National Investigation Agency ( NIA )
-
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూలు వద్ద పేలుడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కలకలం రేపిన ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి. అక్కడ లభించిన తెల్లటి పదార్థం అమోనియం నైట్రేట్, క్లోరైడ్ల మిశ్రమం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంకా పేలుడు పదార్థాలుండొచ్చనే అనుమానంతో ఎన్ఎస్జీ కమాండోలు సమీప ప్రాంతాల్లో రోబోలతో గాలింపు జరిపారు. ‘పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పేలుడుకు కొద్ది క్షణాల ముందే ఘటనాస్థలి మీదుగా కొన్ని ద్విచక్ర వాహనాలు వెళ్లాయని, లేకుంటే పెనుప్రమాదమే జరిగి ఉండేది’ అని అధికారులు వివరించారు. పేలుడుతో మంటలు చెలరేగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ ఓకే
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు, ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్) ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. జూలై 5న రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్‌కు ఒకరోజు బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రమాణ స్వీకార ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేయాలని ఎన్ఐఏ షరతులు విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారనే కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 2019 ఆగస్టులో అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)పై నెగ్గారు. -
ఎన్ఐఏ చేతికి ‘బస్సుపై ఉగ్రదాడి’ కేసు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. -
బెంగాల్లో ఎన్ఐఏ అధికారులపై దాడి
న్యూఢిల్లీ/బలూర్ఘాట్(పశ్చిమబెంగాల్): 2022 పేలుడు ఘటనలో ఇద్దరు కీలక కుట్రధారులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు జరిపిన దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు ఢిల్లీలో మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ‘బెంగాల్‌లోని భూపతినగర్ 2022 డిసెంబర్లో చోటుచేసుకున్న పేలుడు కేసులో కీలక పురోగతి సాధించాం. ముగ్గురి మృతికి కారణమైన అప్పటి ఘటనకు కీలక కుట్రదారులైన బలాయి చరణ మైతీ, మనోబ్రత జనాల కోసం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో సోదాలు జరిపాం. స్థానికుల తీవ్ర ప్రతిఘటన నడుమ వారిద్దరినీ అరెస్ట్ చేశాం. స్థానికుల దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. ఎన్ఐఏకి చెందిన ఒక వాహనం ధ్వంసమైంది. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’అని ఆయన వివరించారు. మైతీ, జనా అనే వారు స్థానికంగా భయోత్పాతం సృష్టించేందుకు నాటుబాంబులు తయారు చేసి, పేల్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, పేలుడు పదార్థాల చట్టాన్ని అందులో చేర్చలేదు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ మేరకు కలకత్తా హైకోర్టు కేసును ఎన్ఐఏకి అప్పగించింది. సీరియస్‌గానే తీసుకుంటాం: గవర్నర్ ఎన్ఐఏ అధికారులపై దాడి అత్యంత తీవ్రమైన అంశమని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. దీనిని అంతే తీవ్రంగా ఎదుర్కొంటామన్నారు. ‘దర్యాప్తు విభాగాల అధికారులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎవరికీ మంచిది కాదు. ఇటువంటి గూండాయిజాన్ని అనుమతించబోం. కఠినంగా వ్యవహరిస్తాం’అని మీడియాతో అన్నారు. మరోదారి లేకే గ్రామస్తుల దాడి: సీఎం మమతా బెనర్జీ భూపతిపూర్‌లో ఎన్ఐఐ అధికారులపై స్థానికుల దాడిని సీఎం మమత సమర్థించారు. శనివారం వేకువజామున ఒక్కసారిగా ఇళ్లలోకి దూరి దాడి చేయడంతోనే స్థానిక మహిళలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడికి దిగారని ఆమె అన్నారు. 2022నాటి ఘటనను ఆమె బాణసంచా పేలుడుగా అభివర్ణించారు. -
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం మూడు రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. కర్ణాటక(12ప్రాంతాలు), తమిళనాడు(5 ప్రాంతాలు), ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట.. మొత్తం 18 ప్రదేశాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలక నిందుతుడు ముజ్మిల్ షరీఫ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ముజ్మిల్ మరో ఇద్దరు నిందితులకు పేలుడు పదార్ధలు , సాంకేతిక పరికరాలు సరాఫరా చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సోదాల్లో నగదుతోపాటు, వివిధ ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారులు సాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇక రామేశ్వరం పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని ఎన్ఐఏ వెల్లడించింది. కాగా మార్చి 1న బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో బాంబు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుకు తక్కువ తీవ్రత ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారు. ఈ సంఘటనలో తొమ్మిది మంది వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తుజరుపుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. చదవండి: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ? Rameshwaram Café blast case: National Investigation Agency (NIA) arrested a key conspirator following massive raids across multiple locations in three states. Muzammil Shareef was picked up and placed in custody as a co-conspirator after NIA teams cracked down at 18 locations,… pic.twitter.com/TEzXTXpSv3 — ANI (@ANI) March 28, 2024 -
ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతెను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31దాకా ఈ పదవిలో కొనసాగుతారు. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) నూతన సారథిగా 1991 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి పీయూశ్ ఆనంద్‌ను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా 1995 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్.సురేశ్‌ను నియమించారు. -
బెంగళూరు పేలుడు కేసులో ఒకరి విచారణ
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ రామేశ్వరం కేఫ్‌లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో బళ్లారిలో షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో బాంబు పెట్టి వెళ్లిపోయిన నిందితుడి కోసం గాలిస్తూ బుధవారం షబ్బీర్ ఆచూకీని కనుగొన్నారు. బళ్లారిలో మోతీ సర్కిల్ సమీపంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో షబ్బీర్‌ను అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొంతసేపు విచారించి బెంగళూరుకు తరలించారు. బాంబు పెట్టిన వ్యక్తికి, షబ్బీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. షబ్బీర్ బళ్లారి సమీపంలో తోరణగల్లు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిíÙయన్‌గా పని చేస్తున్నాడు. బాంబు పేలుడు తర్వాత ప్రధాన నిందితుడు బెంగళూరు నుంచి బళ్లారికి బస్సులు మారుతూ వచ్చాడు. ఆపై షబ్బీర్ ఇంటికి వచ్చి అతడిని కలిసినట్లు ఎన్ఐఏ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు తెలిసింది. కాగా, షబ్బీర్‌ను విచారించి రాత్రి వదిలిపెట్టినట్లు సమాచారం. -
Rameswaram Cafe Blast: నిందితుడి జాడ చెప్తే రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: బెంగళూరులో మార్చి ఒకటో తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సమాచారం అందిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేసింది. కేఫ్‌లోకి అడుగుపెట్టేటపుడు ఆ వ్యక్తి క్యాప్, మాస్్క, కళ్లద్దాలు ధరించి ఉన్నాడని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుడు జాడ తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎన్ఐఏ హామీ ఇచి్చంది. ఈస్ట్ బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. శక్తివంత పేలుడు పదార్ధం(ఐఈడీ) వాడటంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించడం తెల్సిందే. మొదట కర్ణాటక పోలీసులు కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, పేలుడు పదార్ధాల చట్టాల కింద కేసు నమోదుచేశారు. ముంబైలో నవంబర్ 26న ఉగ్రదాడి తర్వాత ప్రత్యేకంగా ఉగ్రసంబంధ ఘటనలపై దర్యాప్తు కోసం ఎన్ఐఏను 2008లో ఏర్పాటుచేశారు. -
బెంగళూరు ‘రామేశ్వరం కేఫ్’ పేలుడు కేసు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. గత శుక్రవారం(మార్చి 1) మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ)పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీబీ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్ఐకు బదిలీ చేయనుంది. కాగా, అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి.. బెంగాల్ బీజేపీ చీఫ్‌కు రోడ్డు ప్రమాదం.. వారిపైనే ఆరోపణలు -
బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడు ఘటనతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ పరిధిలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందిసహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించారు. 30 ఏళ్లలోపు వయసు వ్యక్తి ఒకరు ఆ కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగును పడేసి వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిరీ్వర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబోరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందాలు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు. టోకెన్ కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. పోయేముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్‌వాష్ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ‘ ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ చెప్పారు. ‘‘కేఫ్‌లో తినేందుకు అప్పుడే అక్కడికొచ్చాం. 40 మంది దాకా ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశాం’’ అని ప్రత్యక్ష సాక్షులు ఎడిసన్, అమృత్ చెప్పారు. ఎన్ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించింది. పేలుడు స్థలంలో బ్యాటరీ, వైర్లను గుర్తించారు. కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని కెఫే ఎండీ, సహ వ్యవస్థాపకురాలు దివ్య చెప్పారు. దుండగులను వదలిపెట్టం కేఫ్‌లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతాం. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు’ అని శుక్రవారం మైసూరులో వ్యాఖ్యానించారు. ‘‘ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేపట్టింది. సీసీకెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇది ఉగ్రవాదుల పనిలా లేదు. పేలుడు ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని సీఎం అన్నారు. -
Bengaluru Cafe Bomb Blast Video: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
-
Watch Video:బెంగళూర్ కేఫ్‌లో పేలిన టైం బాంబ్
సాక్షి, బెంగళూరు: నగరంలో సంభవించిన భారీ పేలుడు.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టైం బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. టిఫిన్ బాక్స్‌లో ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. తొలుత బ్లాస్ట్‌కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్‌లో సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించింది. అదే సమయంలో.. బోల్ట్‌లు, నట్లు, ఎలక్ట్రిక్ వైర్లను.. వాచ్‌ను(టైం బాంబ్ కోసం ఉపయోగించేది) గుర్తించింది. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. సీసీఫుటేజీ ఆధారంగా ఉదయం 11 గం. ప్రాంతంలో కేఫ్‌లోని సింక్ వద్ద ఓ ఆగంతకుడు బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాక.. 12గం.46ని. సమయంలో బాంబు పేలింది. ఆ బ్యాగ్‌లోని టిఫిన్ బాక్స్‌లోని బాంబ్ పేలుడుకు కారణమని.. ఇది ఉగ్రదాడే అయ్యి ఉంటుందని ఎన్ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది. ఏం జరిగిందంటే.. రామేశ్వరం కేఫ్‌కు నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది కస్టమర్లు వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మొత్తం తొమ్మిది మందిని బ్రూక్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. అందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్ మోహన్ చెప్పారు. అంతకు ముందు.. ‘‘సిలిండర్ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్ ఫైర్ స్టేషన్ అధికారి చెప్పారు. ఇదీ చదవండి: కలాం స్ఫూర్తి.. రామేశ్వరం కేఫ్ నెల బిజినెస్ 4 కోట్లపైనే! An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. #Karnataka pic.twitter.com/7PXndEx2FC — ANI (@ANI) March 1, 2024 #WATCH | Karnataka | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. Whitefield Fire Station says, "We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing… pic.twitter.com/uMLnMFoHIm — ANI (@ANI) March 1, 2024 Just spoke to Rameshwaram Café founder Sri Nagaraj about the blast in his restaurant. He informed me that the blast occurred because of a bag that was left by a customer and not any cylinder explosion. One of their employees is injured. It’s seems to be a clear case of bomb… — Tejasvi Surya (@Tejasvi_Surya) March 1, 2024 ఇదిలా ఉంటే.. రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో తాను మాట్లాడానని.. పేలుడు గురించి ఆరా తీశానని బీజేపీ నేత, ఎంపీ తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ఇది సిలిండర్ బ్లాస్ట్ కాదని.. కస్టమర్ ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు జరిగిందని.. ఇది ముమ్మాటికే బాంబు పేలుడంటూ పోస్ట్ చేశారాయన. -
తమిళనాడులో NIA సోదాలు
-
సంజయ్ దీపక్ రావు అరెస్ట్ పై నన్ను ప్రశ్నించారు: వేణుగోపాల్
-
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు
-
‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ముగిసిన ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ముగిసిన NIA సోదాలు ఎల్బీనగర్లోని శ్రీనివాస నగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఎ సోదాలు ముగిశాయి. కూకట్పల్లి పీఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు అరెస్ట్ విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు. రవిశర్మ మొబైల్‌తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోలకు చెందిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఎ అధికారులు. ఈ నెల 10న ఎన్ఐఎ కార్యాలయానికి హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేసిన NIA అడిషనల్ ఎస్పీ రాజ్‌కుమార్. విక్షణం పత్రిక ఎడిటర్ వేణు కామెంట్స్ ఉదయం ఐదు గంటలకు మా ఇంటికి ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు.. సెర్చ్ వారెంట్‌తో వచ్చామని చెప్పారు సంజయ్ దీపక్ రావు అరెస్ట్ అయినా దాని మీద వచ్చామని అన్నారు. 2013 నయిల్ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలను తీసుకెళ్లారు. నా మొబైల్ సీజ్ చేశారు. సెప్టెంబర్ 15 సింహపురి టౌన్ షిప్లో సంజయ్ దీపక్ రావును అరెస్ట్ చేశారు. దీపక్‌కు నాకు సంబంధముందని కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి లేఖ రాశాను. నేను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచారం అయ్యింది. దేశంలో NIA ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాము. జనవరి మూడో తేదీన నాపై పెట్టిన కేసును NIA టెకప్ చేసుకుంది. ఈ కేసులో ఏ-22గా నా పేరు చేర్చారు పోలీసుల దగ్గర ఉన్న కన్ఫక్షన్ స్టేట్మెంట్లో నా పేరు ప్రస్థావించినట్టు తెలిపారు. -
అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ముగ్గురు మయన్మార్ దేశస్తులుపై చార్జిషీట్ దాఖలు చేసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి మయన్మార్ దేశస్తులు చొరబడ్డారు. మయన్మార్‌కు చెందిన నిందితులు.. రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్.. రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేశారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులను సైతం నిందితులు పొందారు. ఆధార్ కార్డులతో తమ పేరుతో సిమ్ కార్డులు విక్రయించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సైతం తెరవటం గమనార్హం. గత ఏడాది నవంబర్ 7న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి మయన్మార్ నిందితులు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారు. బంగ్లాదేశీ రెఫ్యుజీ క్యాంపులో ఉన్న మహిళలను భారత్‌లోకి దింపిందీ ముఠా. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల విసిరింది. -
అది పచ్చపన్నాగమే..
విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్‌పై హత్యాయత్నం జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయపడుతోంది. ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు పడుతోంది. సింగిల్‌గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి. కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్‌కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు అచ్చేయిస్తున్నాయి. చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దు్రష్పచారానికి ఒడిగడుతున్నాయి. పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాయి. –సాక్షి, అమరావతి ఎన్ఐఏ చార్జిషీట్లో ఏముంది? వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ... చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడమీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. నాటి దాడి యాదృచ్చికం కాదనీ... హత్య చేసేందుకు పక్కా కుట్రేనన్నది నిర్ధారణ అవుతోంది. రెస్టారెంట్ యజమాని పక్కా టీడీపీ వైఎస్ జగన్‌పై హత్యా యత్యానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ‘ఫ్యూజన్ ఫుడ్స్’ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తూ నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నపుడే. పక్కా పన్నాగంతోనే ఉద్యోగం 2018 అక్టోబర్ 25వ తేదీన వై.ఎస్.జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే అంటే 2018, జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్‌కుమార్ సిఫార్సుమేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్‌కు ఉద్యోగమిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్లి వస్తారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది. నిందితుడు పాత నేరస్తుడే... కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్ఎఫ్) భద్రతా వలయంలో ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లోగానీ అక్కడ ఉండే షాపులు, ట్రావెల్స్ ఏజెన్సీల డెస్్కలలో ఉద్యోగాల్లో చేరడం అంత ఆషామాషీ కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస, స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనార్హ. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉంది. టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడి నీళ్లు జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా దు్రష్పచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని.. జగన్‌కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టిమరీ వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్య నేత’ ఆదేశాలున్నట్టు స్పష్టమవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్‌పై విడుదల అయిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్‌జగన్‌కు సానుభూతి తీసుకువచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దు్రష్పచారం బెడిసికొట్టింది. పచ్చ మీడియా పైశాచిక ఆనందం బాధితునిపై సానుభూతి చూపడం... నిందితుడిపై ఆగ్రహం ప్రదర్శించడం మానవీయ ధర్మం. ఎల్లోమీడియా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బాధితుడైన జగన్‌ను అవహేళన చేయడమే కాకుండా, నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా మలిచేందుకు ఏకంగా న్యాయ వ్యవస్థకే దురుద్దేశాలు ఆపాదిస్తోంది. హత్యాయత్నం కేసు దర్యాప్తును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడాన్ని ఈనాడు, ఇతర పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని తేల్చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటి? ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అందుకే ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖç³ట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. సమగ్ర దర్యాప్తునకు వినతి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధం ఏమిటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా? విమానాశ్రయంలో ఉన్న జగన్‌కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు? జగన్‌ను తానే పొడిచానని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూల్లో శ్రీనివాసరావు చెప్పిన మాట వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్దన్ చౌదరి, లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హర్షవర్దన్కి ఎయిర్‌పోర్టులో 2017లో కేటరింగ్ కాంట్రాక్టు కేటాయింపు సమయంలో కేంద్రమంత్రిగా ఉన్నది టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజే కదా? కథకం ప్రకారం దాడిచేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నాయి? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టేనా? శ్రీనివాస్‌ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లోమీడియా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? -
కుట్రకోణంపై కౌంటర్ దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం వెనుక గల కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ... సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసుకు సంబంధించి విశాఖలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతున్న తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలపాటు నిలిపివేసిన హైకోర్టు, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు లోపాలనుప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకెళ్లిన జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో ఆయనపై జనుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి హత్యాయత్నం చేశారు. పదునైన కత్తితో జగన్ మెడపై దాడికి ప్రయత్నించారు. జగన్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ ఘటనను తేలిక చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ మీడియా సమావేశాలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసింది. జగన్‌ను చంపడమే శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయత్నించాడని ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. ముందస్తు పథకంలో భాగంగానే శ్రీనివాసరావు కోడి కత్తి సంపాదించాడని, అదును చూసి జగన్‌పై దాడి చేశాడని వివరించింది. దీనివెనుక ఉన్న కుట్ర, ప్రేరణ వ్యవహారాన్ని కూడా తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ వివరించింది. కానీ.. ఎన్ఐఏ కుట్ర కోణంపై దృష్టి సారించలేదు. ఎవరి ప్రేరణతో శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డారో తేల్చలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం ఘటన వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో లోపాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శ్రీనివాసరావు వెనుక ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ తేల్చలేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ ఏడాది జూలై 25న తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ వైఎస్ జగన్ తరఫున న్యాయవాది టి.నాగార్జునరెడ్డి గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం విచారణ జరిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తాం: ఎన్ఐఏ వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఎన్ఐఏ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. ఎన్ఐఏ తరఫున హాజరైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి ఎన్ఐఏ, నిందితుడు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించారు. కాగా.. న్యాయవాది నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు జగన్మోహన్రెడ్డిని సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి విశాఖ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న సెషన్స్ కేసు (ఎస్జీ) 5/2023కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ 8 వారాల పాటు నిలుపుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిధి లేకున్నా విజయవాడ కోర్టు ఉత్తర్వులిచ్చింది సీఎం వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలు తేలుస్తామని చార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ ఆ తరువాత ఎలాంటి దర్యాప్తు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కుట్ర కోణం గురించి అసలు పట్టించుకోలేదన్నారు. ఈ దృష్ట్యా కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని కోరుతూ జగన్మోహన్రెడ్డి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. అయితే, ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ ఏడాది జూన్ 25న ఉత్తర్వులిచ్చిందన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్ఐఏ కోర్టు పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జూలై 21న నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. దీని ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును విచారించే పరిధి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు మాత్రమే ఉందని వివరించారు. విచారణ పరిధి లేకపోయినప్పటికీ విజయవాడ కోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిందని, అందువల్ల విజయవాడ కోర్టు ఉత్తర్వులు చెల్లవన్నారు. చట్ట ప్రకారం పరిధి ఉన్న ప్రత్యేక కోర్టు మాత్రమే విచారణ జరపాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
ఉగ్రవాదాన్ని నిర్దాక్షిణ్యంగా అణచేయాలి
న్యూఢిల్లీ: ఉగ్రవాదం పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంలో మళ్లీ కొత్తగా ఉగ్ర గ్రూపు ఏర్పడకుండా కఠినమైన వైఖరిని అవలంబించాలని ఉగ్రవాద వ్యతిరేక విభాగాలను కోరారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించివేయాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వంతోపాటు అన్ని విభాగాలు ఉమ్మడిగా ముందుకు సాగాలన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో రెండు రోజుల జాతీయ ఉగ్ర వ్యతిరేక సదస్సునును అమిత్ షా ప్రారంభించి, ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీలు, హవాలా, ఉగ్ర నిధులు, వ్యవస్థీకృత నేర ముఠాలు, డ్రగ్స్– ఉగ్ర లింకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు మంచి ఫలితాలు సాధించాయని ఆయన అన్నారు. ఎన్ఐఏ, ఉగ్ర వ్యతిరేక బృందాలు, రాష్ట్రాల టాస్క్‌ఫోర్స్‌లు కేవలం కేసుల దర్యాప్తునకే పరిమితం కారాదన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తమ పరిధిని దాటి వినూత్నవిధానాలను ఆలోచించాలని కోరారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేసే క్రమంలో అంతర్జాతీయ సహకారంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల సహకారం కూడా అవసరమని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు, వివిధ ఏజెన్సీల మధ్య సహకారం ఉండాలన్నారు. ఇందుకోసం కేంద్రం పలు డేటా బేస్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎన్ఐఏ పరిధిలో మోడల్ యాంటీ టెర్రరిజం నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి, కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం అన్ని రాష్ట్రాల్లోని ఉగ్రవాద వ్యతిరేక విభాగాల అధికార క్రమం, నిర్మాణం, విచారణ, కార్యాచరణ విధానం ఏకరీతిగా ఉండాలన్నారు. 94 శాతం కంటే ఎక్కువగా నేరారోపణ సాధించిన ఎన్ఐఏ కృషిని షా ప్రశంసించారు. ఈ ఏడాదిలో ఎన్సీబీ చేపట్టిన ఆపరేషన్ సముద్రగుప్తతో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగామన్నారు. -
గురపత్వంత్ సింగ్‌కి భారత్ బిగ్ షాక్
ఢిల్లీ: ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ Gurpatwant Singh Pannun కు భారత్ సాలిడ్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థNIA.. భారత్‌లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో.. NIA దర్యాప్తులో.. అమృత్సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్‌నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్‌పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. ఇదీ చదవండి: మోదీ, షాలను వదలని గురపత్వంత్ -
ముమ్మాటికీ హత్యాయత్నమే
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే. ఆయన్ని హతమార్చాలనే కుట్రతోనే నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ నివేదిక ఇచ్చింది. చార్జిషీట్లోనూ ఇదే పేర్కొంది. అంతకు ముందు సిట్ కూడా ఇదే చెప్పింది’ అని ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. కానీ, ఓ వర్గం మీడియా క్రియేటివ్ సెన్సేషన్ కోసమే కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి తెస్తోందని, దర్యాప్తు అధికారుల నివేదికకు విరుద్ధంగా ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంకటేశ్వర్లు బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. నిందితుడే స్వచ్ఛందంగా అంగీకరించాడు నిందితుడు శ్రీనివాసరావు గతంలో బెయిల్‌పై విడుదలైన తర్వాత తన న్యాయవాదితో (ఇప్పుడున్న న్యాయవాదే) కలిసి ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్పప్పుడు ఆయనపై తానే దాడి చేశానని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఇప్పుడు అదే న్యాయవాది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఆయుధాన్ని సమకూర్చారంటూ కొత్త వాదన తెరపైకి తేవడం సిగ్గుచేటు. న్యాయ స్థానంలో దాఖలు చేసిన పత్రాల్లోని విషయాన్ని చూడాలి తప్ప, కోర్టులో జరగనివి, జరిగినవి చెప్పడం కచ్చితంగా కోర్టు ధిక్కరణే. దీనికి బాధ్యులు చర్యలు ఎదుర్కోక తప్పదు. సీఎం జగన్‌పై హత్యాయత్నంలో నిందితుడు శ్రీనివాసరావు ఒక ఆయుధం మాత్రమే. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల హస్తం లేకుండా ఈ ఘటన జరగడానికి అవకాశం లేదనడానికి అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం దర్యాప్తును, కోర్టు విచారణను తప్పుదోవ పట్టించడానికి, రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదు. మీడియాతో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు కోడి కత్తి అంటూ కేసు తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా ఓ పత్రిక (ఈనాడు) మొదటి నుంచీ వ్యవహరిస్తోంది. ఘటన జరిగిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ హడావుడిగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడు జె.శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అని ప్రకటించారు. సానుభూతి కోసమే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న డీజీపీ ఏకపక్షంగా ప్రకటించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఓ వర్గం మీడియా సైతం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన (2018 అక్టోబరు 25) మర్నాటి నుంచే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా కథనాలు ప్రచురించింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఏకపక్షంగా రాసేశారు. ఆ దాడిలో వైఎస్ జగన్‌కు తీవ్రమైన గాయం అయ్యింది. ఆ కత్తి మెడలో దిగి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ, ఓ ప్రతిక (ఈనాడు) మాత్రం వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. బాధితుడైన వైఎస్ జగన్‌ను అవహేళన చేస్తోంది. బ్లేడ్లతోనే ఎన్నో హత్యలు చేస్తున్నారు. కోడి కత్తి చిన్నగా ఉన్నా అత్యంత పదునుగా ఉంటుంది. కానీ కేసు తీవ్రతను తగ్గించి చూపించేందుకు ప్రతిసారీ కోడి కత్తి అంటూ ఓ ఆయుధాన్ని కేసుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. దాడి నాటి దృశ్యం కేసులున్న వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఎలా? నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖ విమానాశ్రయం రెస్టారెంట్ ఫ్యూజన్ ఫుడ్స్‌లో ఉద్యోగంలో చేరడంతోనే ఈ కుట్రకు బీజం పడింది. వాస్తవానికి విమానాశ్రయంలో పనిచేసే వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేస్తేనే ఉద్యోగంలో చేర్చుకోవాలి. శ్రీనివాసరావుకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఎన్వోసీ ఎవరు ఇచ్చారన్నది కీలకంగా మారింది. శ్రీనివాసరావుపై 2017లో అప్పటి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఓ కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్తో పాటు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అంటే అతనికి నేర చరిత్ర ఉన్నట్టే. పైగా, అతన్ని రెస్టారెంట్లో చేర్పించడానికి ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఆతృత కనబరచడం గమనార్హం. శ్రీనివాసరావుపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విమానాశ్రయ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసులు లేవని ఆ పోలీస్ స్టేషన్ అధికారి ఎన్వోసీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో అతనిపై కేసులు ఉన్నాయో లేవో వారికి తెలియదని చెప్పినట్టే. కానీ హర్షవర్ధన్ చౌదరి మాత్రం శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి నేర చరిత్ర లేదని తానే సొంతంగా నిర్ధారిస్తూ ఎన్వోసీ సమర్పించారు. ఏ ప్రాతిపదికన ఆయన అలా చెప్పారు? అంటే శ్రీనివాసరావు నేర చరిత్రను గోప్యంగా ఉంచుతూ డీజీసీఏను తప్పుదోవ పట్టిస్తూ మరీ ఎన్వోసీ ఇచ్చారు. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉంది. సాక్ష్యం చెప్పడానికి రానని సీఎం చెప్పలేదు ఎన్ఐఏ దర్యాప్తు అనంతరం తొలి చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో పెద్ద కుట్రకోణం దాగి ఉందని, తదుపరి దర్యాప్తు చేపడతామని పేర్కొంది. తొలుత 39 మంది సాక్షులను తూతూమంత్రంగానే విచారించి వదిలేసింది. 2019 జనవరి 23న చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సాక్షిని కూడా విచారించలేదు. ఒక్క డాక్యుమెంట్‌ను కూడా సేకరించలేదు. సిట్ అధికారులు ఇచ్చిన రికార్డులను మాత్రమే 2019 జూలై 23న కోర్టులో దాఖలు చేశారు. తాజాగా కొత్త అంశాలు వెలుగులోకి రాలేదని మాత్రమే కోర్టులో చెప్పింది. దర్యాప్తు అవసరం లేదని ఎక్కడా రాయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఇకపై ఎన్ఐఏ విచారణ అవసరం లేదని చెప్పినట్టు రాస్తోంది. ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రానని ఎక్కడా చెప్పలేదు. తన సాక్ష్యం రికార్డు ప్రక్రియలో ప్రజలకు అసౌకర్యం కులుగుతుందని మాత్రమే చెప్పారు. అడ్వొకేట్ కమిషన్ ద్వారా సాక్షులను విచారించే అవకాశం ఉందని, దాని ప్రకారం తనను విచారించాలని అనుమతి కోరుతూ ఎన్ఐఏ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కూడా వక్రీకరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపైనా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖ ఎన్ఐఏ న్యాయస్థానానికి, మిగిలిన జిల్లాల్లోని కేసుల విచారణ పరిధి విజయవాడ న్యాయస్థానానికి ఉంటుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సైతం జీవో ఇచ్చింది. కుట్రకోణం ఉంది.. అనుమానాలివే తనపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందని ఈ కేసులో బాధితుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు బలాన్ని చేకూరుస్తూ స్పష్టమైన అంశాలను ప్రస్తావించారు. నేర చరిత్ర ఉన్న నిందితుడు శ్రీనివాసరావును విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో ఉద్యోగంలో చేర్పించడం, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి నిందితుడు ఆయుధాన్ని అక్రమంగా తీసుకురావడం, ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి టీడీపీ నేత కావడం మొదలైన అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కుట్ర కోణాన్ని, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి హత్యాయత్నం వెనుక కుట్రను ఛేదించాలని, దాని వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాం. ఎన్ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేయాలనేదే మా వాదన. అందులో మేం చెప్పిన అంశాలివీ.. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరికి, నిందితునికి ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు శ్రీనివాసరావుపై గతంలో కేసులు ఉన్నప్పటికీ, విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో చెప్పిన విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్థన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్థన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ♦ ఎన్ఐఏకి రికార్డు ఇవ్వొద్దని సిట్ దర్యాప్తు అధికారి శ్రీనివాసరావును అప్పటి డీజీపీ ఎందుకు ఆదేశించారు? కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? ♦ స్థానిక పోలీసులు బయోమెట్రిక్ హాజరు మిషన్‌ను సీజ్ చేసి వివరాలు సేకరించగా అందులో నిందితుడు శ్రీనివాసరావు పేరు నమోదు కాలేదు. హర్షవర్ధన్ కూడా పేరు ఎంట్రీ చేయలేదని చెప్పారు. కానీ, ఎన్ఐఏ దగ్గరికి వచ్చేసరికి బయోమెట్రిక్ హాజరులో నిందితుడు అక్కడే పని చేస్తున్నట్టు, దాడి జరిగిన రోజు కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు. ఇవి పరస్పర విరుద్ధ అంశాలు. ♦ అదే రోజు విమానాశ్రయం లాంజ్‌లో సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదు? -
కరీంనగర్ హుస్సేనీపురాలో ఎన్ఐఏ సోదాలు
-
న్యాయస్థానం నిర్ణయంపైనా ‘పచ్చ’పాతమా రామోజీ?
దుష్ప్రచారం చేయడంలో తనను మించిన వారు లేరంటూ ఈనాడు రామోజీ మరో అడుగు ముందుకు వేశారు. చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా తగ్గేదే లేదని పదే పదే చాటుకుంటున్న రామోజీ.. తుదకు పాత్రికేయ విలువలకూ తిలోదకాలు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయడంతో ఈయన గారికి బీపీ పెరిగిపోయింది. న్యాయస్థానమైతే ఏంటనుకుంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ కేసును విచారిస్తోంది ఎన్ఐఏ. బదిలీ చేస్తూ తీర్పు చెప్పింది విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం. బదిలీ చేసింది విశాఖలోని ఆ కోర్టుకే. ఇందులో అభ్యంతరం ఏమిటి రామోజీ? తీర్పు ఎలా ఇవ్వాలో కూడా మీరే నిర్దేశిస్తారా? సాక్షి, అమరావతి: పచ్చ (టీడీపీ) కామెర్లు సోకిన ఈనాడు రామోజీరావు ఏనాడో పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతటితో ఆగక ఇప్పుడు ఏకంగా న్యాయస్థానాల నిర్ణయాలు, తీర్పులను సైతం వక్రీకరిస్తూ.. వక్రభాష్యాలు చెబుతూ.. దురుద్దేశాలు ఆపాదించేందుకూ బరితెగించారు. చంద్రబాబు కోసం ఎంతకైనా దిగజారుతామని తన దివాలాకోరుతనాన్ని మరోసారి ప్రదర్శించారు. ఇందులో భాగంగా న్యాయ వ్యవస్థ అధికార పరిధిలోకి చొరబడి మరీ న్యాయమూర్తి నిర్ణయాలకు వక్రభాష్యం చెప్పారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై 2018 అక్టోబరు 25న విశాఖపట్నంలో జరిగిన హత్యాయత్నం కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ ‘ఈనాడు’ సొంత వ్యాఖ్యలు చేయడం న్యాయ నిపుణులను విస్మయ పరిచింది. న్యాయ వ్యవస్థను కించపరిచిన ఈనాడు ఈ కేసును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడంపై ఈనాడు పత్రిక బుధవారం ప్రచురించిన కథనం పూర్తిగా వక్రీకరణే. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని ఈనాడు తీర్మానించేయడం న్యాయ వ్యవస్థను ప్రశ్నించడమే. రాజకీయ దురుద్దేశంతో ప్రచురించిన కథనం అది. ఏకంగా న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ... న్యాయ వ్యవస్థను కించపరుస్తూ కథనాన్ని ప్రచురించింది. ఎన్ఐఏ కోరిక మేరకే విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను సాగదీసేందుకే విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి కేసును బదిలీ చేశారని ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు న్యాయస్థానాల్లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతుందని హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. అందుకే రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ లేఖ ద్వారా కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సీబీఐలకు ఇతర రాష్ట్రాల్లో కూడా వేర్వేరు చోట్ల ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవాడతోపాటు విశాఖపట్నం, కర్నూలులో ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి. అదే విధంగా ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖపట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నంలో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. ఈనాడు పైశాచిక ఆనందం ఎవరైనా బాధితునిపట్ల సానుకూలత, సానుభూతి చూపుతారు. దాడికి పాల్పడిన వారి పట్ల ఆగ్రహం ప్రదర్శిస్తారు. కానీ ఈనాడు పత్రిక అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ హత్యాయత్నం కేసులో బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయనపట్ల ఈనాడు పత్రిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన్ని అవహేళన చేయడమే కాకుండా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తోంది. ఇలా పైశాచిక ఆనందం పొందుతోంది. నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తక్కువగా చూపేందుకు కుట్ర పన్నుతోంది. నిజాలకు పాతర.. ‘ఈనాడు’ ఎత్తుగడ! కేసులో వాస్తవాలు బయట పడకూడదనే ఈనాడు ఇలా వక్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. నిందితుడు పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడని, మెడ భాగంలో పొడిచి.. జగన్‌ను హత్య చేయాలన్నది అతని లక్ష్యమని స్పష్టం చేసింది. చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని కూడా చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంత తీవ్రమైన దాడిని తక్కువగా చేసి చూపేందుకు ఈనాడు పత్రిక దిగజారుడు కథనాలు ప్రచురిస్తోంది. కుట్ర కోణం, సూత్రధారులపై సమగ్ర దర్యాప్తు చేయాలి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కింది అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ♦ విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితునితో ఉన్న సంబంధం ఏమిటి? ♦ నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుపై గతంలో కేసు ఉన్నా సరే విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా! ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నప్పుడు కాఫీ ఇచ్చేందుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావునే ఎందుకు పంపించారు? ♦ హర్షవర్ధన్ చౌదరికి విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? ♦ హర్షవర్ధన్ చౌదరి, నారా లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? -
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు: నలుగురికి పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన నలుగురికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో డానిశ్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం (బిహార్), ఇమ్రాన్ ఖాన్ (మహారాష్ట్ర), ఒబైదుర్ రెహా్మన్ (హైదరాబాద్) ఉన్నారు. వీరికి 2006 వారణాసి పేలుళ్లకు, 2007 ఫైజాబాద్, లక్నో పేలుళ్లు, 2008 జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2010 బెంగళూరు స్టేడియం పేలుడు, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లతో సంబంధాలున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన కుట్రదారులతో కలిసి పథక రచన చేసినట్టు వివరించింది. ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఇప్పటికే యాసిన్ భక్తల్ తదితరులపై అభియోగాలు మోపడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ వీరిని 2013 జనవరి–మార్చి మధ్య అరెస్టు చేసింది. చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
బీరెల్లి కుట్ర కేసుపై ఎన్‘ఐ’ఏ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘బీరెల్లి’కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 152/2022 ప్రకారం 2022, ఆగస్టు 19న 152 మందిపై కేసు నమోదైంది. తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు నేతలతోపాటు కొందరు ఆ పార్టీ ప్రజాసంఘాల నాయకులు (ప్రాక్షన్ కమిటీ మెంబర్లు) సమావేశం ఆయ్యారనేది ఆ ఎఫ్ఐఆర్లోని సారాంశం. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తోపాటు 10 సెక్షన్ల కింద ప్రొఫెసర్ హరగోపాల్ సహా 152 మందిపై నేరాభియోగం మోపారు. ఈ కేసు ఇటీవల వివాదాస్పదం కావడంతో డీజీపీ ఆదేశాల మేరకు విచారణ జరిపారు. ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు జస్టిస్ సురేష్ (లేట్), వి.రఘునాథ్, జర్నలిస్ట్ పద్మజా షా, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్‌లపై ‘ఉపా’కేసులు ఎత్తివేశారు. ఈ మేరకు జూన్ 17న ప్రకటన చేసిన ములుగు ఎస్పీ గౌస్ ఆలం.. మిగతా వారిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసు పూర్వాపరాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుండటం చర్చనీయాంశమైంది. ‘ఉపా’కేసులో ఎన్ఐఏ ఆరా 2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కుట్ర కేసులో 152 మంది పేర్లుండగా.. అందులో చాలా మందిని గతంలో నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్ విద్యార్థినిని మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసినా.. 2021 మే 31వ తేదీన కేసు మళ్లీ తెరిచి దర్యాప్తు చేయాలని ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2022 సెప్టెంబర్ మొదటి వారంలో కేసును స్వీకరించిన ఎన్ఐఏ రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్ జిల్లాల్లో సోదాలు నిర్వహించి హైకోర్టు న్యాయవాది, చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) సభ్యురాలు చుక్కా శిల్పను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేశారు. డి.దేవేంద్ర, దుబాసి స్వప్నలను కూడా ఎన్ఐఏ అరెస్టు చేసింది. పర్వతపురంలోని చైతన్య మహిళా సంఘం నేత దేవేంద్ర, అంబేడ్కర్ పూలే యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే క్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో క్రియాశీలకంగా పని చేశారన్న సమాచారంతో హనుమకొండకు చెందిన సముద్రాల అనిత, ఆమె తల్లి ఇంట్లో కూడా 2022 సెపె్టంబర్ 5న దాడులు చేయడం అప్పట్లో కలకలం రేపింది. వీరందరితోపాటు మరో నలభై మంది వరకు వివిధ కేసుల్లో ఎన్ఐఏ నిందితులుగా పేర్కొన్న వారి పేర్లు కూడా ‘బీరెల్లి’కుట్ర కేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆరా తీస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వివరాలు సేకరించిన ఏపీ ఇంటెలిజెన్స్ ములుగు జిల్లా తాడ్వాయి పోలీసుస్టేషన్లో కేసు నమోదైనా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. 13 మంది మావోయిస్టు పా ర్టీల నేతలతోపాటు 20 సంఘాలకు చెందిన 146 మందిపై 10 సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణ జరుగుతోంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రజాసంఘాల ప్రతినిధుల పేర్లుండగా.. ఇదే కేసు విషయమై ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు రెండు రోజుల క్రితం ములుగు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించినట్లు తెలిసింది. తాడ్వాయి, పస్రా ఎస్‌హెచ్‌వోలు, స్పెషల్‌బ్రాంచ్ అధికారులతోనూ మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. -
ఎన్ఐఏ కస్టడీకి పీఎఫ్ఐ సభ్యులు
సాక్షి, చెన్నై: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి చెందిన ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఐసిస్‌కు అనుకూలంగా, దేశంలో మైనారిటీ పాలనే లక్ష్యంగా పీఎఫ్ఐ సాగిస్తున్న ప్రయత్నాలపై అనుమానంతో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి తమిళనాడుకు చెందిన 10 మంది సహా దేశ వ్యాప్తంగా 106 మందిని ఎన్ఐఏ ఇటీవల అరెస్టు చేసింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా చెన్నై, మదురై, దిండుగల్, తేనిలకు చెందిన అయిదుగురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. -
మూడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ/బనశంకరి: నిషేధిత ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్రలపై దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు బుధవారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. బిహార్‌లోని కతీహర్ జిల్లా, కర్ణాటకలోని దక్షిణ కన్నడ, షిమోగా జిల్లాలు, కేరళలోని కాసర్గోడ్, మలప్పురం, కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో మొత్తం 25 చోట్ల ఈ సోదాలు జరిగాయి. అనుమానితుల నివాసాల్లో సోదాలు చేపట్టినట్లు ఎన్ఐఏ అధికారులు తెలియజేశారు. మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్కులు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, డేటా కార్డులు, ఇతర డిజిటల్ పరికరాలు, పత్రాలు, పీఎఫ్ఐకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ సోదాల్లో రూ.17.50 లక్షల నగదు లభ్యమైందని వివరించారు. భారత్‌లో విధ్వంసకర కార్యకలాపాల కోసం పీఎఫ్ఐకి విదేశాల నుంచి హవాలా డబ్బు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కర్ణాటకలోని బంట్వాళ, పుత్తూరుల్లో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. కేరళలోని కాసరగోడ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఎన్ఐఏ గుర్తించింది. కశ్మీర్‌లోనూ... శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, బుద్గామ్ జిల్లాల్లో మూడు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి చెప్పారు. పాక్ దన్నున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్–బదర్, అల్‌కాయిదా ఉగ్ర సంస్థల అనుబంధ సంస్థల సభ్యులు, సానుభూతిపరుల నివాసాల్లో సోదాలు జరిగాయి. ద రెసిస్టెన్స్ ఫోర్స్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్–జమ్మూకశ్మీర్, ముజాహిదీన్ గజ్వాత్–ఉల్–హింద్, జమ్మూకశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్, కశ్మీర్ టైగర్స్, పీపుల్స్ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థలు ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చాయి. -
ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట
పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం వేట ముమ్మరం చేసింది. డ్రోన్లు, జాగిలాలతోపాటు హెలికాప్టర్‌తో గాలింపు కొనసాగిస్తోంది. బాటా–డోరియా అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యలను సైనిక, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది. గురువారం ముష్కరుల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన ఐదుగురు చనిపోవడంతోపాటు మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల మృతదేహాలకు ఉన్నతాధికారులు శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను పటిష్టం చేశారు. ముష్కరుల దుశ్చర్యను ఖండిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, రాష్ట్రీయ బజరంగ్ దళ్, శివసన, డోగ్రా ఫ్రంట్, జమ్మూ స్టేట్హుడ్ ఆర్గజనైజేషన్ జమ్మూలో భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. -
