Ram Sethu
-
మళ్ళీ తెరపైకి సేతు సముద్రం ప్రాజెక్ట్
-
Year End 2022: అలరించని బీటౌన్ స్టార్స్.. వందల కోట్ల నష్టాలు!
బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే..ఖాన్ త్రయం పేరు వినిపిస్తుంది. తర్వాత అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ రేంజ్ చూపిస్తున్నారు. అయితే ఈ ఏడాది బాక్సాఫీసు ముందు వీళ్ల ప్రతాపాలు ఏవీ చెల్లుబాటు కాలేదు. సినిమ టాక్ ఎలా ఉన్నా ఈ స్టార్లు..ఓ మోస్తారు కలెక్షన్లు రాబడుతుంటారు. కానీ ఇప్పుడు మినిమం వసూళ్లు కూడా రాబట్టలేకపోతున్నారు. వందల కోట్ల నష్టాలు తీసుకొస్తున్నారు. ఈ ఏడాదిలో భారీ అంచనాల మధ్య విడుదలై వందల కోట్ల నష్టాలు మిగిల్చిన సినిమాలపై ఓ లుక్కేయండి ఆమిర్ ఖాన్ పేరు చెప్తే..పర్ఫెక్షన్ గుర్తుకు వస్తుంది. ఇంతటి మిస్టర్ పర్ఫెక్షనిస్టు కూడా ఈ ఏడాది బాలీవుడ్‌కు బలం తీసుకురాలేకపోయాడు. పీకే,దంగల్ లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీసును తిరగరాసిన ఆమిర్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తో గట్టి దెబ్బే తిన్నాడు. క్రిటిక్స్‌తో పాటు..కామన్ ఆడియన్..ఈ సినిమాను చూసి పెదవి విరిచేశారు. ఈ ఇ ఏడాదిలో వచ్చిన లాల్ సింగ్ చద్దా అయితే దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకున్నాడు అమిర్ ఈ ఇయర్ ఖాన్ త్రయంలో మరో ఇద్దరు హీరోలు బాక్సాఫీసుకు దూరంగా ఉన్నారు. అపజయాల పరంపర కొనసాగిస్తున్న..షారుఖ్ ఖాన్ పెద్ద బ్రేక్ తీసుకొని వరసగా సినిమాలు చేస్తున్నాడు. 2022 మొత్తం షూటింగ్లకే పరిమితమయ్యాడు. సల్లూ బాయ్ కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ హిందీ డబ్బింగ్‌తో అక్కడి ఆడియన్స్‌కు కనిపించాడు. కానీ ఈ ఖండల వీరుడు ఉన్నా కూడా అక్కడ ఫలితం లేకుండా పోయింది. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ..సునాయసంగా వందల కోట్లు సంపాదిస్తున్నాడు ఖిలాడి అక్షయ్ కుమార్. ఈ ఏడాదిలో ఈయన నటించిన సినిమాలు..భారీ నష్టాలు తీసుకొచ్చాయి. ఆరు సినిమాలు విడుదలైతే..ఒక్క సినిమా కూడా డబ్బులు రాబట్టలేకపోయింది. ఓటీటీలో వచ్చిన అత్రంగిరే ,కట్‌పత్లీ ఆకట్టుకోలేకపోయాయి. థియేటర్లలో విడుదలైన బచ్చన్ పాండే,సామ్రాట్ పృథ్వీరాజ్,రక్ష బందన్,రామ్ సేతు లాంటి సినిమాలు బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చాయి. హృతిక్ రోషన్ విక్రమ్ వేదా,షాహిద్ కపూర్ జెర్సీ, టైగర్ ష్రాప్ ‘హీరో పంతీ 2’, అయుష్మాన్ ఖురానా ‘ఆన్ యాక్షన్ హీరో’, రణ్వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’, కంగనా రనౌత్ ‘ధాకడ్’, రణ్‌బీర్ కపూర్ ‘షంషెరా’, వరుణ్ దావాన్ ‘బేడియా’ లాంటి మూవీస్..ఈ ఇయర్ అంచనాలతో విడుదల అయ్యాయి. అయితే..ఒక్క సినిమా కూడా ఆడియన్స్‌ను థియేటర్లలోకి రప్పించలేకపోయింది. -
ఓటీటీలోకి వచ్చేసిన ‘రామ్ సేతు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా చూడాలంటే.. రూ.199 అద్దె చెల్లించాలని కండీషన్ పెట్టంది. ఇక ఎలాంటి అద్దె చెల్లించకుండా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్కు తీసుకొస్తారో వేచి చూడాల్సి ఉంది. ‘రామ్ సేతు’ కథేంటంటే.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్యన్(అక్షయ్ కుమార్)తో ఓ రిపోర్ట్‌ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్‌కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు. అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్ హామీ ఇవ్వడంతో ఆర్యన్ వారి టీమ్‌లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్ టీమ్ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్ వేసిన ప్లాన్ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్ టీమ్‌కు ఏపీ(సత్యదేవ్)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్‌గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అనేదే మిగతా కథ. -
‘రామ్ సేతు’లో నటించానంటే నమ్మలేకపోతున్న: జయశ్రీ
‘రామ్ సేతు’లో నేను నటించిన సీన్స్ కథకు అత్యంత కీలకమైనవని తెలిసినా.. ఎడిటింగ్‌లో ఎక్కడ తీసేస్తారోననే భయం ఉండేది. కానీ సినిమా చూసిన తర్వాత నా సీన్స్ ఏవీ కట్ చేయలేదని తెలిసింది. నా సన్నిహితులు సినిమా చూసిన తర్వాత పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను’అన్నారు నటి జయశ్రీ రాచకొండ. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైంది. ఈ చిత్రంలో జయశ్రీ జడ్జిగా నటించారు. . అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలగానే ఉందని చెబుతున్న రాచకొండ... ఈ చిత్రం ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం తాను ‘లీగల్లీ వీర్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనసున ఉన్నది... చెప్పాలనున్నది, ‘బ్రేకింగ్ న్యూస్’ లాంటి చిత్రాలతో పాటు సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘డాక్టర్ రెహానా’ లోనూ నటిస్తోంది. -
Ram Setu Review: ‘రామ్ సేతు’ మూవీ రివ్యూ
టైటిల్: రామ్ సేతు నటీనటులు: అక్షయ్ కుమార్, నాజర్, సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా తదితరులు నిర్మాతలు: అరుణా భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్, మహావీర్ జైన్, ఆశిష్ సింగ్, ప్రైమ్ వీడియో దర్శకత్వం : అభిషేక్ శర్మ సంగీతం: డేనియల్ బి జార్జ్ సినిమాటోగ్రఫీ: అసీమ్ మిశ్రా ఎడిటర్: రామేశ్వర్ ఎస్ భగత్ విడుదల తేది: అక్టోబర్ 25, 2022 అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యంగ్ అండ్ టాలెంట్ హీరో సత్యదేవ్ మరో కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరూచా హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా నేడు( అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘రామ్ సేతు’ కథేంటంటే.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకాంత్ (నాజర్) రామసేతును నాశనం చేస్తూ.. సేతుసముద్రం పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. ఇది జరగాలంటే భారతీయులు విశ్వసిస్తున్నట్లు రామసేతును శ్రీరాముడు నిర్మించలేదని, అది సహజసిద్దంగా ఏర్పడిందని నిరూపించాలి. దీని కోసం భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్యన్(అక్షయ్ కుమార్)తో ఓ రిపోర్ట్‌ని ఇప్పిస్తాడు. దీంతో అర్యన్‌కు లేనిపోని చిక్కులు వచ్చిపడతాయి. ఆయన ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఉద్యోగం కూడా కోల్పోతాడు. అయితే రామసేతు మీద మరింత పరిశోధన చేయమని, అన్ని విధాలుగా తోడుగా ఉంటానని ఇంద్రకాంత్ హామీ ఇవ్వడంతో ఆర్యన్ వారి టీమ్‌లో చేరిపోతాడు. రామసేతు మీద పూర్తిగా పరిశోధించేందుకు వెళ్లిన ఆర్యన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? ఆర్యన్ టీమ్ ఎందుకు శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చింది? ఇంద్రకాంత్ వేసిన ప్లాన్ ఏంటి? శ్రీలంక ప్రయాణంలో ఆర్యన్ టీమ్‌కు ఏపీ(సత్యదేవ్)ఎలాంటి సహాయం చేశాడు. గైడ్‌గా చెప్పుకున్న ఏపీ ఎవరు? చివరకు ఆర్యన్ ‘రామసేతు’పై ఆధారలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రామ్ సేతు ఒక అడ్వెంచర్ థ్రిల్లర్. రామసేతుని స్వయంగా శ్రీరాముడే నిర్మించాడని భారతీయులు విశ్వసిస్తారు. రామసేతు వేనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది అందరికి ఆసక్తికరమైన అంశమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని తీసుకొని ‘రామ్ సేతు’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అభిషేక్ శర్మ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనాన్ని నడిపించడంలో విఫలమయ్యాడు. వాస్తవ గాధకు కల్పనను జోడించి కథనాన్ని నడిపించాడు. ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులను కట్టిపడేసేలా స్క్రీన్‌ప్లే ఉండాలి. ఈ చిత్రంలో అది మిస్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. కానీ ప్లస్ ఏంటంటే.. రామసేతు నిర్మాణానికి సంబంధించిన అనేక వాస్తవాలను ఈ చిత్రంలో చూపించారు. శ్రీలకంలో రావణాసురుడి ఆనవాళ్లు ఉన్నాయని, రామాయణం ప్రకారం రావణుడు ఉన్నాడంటే.. రాముడు కూడా ఉన్నట్లే కదా అని ఈ చిత్రం సారాంశం. శ్రీలంకలో ఉన్న త్రికూటరపర్వతం, అశోకవనం, స్వర్ణలంక ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించారు. అయితే హీరో టీమ్ చేసే పరిశోధన మాత్రం ఆసక్తికరంగా సాగదు. పేలవమైన స్క్రీన్‌ప్లే, పసలేని డైలాగ్స్, చప్పగా సాగే కీలక సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. నిర్మాణ విలువలు కూడా అంత ఉన్నతంగా ఉన్నట్లు కనిపించవు. ఎవరెలా చేశారంటే.. ఆర్కియాలజిస్ట్ ఆర్యన్గా అక్షయ్ చక్కగా నటించాడు. తన పాత్రకు తగినట్టుగా ప్రొఫెషనల్‌గా తెరపై కనిపించాడు. గైడ్ ఏపీగా సత్యదేవ్ తనదైన నటనతో మెప్పించాడు. ఆయన ఎవరో అని రివీల్ చేసే సీన్ ఆకట్టుకుంటుంది. ఆర్యన్ టీమ్మెంబర్గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పాత్రకు న్యాయం చేసింది. నాజర్, నుస్రత్ బరూచాతో పాటు ఇతన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. డేనియల్ బి జార్జ్ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా. ఎడిటర్ రామేశ్వర్ ఎస్ భగత్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
అక్షయ్ కుమార్ ‘రామ్‌సేతు’ రిలీజ్ డేట్ ఫిక్స్
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్‌సేతు’. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను అక్టోబరు 25న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటిస్తూ, ఫస్ట్ గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. ఈ మూవీలో పురావస్తు శాస్త్రవేత్త ఆర్యన్ పాత్రలో నటించారు అక్షయ్. ‘రామసేతు’ అనే బ్రిడ్జి ఉందా? లేదా? అని పురావస్తు శాస్త్రవేత్తలు జరిపే పరిశోధనల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బాలీవుడ్ టాక్. जुड़िए हमारे साथ और बनिए इस रोमांचक सफ़र का हिस्सा… राम सेतु की दुनिया भर में पहली झलक, आज दोपहर 12 बजे. Are you all set? #RamSetu. October 25th. Only in Theatres worldwide. pic.twitter.com/qQCsc7kPI6 — Akshay Kumar (@akshaykumar) September 26, 2022 -
సినిమా సైంటిస్ట్ లు
-
అక్షయ్ పక్కా ప్లాన్.. 2000 కోట్ల టార్గెట్.. ఏ హీరోకి సాధ్యపడని రికార్డు
2021లో బాలీవుడ్ బాక్సాఫీస్ స్టార్ ఎవరూ అంటే అక్షయ్ కుమార్ పేరు మాత్రమే చెప్పాలి. ఈ ఏడాది రిలీజ్ చేసిన ‘బెల్ బాటమ్’ తో బాలీవుడ్ లో మళ్లీ స్టార్ హీరోలు తమ చిత్రాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడం ప్రారంభించారు. సూర్యవంశీ ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించి ....అదే బాక్సాఫీస్ ను పరుగులు పెట్టించాడు. ఇలా ఈ ఏడాది అక్షయ్ నటించిన రెండు చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ భారీ వసూళ్లను రాబట్టగా.. మరో సినిమా అతరంగీరే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. వచ్చే ఏడాది కూడా ఇదే స్పీడ్ చూపించనున్నాడు అక్షయ్. జనవరిలో పృథ్వీరాజ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత లిస్ట్ లో బచ్చన్ పాండే, రక్షాబంధన్, రామ్ సేతు, మిషన్ సిండ్రెల్ల, ఓమైగాడ్ 2, చిత్రాలు ఉన్నాయి.వీటన్నిటితో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం ది ఎండ్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ అన్ని కూడా 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థ్రియేట్రికల్ రైట్స్, శాటీలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో దాదాపు 2000 వేల కోట్లకు పైగా బిజినెస్ జరగనుంది. ఇంత మొత్తంలో ఒక హీరో వల్ల వ్యాపారం జరగడం ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఎన్నడూ చూడలేదు.మొత్తంగా బాలీవుడ్ కు అక్షయ్ మనీ మెషి న్ గా మారాడు. -
సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్, స్టార్ హీరో సినిమాలో అవకాశం
Satyadev Bollywood Entry: హీరోగానూ, కీలక పాత్రలు చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్న సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ‘‘కొన్ని విషయాలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయి. నా బాలీవుడ్ పరిచయం కూడా అంతే. నేను నా ప్రొఫైల్‌ను బీ టౌన్లో షేర్ చేయలేదు. కానీ ‘రామ సేతు’లో నటించే అవకాశం వచ్చింది. హ్యాపీ’’ అన్నారు సత్యదేవ్. అతడు నటించిన 'తిమ్మరుసు' చిత్రం కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇందులో ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్గా నటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. -
అక్షయ్ కుమార్ సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్!
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదిచుకున్న సత్యదేవ్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామ్‌సేతు' లో సత్యదేవ్‌కు అవకాశం వచ్చినట్లు బీటౌన్ టాక్. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుష్రత్ భారుష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయాలని భావిస్తోందట చిత్ర బృందం. ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి సీనియర్ నటుడు నాజర్, తెలుగు నుంచి సత్యదేవ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ చిత్ర షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభమయినా కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. చదవండి :నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేసిన 'జాంబిరెడ్డి' డైరెక్టర్ -
‘రామ్ సేతు’లో అక్షయ్ కుమార్ ఫస్ట్‌లుక్ చూశారా?
పురావస్తు శాస్త్రవేత్తగా అయోధ్యకు ప్రయాణమయ్యారు అక్షయ్ కుమార్. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుమ్రత్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న హిందీ సినిమా ‘రామ్ సేతు’. ఈ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభమయింది. ఈ చిత్రంలో పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నారు అక్షయ్. ‘‘నా కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన సినిమా ‘రామ్ సేతు’. ఈ సినిమా షూటింగ్, నా కొత్త లుక్ ఎలా ఉందో చెప్పండి’ అంటూ ఈ సినిమాలోని తన లేటెస్ట్ లుక్‌ను షేర్ చేశారు అక్షయ్. కొన్నేళ్ల క్రితం రామసేతు అనే బ్రిడ్జ్ ఉన్న మాట నిజమా? అబద్ధమా? అనే అంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందదని బాలీవుడ్ టాక్. The journey of making one of the most special films for me begins today. #RamSetu shooting begins! Playing an archaeologist in the film. Would love to hear your thoughts on the look? It always matters to me🙏🏻 @Asli_Jacqueline@Nushrratt@Abundantia_Ent@LycaProductions pic.twitter.com/beI6p0hO0I — Akshay Kumar (@akshaykumar) March 30, 2021 -
అభిమానులకు అక్షయ్ దీపావళి కానుక
ఈ మహమ్మారి వారి వల్ల సామాన్య ప్రజల నుంచి బడా వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖలకు గడ్డుకాలమనే చెప్పుకోవాలి. అలాగే ఈ కరోనా కారణంగా చాలా మంది స్టార్ నటీనటులకు కూడా అంతగా సినిమాలు లేకపోవడంతో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ వారందరికి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భిన్నం. ఈ గడ్డుకాలంలో కూడా చేతి నిండా సినిమాలతో అక్కి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘లక్ష్మి’, ‘బెల్‌బాటమ్’లు విడుదల కాగా.. ‘సూర్వవంశీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అక్షయ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు దీపావళి కానుక ఇచ్చాడు. (చదవండి: ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?!) This Deepawali,let us endeavor to keep alive the ideals of Ram in the consciousness of all Bharatiyas by building a bridge(setu) that will connect generations to come. Taking this mammoth task ahead,here is our humble attempt - #RamSetu Wishing you & yours a very Happy Deepawali! pic.twitter.com/ZQ2VKWJ1xU — Akshay Kumar (@akshaykumar) November 14, 2020 తను నటించబోయే ‘రామ్ సేతు’ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను శనివారం దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టలో అక్షయ్ మెడలో ఎరుపు కండువాతో కార్గ్ ప్యాంట్, షర్ట్ ధరించి ఉన్నాడు. అంతేగాక స్లింగ్ బ్యాగు ధరించి నెలవైపు చూస్తుండగా.. వెనకాల హిందువుల దైవమైన శ్రీరాముడి రాముడి షాడో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. పొస్టర్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ఈ దీపావళి, రాబోయే తరాలను కలిపేందుకు ఒక వంతెనను(సేతు) నిర్మించి.. భారతీయుల ఆదర్శ దైవం శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం’ అంటూ రాసుకొచ్చాడు. అదే విధంగా త్వరలోనే ‘రామ్‌సేతు’తో మీ ముందుకు వస్తున్నానంటూ.. ఈ దీపావళి మీ అందరి ఇళ్లలో కాంతి నింపాలని ఆశిస్తూ హ్యాపీ దీపావళి అని అక్షయ్ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: లక్ష్మి నుంచి మరో ప్రోమో) -
రామసేతును కాపాడుతాం
-
రామసేతును కాపాడుతాం
న్యూఢిల్లీ : భారత్-శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న చారిత్రక నిర్మాణమైన రామ సేతును కాపాడుతామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మణాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని స్పష్టం చేసింది. దేశప్రజల ఆసక్తి దృష్ట్యా ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని ముట్టుకోబోమని, కాపాడటానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపింది. సేతు సముద్రం ప్రాజెక్టుతో రామసేతు నిర్మాణం దెబ్బతింటుందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణలో భాగంగా షిప్పింగ్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అఫడవిట్ దాఖలు చేసింది. లంకలో ఉన్న సీత కోసం వానరసేన సాయంతో రాముడే ఈ సేతును నిర్మించినట్లు ప్రచారం జరిగింది. ఇది తమిళనాడులోని రామేశ్వరం దగ్గర్లో ఉన్న పంబన్ దీవి నుంచి శ్రీలంక ఈశాన్య తీరంలోని మన్నార్ దీవి వరకు ఉంది. ఇది సహజసిద్ధంగా ఏర్పడిందని కొందరు వాదించినా.. అదంతా ఉత్తదే అని చాలాసార్లు తేలిపోయింది. -
మళ్లీ తెరమీదకు ‘సేతు’
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సేతు సముద్ర నినా దం మళ్లీ తెర మీదకు వచ్చింది. కోర్టు కేసులతో ఇన్నాళ్లు మరుగున పడ్డ ఈ వివాదం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ రూపంలో మళ్లీ చర్చకెక్కుతున్నది. గతంలో రూపకల్పన చేసిన మార్గంలో కాకుండా కొత్త మార్గంలో పనులకు చర్యలు తీసుకోనున్నామన్న గడ్కరీ ప్రకటనను కొందరు వ్యతిరేకిస్తుంటే, మరి కొందరు ఆహ్వానిస్తున్నారు. శ్రీలంక తో పాటుగా సముద్ర తీర దేశాల మధ్య భారత్ నుంచి నౌకాయూన మార్గాన్ని సులభతరం చేస్తూ సేతు సముద్రం ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం గతంలో శ్రీకారం చుట్టిన విష యం తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి ముందుకు కదలడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ ప్రాజె క్టు పనులు జరుగుతున్న మార్గంలో రామసేతు వంతెన బయ ట పడడం వివాదాన్ని రేపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు బయలు దేరాయి. కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలో ఉన్నాయి. ఈ సమయంలో రాముడు నిర్మించిన వంతెనను కూల్చేం దుకు వీలు లేదని, ఆ వంతెనను పురాతన చిహ్నంగా ప్రకటించాలంటూ గత ఏడాది రాష్ర్ట ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం సైతం ప్రవేశ పెట్టింది. ఈ విషయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖాస్త్రాలు సందించినా, స్పం దన లేదు. అలాగే, ఈ ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్, డీఎంకే అధినేత ఎం కరుణానిధి అప్పుడప్పుడు పెదవి విప్పడం జరుగుతూ వస్తున్నది. దీంతో ఈ నినా దం కాస్త తెర మరుగు అయింది. బీజేపీ సర్కారు కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాక, సేతు మీద తప్పకుండా దృష్టి పెడతామన్న ప్రకటన చేసింది. పరిశీలన: తమ ప్రకటన మేరకు ఆ పథకం అమ లు సాధ్యాసాధ్యాల మీద కేంద్రం దృష్టి పెట్టినట్టుంది. కేంద్ర నౌకాయన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం జరి పిన పరిశీలనలతో మళ్లీ సేతు సముద్ర ప్రాజెక్టు సాధన నినాదం తెర మీదకు వచ్చినట్టు అయింది. ఇది వరకు సేతు సముద్రం ప్రాజెక్టు పనులు జరిగిన ప్రదేశాల్ని, రాముడి వంతెన మార్గ పరిసరాల్ని హెలికాప్టర్ ద్వారీ వీక్షించిన మంత్రి గడ్కరీ కొత్త నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. సేతు సముద్రం ప్రాజెక్టు అమలు చేస్తామంటూనే మా ర్గంలో మార్పులు ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. పాంబన్ వంతెన మార్గాన్ని విస్తరించి కాలువల నిర్మాణం ద్వారా సేతు ప్రాజెక్టుకు కొత్త మార్గం యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఇది కాస్త సేతు ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా ముందుకెళుతున్న వారిలో వ్యతిరేకతను రేకెత్తిస్తున్నది. అలాగే, మరి కొన్ని వర్గా లు రాముడి వంతెన సురక్షితం కావడంతో ఆహ్వానిస్తున్నాయి. అమలుకు పట్టు సేతు సముద్రం ప్రాజెక్టు పాంబన్ వం తెన మార్గం గుండా అమలుకు నోచుకునేనా అన్న ప్రశ్న బయలు దేరింది. పాంబన్ కాలువ లోతు పన్నెండు అడుగులు, ఈ మార్గంలో వెయ్యి టన్నుల బరువు కల్గిన నౌకలు ప్రయాణించేం దుకు వీలుంది. అయితే, ఈ కాలువను విస్తరించాల్సి ఉంటే, మూడు అడుగులు పైగా లోతును తవ్వలేని పరిస్థితి. మూడు అడుగులు తవ్వినా, పదిహే ను అడుగుల లోతుకు చేరుతుంది. ఈ మార్గంలో పదమూడు వేల టన్నుల బరువు కల్గిన నౌకలు ప్రయాణించేం దుకు వీలుంది. అయితే, ఆచరణలో అమలు కాని రీతిలో మంత్రి ప్రకటన ఉండడంతో కేంద్ర నౌకాయూనశాఖ మాజీ మంత్రి జీకే వాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనుస్కోడి మీదుగా సాగాల్సిన వంతెనను పాంబన్ మీదుగా మళ్లించడం వృథా ప్రయాసని పేర్కొంటున్నారు. గతంలో చేసిన మార్పులు మేరకు ఆ ప్రాజెక్టు అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. వ్యతిరేకత సేతు ప్రాజెక్టులో మార్పు దిశగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన చేస్తే జాలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టాలని అఖిల భారత జాలర్ల సమాఖ్య నేత ఇళంగోవన్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా కారైక్కాల్, నాగపట్నం, తంజావూరు తదితర ఆరు తీరగ్రామాల్లో సముద్రం వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీంతో జాలర్లు నష్ట పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా జరిగే తవ్వకాలతో సముద్రం రామేశ్వరం వైపునకు మరలే అవకాశం ఉందని, దీంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు.