సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు | APJ Abdul Kalam's funeral Completed | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 30 2015 12:28 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో గురువారం పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా కలాం భౌతికకాయానికి తుది నివాళులు అర్పించారు. త్రివిధ దళాలు కూడా కలాంకు వీడ్కోలు పలికాయి. అంతకు ముందు కలాం నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య కొనసాగింది. దారి పొడవునా వేలాదిమంది అభిమానులు, ప్రజలు కలాంకు నివాళులు అర్పించారు. మరోవైపు సామాన్య ప్రజలు కూడా అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతానికి తండోపతండాలుగా చేరుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, పారికర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, కేరళ ముఖ్యమంత్రి,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు గవర్నర్ రోశయ్య, విజయ్ కాంత్, సీఎం రమేష్ తదితరులు అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement