rameswaram
-
ఇంజనీరింగ్ అద్భుతంగా పంబన్ కొత్త బ్రిడ్జి.. ఫోటోలు వైరల్
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న కొత్త పంబన్ వంతెన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రూపొందుతున్న ఈ వంతెన ఫోటోలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేయడమే ఇందుకు కారణం. కొత్త వంతెనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. దానికి సంబంధించిన విషయాలు, విశేషాలను ఆయన పంచుకున్నారు.ఈ బ్రిడ్జి ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్రమంత్రి కొనియాడారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యిందని, అనేక సార్లు పరీక్షించినట్లు వెల్లడించారు. అయితే కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ద్వారా భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.కొత్త బ్రిడ్జి ద్వారా రామేశ్వరం అభివృద్ధి చెందుతున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం ద్వారా రూ. 90 కోట్ల వ్యయంతో రామేశ్వరం రైల్వే స్టేషన్‌ను కూడా అప్గ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ద్వీపానికి పర్యాటకం, వాణాజ్యం, కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు.పాత వంతెన మధ్య నుంచి పడవలు షిప్‌లు వెళ్లాలంటే కష్టమయ్యేది.16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది.సముద్ర మట్టానికి 19 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు మాత్రమే వంతెన మధ్య ప్రయాణించేవిసింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది.కొత్త బ్రిడ్జి వర్టికల్ లిఫ్ట్ స్పాన్.. పూర్తిగా ఆటోమేటెడ్.ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా డిజైన్సముద్ర మట్టానికి 22 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు, షిప్‌లు కూడా ప్రయాణించగలవు.డబుల్ ట్రాక్‌లు, విద్యుదీకరణ కోసం రూపొందించారు.హై-స్పీడ్ రైలు అనుకూలత, ఆధునిక డిజైన్.వందే ళ్లపాటు సేవలుకాగా రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో నిర్మించిన పంబన్ వంతెన గురించి అందరికీ తెలిసిందే. దీనిని 1914 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. అప్పట్లో రూ.20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన న 105 ఏళ్ల పాటు రామేశ్వరం నగరాన్ని ఇతర ప్రధాన భూభాగంతో కలిపింది.ఇది దేశంలోనే తొలి సముద్ర వంతెన. అంతేగాక 2010లో బాంద్రా- వర్లీ సముద్రపు లింక్‌ను ప్రారంభించే వరకు దేశంలోనే అతి పొడవైన వంతెన కూడా. 2. 06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. 2022లో ఈ వంతెనకు తుప్పు పట్టడంతో దీనిని పూర్తిగా మూసేశారు.దీని స్థానంలో 2019లో కొత్త వంతెన నిర్మాన్ని ప్రారంభించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. ఇది 105 ఏళ్ల నాటి పాంత వంతెనను భర్తీ చేయనుంది.🚆The New Pamban Bridge: A modern engineering marvel!🧵Know the details 👇🏻 pic.twitter.com/SQ5jCaMisO— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024 -
భారత మత్స్యకారులను పట్టుకున్న శ్రీలంక
తమిళనాడు తీరంలో రెండు పవర్ బోట్లతో పాటు తొమ్మిది మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకుంది. ఆ మత్స్యకారులు భారత సరిహద్దు దాటి చేపల వేట సాగిస్తున్నారని శ్రీలంక ఆరోపిస్తోంది. 535 బోట్లలో మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో చేపల వేటకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా విదేవిధంగా శ్రీలంక భారత జాలర్లను పట్టుకుంది.జూలై ఒకటిన రామేశ్వరం ద్వీపం సమీపంలోని పాల్క్ బే సముద్ర ప్రాంతంలో పాంబన్ నుంచి చేపల వేటకు వెళ్లిన 26 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక నావికాదళానికి చిక్కారు. గత నెలలోనే శ్రీలంక నావికాదళం తమ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో 18 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. మూడు మత్స్యకారుల బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికిముందు కూడా శ్రీలంక నేవీ నలుగురు భారతీయ జాలర్లను అరెస్టు చేసి, వారి పడవను స్వాధీనం చేసుకుంది.ఈ ఏడాది జనవరిలో శ్రీలంక నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు శ్రీలంక 180 మందికి పైగా భారత జాలర్లను అరెస్టు చేసింది. గత ఏడాది 240 నుంచి 245 మందిని అరెస్టు చేసిన నేపధ్యంలో భారత్-శ్రీలంక సంబంధాల్లో వివాదాలు తలెత్తాయి. -
రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్
కోల్‌కతా: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కేఫ్ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్ షాజిబ్‌ను పశ్చిమబెంగాల్లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. తూర్పు మెదీనాపూర్‌లోని కాంతి ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళలోని పలు ప్రాంతాల్లో తనిఖీల తర్వాత అక్కడి పోలీసుల సాయంతో ఈ అరెస్టుల పరిణామం జరిగింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులకు స్థానికంగా సహకరించిన ముజమ్మిల్ షరీఫ్‌ను కూడా దర్యాప్తు సంస్థ గత నెలలో అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురూ ఐఎస్ఐఎస్ మాడ్యూల్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నవంబర్‌లో నమోదైన మంగుళూరు కుక్కర్ పేలుడు కేసుతో పాటు శివమొగ్గ గ్రాఫిటీ కేసులోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన నిందితుడు.. కేఫ్‌లో టిఫిన్ చేసి.. బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ కేసును ఎస్ఐఏ దర్యాప్తు చేస్తోంది. పేలుడుకు పాల్పడిన ఈ ఇద్దరు వ్యక్తులు ఆచూకి తెలిపితే ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తామని.. అందుకు సంబంధిన నిందితుల ఫోటోలను విడుదల చేసి.. ఎన్ఐఏ రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!.. మంత్రి సంచలన కామెంట్స్ -
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(12ప్రాంతాలు), తమిళనాడు(5 ప్రాంతాలు), ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట.. మొత్తం 18 ప్రదేశాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక నిందుతుడు ముజ్మిల్ షరీఫ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ముజ్మిల్ మరో ఇద్దరు నిందితులకు పేలుడు పదార్ధలు , సాంకేతిక పరికరాలు సరాఫరా చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సోదాల్లో నగదుతోపాటు, వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారులు సాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇక రామేశ్వరం పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని ఎన్ఐఏ వెల్లడించింది. కాగా మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో బాంబు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారు. ఈ సంఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తుజరుపుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. చదవండి: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ? Rameshwaram Café blast case: National Investigation Agency (NIA) arrested a key conspirator following massive raids across multiple locations in three states. Muzammil Shareef was picked up and placed in custody as a co-conspirator after NIA teams cracked down at 18 locations,… pic.twitter.com/TEzXTXpSv3 — ANI (@ANI) March 28, 2024 -
బెంగళూరు పేలుడు కేసులో ఒకరి విచారణ
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో బళ్లారిలో షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో బాంబు పెట్టి వెళ్లిపోయిన నిందితుడి కోసం గాలిస్తూ బుధవారం షబ్బీర్ ఆచూకీని కనుగొన్నారు. బళ్లారిలో మోతీ సర్కిల్ సమీపంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో షబ్బీర్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొంతసేపు విచారించి బెంగళూరుకు తరలించారు. బాంబు పెట్టిన వ్యక్తికి, షబ్బీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. షబ్బీర్ బళ్లారి సమీపంలో తోరణగల్లు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిíÙయన్‌గా పని చేస్తున్నాడు. బాంబు పేలుడు తర్వాత ప్రధాన నిందితుడు బెంగళూరు నుంచి బళ్లారికి బస్సులు మారుతూ వచ్చాడు. ఆపై షబ్బీర్ ఇంటికి వచ్చి అతడిని కలిసినట్లు ఎన్ఐఏ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలిసింది. కాగా, షబ్బీర్‌ను విచారించి రాత్రి వదిలిపెట్టినట్లు సమాచారం. -
రామేశ్వరంలో వరదముంపు ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్ షర్మిల
-
సీఎం కేసీఆర్ ఆలయాల సందర్శన
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం రామేశ్వరంలోని ప్రసిద్ధ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారమే రామేశ్వరం వెళ్లిన కేసీఆర్ అక్కడ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి వద్ద అంజలి ఘటించారు. తర్వాత అక్కడే బస చేసిన సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబసభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే రామసేతు, పంచముఖ హనుమాన్‌లను కూడా దర్శించుకున్నారు. అలాగే ధనుష్కోటి బీచ్‌ను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే రామసేతు నిర్మాణం మొదలుపెట్టాడని చెబుతారు. దీనినే ప్రస్తుతం అడమ్స్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబసభ్యులు తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు, సిబ్బంది వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సముదాయంలోని రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలను, అక్కడి శిల్ప, చిత్రకళను కేసీఆర్ తిలకించారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. -
రామేశ్వర ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్
సాక్షి, చెన్నై : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టిన తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రస్తుతం రామేశ్వరంలో పర్యటిస్తున్నారు. రామేశ్వరంలో ప్రసిద్ధ గాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించారు. ప్రత్యేక పూజలో స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు ఆలయ నిర్వాహకుల నుండి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈనెల 13న డీఎమ్‌కే అధినేత స్టాలిన్‌ను కేసీఆర్ కలవనున్నట్లు ప్రకటించినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరిద్దరి భేటీ సాధ్యపడకపోవచ్చుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
తవ్వకాల్లో భారీగా బాంబులు, బుల్లెట్లు
సాక్షి, చెన్నై: భారీ ఆయుధాల డంప్ బయటపడటంతో తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. రామాంతపురం జిల్లా రామేశ్వరం సముద్ర తీరంలో ఓ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా.. భారీ ఎత్తున్న ఆయుధాలు బయటపడ్డాయి. ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు, బాంబులు, మందు గుండు సామాగ్రిని భారీ ఎత్తున్న పెట్టెల్లో లభించాయి. ఈ ఆయుధ బాంఢాగారం నిషేధిత ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)కు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. తీరంలోని ఓ మత్స్యకారుడి ఇంటి వద్ద ఉన్న కొబ్బరి తోటలో చెత్తను పూడ్చేందుకు ఓ గొయ్యిని తవ్వారు. అయితే ఐదడుగులు తవ్వేసరికి పెట్టెలు బయటపడ్డాయి. అనుమానంతో తెరిచి చూడగా ఆయుధాలు కంటపడ్డాయి. దీంతో కంగారుపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంత శ్రమించిన పోలీసులు వాటిని వెలికి తీశారు. సుమారు 5000 వేల బుల్లెట్లతోపాటు వందల కేజీల మందు గుండు సామాగ్రి బయటపడింది. ఇవన్నీ తుప్పు పట్టిన స్థితిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 1983-90 మధ్య కాలంలో ఎల్టీటీఈ.. ఉగ్ర శిక్షణా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని వాడుకుని ఉంటుందని జిల్లా ఎస్పీ ఓంప్రకాశ్ మీనా అభిప్రాయపడుతున్నారు. -
రామేశ్వరంలో శ్రీదేవి అస్థికల నిమజ్జనం
సాక్షి, ముంబయి : కోట్లాది అభిమానులను దుఖఃసాగరంలో ముంచి సుదూరతీరాలకు పయనమైన నటి శ్రీదేవి అంత్యక్రియలు ముంబయిలో అధికార లాంఛనాల మధ్య ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి అస్థికలను సముద్రంలో కలిపేందుకు ఆమె భర్త బోనీకపూర్ ఇతర కుటుంబసభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లేందుకు చెన్నై చేరుకున్నారు. అస్థికల నిమజ్జనం అనంతరం వెనువెంటనే వారు ముంబయి తిరిగివెళతారు. బోనీకపూర్ బృందం ముంబయి నుంచి చార్టర్డ్ విమానంలో శుక్రవారం సాయంత్రం చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్లి అస్ధికలు నిమజ్జనం చేస్తారు. నదుల్లో మరణించిన వారి అస్థికలు కలపడం హిందూ సంప్రదాయంలో భాగం. నదీతీర్థాల్లో కర్మకాండలు ఆచరించిన అనంతరం పవిత్ర నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అనితర సాధ్యమైన తన నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి మేనల్లుడి వివాహానికి హాజరై దుబాయ్ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించారు. ఆమె మృతిపై పలు సందేహాలు వ్యక్తమైనా వాటికి తెరదించుతూ కేసును క్లోజ్ చేస్తున్నట్టు దుబాయ్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. -
కమల్ రాజకీయ యాత్ర
-
కలాంను స్మరించుకొని ..రాజకీయ ప్రస్ధానం
-
వడివడిగా కమల్ అడుగులు!
సాక్షి, చెన్నై: రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు కమల్‌హాసన్ బుధవారం ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకున్నారు. కలాం సమాధికి అంజలి ఘటించారు. అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం అక్కడి నుంచి మదురై బయలుదేరారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కమల్ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి.. పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం మదురైలో నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ పేరు, పతాకం, పార్టీ లక్ష్యాలను కమల్ ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్‌లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు రజనీకాంత్, విజయ్‌కాంత్‌లను కమల్ కలుసుకున్నారు. -
ఆ రైలంతా టికెట్ లేని ప్రయాణికులే..
రామేశ్వరం : దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు టికెట్ లేకుండానే రైలు ప్రయాణం చేసేశారు. టికెట్ కౌంటర్లో ఉద్యోగులెవరూ లేకపోవటమే ఇందుకు కారణం. తమిళనాడులోని రామేశ్వరం- మదురై ప్యాసింజర్ ట్రెయిన్ నిత్యం ఉదయం 5.30 గంటల సమయంలో రామేశ్వరం నుంచి బయలుదేరుతుంది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జనం స్టేషన్‌కు చేరుకుని కౌంటర్ వద్ద క్యూ కట్టారు. అయితే, రైలు బయలుదేరే సమయం దగ్గరపడుతున్నా సంబంధిత ఉద్యోగులెవరూ లేకపోవటంతో ప్రయాణికులంతా రైలెక్కేశారు. గమ్యస్థానాలకు చేరుకున్నారు. టికెట్ కౌంటర్లో ఉండాల్సిన ఉద్యోగి రాకపోవటంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమయినట్లు తెలుస్తోంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. మధురై-రామేశ్వరం మధ్య దూరం 161 కిలోమీటర్లు కాగా బుధవారం రైలులో సుమారు వెయ్యిమంది ఉచితంగా ప్రయాణించినట్లు సమాచారం. -
వంతెనపై మినీబస్సు ఊగిసలాట
-
38 మంది జాలర్లకు విముక్తి
రామేశ్వరం: గత నెలలో అదుపులోకి తీసుకున్న38 తమిళ జాలర్లను శ్రీలంక అధికారులు విడుదల చేయనున్నారు. గత నెల 21, 26వ తేదీల్లో తమ ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపలు పడుతున్నారంటూ తమిళనాడుకు చెందిన జాలర్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. వీరిని మంగళవారం మధ్యాహ్నం భారత అధికారులకు అప్పగించనున్నట్లు ప్రకటించింది. అనంతరం వీరంతా కరైకాల్ చేరుకుంటారని అధికారులు ప్రకటించారు. -
మళ్లీ రామసేతు వివాదం ఎందుకు?
-
మళ్లీ రామసేతు వివాదం ఎందుకు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడంతో గత ఆరేళ్లుగా కోర్టు పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద రామ మందిర నిర్మాణ అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు అదే కోవలో కాల గమనంలో కనుమరుగైందని అనుకుంటున్న ‘రామసేతు’ అంశం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. రామసేతు ప్రకతిసిద్ధంగా ఏర్పడినదా లేదా మానవ నిర్మాణమా? అన్న అంశాన్ని తెలుసుకోవడానికి తాము స్వతంత్య్ర సర్వే నిర్వహించాలనుకుంటున్నామని భారత చారిత్రక పరిశోధన మండలి శనివారం ఓ ప్రకటన చేసింది. ఈ మండలి చైర్మన్ సుదర్శన్‌రావు పక్కా హిందుత్వ వాదనే విషయం అందరికి తెల్సిందే. పుక్కిటి పురాణాన్ని చరిత్రగా మలిచేందుకు జరిగే ప్రయత్నమే ఇదని కొంత మంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం తీరం నుంచి శ్రీలంక ఆగ్నేయ తీరంలోని మన్నార్ దీవులకు మధ్య సముద్రం నీటి లోపల ఓ వారధిలాంటి నిర్మాణం ఉంది. బ్రిటానియా ఎన్సైక్లోపీడియా ప్రకారం దీన్ని రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి అని పిలుస్తారు. ఇది సున్నపు మేటల వల్ల ఏర్పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. దీన్ని ఆడమ్స్ నిర్మించడం ఆడమ్స్ బ్రిడ్జి అని, కాదు రాముడు నిర్మించడం వల్ల రామసేతు అని పేరు వచ్చిందన్నది మత విశ్వాసకుల అభిప్రాయం. సీతను రావణాసురుడు శ్రీలంకకు ఎత్తుకుపోవడం వల్ల అక్కడికి వెళ్లేందుకు వానర సైన్యం రాళ్లతో ఈ వంతెన నిర్మించిందన్నది మత విశ్వాసకుల అభిప్రాయం. 18వ శతాబ్దంలోనే కొట్టేయాలనుకున్నారు పాశ్చాత్య దేశాల నుంచి సరకు రవాణా నౌకలు భారత తూర్పు తీరానికి రావాలంటే సముద్రం నీటిలో ఈ రామసేతు అడ్డుగా ఉంది. దాంతో ఆ నౌకలు శ్రీలంకను చుట్టి భారత్ తీరానికి వస్తున్నాయి. దీని వల్ల అపార ఖర్చుతోపాటు ఎంతో కాలం ఖర్చవుతోంది. బ్రిటిష్ కాలంలో ఇంగ్లండ్ నుంచి భారత్ తూర్పు తీరానికి ఈస్ట్ ఇండియా కంపెనీ సరకుల నౌకలు కూడా శ్రీలంకను చుట్టి వచ్చేవి. ఈ అనవసర ఖర్చును, సమయాన్ని ఆదా చేయడం కోసం రామసేతును కొట్టేయాలని ఇంగ్లీష్ జియోగ్రాఫర్ జేమ్స్ రెన్నెల్ ప్రణాళిక వేశారు. అది అనేక చారిత్రక కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్ట్ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. 1955లో సేతు సముద్రం ప్రాజెక్టు కమిటీ ప్రతిపాదనలను భారత్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే 50 ఏళ్ల తర్వాత, అంటే 2005లో ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషద్ లాంటి సంస్థలు ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగడమే కాకుండా సుప్రీం కోర్టుకెక్కాయి. రామాయణం ఒక ఇతియాసం మాత్రమేనని, అందులోని రాముడి పాత్ర నిజంగా ఉందనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవంటూ భారత ఆర్కియాలోజి సంస్థ కోర్టులో 2007లో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎల్కే అద్వానీకి ఎంతో కలసివచ్చింది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆయన అఫిడవిట్‌ను అస్త్రంగా మలుచుకొన్నారు. మత విశ్వాసాలను గౌరవించలేని కాంగ్రెస్‌కు లౌకికవాదినని చెప్పుకునే అర్హత కూడా లేదని విమర్శించారు. రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు? కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు తమిళనాడులోని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు మద్దతు పలికాయి. రామసేతును దెబ్బతీయకుండానే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిందిగా ఏఐడీఎంకే సూచించింది. డీఎంకే నాయకుడు కరుణానిధి ఒక అడుగు ముందుకేసి, రామసేతును కట్టడానికి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నారని వ్యాఖ్యానించడం పట్ల హిందూ సంస్థలు నాడు తీవ్రంగా గొడవ చేశాయి. ప్రముఖ చరిత్రకారుడు పన్నీకర్ కూడా రామసేతుకు నష్టం జరుగకుండా ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగాలని సూచించారు. రామాయణం చరిత్రకాదని, అది కల్పిత గాధన్నది తనకు తెలుసునని, అయితే కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని ఇక్కడ దెబ్బతీయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో వివాదం సద్దుమణగింది. పర్యావరణ అంశాల అవరోధం 2009 తర్వాత కోర్టు వాదనలన్నీ ప్రధానంగా పర్యావరణ అంశాలపై కొనసాగాయి. సేతు సముద్రం ప్రాజెక్ట్ వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందంటూ పర్యావవరణ పరిరక్షణ సంస్థలు వాదించాయి. ఈనేపథ్యంలో వాస్తవాస్తవాలను తేల్చేందుకు ఆర్కే పచౌరి కమిటీ ఏర్పాటయింది. పర్యావరణ పరిస్థితులకు తీవ్ర విఘాతం కలుగుతుందంటూ 2013లో పచౌరి కమిటీ నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి పూర్తిగా తెరపడిన ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకరావడం వెనక దురుద్దేశాలున్నాయని కేరళ, తమళనాడు పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మతం పునాదులను బలోపేతం చేసుకునే ప్రయత్నం కావచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. -
కనులపండువగారథోత్సవం
నత్తా రామేశ్వరం (పెనుమంట్ర) : నత్తా రామేశ్వరంలో గోస్తనీ తీరాన కొలువైన రామేశ్వరస్వామి ఆలయం నిర్మిం చిన నాటి నుంచి ఆచారంగా వస్తున్న స్వామివారి కల్యాణ ర«థోత్సవం శుక్రవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. రామేశ్వరస్వామి పార్వతీ సమేతుడై ప్రత్యేక అలంకరణలో రథంలో కొలువుదీరారు. రథాన్ని అరటిగెలలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. హరహరమహాదేవ శంభోశంకర అంటూ భక్తులు స్వామివారి రథాన్ని లాగారు. కాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ రథోత్సవానికి హాజరయ్యారు. వేలాది మంది భక్తుల సందడి నడుమ మేళతాళాలతో రథోత్సవం వైభవంగా సాగింది. వైభవంగా ఆచంటేశ్వరుని రథోత్సవం ఆచంట : మహాశివరాత్రి పర్వదినం సం దర్భంగా ప్రసిద్ధిగాంచిన ఆచంటేశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. ఆచంట పరిసర గ్రామాలకు చెందిన భక్తులు కోడేరులోని వశిష్ట గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్నాహ్నం మూడు గంటలకు పురవీధులగుండా స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మ న్ గొడవర్తి కృష్ణ భగవాన్, ఈవో దండు వెంకట కృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
ఫ్యాన్కుు ఉరి వేసుకుని ఆత్మహత్య భర్త, అత్తే హతమార్చారంటూ తల్లి ఆరోపణ రామేశ్వరం (పెదపూడి) : అత్తింటి వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఆమె అత్త, భర్త అనుమానం, వేధింపులను తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన కుమార్తెను వారే హతమార్చారని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపించారు. పెదపూడి ఎస్సై వీఎల్‌వీకే సుమంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ(28)కు 2011 జూ¯ŒS 10న రామేశ్వరం గ్రామానికి చెందిన మెర్నిడ్డి కుమార్‌తో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కొడుకు చరణ్ ఉన్నాడు. కుమార్ రోల్డ్‌గోల్డ్ వస్తువులు అమ్ముతూ, గ్రామాల్లో తిరుగుతుంటాడు. వస్తువుల తయారీకి ఆర్డర్లు తీసుకుంటాడు. అతడు తన తమ్ముడికి చెందిన కాకినాడ జగన్నాథపురంలోని షాపులో ఉండేవాడు. పెళ్లయినప్పటి నుంచి కుమార్ మద్యానికి అలవాటు పడ్డాడు. మద్యం మత్తులో భార్యను హింసించేవాడు. పది రోజుల క్రితం కుమార్ రోడ్డు ప్రమాదానికి గురి కాగా, కాలికి గాయమైంది. అతడిని పలకరించడానికి అన్పపూర్ణ తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ రాలేదంటూ ఆమె అత్త, భర్త వేధింపులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురై, సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఇంట్లో ఫ్యా¯ŒSకు చీరతో ఉరి వేసుకుంది. ఆమె మరిది మాణిక్యాలరావు గది తలుపులు తెరవగా, అప్పటికే అన్నపూర్ణ చనిపోయింది. మృతురాలి తండ్రి త్రిమూర్తులు ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సుమంత్, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. నా కుమార్తెను హతమార్చారు : తల్లి ఆరోపణ మృతురాలి అత్త పద్మావతి, భర్త కుమార్ వేధింపులకు గురిచేసి తన కుమార్తెను హతమార్చారంటూ అన్నపూర్ణ తల్లి రేల పార్వతి ఆరోపించింది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్త ఆమెను వేధించేవారని పేర్కొంది. మూడు సార్లు తన కుమార్తెను హతమార్చడానికి వీరు యత్నించారని ఆరోపించింది. గతంలో భర్త కుమార్.. అన్నపూర్ణ గొంతు నులుమగా ఆమె అపస్మారక స్థితికి చేరి, బతికిందని పేర్కొంది. ఆరు వారాల క్రితం మరోసారి భర్త ఆమెను హతమార్చేందుకు యత్నించగా, మరిది మాణిక్యాలరావు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అన్నపూర్ణ బతికిందన్నారు. తన కుమార్తెను అత్త, భర్త హింసించి, చంపారంటూ పార్వతి అధికారుల వద్ద విలపించింది. -
కార్పెంటర్ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక రామేశ్వరంలోని కార్పెంటర్ పుట్టా రఘునాథ్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథ్‌కు భార్య భ్రమరాంబతోపాటు సుబ్రమణ్యం, శ్రీనివాసులు అనే కుమారులు ఉన్నారు. కుమారులు ఇద్దరూ కడప సెయింట్ జోసెఫ్‌లో చదువుతున్నారు. భార్య ఇంటి వద్ద కూరగాయల వ్యాపారం చేస్తోంది. కొన్ని రోజుల నుంచి తాగుడుకు బానిస అయిన రఘునాథ్ పనికి సరిగా వెళ్లడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని భార్యను అడుగగా.. ఆమె ఇవ్వలేదు. అప్పుడప్పుడు అతనికి కడుపు నొప్పి కూడా ఎక్కువగా వస్తుంటుంది. రాత్రి పడుకున్న అతను తెల్లారే సరికి మిద్దెపైన రేకుల కడ్డీలకు ఉరివేసుకున్నాడు. శనివారం విషయం తెలియడంతో వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. -
కలాం విగ్రహ ఏర్పాట్లు సందర్శించిన ప్రత్యేక బృందం
రామేశ్వరంః మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. జూలై 27న జరగనున్న విగ్రహ స్థాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులతో కూడిన బృందం ఆ ప్రదేశాన్ని సందర్శించింది. రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులు రామేశ్వరంలో పర్యటించారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఏర్పాటుకోసం జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. మాజీ రాష్ట్పపతి మొదటి వర్థంతి సందర్భంలో జూలై 27న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అదే ప్రాంతంలో కలాం స్మారక చిహ్నంగా ఓ లైబ్రరీని, మ్యూజియం ను సైతం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికోసం హౌసింగ్ క్వార్టర్స్ ను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ బృందంతోపాటు మండపం కోస్ట్ గార్డ్ కమాండర్ రామ్మోహన్ రావు, అబ్దుల్ కలాం మేనల్లుడు షేక్ సలీం కూడా హాజరై విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. -
సముద్రుడి కోసం దర్భశయనం...
కన్యాకుమారి ప్రసిద్ధం. రామేశ్వరం జగత్ ప్రసిద్ధం. కానీ ఆ సమీపంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒకటి ఉంది. అదే దర్భశయనం. రాముడు దర్భలమీద శయనించి, సముద్రుడిని ఉపాసించినట్టుగా చెబుతోంది ఇక్కడి స్థల పురాణం. పది అడుగుల రాముడి ఏకశిలా విగ్రహం గురించి, మరెన్నో విశేషాల గురించి వివరిస్తున్నారు దర్భశయనం సందర్శించిన ఒంగోలు వాస్తవ్యులు సంగుబొట్ల వెంకటసత్య భగవానులు. ‘పంచభూత లింగాల దర్శనంతో పాటు కన్యాకుమారి రామేశ్వరం ప్రాంతాలను సందర్శించాలనుకున్నాం మేము. కానీ అనుకోకుండా మరో పుణ్యక్షేత్రమైన దర్భశయన కూడా చూస్తామనుకోలేదు. అది మా యాత్రలో మాకు దక్కిన మరో భాగ్యం. ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకూ దాదాపు 1000 కిలోమీటర్ల దూరం. రాను పోను మరో 1500 కిలోమీటర్ల ప్రయాణం పడుతుంది అనుకున్నాం. మా ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర అంతా కలిపి 7 రోజులు. ఇదంతా వెహికిల్ మాట్లాడుకుని తిరుగుదామని నిశ్చయించుకున్నాం. ఒంగోలు నుంచి బయల్దేరి ఈ యాత్రకు విఘ్నాలు కలగకుండా ముందుగా కాణిపాకంలోని గణపతిని దర్శించుకొని చిత్తూరు మీదుగా అరుణాచలం చేరుకున్నాం. అక్కడే ‘అగ్నిలింగం’ ఉంది. దానిని దర్శించుకొని రాత్రి శ్రీరంగపట్టణం మీదుగా మరుసటిరోజు అక్కడకు సమీపంలో ఉన్న జంబూకేశ్వరం చేరుకున్నాం. ఇక్కడే ‘జల లింగం’ ఉంది. దానిని దర్శించుకొని దిండిగల్ మీదుగా పళని- అటు నుంచి మధురై- దర్శించుకొని కన్యాకుమారి చేరుకున్నాం. మన ఉపఖండానికి చివర ప్రాంతం ఇది. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో శుచీంద్రంలోని అనసూయాదేవి ఆలయం ఉంది. అనసూయాదేవి అంటే సతీ అనసూయ. ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పసిపిల్లలను చేసి, ఊయలలో ఊపిన స్థలం ఇదేనని అంటారు. ఇక్కడి దేవాలయం పై కప్పు మీద శ్రీచక్రం ఉండటం అబ్బురంగా అనిపించింది. అలాగే ఇక్కడి 20 అడుగుల హనుమంతుని విగ్రహం చూడటానికి కూడా రెండు కళ్లు సరిపోలేదు. మరునాడు కన్యాకుమారి నుంచి రామేశ్వరం చేరుకొని ఆ చుట్టుపక్కల దేవాలయాలన్నీ దర్శించుకున్నాక తిరుగు ప్రయాణానికి సిద్ధమై దారిలో రామనాథపురం చేరుకున్నాం. తమిళనాడులో ఇదో పెద్ద జిల్లా. ఇక్కడే మాకు దర్భశయనం గురించి తెలిసింది. రామనాథపురం నుంచి ఈ ఆలయం 10 కి.మీ. దూరంలో ఉందని స్థానికులు ఈ గ్రామాన్ని ‘తిరుపులని’ అంటారని చెప్పారు. ఈ వివరాలు విని దర్భశయనం చూడాలని నిశ్చయించుకున్నాం. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం 6.30 గంటలకు ఆలయానికి చేరుకున్నాం. కాని 8 గంటలకు గానీ దేవాలయ ద్వారాలు తెరుచుకోలేదు. సుమారు 10-15 ఎకరాలలో ఉంటుంది దర్భశయన దేవాలయం. సువిశాలంగా ఉన్న ఆ ఆలయ ప్రాకారాలు చూసుకుంటూ ముందుకు సాగాం. అది చాలా ప్రాచీన గుడి. మూలవిరాట్టును చూడగానే మాటల్లో చెప్పలేని ఉద్వేగానికి లోనయ్యాం. కథ తెలుసుకొని తరించాం. పాయసం.. సంతాన భాగ్యం... ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పాయసం పెడతారు. ఆ ప్రసాదాన్ని ఆకు దోనెలలో పెట్టి భక్తులకు పంచుతారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ప్రత్యేక పూజలు జరిపి ఈ పాయసం అందిస్తారు. ఈ పాయసం తింటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కోనేరు తీర్థం పరమపవిత్రం దర్భశయనంలో అతిపెద్ద కోనేరు ఉంది. అయితే ఇందులో స్నానాలు చేయకూడదు. తీర్థంగా ఇక్కడి నీళ్లు తెచ్చుకోవచ్చు. పరమపవిత్రమైన తీర్థంగా ఈ కోనేటికి పేరుంది. వసతి సదుపాయాలు ఇది చిన్న ఊరు. చిన్న చిన్న హోటళ్లలో భోజనం లభిస్తుంది. బస చేయడానికి మాత్రం 10 కి.మీ దూరంలో ఉన్న రామనాథపురానికి రావాలి. అక్కడ చాలా మంచి వసతి సదుపాయాలు ఉన్నాయి. దర్భశయనం ఊరు చిన్నదే అయినప్పటికీ దేవాలయం మాత్రం పెద్దది. రామనాథపురం నుంచి ఆటోలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. దర్భశయనంలో ఫొటోలు తీసేవారున్నారు. కెమరా తీసుకెళితే మనమే ఫొటోలు తీసుకోవచ్చు. పెద్దగా నిబంధనలు ఏమీ లేవు. పూజాద్రవ్యాలు అన్నీ లభిస్తాయి. వెంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దర్భశయనం పూజాసామగ్రిని అమర్చుకునే బుట్టల అల్లికకు చాలా ప్రసిద్ధి. అలాంటి ఆకర్షణీయమైన బుట్టలు మరేచోట కనిపించలేదు. రూ.40 నుంచి వంద రూపాయల దాకా వివిధ పరిమాణాల్లో ఈ బుట్టలు ఉన్నాయి. ముఖ్య ఉత్సవాలు... మార్చి-ఏప్రిల్ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవం జరుగుతుంది. శ్రీరామనవమి ఇక్కడ ముఖ్యమైన పండగ. అలాగే వైకుంఠ ఏకాదశి, జన్మాష్టమి, పొంగల్, దీపావళి, వారాంతాలు భక్తజన సందడి ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శన వేళలు ఉదయం 8 గంటల నుంచి 12.20 వరకు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8.00 వరకు. తిరుగుప్రయాణం... దర్భశయనం దర్శించుకున్న తర్వాత నవగ్రహ పాషాణం చేరాం. రాములవారు రావణవధ తర్వాత తిరుగు ప్రయాణంలో నవగ్రహాలను ప్రతిష్టించి సీతాసమేతంగా పూజలు చేసి వెళ్లిన ప్రదేశం ఇది. అక్కడ భక్తులు నవగ్రహపాషాణాన్ని స్వయంగా తాకి, సముద్రంలో స్నానం చేసి వస్తారు. అక్కడ నుంచి తంజావూరులోని ప్రసిద్ధ బృహదీశ్వరాలయాన్ని సందర్శించుకొని రాత్రికి చిదంబరం చేరాం. ఇక్కడే పంచలింగాలలో ఒకటైన ‘ఆకాశలింగం’ ఉంది. దానిని దర్శించుకుని అక్కడ నుంచి కాంచీపురానికి చేరుకున్నాం. అక్కడ ‘పృథ్వీలింగం’ (ఏకాంబరేశ్వరస్వామిని) దర్శించుకున్నాం. అక్కడ నుంచి విష్ణుకంచిలోని వెండిబల్లి, స్వర్ణబల్లిని స్పర్శించి, అక్కడ నుంచి తిరుపతి మీదుగా శ్రీకాళహస్తి చేరాం. ఇక్కడ ‘వాయులింగం’ను దర్శించుకొని తిరిగి ఒంగోలుకు ఏడో రోజున చేరాం. ఈ క్షేత్రాలలో అపురూపమైనదిగా రామేశ్వరంలో హనుమంతుడు లంఘించిన ప్రదేశం, గంధమాధన పర్వతం, రామేశ్వరానికి 10 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం-ధనుష్కోటి మధ్యలో సముద్రతీరంలో శ్రీరాముల వారు విభీషణుడు కలుసుకున్న ప్రదేశంలో ఓ గుడి ఉంది. అత్యంత ప్రాచీనమైన ఈ గుడిలో విభీషణుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ పూజలు చేయడానికి ఎవరూ లేరు. మనమే పూజలు చేసి, విభీషణుడిని దర్శించుకొని రావాలి. ఈ గుడికి చాలా తక్కువ మంది భక్తులు వెళ్లడం కనిపించింది. ఇక్కడ ప్రదేశాలన్నీ రామాయణం జరిగింది అనడానికి ప్రత్యక్షసాక్ష్యాలు. వాల్మీకి మహర్షి రామాయణంలో దర్భశయనం, నవగ్రహ పాషాణం ప్రస్తావన యుద్ధకాండలో వివరించి ఉన్నారు. ఒక్కొక్కరికి 8 వేల రూపాయలు... ఒంగోలు నుంచి (రాను పోను) లెక్కిస్తే 2600 కిలోమీటర్లు వచ్చింది. హైదరాబాద్ నుంచి అయితే మరొక 450 కిలోమీటర్లు కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం 3000 కిలోమీటర్లు అవుతుంది. వాహనం, భోజన వసతి, పూజాద్రవ్యాలు, పూజా కైంకర్యాలు.. ఇవన్నీ ఖర్చులు కలుపుకొని ఏడుగురికి 50 వేల రూపాయల ఖర్చు అయ్యింది. స్థలపురాణం శ్రీరామచంద్రుడు లంకకు వెళ్లడానికి వానర సేనతో సముద్రుడి మీద వారధి కట్టడానికి సిద్ధపడ్డాడు. సముద్రుడి కోసం ఇక్కడ రాముడు మూడు రోజుల పాటు దర్భల మీద శయనించి ఉపాసించాడు. అయినా సముద్రుడు రాలేదు. దీంతో సముద్రుడి మీద కోపగించిన రాముడు బాణ ప్రయోగానికి సంసిద్ధమయ్యాడు. దాంతో సముద్రం అల్లకల్లోలమైంది. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై శ్రీరాముడితో వారధి కట్టుకొమ్మని అందుకు తాను సాయం చేస్తానని చెప్పాడు. దీంతో నీలుడి ఆధ్వర్యంలో వానర సేనతో వారధి నిర్మించాడు రాముడు. ఇందుకు ఆనవాలుగా ఈ ఆలయం మూలవిరాట్టు దర్భల మీద శయనించి ఉంటుంది. అయితే వేల ఏళ్ల క్రితం పులవార్, కలవార్, కన్నవార్ అనే ముగ్గురు మహర్షులు మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేశారని, మహావిష్ణువు ప్రత్యక్షమై వారి కోరిక మీదకు అక్కడి దర్భల మీద శయనించాడనే పురాణగాథ కూడా ఉంది. -
చెన్నైలో మునిగి శ్రీలంకలో శవమై తేలి..
రామేశ్వరం: భారీ వర్షాలతో వచ్చిన వరదల కారణంగా కొట్టుకుపోయిన చెన్నై వాసి శ్రీలంకలో శవమై తేలాడు. శ్రీలంకకు చెందిన జాలర్లు అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వీటి కారణంగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని కామరాజ్ నగర్ ఎన్జీవో కాలనీకి చెందిన ఎన్ పూమి దొరై అనే వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. అతడి జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. అయితే, తాజాగా అతడి మృతదేహం శ్రీలంకకు చెందిన నావికులకు త్రింకోమల్లీ అనే ప్రాంతంలో లభించింది. ఆ మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అతడిని తమిళనాడుకు చెందిన పూమి దొరైగా గుర్తించారు. దీంతో అతడి మృతదేహాన్ని చెన్నైకి తరలించేందుకు శ్రీలంకలోని భారత ప్రభుత్వ రాయబారులు ఏర్పాటుచేస్తున్నారు. పూమి దొరై ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. -
అంధ భక్తులపై ఖాకీల నిర్వాకం
రామేశ్వరం: కొందరు అంధులపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లినవారిని అడ్డుకోవడమే కాకుండా వారిని వేధింపులకు గురి చేశారు. దీంతో వారంతా మంగళవారం అదే ఆలయం ముందు ధర్నాకు దిగి ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన అంధ భక్తులు శ్రీ రామనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో తనిఖీకోసం ప్రత్యేక క్యూ ఉందని వారికి తెలియదు. పైగా వారికి చూపులేనందున ఆ విషయం ముందుగా తెలుసుకోలేకపోయారు. అందుకే ఆలయంలోకి వెళ్లేందుకు ద్వారం వద్దకు వెళ్లిన 12మంది అంధులను అమానుషంగా నలుగురు పోలీసులు ఈడ్చుకెళ్లారు. వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసినా భాషరాని కారణంగా చెప్పలేకపోయారు. దీంతో పోలీసులకు వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆ అంధ భక్తులకు మరికొందరు భక్తులు తోడై ఆందోళనకు దిగారు. -
రామేశ్వరంలో కలాం విగ్రహం
చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం 20 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామేశ్వరం - రామనాథపురం జాతీయ రహదారిలో పంబన్ వంతెన సమీపంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు రామనాథపురం జిల్లా తూర్పు అరిమా సంఘం అధ్యక్షులు విశ్వనాథన్ తెలిపారు. మరోవైపు రామేశ్వరం జిల్లా పేయ్‌కరుంబులో గత నెల 30న కలాం అంత్యక్రియలు జరగ్గా.. ఇప్పటికీ జనం రోజూ అధిక సంఖ్యలో ఖననం చేసిన ప్రదేశానికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. -
ఘనంగా కలాం అంత్యక్రియలు
-
సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు
-
ఇక సెలవంటూ...
రామేశ్వరం : మహామనిషి మహాభినిష్క్రమణం. బంధువులు, అభిమానులు, అనుచరులు కడసారి వీడ్కోలు పలకగా ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బంధువులు, అభిమానులు, అనుచరులు తరలి రాగా మిస్సైల్ మ్యాన్‌కు భారతావని వీడ్కోలు పలికింది. ముద్దుబిడ్డను మాతృభూమి శోకతప్త హృదయంతో సాగనంపింది. సొంతగడ్డపైనే తన అంతిమ సంస్కరాలు పూర్తి కావాలన్న కలాం ఆకాంక్ష మేరకు ఆయన సొంత గడ్డపైనే అంత్యక్రియలు జరిగాయి. కలాం అంత్యక్రియలకు వీవీఐపీలతో పాటు రాజకీయ, శాస్త్ర-సాంకేతిక రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. కేరళ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నీరు సెల్వం హాజరు కాగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కలాం అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిస్సైల్ మ్యాన్‌కు తుది నివాళులు అర్పించారు. కలాం భౌతికాకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఆ తర్వాత ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత కలాం పార్థివ దేహాన్ని ఖననం చేశారు. మరోవైపు రామేశ్వరం జనసంద్రమైంది. కలాంను చివరిసారిగా చూసేందుకు తరలివచ్చిన అభిమాన గణంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అంతకు ముందు జరిగిన కలాం అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. రోడ్డుపై బారులు తీరిన జనం ...కలాం సలామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
కలాంకి నివాళులర్పించిన మోదీ
-
రామేశ్వరం చేరుకున్న కలాం పార్థీవ దేహం!
-
రామేశ్వరం చేరిన కలాం పార్థివదేహం
రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని ఆయన సొంతూరు తమిళనాడులోని రామేశ్వరానికి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో కలాం భౌతికకాయాన్ని తరలించారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాన్ని మధురైకి తరలించి.. అక్కడి నుంచి హెలికాప్టర్లో తీసుకెళ్లారు. కలాం భౌతికకాయం వెంట కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్యనాయుడు వచ్చారు. ఇదే గడ్డపై ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగి.. అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన భారతరత్న కలాం .. చివరి సారిగా సొంతూరు రామేశ్వరానికి నిర్జీవంగా చేరుకున్నారు. కలాం పార్థివదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. కలాం భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు జనం బారులు తీరారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి, ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. రేపు ఉదయం కలాంకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కలాం అంత్యక్రియల్లో పాల్గొంటారు. -
కలాం చివరి చూపు కోసం..
చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టినగడ్డ రామేశ్వరం ఆయన పార్థివదేహం దర్శనం కోసం ఎదురు చూస్తోంది. తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం ఇంటి దగ్గర జనం బారులు తీరారు. కలాం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం తీసుకురానున్నారు. కలాం ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి, ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో రామేశ్వరం సమీపంలోని మధురైకు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రామేశ్వరం తరలిస్తారు. రామేశ్వరంలో ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వపడే శాస్త్రవేత్తగా ఎదిగి.. అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన కలాంకు నివాళులు అర్పించేందుకు బాధాతప్త హృదయాలతో నిరీక్షిస్తున్నారు. షిల్లాంగ్‌లో ఐఐఎంలో ప్రసంగిస్తూ కలాం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. -
రేపు అబ్దుల్ కలాం అంత్యక్రియలు
నేడు రామేశ్వరానికి భౌతికకాయం రక్షణ వలయంలో రామేశ్వరం ప్రధాని సహా పలువురు రాక 30న రాష్ట్ర ప్రభుత్వ సెలవు చెన్నై, సాక్షి ప్రతినిధి:భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు రామేశ్వరం సన్నద్ధం అవుతోంది. పూర్తి అధికార లాంఛనాలతో ఈనెల 30వ తేదీన అబ్దుల్ కలాం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కలాం భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి ఆయన స్వస్థలమైన రామేశ్వరానికి బుధవారం ఉదయం చేరుస్తారు. బుధవారం అంతా ప్రజల సందర్శనార్థం ఉంచి గురువారం ఉదయం ముస్లిం మత సంప్రదాయంలో ఖననం చేస్తారు. ఇందుకోసం రామేశ్వరంలో కట్టపల్లి, నటరాజపురం, ఉదయం పాలిటెక్నిక్ సమీపంలో ఇలా మూడు స్థలాలను ఎంపిక చేశారు. ఈ మూడు స్థలాలను రామేశ్వరం జిల్లా కలెక్టర్ నందకుమార్, ఎస్పీ మయిల్వాహనం మంగళవారం పరిశీలించారు. కలాం బంధువులు ఈ మూడు స్థలాల్లో ఒకదానిని ఎంపిక చేసుకున్న తరువాత ఖననం జరిగే ప్రదేశాన్ని ఖరారు చేస్తారు. రామేశ్వరంలో రక్షణ వలయం: భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు వీవీఐపీలు హాజరుకానున్న దృష్ట్యా రామేశ్వరం రక్షణ వలయంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఆరు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఇంకా అధికార, అనధికార ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 30న సెలవు: అబ్దుల్ కలాం అంత్యక్రియల దృష్ట్యా ఈనెల 30 వ తేదీన సెలవు దినంగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు సెలవుదినాన్ని పాటించాలని మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కలామ్ మరణ వార్త వెలువడగానే ఏడురోజులు సంతాపదినాలుగా ప్రకటించిన ప్రభుత్వం చెన్నై సచివాలయంలో జాతీయ పతాకాన్ని అవనతం చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ఇవ్వక పోవడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్, పీఎంకే నేతలు ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మూడు దినాలు సంతాపం పాటిస్తున్నట్లు వెల్లడించారు. -
పుట్టిన గడ్డపైనే అంత్యక్రియలు
-
పుట్టిన గడ్డపైనే అంత్యక్రియలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు.. ఆయన స్వస్థలం తమిళనాడులోని రామేశ్వరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయన పార్థీవదేహాన్ని రేపు (బుధవారం) రామేశ్వరం తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలు రామేశ్వరంలోనే జరగాలని కలాం కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన కేంద్రం కేబినెట్ సమావేశంలో ఈ మహావీరుడికి తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన సేవలను కొనియాడుతూ తీర్మానం చేసింది. అబ్దుల్ కలాం అంత్యక్రియల ఏర్పాట్లపై చర్చించారు. తన స్ఫూర్తివంతమైన జీవితంలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని కేంద్ర కేబినెట్ నివాళులర్పించింది. రామేశ్వరంలో రేపు అధికార లాంఛనాలతో, గౌరవ ప్రదంగా అబ్దుల్ కలాం అంత్యక్రియలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధానినరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ రామేశ్వరానికి వెళతారు. కాగా భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం షిల్లాంగ్‌లో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు వైమానిక దళ హెలికాప్టర్లో కలాం పార్థివదేహం గువాహటి నుంచి ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి చేరుకోనుంది. అక్కడ నుంచి టెన్ రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి కలాం భౌతికకాయాన్ని తరలించనున్నారు. -
