం ఇచ్చారు అక్షయ్. అలాగే ‘బచ్చన్ పాండే’ను 2021 జనవరి 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. విశేషం ఏంటంటే అదే రోజు అక్షయ్ కుమార్ డిటెక్టివ్ థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’ విడుదల కావాల్సింది. ‘‘నేను నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతాయని జోక్స్ చేసుకుంటున్నారా? ‘బచ్చన్ పాండే’ కోసం ‘బెల్ బాటమ్’ను 2021 ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు అక్షయ్. -
రీమేక్ కుమార్
ఏడాదికి మూడు సినిమాలతో హిందీ ప్రేక్షకులను పలకరిస్తారు అక్షయ్ కుమార్. దేశభక్తి, యాక్షన్, సోషల్ మెసేజ్, మల్టీస్టారర్ కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారాయన. అప్పుడప్పుడు రీమేక్ సినిమాల్లోనూ మెరుస్తుంటారు. కానీ, ఇటీవల అక్షయ్ కుమార్ సినిమాల ఎంపిక చూస్తుంటే... ఆయన ఆసక్తి రీమేక్స్ మీదకు మళ్లినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఉన్న 5 సినిమాల్లో 3 రీమేక్సే కావడం విశేషం. తమిళంలో హిట్ అయిన ‘వీరమ్’ ఆధారంగా ‘బచ్చన్ పాండే’ సినిమా చేస్తున్నారు. సౌత్ ఆడియన్స్‌ను భయపెట్టిన ‘కాంచన’ను ‘లక్ష్మీబాంబ్’గా చుడుతున్నారు. తాజాగా ‘బెల్ బాటమ్’ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా అధికారికంగా ‘బెల్‌బాటమ్’ చిత్రానికి రీమేక్ కాకపోయినా, ఆ సినిమా స్ఫూర్తిగా సాగనుందని టాక్. ఆ చిత్ర విశేషాలేంటో చదువుదాం. లక్ష్మీ బాంబ్ హారర్–కామెడీ సినిమాల్లో ‘కాంచన’ సిరీస్ సౌత్‌లో సూపర్ సక్సెస్ఫుల్. అన్యాయంగా హత్య చేయబడ్డ ఓ వ్యక్తి ఆత్మ రాఘవ లారెన్స్ శరీరంలోకి ప్రవేశించి తన పగను తీర్చుకోవడం అనేది ఈ సిరీస్‌లోని సినిమాల కథ. అన్యాయానికి గురై హత్య చేయబడ్డ ఓ హిజ్రా ఆత్మగా మారి ఎలా పగ తీర్చకుందనేది ‘కాంచన 2’ సినిమా కథ. ‘కాంచన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో లారెన్స్‌కి ఇదే తొలి సినిమా. 2020 జూన్ నెలాఖరులో ‘లక్ష్మీ బాంబ్’ థియేటర్స్‌లో పేలనుంది. వీరమ్– బచ్చన్ పాండే ఒక ఊరిలో పంచ పాండవుల్లాంటి అన్నదమ్ములు. నలుగురు తమ్ముళ్లంటే అన్నయ్యకు వల్లమాలిన ప్రేమ. పెళ్లి చేసుకుంటే అన్మదమ్ముల అనుబంధం దెబ్బతింటుందేమోనని వద్దనుకుంటాడు. తమ్ముళ్లను కూడా అదే ఫాలో అవ్వమంటాడు. అన్న చాటుగా పెరిగిన తమ్ముళ్లు అన్నకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. తమ ప్రేమలకు గ్రీన్ సిగ్నల్ పడాలంటే అన్నయ్య కూడా ప్రేమలో పడాలని తమ్ముళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అందరూ కలసి అన్న మనసు మార్చారా? లేదా? తర్వాత ఏం జరిగింది? అన్నది ‘వీరమ్’ కథాంశం. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘కాటమరాయుడు’ టైటిల్‌తో పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. ఈ చిత్ర హిందీ రీమేక్ ‘బచ్చన్ పాండే’ 2020 క్రిస్మస్కు విడుదల కానుంది. బెల్ బాటమ్ జేమ్స్‌బాండ్ సినిమాలు, డిటెక్టివ్ సినిమాలు విపరీతంగా చూసి, క్రైమ్ నవలలు బాగా చదివి డిటెక్టివ్‌ల మీద ఒకలాంటి ఇష్టం ఏర్పరచుకుంటాడు హీరో. వృత్తికి కానిస్టేబుల్ అయినా డిటెక్టివ్‌గా ఫీల్ అవుతాడు. ఓ మర్డర్ మిస్టరీని అవలీలగా పరిష్కరిస్తాడు. దీంతో ఓ భారీ దొంగతనం కేసును పరిష్కరించే బాధ్యతని హీరోకి అప్పచెబుతుంది ప్రభుత్వం. ఈ కేసులో ప్రమేయం ఉన్న వాళ్లని ఎలా పట్టుకున్నాడన్నదే ‘బెల్ బాటమ్’ కథాంశం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను జయ తీర్థ తెరకెక్కించారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘బెల్ బాటమ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు అక్షయ్. 2021 జనవరిలో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. బాలీవుడ్‌కు కథలు అవసరమున్నప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీ సూపర్ హిట్ కథలు ఇస్తూ వస్తోంది. సల్మాన్ ఖాన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు సక్సెస్‌పుల్ స్టార్ట్ (తెలుగు ‘పోకిరి’ చిత్రాన్ని ‘వాంటెడ్’గా రీమేక్ చేశారు) ఇచ్చింది రీమేకే. బాలీవుడ్‌కు తొలి వంద కోట్ల గ్రాసర్‌ని ఇచ్చింది (గజిని) సౌత్ రీమేకే. కథ కావాల్సినప్పుడల్లా బాలీవుడ్‌ను పలకరించే దక్షిణాది బంధువు రీమేకే. గత రీమేక్‌లు అక్షయ్ కుమార్ గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ సినిమాని ‘రౌడీ రాథోడ్’గా, తమిళ ‘రమణ’ చిత్రాన్ని ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా, తమిళ ‘తుపాకి’ చిత్రాన్ని ‘హాలిడే’గా, మలయాళ ‘మణిచిత్రతాళ్’ సినిమాను ‘భూల్ బులయ్య’గా, మలయాళ ‘రామ్‌జీ రావ్ స్పీకింగ్’ను ‘హేరా ఫేరీ’గా రీమేక్ చేశారు. కత్తి పట్టనున్నారు ఏఆర్ మురగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘కత్తి’. మల్టీనేషనల్ కంపెనీల ప్రభావం సామాన్య రైతుల మీద ఎలా పడుతోంది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తారని తెలిసింది. ఏఆర్ మురగదాస్ దగ్గర పనిచేసిన జగన్ శక్తి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. -
సీతాకోక రెక్కలు
బెల్ బాటమ్ ప్యాంట్స్ గురించి తెలిసిందే కదా! పాదాల వద్ద చాలా వదులుగా ‘బెల్’ ఆకారంలో ఈ ప్యాంట్స్ ఉంటాయి. ఇదే విధానం బెల్ ప్యాటర్న్‌ని స్లీవ్స్‌కి ఉపయోగించారు డిజైనర్లు. ముంజేతులు, మోచేతుల వద్ద ‘బెల్’ ఆకారం వస్తుంది. కుచ్చుల అమరిక అయితే భుజం నుంచి కూడా తీసుకోవచ్చు. వీటిని బటర్‌ఫ్లై స్లీవ్స్ అంటారు. ‘బిషప్ స్లీవ్స్’గా కూడా వీటికి మరో పేరుంది. బ్యూటీ విదేశాల్లో మొదలైన స్టైల్ మ్యాక్సీ డ్రెస్‌కు బెల్ స్లీవ్స్ వాడకం 1970లో మొదలయ్యింది. ఆ ప్యాటర్న్ ఈ పదేళ్లలో రకరకాల వెస్ట్రన్ డ్రెస్‌లకు హంగుగా మారింది. అయితే, ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం ఇటీవలే! మనవాళ్లూ అందిపుచ్చుకున్నారు దేశీయ సంప్రదాయ దస్తులను స్టైలిష్‌గా రూపకల్పన చేయడంలో ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు ఉత్సుకత చూపుతూనే ఉన్నారు. దీంట్లో భాగంగానే చిన్న చిన్న గౌన్లతో పాటు బ్లౌజ్‌లకూ బెల్ షేప్ స్లీవ్స్ తీసుకువచ్చారు. దీంతో ఇవి కాస్త సంప్రదాయం, మరికాస్త పాశ్చాత్యంతో యువతరాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయానికి అసలు సిసలు చిరునామాగా ఉండే చీరలకూ ఈ స్టైల్‌ని తీసుకువచ్చారు. శారీ బ్లౌజులకు కూడా బెల్ స్లీవ్స్, బటర్‌ఫ్లై స్లీవ్స్ జత చేయడంతో సరికొత్త స్టైల్‌తో అమ్మాయిలను, అమ్మలనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పూర్తి కాంట్రాస్ట్‌తో మెరుపులు చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకుని లాంగ్ స్లీవ్స్‌ను బెల్షేప్లా డిజైన్ చేయాలి. దీని వల్ల మరో ఎంబ్రాయిడరీ వర్క్ అవసరం ఉండదు. లాంగ్ జాకెట్‌కు కుచ్చులు, లెహంగా, స్కర్ట్మీదకు లాంగ్ జాకెట్‌ని డిజైన్ చేసుకొని దీనికి బెల్ లేదా కుచ్చుల స్లీవ్స్‌ని జత చేస్తే చాలు ఇండో వెస్ట్రన్ లుక్‌తో పార్టీలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెప్లమ్ బ్లౌజ్ జాకెట్ నడుము భాగంలో కుచ్చుల పార్ట్‌ను అదనంగా జత చేస్తే పెప్లమ్ బ్లౌజ్ అవుతుంది. దీనికి బెల్ స్లీవ్స్ లేదా కుచ్చుల స్లీవ్స్ జత చేస్తే జాకెట్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఈ మోడ్రన్ జాకెట్‌ను అటు లాంగ్ లెహంగాల మీదకే కాకుండా జీన్స్ వంటి అధునాతన ప్యాంట్స్మీదకూ ధరించవచ్చు. జాకెట్ చేతుల భాగం వదులుగా ఉండటం వల్ల వేసవి ఉక్కకు సరైన పరిష్కారం కూడా దొరికినట్టే. స్టైల్‌కి స్టైల్ .. సౌకర్యానికి సౌకర్యం. ఒకే నగ కాలికి.. భుజానికి అందమైన ఆభరణాలతో మేనిని సింగారించడం అనే మాట మగువలకు అత్యంత ప్రియమైనది. ఆధునిక మహిళల మదిని దోచుకునేలా బాడీ జువెల్రీ పేరుతో కాలికి, భుజానికి పట్టీలా అలంకరించుకునేందుకు ఓ ఆభరణం సిద్ధంగా ఉంది. అదే యాంకిల్ అండ్ ఆర్మ్ జువెల్రీ. ఫ్యాషన్ జువెల్రీగా అతివలను ఆకట్టుకుంటున్న ఈ నవీన ఆభరణాలను ధరించే డ్రెస్‌ను బట్టి ఒకసారి చేతికి పట్టీలా అలంకరించుకొని మెరిసిపోవచ్చు. మరోసారి కాలికి పట్టీలా ధరించి వెలిగిపోవచ్చు. ధర మాత్రం ఆన్లైన్లో రూ.200/– నుంచి పలుకుతున్నాయి. -
ముహూర్తం కుదిరింది
ఫొటో చూసి, హెడ్డింగ్ చదివి హీరోయిన్ హరిప్రియకు పెళ్లి సెట్ అయ్యిందని ఆలోచించి తప్పులో కాలేయకండి. ముహూర్తం కుదిరింది ఆమె నెక్ట్స్ చేయబోయే చిత్రానికి. జయతీర్థ దర్శకత్వంలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా రూపొందనున్న సినిమా ‘బెల్ బాటమ్’. ఈ చిత్రాన్ని రేపు లాంఛనంగా స్టార్ట్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం నిర్ణయించారు. ఎయిటీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగనుందట. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం లొకేషన్స్‌ను సెర్చ్ చేస్తున్నారట చిత్రబృందం. ‘‘నా నెక్ట్స్ చిత్రం ‘బెల్ బాటమ్’లో నటించనున్నందుకు సంతోషంగా ఉంది. జయతీర్థగారితో సెకండ్ టైమ్, రిషబ్ శెట్టితో థర్డ్ టైమ్ కలిసి వర్క్ చేయబోతున్నాను. నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ ఇది. టీమ్ అందరితో కలిసి సెట్లో సందడి చేసేందుకు వెయిట్ చేస్తున్నాను’’ అని హరిప్రియ పేర్కొన్నారు. సంతోష్ కేసీ నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం: అంజేష్ లోక్‌నాథ్, కెమెరా: అరవింద్ కశ్యప్, ఎడిటింగ్: ప్రకాశ్. -
ఏదీ నాటి దర్జా?
