ఆ స్టార్‌ హీరో సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న రకుల్‌! | Rakul Preet Sing Said She Cried While Watching Bell Bottom Movie In Theaters | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: భావోద్వేగంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి: రకుల్‌

Published Fri, Aug 27 2021 3:33 PM | Last Updated on Fri, Aug 27 2021 4:16 PM

Rakul Preet Sing Said She Cried While Watching Bell Bottom Movie In Theaters - Sakshi

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య బ్రేక్‌ తీసుకుంది. కుటుంబ సభ్యులతో ఈ విరామ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న రకుల్‌ మళ్లీ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘కొండపొలం, తమిళంలో భారతీయుడు-2, అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌, అయలాన్‌’తో పాటు హిందీలో ‘ఎటాక్‌, మేడే, థ్యాంక్‌ గాడ్‌, డాక్టర్‌ జీ’ వంటి ప్రాజెక్ట్స్‌ చేస్తుంది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు ప్రస్తుతం సాధారణ స్థితికి రావడంతో థియేటర్లో మళ్లీ సినిమాలు సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మూవీని థియేటర్లో చూసి కన్నీటి పర్యంతరం అయినట్లు ఆమె సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంది. 

చదవండి: అమితాబ్‌ నాకంత జీతం ఇవ్వలేదు: బాడీగార్డు

అక్షయ్‌ కుమార్‌ హీరోగా రంజిత్‌ తివారీ దర్శకత్వంతో తెరకెక్కిన ‘బెల్‌ బాటమ్‌’ మూవీ ఇటీవల థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రకుల్‌ అతిథి పాత్రలో కనిపించింది. దీంతో చిత్ర మూనిట్‌తో కలిసి ఆమె ‘బెల్‌ బాటమ్‌’ను థియేటర్లో చూసిందట. చాలా రోజుల తర్వాత తొలిసారి థియేటర్లో సినిమా చూడటంతో తను ఒక్కసారిగి భావోద్వేగానికి లోనయ్యానని, స్క్రీన్‌పై పేర్లు రాగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో అభిమానులతో పంచుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సినిమాను థియేటర్లో విడుదల చేసిన మేకర్స్‌ రకుల్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. కాగా టాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో రకుల్‌ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రకుల్‌, రానాలతో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది. 

చదవండి: 
సినిమాలకు సమంత బ్రేక్‌.. అందుకేనా!
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌.. నోటీసులు రాలేదంటున్న నటులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement