మళ్లీ తెరమీదకు ‘సేతు’ | Won't touch Ram Sethu, will find viable alternative: Nitin Gadkari | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరమీదకు ‘సేతు’

Published Thu, Nov 6 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

మళ్లీ తెరమీదకు ‘సేతు’

మళ్లీ తెరమీదకు ‘సేతు’

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సేతు సముద్ర నినా దం మళ్లీ తెర మీదకు వచ్చింది. కోర్టు కేసులతో ఇన్నాళ్లు మరుగున పడ్డ ఈ వివాదం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ రూపంలో మళ్లీ చర్చకెక్కుతున్నది. గతంలో రూపకల్పన చేసిన మార్గంలో కాకుండా కొత్త మార్గంలో పనులకు చర్యలు తీసుకోనున్నామన్న గడ్కరీ ప్రకటనను కొందరు వ్యతిరేకిస్తుంటే, మరి కొందరు ఆహ్వానిస్తున్నారు. శ్రీలంక తో పాటుగా సముద్ర తీర దేశాల మధ్య భారత్ నుంచి నౌకాయూన మార్గాన్ని సులభతరం చేస్తూ సేతు సముద్రం ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం గతంలో  శ్రీకారం చుట్టిన విష యం తెలిసిందే. అయితే,  ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి ముందుకు కదలడం లేదు.
 
 ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.  ఈ ప్రాజె క్టు పనులు జరుగుతున్న మార్గంలో రామసేతు వంతెన బయ ట పడడం వివాదాన్ని రేపింది.  ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు బయలు దేరాయి. కోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలో ఉన్నాయి. ఈ సమయంలో రాముడు నిర్మించిన వంతెనను కూల్చేం దుకు వీలు లేదని, ఆ వంతెనను పురాతన చిహ్నంగా ప్రకటించాలంటూ గత ఏడాది  రాష్ర్ట ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం సైతం  ప్రవేశ పెట్టింది.  ఈ విషయంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖాస్త్రాలు సందించినా, స్పం దన లేదు. అలాగే, ఈ ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా ఓ వైపు కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్, డీఎంకే అధినేత ఎం కరుణానిధి అప్పుడప్పుడు పెదవి విప్పడం జరుగుతూ వస్తున్నది. దీంతో ఈ నినా దం కాస్త తెర మరుగు అయింది. బీజేపీ సర్కారు కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాక, సేతు మీద తప్పకుండా దృష్టి పెడతామన్న ప్రకటన చేసింది.
 
 పరిశీలన:
 తమ ప్రకటన మేరకు ఆ పథకం అమ లు సాధ్యాసాధ్యాల మీద కేంద్రం దృష్టి పెట్టినట్టుంది. కేంద్ర నౌకాయన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం జరి పిన పరిశీలనలతో మళ్లీ సేతు సముద్ర ప్రాజెక్టు సాధన నినాదం తెర మీదకు వచ్చినట్టు అయింది.  ఇది వరకు సేతు సముద్రం ప్రాజెక్టు పనులు జరిగిన ప్రదేశాల్ని, రాముడి వంతెన మార్గ పరిసరాల్ని హెలికాప్టర్ ద్వారీ వీక్షించిన మంత్రి గడ్కరీ కొత్త నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. సేతు సముద్రం ప్రాజెక్టు అమలు చేస్తామంటూనే మా ర్గంలో మార్పులు ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. పాంబన్ వంతెన మార్గాన్ని విస్తరించి కాలువల నిర్మాణం ద్వారా సేతు ప్రాజెక్టుకు  కొత్త మార్గం యోచనలో ఉన్నట్టు ప్రకటించారు.  ఇది కాస్త సేతు ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా ముందుకెళుతున్న వారిలో వ్యతిరేకతను రేకెత్తిస్తున్నది. అలాగే, మరి కొన్ని వర్గా లు రాముడి వంతెన సురక్షితం కావడంతో ఆహ్వానిస్తున్నాయి.
 
 అమలుకు పట్టు  
 సేతు సముద్రం ప్రాజెక్టు పాంబన్ వం తెన మార్గం గుండా అమలుకు నోచుకునేనా అన్న ప్రశ్న బయలు దేరింది. పాంబన్ కాలువ లోతు పన్నెండు అడుగులు, ఈ మార్గంలో వెయ్యి టన్నుల బరువు కల్గిన నౌకలు ప్రయాణించేం దుకు వీలుంది. అయితే, ఈ కాలువను విస్తరించాల్సి ఉంటే, మూడు అడుగులు పైగా లోతును తవ్వలేని పరిస్థితి. మూడు అడుగులు తవ్వినా, పదిహే ను అడుగుల లోతుకు చేరుతుంది. ఈ మార్గంలో పదమూడు వేల టన్నుల బరువు కల్గిన నౌకలు ప్రయాణించేం దుకు వీలుంది. అయితే, ఆచరణలో అమలు కాని రీతిలో మంత్రి ప్రకటన ఉండడంతో కేంద్ర నౌకాయూనశాఖ మాజీ మంత్రి జీకే వాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనుస్కోడి మీదుగా సాగాల్సిన వంతెనను పాంబన్ మీదుగా మళ్లించడం వృథా ప్రయాసని పేర్కొంటున్నారు. గతంలో చేసిన మార్పులు మేరకు ఆ ప్రాజెక్టు అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
 
 వ్యతిరేకత  
 సేతు ప్రాజెక్టులో మార్పు దిశగా  కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన చేస్తే జాలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టాలని అఖిల భారత జాలర్ల సమాఖ్య నేత ఇళంగోవన్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా కారైక్కాల్, నాగపట్నం, తంజావూరు తదితర ఆరు తీరగ్రామాల్లో సముద్రం వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీంతో జాలర్లు నష్ట పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా జరిగే తవ్వకాలతో సముద్రం రామేశ్వరం వైపునకు మరలే అవకాశం ఉందని, దీంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement