అధికార అన్నాడీఎంకే నేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బహిష్కృతనేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ రాజకీయంగా మరో మెట్టు ఎక్కారు. మధురై జిల్లా మేలూరులో గురువారం ఉదయం దినకరన్ తన సోంత పార్టీ పేరు, చిహ్నంను ప్రకటించారు. ‘అమ్మ మక్కల్ మున్నెట కళగం’ గా పార్టీ పేరును ప్రకటించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దినకరన్ నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండాపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను ముద్రించారు. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ.. పన్నీరు పెల్వం, పళని స్వామీలు అన్నాడీఎంకేను మోసం చేశారని ఆరోపించారు. ఇటీవల దినకరన్ ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.