బెల్‌బాటమ్, స్కిన్‌టైట్ ప్యాంట్లు.. పొడవు కాలరుచొక్కాలు.. షార్ట మోడల్ షర్టులు.. రఫ్‌లుక్ డ్రెస్సులు.. ఒకటా.. రెండా.. మోడల్ఏదైనా, కుట్టు ఎలాగున్నా తమదైన శైలిలో దుస్తులు కుట్టిన దర్జీలు ఇప్పుడు ఆ దర్జా కోల్పోయారు. రెడీమేడ్ డ్రెస్సుల రాకతో వీరికాళ్ల కదలికలు ఆగిపోయాయి. టకటకమంటూ పని చేసిన వీరి మిషన్లు రంగురంగుల రెడీమేడ్ డ్రెస్సుల రాకతో మూలకు చేరిపోయాయి. పట్టణాల్లో మొదలై మెల్లగా పల్లె నడిబొడ్డుకు చేరిన రెడీమేడ్ హోరు దర్జీల ఉపాధిని గల్లంతు చేసింది. జీవితాలను ముక్కలు చేసింది. కుట్టు చప్పుడును ఆపేసింది. దర్జీ వృత్తికి వన్నెతెచ్చిన కుట్టు మిషన్‌ను ఆవిష్కరించిన విలియమ్స్హో, విలీఫ్జోన్స్ల స్మారకార్థం ఏటా ఫిబ్రవరి 28న ‘టైలర్స్ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.. నేడు టైలర్స్ డే ⇒ కష్టాల్లో కత్తెర పట్టిన చేతులు ⇒ టైలర్ల జీవితాల్లో అంధకారం ⇒ గతమెంతో ఘనం .. ప్రస్తుతం దుర్భరం ⇒ రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువు షాబాద్/ఘట్కేసర్ టౌన్: ఒకప్పుడు దర్జీ లేని ఊరు లేదంటే అతిశయోక్తి లేదు. మనిషికి హుందాతనాన్ని, అందాన్ని ఇచ్చే దుస్తుల కోసం పట్టణాల నుంచి పల్లెల వరకు అందరూ దర్జీల వద్ద క్యూ కట్టేవారు. పండగలు,పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు దగ్గరుండి మరీ దుస్తులను కుట్టించుకునేవారు. ఇదంతా గతం. రెడీమేడ్ దుస్తుల వైభవం ముందు దర్జీలు కుదేలయ్యారు. యువతను ఆకర్షించే నూతన డిజైన్లలో షర్టులు, జీన్స్ ఫ్యాంటులు, చుడీదార్లు, పంజాబీ డ్రెస్‌లు మార్కెట్లో దిగడంతో కుట్టు చప్పుడు ఆగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత రెడీమేడ్ వైపు ఆకర్షితులవుతుండడంతో దర్జీలకు పని లేకుండా పోయింది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారంతా పని లేక ఖాళీగా దర్శనమిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పేరుమోసిన టైలర్లకు మాత్రమే కాసింత ఆదరణ లభిస్తోంది. అది కూడా కేవలం పండగ సీజన్లలో మాత్రమే. ఏడాదిలో కేవలం నాలుగు నెలలు మాత్రమే వారికి కాసింతైనా పని దొరుకుతోంది. ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో కొత్తతరం ఇటువైపు రావడం మానేసింది. ఇదే వృత్తిలో ఉన్నవారు కూడా బతుకు వెతుక్కుంటూ మరోదారి వైపు మళ్లుతున్నారు. ఒకప్పుడు 24 గంటలు పనిచేసిన చేతులకు నేడు పనులు లేకుండా పోయాయి. చేతిలోఉన్న పనిని నమ్ముకోలేక, ఇంకో పనిచేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. నేటి ఫ్యాషన్లు, మెళకువలు నేర్చినవారు మాత్రం కాస్తోకూస్తో నిలదొక్కుకుంటున్నారు. భారీగా పెరిగిన ముడి సరుకుల ధరలు పండుగ సీజన్లలో దొరికే కొద్దిపాటి పనిచేసేందుకు అవసరమయ్యే ముడి సరుకుల ధ రలు పెరగటం దర్జీలకు మరో దెబ్బ. ప్రధా నంగా ముడి సరుకులైన దారాలు, జిప్పులు, హుక్కులు, గుండీలు తదితర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు అదనపు భారంగా మారుతున్నాయి. దీంతో చిన్నపాటి షాపు పెట్టిన యజమానికి అందులో పనిచేసే కార్మికులకు ఇద్దరికీ గిట్టుబాటు కావటం లేదు. ప్రస్తుతం పేరు మోసిన టైలర్లు ఒక జత మగవారి బట్టలు కుట్టి ఇచ్చేందుకు గరిష్టంగా రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. ఇక సూట్లకు అయితే రూ.2వేలు, సఫారీ డ్రెస్‌లకు రూ.700 తీసుకుంటున్నారు. ఆడవారికి పంజాబీ డ్రెస్సులు కుట్టివ్వాలంటే రూ.250 నుంచి వివిధ డిజైన్ల బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. అయితే ఇంత మొత్తంలో చెల్లించడానికి విని యోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో దర్జీలకు పని దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దర్జీల సంక్షేమానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించాలి.. పెళ్లి, పండుగలు ఇతర సీజన్లలో మాత్రమే పని దొరుకుతోంది. మాకు బ్యాంకుల ద్వారా రుణాలందిస్తే ఆధునిక కుట్టుమిషన్లు కొనుక్కుంటాం. మెరుగ్గా, ఫ్యాషన్‌గా కుట్టి జీవనోపాధి పొందుతాం. - బాల్‌రాజ్, ఘట్‌కేసర్‌టౌన్ పని కరువైంది.. మార్కెట్లోకి రెడీమెడ్ దుస్తులు రావడంతో టైలర్‌కు ఆదరణకు త గ్గింది. గతంలో ప్రతి ఒక్కరూ కుట్టిన దుస్తులే తొడిగేవారు. ప్రస్తుతం షోరూంలలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాకు పని ఉండడం లేదు. - రమేశ్, షాబాద్ ఆదరణ తగ్గింది.. గతంలో దర్జీ పని చేసే వాళ్ల కు మంచి ఆదరణ ఉండేది. ప్రస్తుతం కొత్తకొత్త షోరూం లు, రెడీమేడ్ దుస్తులు వస్తుండడంతో మాకు గిరాకీ తగ్గింది. కాలానుగుణంగా వస్తున్న వివిధ డిజైన్లను నేర్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. -సాజిత్, షాబాద్ పోటీని తట్టుకోలేకపోతున్నాం రెడీమేడ్ దుస్తులు తయారీదారుైలన బహుళజాతి సంస్థల పోటీని తట్టుకోలేకపోతున్నాం. రెడీమేడ్ దుస్తులను తక్కువ ధరల్లో అందించడంతో కుట్టించుకోవడానికి ఎవరూ ముందుకురావడంలేదు. కుట్టుకూలి డబ్బులతో డ్రెస్‌లే లభిస్తుండడంతో మా దగ్గరికి రావడం లేదు. - తుల్జారాం, ఘట్‌కేసర్‌టౌన్ సీజన్లోనే గిరాకీ.. సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో సొంతంగా టైలర్ షాపు నడుపుకునేవాడిని. ప్రస్తుతం వేరే షాపులో కూలీ పని చేస్తున్నాను. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడే గిరాకీ ఉంటుంది. - రామస్వామి, షాబాద్