33 మంది ఇండియన్ జాలర్ల అరెస్టు
హైదరాబాద్: శ్రీలంక దేశానికి సంబంధించిన నీళ్లలో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో 33 మంది భారతీయ జాలర్లను రామేశ్వరంలో శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీలంక నేవీ పర్సనల్ నాగపట్నం జిల్లా సరిహద్దులో 33 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారని ఫిషరీస్ విభాగం అధికారులు తెలిపారు. శ్రీలంక అధికారులు భారతీయ జాలర్లను అరెస్టు చేయటంతో పాటుగా ఐదు పడవలను కూడా సీజ్ చేశారని నాగపట్నం ఫిషరీస్ విభాగం జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజ్ అన్నారు. వారందరూ కంగుసంతురైకు చెందిన వారుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. -
2.5 కోట్ల గంజాయి స్వాధీనం
రామేశ్వరం: శ్రీలంకకు బోటులో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తమిళనాడు పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కారు, మోటర్ బైకులను స్వాధీనం చేసుకుని... సీజ్ చేసినట్లు తెలిపారు. రామేశ్వరానికి 65 కిలోమీటర్ల దూరంలోని కీలక్రాయి వద్ద ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 2.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
రామసేతు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: గడ్కరీ
రామసేతు ప్రాజెక్ట్ నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. రామసేతు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తామంటూ కేంద్రమంత్రి, బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ మంగళవారం వ్యాఖ్యానించారు. తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న రామసేతు ప్రాజెక్ట్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పరిశీలించిన అనంతరం గడ్కరీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరాణిక వంతెన ( లంక వెళ్లేందుకు వానరసైన్యం సహాయంతో రాముడు నిర్మించిన)గా పిలువబడుతున్న ఈ వంతెనను కూల్చేదిలేదన్నారు. రామసేతు ప్రాజెక్ట్‌ను తప్పకుండా పూర్తిచేస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. -
భగ్గుమన్న తమిళనాడు.. రెండు బస్సులు దహనం
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష వేయడంపై తమిళనాడు భగ్గుమంటోంది. ప్రధానంగా రామేశ్వరం ప్రాంతంలో మత్స్యకారులు తీవ్ర హింసకు పాల్పడ్డారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు. దాదాపు 108 జాలర్ల సంఘాలన్నీ కలిసి తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన చేపడుతున్నారు. రోడ్లపైకి ఎక్కి విధ్వంసానికి పాల్పడ్డారు. రెండు బస్సులను పూర్తిగా దహనం చేశారు. రైల్వే ట్రాకును కూడా ధ్వంసం చేయడంతో అటువైపు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రామనాథపురం జిల్లాలో విధ్వంసం జరుగుతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో వెళ్లారు. తీరప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. -
సమ్మె బాట!
రామేశ్వరం జాలర్ల బాటలో పుదుకోట్టై జాలర్లు నడిచేందుకు నిర్ణయించారు. శుక్ర వారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. పడవలను తిరిగి తమకు అప్పగించాలని కోట్టై పట్నం, జగదాపట్నం జాలర్లు డిమాండ్ చేశారు. శ్రీలంక చెర నుంచి విడుదలైన జాలర్లు శనివారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. సాక్షి, చెన్నై: కడలిలో తమిళ జాలర్లపై శ్రీలంక జులుం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిహద్దులు దాటుతున్నారన్న నెపంతో జాలర్లను పట్టుకెళ్లడం, వారాల తరబడి చెరలో బంధించడం పరిపాటిగా మారింది. జాలర్ల ఆం దోళనలు, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, కేంద్రం హెచ్చరికతో చివరకు వారిని చెర నుంచి శ్రీలంక సర్కారు విడుదల చేస్తోంది. అయితే, పడవలను మాత్రం తిరిగి అప్పగించడం లేదు. ఇది జాలర్ల కుటుంబాలను తీవ్ర అప్పుల్లోకి నెడుతోంది. ఇప్పటికే తమ పడవల్ని తిరిగి అప్పగించాలన్న నినాదంతో రామేశ్వరం జాలర్లు సమ్మె సైరన్ మోగించారు. కచ్చదీవుల్లో వేటకు అనుమతి, తమకు భద్రత లక్ష్యంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. కచ్చదీవుల్లో శరణు కోరడమే లక్ష్యంగా చేపట్టిన నిరసనను కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హామీ మేరకు విరమించిన జాలర్లు కేంద్రంతో సంప్రదింపులకు రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రామేశ్వరం జాలర్లకు మద్దతుగా పుదుకోట్టై జాలర్లు సమ్మెకు సిద్ధం అయ్యారు. పడవలు అప్పగించండి: శ్రీలంక ఆధీనంలో రాష్ట్ర జాలర్లకు చెందిన పడవలు సుమారు వంద వరకు ఉన్నారుు. ఒక్కో పడవ విలువ లక్షల్లో ఉంటుంది. పడవల్ని తిరిగి అప్పగించని దృష్ట్యా, జాలర్లు బతుకు లాగించడం కష్టతరంగా మారింది. తమ పడవలను తమకు అప్పగించాలన్న నినాదంతో శుక్రవారం నుంచి పుదుకోట్టై జాలర్లు సమ్మెకు దిగారు. పడవలను ఒడ్డుకు పరిమితం చేశారు. చిన్న పడవలు కూడా కడలిలోకి వెళ్లలేదు. దీంతో చేపల వేటకు బ్రేక్ పడింది. తమ పడవలను తిరిగి అప్పగించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని జగదాపట్నం, కోట్టై పట్నం పరిసర గ్రామాల జాలర్లు స్పష్టం చేశారు. రామేశ్వరం, పుదుకోట్టై జాలర్లు సమ్మె బాట పట్టిన దృష్ట్యా, తదుపరి నాగపట్నం జిల్లా జాలర్లు వారి బాటలో నడిచే అవకాశం కన్పిస్తున్నాయి. నేడు రాష్ట్రానికి : రామేశ్వరానికి చెందిన 20 మంది, కోట్టై పట్నం, జగదాపట్నానికి చెందిన 23 మంది, నంబుదాల్, అక్కరై పేట్టై పరిసరాలకు చెందిన 51 మంది జాలర్లను గత వారం శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లిన విషయం తెలిసిందే. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరిని విడుదల చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే గురువారం ఆదేశాలు ఇచ్చారు. దీంతో అనురాధపురం చెరలో ఉన్న రామేశ్వరం జాలర్లను, యాల్పానం చెరలో ఉన్న జగదా పట్నం, కోట్టై పట్నం జాలర్లను, కొడియకరై చెరలో ఉన్న ఇతర జాలర్ల విడుదలకు శ్రీలంక నావికాదళం చర్యలు తీసుకుంది. మొత్తం 94 మంది జాలర్లను అక్కడి కోర్టుల్లో హాజరు పరిచారు. వీరందర్నీ విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు జాలర్లను అప్పగించారు. వీరిని సరిహద్దుల్లో భారత కోస్టుగార్డుకు అప్పగించనున్నారు. శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్ర ంలోపు వీరంతా వారి వారి ప్రాంతాలకు చేరుకోనున్నారు. -
‘హరహర మహాదేవ.
