dhinakaran
-
శశికళ, దినకరన్‌కు ఆహ్వానం
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా జరగనున్న మహానాడుకు శశికళ, దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తెలిపారు. అన్నాడీఎంకేలో విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని పూర్తిగా ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి తన గుప్పెట్లో తెచ్చుకున్నారు. అయితే న్యాయ పోరాటం ద్వారా పార్టీ మళ్లీ సత్తా చాటాలని సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం ప్రయత్నిస్తున్నారు. తన బలాన్ని చాటుకునే విధంగా ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా భారీ మహానాడుకు సిద్ధమయ్యారకు. ముప్పెరుం విళాగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడు విజయవంతం కోసం తన శిబిరం తరపున జిల్లాల కార్యదర్శులుగా ఉన్న నేతలతో సమావేశాల్లో పన్నీరు నిమగ్న మయ్యారు. మంగళవారం జరిగిన సమావేశానంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, ముప్పెంరు విళా అన్నది అన్నాడీఎంకే కార్యకర్తలకు దివంగత నేత ఎంజీఆర్ ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఉంటుందని వివరించారు. పదవీ వ్యామోహంతో నిబంధనలు ఉల్లంఘించి సర్వాధికారంతో విర్ర వీగుతున్న ముఠాకు గుణపాఠం చెప్పే వేదిక అవుతుందన్నారు. ఈ మహానాడుకు చిన్నమ్మ శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. వారు తప్పకుండా ఈ మహానాడుకు వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పన్నీరు వ్యాఖ్యలపై పళని శిబిరం సీనియర్‌నేత జయకుమార్ స్పందిస్తూ, ఆ మహానాడును తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆయన ఎవరిని ఆహ్వానిస్తే తమకేంటిని ప్రశ్నించారు. -
పన్నీరు ఆకర్షణ మంత్రం!.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు?
సాక్షి, చెన్నై: పళనిస్వామి వెన్నంటి ఉన్న వారిని తన వైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో కలిసి ఈ వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ఫలితంగా పళని శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే , మరికొందరు నేతలు జంప్ అయ్యారు. వీరంతా ఆదివారం పన్నీరుకు జై కొట్టారు. అడీఎంకేలో పళని స్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూపంలో పార్టీ సమన్వయ కమిటీ తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తి వాదులకు గాలం వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో కలిసి పన్నీరు కొత్తఎత్తులు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు క్యూలో.. చిన్నమ్మ శశికళతో కలిసి రచిస్తున్న వ్యూహానికి ఫలితం ఆదివారం లభించడం గమనార్హం. మదురై జిల్లా ఉసిలం పట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్‌తోపాటుగా ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు పన్నీరుకు ఆదివారం జై కొట్టారు. పళని శిబిరంలో ఉంటూ పన్నీరుపై విరుచుకు పడ్డ ఈ అయ్యప్పన్ ప్రస్తుతం శిబిరం మార్చేశారు. కోర్టు ఆదేశాలు, అందులోని అంశాలకు కట్టుబడి తాను పన్నీరు సెల్వం శిబిరంలోకి వచ్చానని అయ్యప్పన్ ప్రకటించారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు నివాసంలో జరిగిన భేటీ అనంతరం అయ్యప్పన్ మీడియాతో మాట్లాడారు. తానే కాకుండా తనతో పాటుగా మరి కొందరు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని, అందరూ పన్నీరు సెల్వం వైపుగా వచ్చేడం ఖాయమని ప్రకటించారు. చదవండి: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’ అదే సమయంలో పన్నీరు సెల్వం పేర్కొంటూ, మరి కొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌ను కలవనున్నానని, వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో పళని శిబిరానికి చెందిన నేతలు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, నోట్లను ఎరగా వేసి నాయకులు, స్వర సభ్య సమావేశం సభ్యులను తన వైపుగా తిప్పుకునే ప్రయత్నంలో పన్నీరు సెల్వం ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
వచ్చేది ‘చిన్నమ్మ’ ప్రభుత్వమే!
చెన్నై: ప్రజాస్వామ్య పద్ధతిలో అన్నాడీఎంకే పార్టీని చేజిక్కించుకుని తిరిగి అమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని శశికళ మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నాయకుడు దినకరన్ ప్రకటించారు. బెంగళూరులో క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈనెల 7వ తేదీన తమిళనాడుకు వస్తారని తెలిపారు. ఎన్నికల తర్వాత తిరిగి 'అమ్మ' ప్రభుత్వం ఏర్పాటు విషయంలో శశికళ కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. తమిళనాడులోని మధురైలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జయలిలత నిజమైన మద్దతుదారులంతా శశికళ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. శశికళ రాక సందర్భంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని హోసూరు నుంచి చెన్నై వరకూ భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇటీవల శశికళ విడుదలయ్యారు. అయితే కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయిన విషయం తెలిసిందే. ఆమె రాక సందర్భంగా దినకరన్ స్పందించారు. శశికళ విడుదలైన రోజు నుంచి రాజకీయాలు మారుతాయని పేర్కొన్నారు. జయలలిత స్మారక నిర్మాణాన్ని శశికళ సందర్శించాలని ఉన్నా కూడా అయితే ఉద్దేశపూర్వకంగా అది మూసి ఉంచారని ఆరోపించారు. పార్టీ నిబంధనల ప్రకారం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదని, జనరల్ సెక్రటరీ మాత్రమే సర్వసభ్య సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తుచేశారు. జనరల్ సెక్రటరీ పదవిని రద్దు చేయడంపై శశికళ కోర్టులో సవాలు చేశారని తెలిపారు. తన పదవిని పునరుద్ధరించే విషయంలో ఆమె పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత 'అమ్మ' ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వంలో శశికళ కీలక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దినకరన్ ప్రస్తుతం ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
తేలని తమిళ తగువు
తమిళనాడులో ఎడతెగకుండా కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు ఇప్పట్లో తెరపడే అవకాశం లేదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తే అర్ధమవుతుంది. టీటీవీ దినకరన్ గూటికెళ్లిన 18మంది అన్నా డీఎంకే శాసనసభ్యులపై స్పీకర్ పి. ధన్పాల్ అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నమైన తీర్పులు వెలువరించింది. స్పీకర్ చర్య సరైనదేనని జస్టిస్ ఇందిరా బెనర్జీ అభిప్రాయపడగా, మరో న్యాయమూర్తి జస్టిస్ సుందర్ ఆయన తీరును వ్యతిరేకించారు. ఈ రెండు తీర్పులూ మూడో న్యాయమూర్తి సుముఖానికి వెళ్లి అక్కడ వెలువరించే అభిప్రాయాన్నిబట్టి తుది తీర్పు ఏమిటన్నది తెలుస్తుంది. దీనంతకూ రెండు మూడు నెలల సమయం పడుతుంది. ఆ తుది తీర్పు వచ్చాక కూడా తమిళనాడు అస్థిరత తొలగిపోతుందన్న భరోసా లేదు. ఆ తీర్పు వెలువడ్డాక దానిపై వేరే రకమైన చర్చ మొదలవుతుంది. శాసనసభ వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ జోక్యమేమిటన్న ప్రశ్నను సహజంగానే పాలకపక్షం లేవనెత్తుతుంది. ఆ తీర్పును గుర్తించబోమని స్పీకర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఏతావాతా ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి ఇప్పట్లో వచ్చే ముప్పేమీ లేదు. తమిళనాడు అసెంబ్లీలో ఈ వివాదం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తోంది. అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణానంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. అన్నాడీఎంకేలో చీలికలు, చీలిన పక్షాలు మళ్లీ కలవడం, ఈలోగా శశికళ మేనల్లుడు దినకరన్ పార్టీలోని 18మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడంతోపాటు జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందడం లాంటి పరిణామాలు అక్కడి రాజకీయాలను మరింత అయో మయంలోకి నెట్టాయి. అన్నాడీఎంకే ప్రభుత్వానికి తగిన బలం లేదని, అది కొనసాగడానికి వీల్లేదని దినకరన్ వర్గం వాదిస్తోంది. 