అభిమానులకు అక్షయ్‌ దీపావళి కానుక | Akshay Kumar Announces His Next Movie And Shares First Look On Diwali | Sakshi
Sakshi News home page

అభిమానులకు అక్షయ్‌ దీపావళి కానుక

Published Sat, Nov 14 2020 3:58 PM | Last Updated on Sat, Nov 14 2020 7:01 PM

Akshay Kumar Announces His Next Movie And Shares First Look On Diwali - Sakshi

ఈ మహమ్మారి వారి వల్ల సామాన్య ప్రజల నుంచి బడా వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖలకు గడ్డుకాలమనే చెప్పుకోవాలి. అలాగే ఈ కరోనా కారణంగా చాలా మంది స్టార్‌ నటీనటులకు కూడా అంతగా సినిమాలు లేకపోవడంతో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ వారందరికి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ భిన్నం. ఈ గడ్డుకాలంలో కూడా చేతి నిండా సినిమాలతో అక్కి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘లక్ష్మి’‌, ‘బెల్‌బాటమ్‌’లు విడుదల కాగా.. ‘సూర్వవంశీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అక్షయ్‌ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులకు దీపావళి కానుక ఇచ్చాడు. (చదవండి: ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?!)

తను నటించబోయే ‘రామ్‌ సేతు’ సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను శనివారం దీపావళి సందర్భంగా సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టలో అక్షయ్‌ మెడలో ఎరుపు కండువాతో కార్గ్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి ఉన్నాడు. అంతేగాక స్లింగ్‌ బ్యాగు ధరించి నెలవైపు చూస్తుండగా.. వెనకాల హిందువుల దైవమైన శ్రీరాముడి రాముడి షాడో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. పొస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఈ దీపావళి, రాబోయే తరాలను కలిపేందుకు ఒక వంతెనను(సేతు) నిర్మించి.. భారతీయుల ఆదర్శ దైవం శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిద్దాం’ అంటూ రాసుకొచ్చాడు. అదే విధంగా త్వరలోనే ‘రామ్‌సేతు’తో మీ ముందుకు వస్తున్నానంటూ.. ఈ దీపావళి మీ అందరి ఇళ్లలో కాంతి నింపాలని ఆశిస్తూ హ్యాపీ దీపావళి అని అక్షయ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: లక్ష్మి నుంచి మరో ప్రోమో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement