చెన్నైలో మునిగి శ్రీలంకలో శవమై తేలి.. | Chennai rain victim's body washed ashore in Sri Lanka | Sakshi
Sakshi News home page

చెన్నైలో మునిగి శ్రీలంకలో శవమై తేలి..

Published Tue, Dec 8 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

చెన్నైలో మునిగి శ్రీలంకలో శవమై తేలి..

చెన్నైలో మునిగి శ్రీలంకలో శవమై తేలి..

రామేశ్వరం: భారీ వర్షాలతో వచ్చిన వరదల కారణంగా కొట్టుకుపోయిన చెన్నై వాసి శ్రీలంకలో శవమై తేలాడు. శ్రీలంకకు చెందిన జాలర్లు అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వీటి కారణంగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని కామరాజ్ నగర్ ఎన్జీవో కాలనీకి చెందిన ఎన్ పూమి దొరై అనే వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. అతడి జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు.

అయితే, తాజాగా అతడి మృతదేహం శ్రీలంకకు చెందిన నావికులకు త్రింకోమల్లీ అనే ప్రాంతంలో లభించింది. ఆ మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అతడిని తమిళనాడుకు చెందిన పూమి దొరైగా గుర్తించారు. దీంతో అతడి మృతదేహాన్ని చెన్నైకి తరలించేందుకు శ్రీలంకలోని భారత ప్రభుత్వ రాయబారులు ఏర్పాటుచేస్తున్నారు. పూమి దొరై ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement