
2021లో బాలీవుడ్ బాక్సాఫీస్ స్టార్ ఎవరూ అంటే అక్షయ్ కుమార్ పేరు మాత్రమే చెప్పాలి. ఈ ఏడాది రిలీజ్ చేసిన ‘బెల్ బాటమ్’ తో బాలీవుడ్ లో మళ్లీ స్టార్ హీరోలు తమ చిత్రాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడం ప్రారంభించారు. సూర్యవంశీ ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించి ....అదే బాక్సాఫీస్ ను పరుగులు పెట్టించాడు. ఇలా ఈ ఏడాది అక్షయ్ నటించిన రెండు చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ భారీ వసూళ్లను రాబట్టగా.. మరో సినిమా అతరంగీరే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. వచ్చే ఏడాది కూడా ఇదే స్పీడ్ చూపించనున్నాడు అక్షయ్. జనవరిలో పృథ్వీరాజ్ మూవీ రిలీజ్ అవుతోంది.
ఆ తర్వాత లిస్ట్ లో బచ్చన్ పాండే, రక్షాబంధన్, రామ్ సేతు, మిషన్ సిండ్రెల్ల, ఓమైగాడ్ 2, చిత్రాలు ఉన్నాయి.వీటన్నిటితో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం ది ఎండ్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ అన్ని కూడా 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థ్రియేట్రికల్ రైట్స్, శాటీలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో దాదాపు 2000 వేల కోట్లకు పైగా బిజినెస్ జరగనుంది. ఇంత మొత్తంలో ఒక హీరో వల్ల వ్యాపారం జరగడం ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఎన్నడూ చూడలేదు.మొత్తంగా బాలీవుడ్ కు అక్షయ్ మనీ మెషి న్ గా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment