రామసేతు (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : భారత్-శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న చారిత్రక నిర్మాణమైన రామ సేతును కాపాడుతామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మణాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని స్పష్టం చేసింది. దేశప్రజల ఆసక్తి దృష్ట్యా ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని ముట్టుకోబోమని, కాపాడటానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపింది. సేతు సముద్రం ప్రాజెక్టుతో రామసేతు నిర్మాణం దెబ్బతింటుందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణలో భాగంగా షిప్పింగ్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అఫడవిట్ దాఖలు చేసింది.
లంకలో ఉన్న సీత కోసం వానరసేన సాయంతో రాముడే ఈ సేతును నిర్మించినట్లు ప్రచారం జరిగింది. ఇది తమిళనాడులోని రామేశ్వరం దగ్గర్లో ఉన్న పంబన్ దీవి నుంచి శ్రీలంక ఈశాన్య తీరంలోని మన్నార్ దీవి వరకు ఉంది. ఇది సహజసిద్ధంగా ఏర్పడిందని కొందరు వాదించినా.. అదంతా ఉత్తదే అని చాలాసార్లు తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment