రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు కమల్‌హాసన్ బుధవారం ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకున్నారు. కలాం సమాధికి అంజలి ఘటించారు. అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం అక్కడి నుంచి మదురై బయలుదేరారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కమల్ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి.. పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.