రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసు.. కీలక నిందితుడి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో మరొక నిందితుడు అరెస్ట్‌

Published Thu, Mar 28 2024 7:53 PM

NIA Arrest Muzammil Shareef In rameshwaram Cafe Blast - Sakshi

న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(12ప్రాంతాలు), తమిళనాడు(5 ప్రాంతాలు), ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట.. మొత్తం 18 ప్రదేశాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక నిందుతుడు ముజ్మిల్‌ షరీఫ్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. నిందితుడు ముజ్మిల్‌ మరో ఇద్దరు నిందితులకు పేలుడు పదార్ధలు , సాంకేతిక పరికరాలు సరాఫరా చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

సోదాల్లో నగదుతోపాటు, వివిధ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారులు సాజీబ్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ మంతెన్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు.  ఇక రామేశ్వరం పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని ఎన్‌ఐఏ వెల్లడించింది. 

కాగా మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో బాంబు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారు. ఈ సంఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై ఎన్‌ఐఏ దర్యాప్తుజరుపుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది.
చదవండి: శివ‌సేన‌లో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్‌ వెస్ట్‌ నుంచి పోటీ?

Advertisement
Advertisement