2016 సెప్టెంబర్‌లో ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనబోతుండగా స్పీకర్ ధన్పాల్ దినకరన్ శిబిరం ఎమ్మెల్యేలు అనర్హులని ప్రకటించారు. వారు అనర్హులైతే తప్ప పళనిస్వామి సర్కారు నిలబడే స్థితి లేదు. ఆ దశలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో బలపరీక్ష ఆగింది. న్యాయస్థానం వారి అనర్హత చెల్లుతుందని చెబితే తాత్కాలికంగా ప్రభుత్వానికి గండం గడిచినా ఉప ఎన్నికల్లో అది విషమ పరీక్ష ఎదుర్కొనవవలసి వస్తుంది. ఉప ఎన్నికల్లో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే జనం ఆయన పక్షానే ఉన్నారని తేలుతుంది. పళనిస్వామి అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోతారు. అనర్హత చెల్లదని చెబితే, ఆ 18మందీ బలపరీక్ష సమయంలో 98మంది సభ్యులున్న డీఎంకేతో చేతులు కలుపుతారు. పర్యవసానంగా ప్రభుత్వం పతనమవుతుంది. ఇలా ‘ముందు చూస్తే నుయ్యి... వెనకచూస్తే గొయ్యి’ అన్నట్టు విపత్కర స్థితిలో పడిన పళనిస్వామి ప్రభుత్వం దినదినగండంగా రోజులీడుస్తోంది. దీని ప్రభావం సహజంగానే పాలనపై కూడా ఉంటోంది. స్టెరిలైట్ కంపెనీ కాలుష్యంపై ఆందోళన, పోలీసు కాల్పుల్లో 12మంది ప్రాణాలు కోల్పోవడం దీని పర్యవసానమే. శాసనసభల్లో స్పీకర్లు తీసుకునే నిర్ణయం లేదా నిర్ణయరాహిత్యం తరచు ఎన్నో సమస్యలకు దారితీస్తోంది. వారి నిర్ణయం వల్ల లేదా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులెదుర్కుంటున్న పక్షాలు న్యాయం కోసం ఏళ్ల తరబడి నిస్సహాయంగా ఎదురుచూడవలసి వస్తున్నది. చాలా సందర్భాల్లో అది దక్కడం దుర్లభమవుతోంది. స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి తటస్థంగా ఉంటానని, అన్ని పక్షాలకూ సమానమైన అవకాశాలిస్తానని తొలిరోజు గంభీరంగా ఉపన్యాసమిస్తారు. కానీ ఆచరణ మొత్తం అందుకు భిన్నంగా ఉంటుంది. తాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యామన్న స్పృహే వారికుండదు. ‘మా హక్కులు కాపాడండి మహాప్రభో’ అని ప్రతిపక్షాలు వేడుకున్నా దిక్కూ మొక్కూ ఉండదు. పాలకపక్షం నీళ్లు నములుతున్నప్పుడూ, విపక్షం నుంచి విమర్శల తీవ్రత పెరిగినప్పుడూ స్పీకర్లు ఆపద్బాంధవుల అవతారమెత్తుతారు. సభను వాయిదా వేయడమో, విపక్షం మైకు కట్ చేయడమో, సభ్యులను సభ నుంచి గెంటేయడమో చేసి పాలక్షపక్షాన్ని ఆదుకుంటారు. ఇక ఫిరాయింపుల విషయంలో చట్టం స్పష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవడానికి మన స్పీకర్లకు ఏళ్లూ పూళ్లూ పడుతోంది. అందుకు ఆంధ్రప్రదేశ్ మొదలుకొని లోక్‌సభ వరకూ ఎన్నయినా ఉదాహరణలు చెప్పవచ్చు. ఒకపక్క లోక్‌సభ, శాసనసభల కాలపరిమితి దగ్గరపడుతున్నా ఫిరాయింపుల విషయంలో ఏం చేయాలో వారికి బోధపడటం లేదు! నిజానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. స్పీకర్ స్థానంలో ఉండేవారు తటస్థంగా, సత్యనిష్టతో విధులు నిర్వర్తించాలని, నిర్వర్తిస్తారని మన రాజ్యాంగం ఆశిస్తోంది. కానీ జరిగేదంతా ఇందుకు భిన్నం. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు దాన్ని సరిచేయడం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం న్యాయస్థానాల కర్తవ్యం. కానీ చట్టసభల పరిధిలో అలా జరిగినప్పుడు ఏం చేయాలి? తాము అన్నిటికీ అతీతమని స్పీకర్లు భావిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన ఫిరాయింపులపై స్పీకర్లు నిర్ణయాలు ప్రకటించకపోవడం... తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ్యులిద్దరిపై అనర్హత వేటు వేయడంవంటి విషయాల్లో న్యాయస్థానాల్లో ఏం జరుగుతున్నదో జనం చూస్తూనే ఉన్నారు. చట్టసభలు మందబలంతో నడుస్తున్నాయని, స్పీకర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, విపక్షాల హక్కుల్ని తొక్కేస్తున్నారని, న్యాయస్థానాలు సైతం నిస్సహాయంగా మిగిలిపోతున్నాయని ప్రజానీకంలో అభిప్రాయం ఏర్పడితే అది మౌలికంగా ప్రజాస్వామ్యంపైనే నమ్మకం సడలింపజేస్తుంది. కనుకనే చట్టసభల హక్కులు, స్పీకర్ల అధికారాల విషయంలో స్పష్టత అవసరం. తమిళనాడు వివాదానికి సాధ్యమైనంత త్వరలో తెరపడటం ముఖ్యం. -
తమిళనాడులో మరో కొత్త పార్టీ
-
తమిళనాడులో మరో కొత్త పార్టీ
సాక్షి, చెన్నై : అధికార అన్నాడీఎంకే నేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బహిష్కృతనేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ రాజకీయంగా మరో మెట్టు ఎక్కారు. మధురై జిల్లా మేలూరులో గురువారం ఉదయం దినకరన్ తన సోంత పార్టీ పేరు, చిహ్నంను ప్రకటించారు. ‘అమ్మ మక్కల్ మున్నెట కళగం’ గా పార్టీ పేరును ప్రకటించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దినకరన్ నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండాపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను ముద్రించారు. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ.. పన్నీరు పెల్వం, పళని స్వామీలు అన్నాడీఎంకేను మోసం చేశారని ఆరోపించారు. ఇటీవల దినకరన్ ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. తమిళనాట ఉన్నన్ని రాజకీయ పార్టీలు మరే రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తమిళనాడుగా విడిపోయిన తొలిదినాల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయి. కాంగ్రెస్ అగ్రనేత కామరాజనాడార్ ముఖ్యమంత్రిగా 1963లో రాష్ట్రంలో జాతీయ పార్టీ శకం ముగిసింది. ద్రవిడ సెంటిమెంట్‌తో పుట్టుకొచ్చిన డీఎంకే ఆ తరువాత అధికారంలోకి రాగా, డీఎంకేతో విభేదించి బైటకు వచ్చిన ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకేను స్థాపించారు. అప్పటి నుంచీ నేటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలదే ఆధిపత్యం, అధికారంలా రాష్ట్ర రాజకీయాలు సాగాయి. రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా కాంగ్రెస్ పార్టీ... అన్నాడీఎంకే, డీఎంకేల పంచన చేరడాన్ని అలవాటు చేసుకుంది. మరో జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్రంలో ఉనికే లేదు. ఈ దశలో డీఎంకే, అన్నాడీఎంకేలను స్ఫూర్తిగా తీసుకుని వైగో, విజయకాంత్, శరత్‌కుమార్, జీకే వాసన్, డాక్టర్ రాందాస్, సీమాన్, తిరుమావళవన్ తదితరులు ప్రాంతీయ పార్టీలు పెట్టారు. అయితే కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి ప్రజాకర్షణ నేతలు ఆయా పార్టీలకు లేకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకేల ప్రాభవాన్ని కొత్త పార్టీలు దెబ్బతీయలేక పోయాయి. కొత్త పార్టీల శకం సుదీర్ఘ విరామం తరువాత మరలా కొత్త పార్టీల శకం ప్రారంభమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతే ప్రముఖ సినీ నటులు కమల్‌హాసన్, రజనీకాంత్లకు పార్టీ ఏర్పాటుకు ప్రేరణనిచ్చింది. కమల్‌హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించారు, నటులు రజనీకాంత్ పార్టీ ఏర్పాటుకు సన్నాహ దశలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కమల్, రజనీల ప్రాభవం, ప్రభావం ఏమాత్రం ఉంటుందోనని అందరూ అంచనాలు వేస్తుండగా అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. గడిచిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది తన సత్తా ఏమిటో నిరూపించుకున్న దినకరన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేలను కంగుతినిపించారు. దశాబ్దాల తరబడి ప్రజల హృదయాల్లో నాటుకుపోయిన రెండాకులు, ఉదయసూర్యుడి గుర్తులను కాదని కుక్కర్ గుర్తుపై పోటీ చేసి విజయబావుటా ఎగురువేశారు. జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్లో గెలుపొందడం ద్వారా శశికళ కుటుంబమే జయకు రాజకీయ వారసులనే నినాదాన్ని లేవనెత్తారు. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం దక్కించుకోవాలని ఈసీ వద్ద పోరాడి విఫలమైన దినకరన్ కొత్త పార్టీ ఏర్పాటే మేలనే నిర్ణయానికి వచ్చారు. అఖిలభారత అమ్మా ద్రావిడ మున్నేట్రకళగం, ఎంజీఆర్ అమ్మ మున్నేట్ర కళగం, అమ్మ ఎంజీఆర్ మున్నేట్ర కళగం ఈ మూడు పేర్లలో ఒకదాన్ని తన పార్టీ పేరుగా ఆమోదించేలా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తనకు కలిసొచ్చి విజయాన్ని కట్టబెట్టిన కుక్కర్ గుర్తును శాశ్వతంగా తమకే కేటాయించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దినకరన్ గతంలో పిటిషన్ వేశారు. దీనిపై ఈనెల 9వ తేదీన సానుకూలంగా తీర్పు వెలువడింది. చట్టపరమైన చిక్కులు తొలగిపోవడంతో పార్టీ ఏర్పాటుకు దినకరన్ సిద్ధమయ్యారు. -
'అమ్మ, దేవుడి దీవెనలు మాకే'
సాక్షి, చెన్నై : ఎన్నికల ప్రచార సమయంలోనే కాదు పోలింగ్ రోజు కూడా తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఆసక్తికర మాటలు వినిపిస్తున్నాయి. ఓపక్క తమ అభ్యర్థికే అమ్మ(జయలలిత), దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయంటూ అన్నాడీఎంకే పార్టీ చెప్పుకుంటుండగా విజయం తనదేనంటూ టీటీవీ దినకరన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా తన వెంటే ఉన్నారని, వారికి తనపై పూర్తి విశ్వాసం ఉందని చెబుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ తరుపున ముఖ్యమంత్రి పళనీస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కలిసి మధుసూధనన్ అనే వ్యక్తిని ఎన్నికల బరిలో దింపగా దినకరన్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక ప్రతిపక్ష డీఎంకే ఎన్ మారుదు గణేశ్ అనే వ్యక్తిని, బీజేపీ కే నాగరాజన్ అనే అభ్యర్థిని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
పార్టీ పదవి నుంచి సీఎంకు ఉద్వాసన
చెన్నై: అన్నాడీఎంకే పార్టీపై తన పట్టు సాధించేందుకు శశికళ మేనల్లుడు దినకరన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామితో నేరుగా తలపడిన ఆయన ఆదివారం మరో సంచలనానికి తెర తీశారు. పార్టీ పదవి నుంచి పళనిస్వామిని తప్పిస్తున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగించినట్టు తెలిపారు. తన దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్ రాజేంద్రన్‌ను కూడా పార్టీ పదవి నుంచి శనివారం దినకరన్ తప్పించారు. రాజేంద్రన్ స్థానంలో పి ముతుయాన్‌ను నియమించినట్టు వెల్లడించారు. శాసనసభలో బలం నిరూపించుకునేలా పళనిస్వామిని ఆదేశించాలని కోరుతూ ఆగస్టు 22న దినకరన్ దగ్గరనున్న 19 మంది ఎమ్మెల్యేలు.. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి కోరారు. పళనిస్వామిని సీఎం పీఠం నుంచి దించాలన్న లక్ష్యంతో గత కొద్దిరోజులు పార్టీ పదవుల నుంచి ఆయన వర్గీయులను దినకరన్ తొలగిస్తున్నారు. ఇంతకుముందు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించి, తన అనుచరులను నియమించారు. మరోవైపు దినకరన్ దాడి నుంచి గట్టెక్కేందుకు ఈపీఎస్ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. -
'జయ మృతి తర్వాత నేనే సీఎం అయ్యేవాడిని'
కోయంబత్తూరు: దివంగత నేత జయలలిత మరణించిన వెంటనే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడినని, కానీ సీఎం కావాలని ఆనాడు తాను కోరుకోలేదని అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ అన్నారు. తాను సీఎం పదవి తిరస్కరించడంతోనే శశికళ.. పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా నియమించారని చెప్పుకొచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శశికళ సైతం సీఎం పదవి చేపట్టే అవకాశమున్నా.. ఆమె కూడా ఆ పని చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు శశికళను, తనను పక్కనబెట్టి పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు శశికళను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఇటీవల విలీనమై.. అన్నాడీఎంకే నుంచి శశికళను, దినకరన్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పళనిస్వామి ప్రభుత్వంపై దినకరన్ తిరుగుబాటు లేవనెత్తారు. -
దినకరన్‌కు 40మంది ఎమ్మెల్యేల మద్దతు!
చెన్నై: ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వాన్ని కూల్చి తీరుతామని టీటీవీ దినకరన్ వర్గం శపథం చేసింది. పళనిస్వామికి వ్యతిరేకంగా తమకు 40మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం పేర్కొంది. జైలుపాలైన అన్నాడీఎంకే నేత వీకే శశికళ సోదరుడు దివాకరన్ బుధవారం కుంభకోణంలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు 40మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. పళని ప్రభుత్వాన్ని కూల్చి.. అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోలేరని, ఆయన ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు. పన్నీర్ సెల్వంతో ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రమాణం చేయించడం తప్పుడు చర్య అని దివాకరన్ మండిపడ్డారు. తమిళనాడులో అస్థిర ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ బయటకు వెళ్లినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై దినకరన్ స్పందించారు. అది నకిలీ వీడియో అని, కావాలనే ఆ వీడియోను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. -
దినకరన్ దూకుడు, ఈపీఎస్ వర్గంలో కలవరం!
చెన్నై: అధికార అన్నాడీఎంకే వర్గంలో విభేదాలు తీవ్రమయ్యాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్)- శశికళ అక్క కొడుకు దినకరన్ మధ్య వర్గపోరు ముమ్మరం కావడంతో మళ్లీ తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈపీఎస్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ దినకరన్‌ను కలువడంతో ఆయన ప్రభుత్వ మనుగడపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే (అమ్మ) పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఈపీఎస్‌కు కేవలం 122మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయన వర్గం నుంచి జారుకుంటే ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు జైలు నుంచి విడుదలైన దినకరన్ ఈపీఎస్ వర్గాన్ని సవాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి తనను, చిన్నమ్మ శశికళను ఎవరూ దూరం చేయలేరని, ఆ అధికారం ఎవరికీ లేదని దినకరన్ అంటున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళను కలిసిన అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడారు. శశికళతో, దినకరన్‌తో అన్నాడీఎంకేకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు ఆర్థికమంత్రి జయకుమార్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అన్నాడీఎంకే నుంచి తమను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. తీహార్ జైలు నుంచి దినకరన్ విడుదలైన సందర్భంగా పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మన్నార్గుడి మాఫియా మళ్లీ పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ వర్గాన్ని దూరం పెడుతూనే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఈపీఎస్ వర్గం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా తనవర్గం నుంచి ఎమ్మెల్యేలు జారుకోకుండా చర్యలు తీసుకుంటోంది. దినకరన్, శశికళను ఎమ్మెల్యేలు కలువకుండా ఈపీఎస్ వర్గం పావులు కదుపుతున్నట్టు సమాచారం. -
ఢిల్లీ క్రైమ్ పోలీసుల చెన్నై పర్యటన వాయిదా
న్యూఢిల్లీ: రెండాకులు గుర్తుకు కేటాయించాలంటూ లంచం కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ చెన్నై పర్యటను వాయిదా వేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముందుగా ఢిల్లీలో విచారణ పూర్తి చేసిన అనంతరం చెన్నై వెళ్లనున్నారు. అంతేకాకుండా చెన్నై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దినకరన్‌ను ఢిల్లీ తీసుకు వచ్చే విచారణ జరపాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆర్కేనగర్కు మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా ఎలాగైనా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ భావించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక, రెండాకుల చిహ్నంపై సోమవారం ఢిల్లీలోని సీఈసీ కార్యాలయంలో మళ్లీ విచారణ జరగనున్నట్లు తెలుసుకుని ఆయన తన ప్రయత్నాల వేగం పెంచారు. ఎన్నికల కమిషన్‌లోని ఒక అధికారి ద్వారా పని కానిచ్చేందుకు బడా బ్రోకర్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల ‡హోటల్లో దినకరన్ తరఫున బేరసారాలు సాగుతున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులకు ఉప్పందడంతో ఒక్కసారిగా దాడులు జరిపారు. కర్ణాటకకు చెందిన సుఖేష్ చంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.1.30 కోట్లు, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చెందిన ఒక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండాకుల చిహ్నం సాధించి పెడతానని దినకరన్‌తో రూ.60 కోట్లు బేరం కుదుర్చుకున్న సుఖేష్ రూ.1.30 కోట్ల అడ్వాన్సు పొందాడు. దీంతో సుఖేష్ వాంగ్మూలం ఆధారంగా దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో దినకరన్‌కు నోటీసులు ఇచ్చే అంశం వాయిదా పడింది. కాగా దినకరన్ మాత్రం ఈ సుఖేష్ ఎవరో తనకు తెలియదు, సమన్లు అందితే చట్టం ద్వారా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన న్యాయవాదులతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాగా తాను చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా ఢిల్లీ పోలీసుల చేతుల్లో దినకరన్ కటకటాలపాలు కాక తప్పదనే ప్రచారం జరుగుతోంది. -
బుక్కయిన దినకరన్.. బిగుస్తున్న ఉచ్చు
-
బుక్కయిన దినకరన్.. బిగుస్తున్న ఉచ్చు
చెన్నై: తమిళనాడు రాజకీయాలు నిత్యం ఉత్కంఠగా మారుతున్నాయి. రోజుకోమలుపు తిరుగుతున్నాయి. శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ బుక్కయ్యారు. ఆయనపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఆకులు అన్నాడీఎంకే పార్టీ గుర్తు అనే విషయం తెలిసిందే. దీనికోసం పన్నీర్ వర్గం, శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు లాబీయింగ్‌లు చేస్తున్నారు. అయితే, దినకరన్ మాత్రం ఏకంగా ఆ గుర్తు తమకే వచ్చేలా చూడాలని చెప్పి రూ.50కోట్ల ఒప్పంద చేసుకొని సుఖేశ్ చంద్ర అనే మధ్యవర్తి ద్వారా ఈసీకి లంచం ముట్టజెప్పేందుకు ప్రయత్నం చేశారని తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే సుఖేశ్ చంద్రకు రూ.కోటి 39లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల చేతికి చిక్కడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అతడి వద్ద నుంచి రూ.కోటి39లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికల సంబంధించి పెద్ద మొత్తంలో ఓటర్లను ప్రభావితం చేశారని దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా దినకరన్ నేడు శశికళను కలవబోతున్నారు.