- ఫ్యాన్‌కుు ఉరి వేసుకుని ఆత్మహత్య
- భర్త, అత్తే హతమార్చారంటూ తల్లి ఆరోపణ
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
Published Tue, Dec 20 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
రామేశ్వరం (పెదపూడి) :
అత్తింటి వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఆమె అత్త, భర్త అనుమానం, వేధింపులను తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన కుమార్తెను వారే హతమార్చారని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపించారు. పెదపూడి ఎస్‌సై వీఎల్‌వీకే సుమంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ(28)కు 2011 జూ¯ŒS 10న రామేశ్వరం గ్రామానికి చెందిన మెర్నిడ్డి కుమార్‌తో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కొడుకు చరణ్ ఉన్నాడు. కుమార్ రోల్డ్‌గోల్డ్ వస్తువులు అమ్ముతూ, గ్రామాల్లో తిరుగుతుంటాడు. వస్తువుల తయారీకి ఆర్డర్లు తీసుకుంటాడు. అతడు తన తమ్ముడికి చెందిన కాకినాడ జగన్నాథపురంలోని షాపులో ఉండేవాడు. పెళ్లయినప్పటి నుంచి కుమార్ మద్యానికి అలవాటు పడ్డాడు. మద్యం మత్తులో భార్యను హింసించేవాడు. పది రోజుల క్రితం కుమార్ రోడ్డు ప్రమాదానికి గురి కాగా, కాలికి గాయమైంది. అతడిని పలకరించడానికి అన్పపూర్ణ తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ రాలేదంటూ ఆమె అత్త, భర్త వేధింపులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురై, సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఇంట్లో ఫ్యా¯ŒSకు చీరతో ఉరి వేసుకుంది. ఆమె మరిది మాణిక్యాలరావు గది తలుపులు తెరవగా, అప్పటికే అన్నపూర్ణ చనిపోయింది. మృతురాలి తండ్రి త్రిమూర్తులు ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌సై తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్‌సై సుమంత్, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
నా కుమార్తెను హతమార్చారు : తల్లి ఆరోపణ
మృతురాలి అత్త పద్మావతి, భర్త కుమార్ వేధింపులకు గురిచేసి తన కుమార్తెను హతమార్చారంటూ అన్నపూర్ణ తల్లి రేల పార్వతి ఆరోపించింది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్త ఆమెను వేధించేవారని పేర్కొంది. మూడు సార్లు తన కుమార్తెను హతమార్చడానికి వీరు యత్నించారని ఆరోపించింది. గతంలో భర్త కుమార్.. అన్నపూర్ణ గొంతు నులుమగా ఆమె అపస్మారక స్థితికి చేరి, బతికిందని పేర్కొంది. ఆరు వారాల క్రితం మరోసారి భర్త ఆమెను హతమార్చేందుకు యత్నించగా, మరిది మాణిక్యాలరావు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అన్నపూర్ణ బతికిందన్నారు. తన కుమార్తెను అత్త, భర్త హింసించి, చంపారంటూ పార్వతి అధికారుల వద్ద విలపించింది.
Advertisement
Advertisement