శంభో శంకర’ అంటూ రాష్ట్రంలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. భక్త జనం తరలి రావడంతో శివాలయాలు భక్తి పారవశ్యంలో మునిగాయి. గురువారం సాయంత్రం నుంచి మహాశివరాత్రి వేడుకలు శివాలయూల్లో వైభవంగా సాగుతున్నారుు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజాధికార్యక్రమాలు జరిగాయి. శివ భక్తులు తమ తమ ఇళ్లల్లో ఉదయాన్నే తల స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షతో శివ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్త్రోత్త్రం, శివ సహ స్ర నామ పారాయణం పఠించారు. ఇక సాయం సంధ్య వేళ శివాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. శంభో శంకర: రాష్ట్రంలోని రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి ఆలయం, కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం, మదురైలోని మీనాక్షి సోమ సుందరేశ్వర ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, చిదంబరం నటరాజ స్వామి ఆలయం, కుట్రాలంలోని కుట్రాలనాథేశ్వరర్ ఆలయం, కోయంబత్తూరులోని పొల్లాచ్చి సుందరేశ్వరాలయం, కన్యాకుమారిలోని ధనుమలయాన్ ఆలయం, కరూర్ జిల్లాలోని ఏకపురీశ్వరర్ ఆలయం... ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రధాన శివ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శివరాత్రి వేడుకల్లో పాల్గొని తరించారు. చెన్నై మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయం, తీర్థ స్వామీశ్వర ఆలయం, వాలీశ్వర ఆలయం, తిరువాన్మీయూరు మరుదీశ్వర ఆలయం, వేళచ్చేరి శ్రీ దండీశ్వర ఆల యం, తిరువేర్కాడు వీరకత్తీశ్వర ఆలయం, వలసరవాక్కం వేల్వీశ్వరాలయం, పూందమల్లి వైదీశ్వరాలయం, పార్క్టౌన్లోని ఏకాంబరీశ్వరాలయం, వడపళణి వేంగీశ్వరాలయం, సైదాపేట కారనీశ్వరాలయం, మింట్ దక్షిణామూర్తి ఆలయం, అనకాపుత్తూరులోని అగదీశ్వరాలయం, పాడిలోని వలిదీశ్వర ఆలయం, కోయంబేడులోని కురుందీశ్వరాలయం తదితర శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. పూజలు : అన్ని శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి విడత, తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండో విడత పూజ, పన్నెండు నుంచి శుక్రవారం ఉదయం మూడు గంటల వరకు మూడో విడత, మూడు నుంచి నాలుగు గంటల వరకు నాలుగో విడత చొప్పున నాలుగు కాల పూజలు భక్తి భావాన్ని పెంపొందిస్తూ నిర్వహించారు. శివుడు, పార్వతీ దేవి విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. వాహనాల్లో స్వామి, అమ్మవార్లను అధిష్టించి ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ ఆవరణల్లో శివరాత్రి పరమార్థాన్ని వివరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఆలయాల్లో శివ లింగాన్ని దర్శించుకున్న భక్తులు రాత్రంతా జాగారం చేశారు. జ్యోతిర్లింగాల దర్శనం: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో పూజలందుకుంటున్న జ్యోతిర్లింగాల్ని బ్రహ్మకుమారి సమాజం చెన్నైలో కొలువు దీర్చింది. పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మకుమారి సమాజం, ఐశ్వర్య విశ్వ విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఆరంభం అయ్యాయి. పురసైవాక్కం రాజా అన్నామలై రోడ్డులోని ధర్మ ప్రకాష్ కల్యాణ మండపం వేదికగా పన్నెండు జ్యోతిర్లింగాలను కొలువుదీర్చారు. శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించవచ్చు. సంగీత విభావరి: శివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులతో పన్నెండు గంటల సంగీత విభావరి జరిగింది. కర్నాటక సంగీత విద్వాంసులు టీఎన్ కృష్ణన్, సుగుణావరదాచారి, నైవేల శాంతన గోపాలన్, గాయత్రి వెంకటరాఘవన్ తదితరులు శివ భక్తి గీతాలాపనలతో భక్తి భావాన్ని చాటారు. నగరంలోని మైలాపూర్ లజ్ కార్నర్ సమీపంలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ సంగీత విభావరి సాయంత్రం ఆరు గంటల నుంచి నిర్విరామంగా పన్నెండు గంటల పాటు సాగింది. -
రామేశ్వరంలో భద్రత పెంపు
రామేశ్వరం(తమిళనాడు) : ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో తమిళనాడులోని రామేశ్వరంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శ్రీలంకలోని జాఫ్నా నుంచి సముద్రమార్గం ద్వారా తీవ్రవాదులు రామేశ్వరంలోకి చొరబడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. తీవ్రవాదులు మధురై, మయిలాడుతురైలలో దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది తీవ్రవాదులు సముద్రమార్గంలో ఇక్కడకు ఇచ్చే అకాశం ఉన్నట్లు సమాచారం ఉందని మయిల్‌వాహనన్ ఎస్పి చెప్పారు. అపరచిత వ్యక్తులు ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారమందించమని సముద్రతీరప్రాంతవాసులను ఆయన కోరారు. గత రాత్రి నుంచి తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశారు. తీరప్రాంతంలోని భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతానికి వచ్చే బోట్లనన్నింటినీ తనిఖీ చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు. -
శ్రీలంక దాడులతో.. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న మత్య్సకారులు
రామేశ్వరం: శ్రీలంక సరిహద్దు జలశయాల్లో చేపల వేటకు వెళ్లుతున్న మత్స్యకారులపై శ్రీలంక నావికా దళం తరుచూ దాడులకూ పాల్పడుతుండటంతో మత్య్సకారులంతా తమ వృత్తులను వదిలేసి బ్రతుకుదెరువు కోసం ప్రక్కప్రాంతాలైన కేరళ, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళుతున్నారని మత్య్సకారుల సంఘం పేర్కొంది. శ్రీలంక దాడులకు భయపడి 3వేల మంది మత్య్సకారులు తమ వృత్తిని వదిలివేశారు. చేపలు పట్టడమే తమ నిత్యకృత్యమై జీవనం సాగిస్తున్న జాలర్లంతా ఆ వృత్తిపైనే ఆధారపడ్డారు. రామేశ్వరం తీరప్రాంతాల్లో తమిళ జాలర్లు తమ పడవల సహాయంతో చేపల వేటకు వెళుతుంటారు. ఈ సమయంలో సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న శ్రీలంక నావికాదళం వారిపై దాడులుకూ పాల్పడటం పరిపాటైంది. దీంతో మత్య్సకారులంతా భయాందోళనలతో తమ జీవనాన్ని నెట్టుకుస్తున్నారు. ఇలా అయితే తాము చేపల వేటకు వెళ్లి బ్రతికి బట్టకట్టడం కష్టమంటూ వారూ వాపోతున్నారంటూ మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు ఎమీరిట్ పిటిఐకి తెలిపారు. గడిచిన కొన్నిరోజుల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లడం మానివేయడంతో చేపల దిగుమతి 90శాతానికి పడిపోయిందన్నారు. అక్కడి తీరప్రాంతాల ద్వీపాలలో దాదాపు 4వేల మంది మత్య్సకారులుంటారని ఎమీరెట్ పేర్కొన్నారు. చేపల పడవలను అద్దెకిచ్చే యాజమానులు జాలర్ల కుటుంబాలకు సహాయం అందించేందుకు విముఖుత చూపిస్తున్నారు. శ్రీలంక జైల్లో నిర్భందానికి గురైన మత్య్సకారుల సంఘం సహాయకుడు ఫెలోమెన్ త్యాగరాజన్ తమ ఆవేధనను వెల్లబుచ్చారు. ఈ సమస్యపై ఇరుదేశాల మధ్య సానుకూల మార్పు రావాల్సిన అవసరం ఎంతైన వుందని ఎమీరిట్ చెప్పారు. దీనిపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని సమాలోచన చేసి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని అప్పడే భారత జాలర్లు నిర్భయంగా భారత జలశయాల్లోకి వెళ్లగలరని అన్నారు. చేపలు పట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో హక్కు కల్పించాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇరుదేశాల ఒప్పందం ప్రకారమే కాథేచ్చివ్ ద్వీప సరిహద్దులో చేపలు వేటడేందుకు అనుమతి ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ కూడా శ్రీలంక నావికా దళం ఒప్పందాన్ని విస్మరించి తరుచూ దాడులకు పాల్పడుతుండటం సరికాదని అన్నారు. తాజాగా శ్రీలంక హై కమీషనర్ వెల్డడించిన వివరాల ప్రకారం.. భారత జాలర్లు దాదాపు 114మంది లంక జైల్లో మగ్గుతున్నారని, అంతర్గతంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. కానీ ఇలాంటి దుశ్చర్యలను భారత జాలర్లు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని ఆయన తెలిపారు.