ఎన్ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో చాలా లోపాలున్నాయని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం ఎన్ఐఏ కోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ సరైన దిశలో దర్యాప్తు చేయలేదని.. అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిల్చిందని ఆరోపించారు. దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిందన్నారు. చార్జిషీట్‌ను కూడా చాలా హడావుడిగా దాఖలు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందన్నారు. అయితే ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ మాత్రం ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. అందుకే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టుకు నివేదించారు. ఎంట్రీ పాస్ లేకుండానే విమానాశ్రయంలోకి నిందితుడు.. వైఎస్ జగన్‌పై అక్టోబర్ 25, 2018లో హత్యాయత్నం జరిగిందని.. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆ మరుసటి రోజు శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్ అధికారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ)ని స్వాధీనం చేసుకున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన రోజు ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లారని చెప్పారు. పాస్ ఇంటిలోనే ఉన్నప్పుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. నిందితుడు కత్తిని లోపలకు ఎలా తీసుకెళ్లాడు? జగన్‌తో కలిసి నిందితుడు ఫొటో దిగినట్లు ఉన్న ఫ్లెక్సీని కూడా సిట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అసలు ఈ ఫ్లెక్సీని ఎవరు తయారు చేశారు? ఏ ఉద్దేశంతో తయారు చేశారన్న వివరాలను ఎన్ఐఏ పట్టించుకోలేదని కోర్టుకు నివేదించారు. ఫెక్ల్సీ విషయంలో నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు ఇచి్చన వాంగ్మూలాన్ని సిట్, ఎన్ఐఏ రికార్డు చేశాయన్నారు. అయితే ఈ రెండు వాంగ్మూలాలకు వైరుధ్యం ఉందన్నారు. ఇందులో ఏది నిజమో తేల్చాల్సిన బాధ్యత ఎన్ఐఏపై ఉందని కోర్టుకు నివేదించారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని గుర్తు చేశారు. లోపల ఉన్న హోటల్లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. మరి శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోపలికి వెళ్లారో ఎన్ఐఏ చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్ఐఏ విచారించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్ హోటల్లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాçÜరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు. దీన్ని ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు. హర్షవర్ధన్ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచచిందన్నారు. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్ఐఏ సరిగా విశ్లేషించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ వాదనలు వినిపించేందుకు ఎన్ఐఏ తరఫు న్యాయవాది సిద్ధిరాములు గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
దాడికి కుట్ర చేసిందెవరు ?..సందేహాస్పదంగా ఎన్ఐఏ అఫిడవిట్
-
ఏది నిజం?: బాధితులనే దోషుల్ని చేస్తారా? పాత్రికేయమంటే ఇదేనా డ్రామోజీ?
నేను చెప్పిందే తీర్పు.... నేను రాసిందే చరిత్ర!!.నేను పడుకుంటే అది రాత్రి... నేను నిద్రలేస్తే అది ఉదయం... అనుకునే తెగ బలిసిన మోతుబరి తత్వం రామోజీరావుది.ఎందుకంటే... వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం చేసిన నిందితుడుజనిపల్లి శ్రీనివాసరావు 2019 జనవరి 17నే దర్యాప్తుఅధికారులకు వాంగ్మూలమిచ్చాడు. నిందితుడితో పాటు ఇతర అనుమానితులు, సాక్షులు, బాధితుడు వైఎస్ జగన్ తాలూకు వాంగ్మూలాలన్నీ తీసుకున్నాక కొంతమేర దర్యాప్తు జరిపి 2019 జనవరి 27న దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టుకు చార్జిషీట్‌ను సమర్పించింది. అందులో... అది హత్యాయత్నమేనని నిర్ధారించింది. వైఎస్ జగన్‌ను హతమార్చాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం నిందితుడు అన్నీ చేశాడనిస్పష్టంగా తేల్చింది. దీనివెనక ఏమైనా కుట్ర ఉందా?ఎవరైనా ప్రేరేపించారా? అనే విషయాలు తేల్చడానికి ఇంకా దర్యాప్తు అవసరమని కూడా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ తెలిసేదేమిటి?వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందనేది వివాదానికి తావులేని అంశం. తేలాల్సిందల్లా... ఆ హత్యా ప్రయత్నం వెనక ఎవరున్నారనేదే!!. అలా తేల్చడంలో ఆలస్యమవుతోంది కాబట్టి, వేగంగా చేసేలా దర్యాప్తు సంస్థను ఆదేశించాలంటూ తాజాగా కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఇదీ జరుగుతున్న వాస్తవం. కానీ రామోజీరావు చేస్తున్నదేమిటి? ఎన్ఐఏ వేసిన చార్జిషీటును కూడా ప్రస్తావించకుండా... అంతకన్నా ముందు... నాలుగేళ్ల కిందట నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, ఇప్పుడే వెలుగు చూసిందంటూ శనివారంనాడు తన పత్రికలో పతాక శీర్షికన ప్రచురించారంటే ఏమనుకోవాలి? ఈ రామోజీరావు బుద్ధి భూలోకాన్ని దాటి పాతాళానికి పడిపోతున్నదనుకోవాలా?లేక తెగ బలిసిన మోతుబరి వ్యవహారమనుకోవాలా? హత్యాయత్నం జరిగిందని దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాక... బాధితుడు వైఎస్ జగన్‌ను అవమానపరిచేలా, నిందితుడి పక్షాన నిలుస్తూ నిందితుడి ఫోటోలు పతాక శీర్షికల్లో వేస్తూ... ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? బాధితుల్ని వదిలి నిందితులకు కొమ్ముకాసే దగాకోరు పాత్రికేయం చరిత్రలో ఎక్కడైనా ఉందా? బాధితులనే దోషులుగా చూపించే కుట్రలు ఇంకెక్కడైనా జరుగుతాయా? ఇదేం తీరు రామోజీరావ్? ఇంకెన్నాళ్లు ఇలా..? హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం. నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్‌తో వీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని,అవకాశం దొరికిన వెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం? గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను లేకుండా చేసే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఫలితం... నాటి ఎన్నికల్లో సరైన ప్రతిపక్షమే లేకుండా చేశారు ప్రజలు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆయన రాజగురువు రామోజీకి గానీ బుద్ధి రాలేదు. అప్పటి చీప్‌ట్రిక్స్‌నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు చూద్దాం... ♦ హత్య జరిగిన రోజే... నిందితుడు శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి పోలీసు కేసులూ లేవని రామోజీరావు రాసేశారు. అంత హడావుడిగా నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘ఈనాడు’ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరు రాయించారు? మరి తనపై ముమ్మిడివరంలో అప్పటికే పోలీసు కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది కదా? దర్యాప్తు జరగకముందే రామోజీకి ఎందుకంత తొందర? ఎవరి ప్రయోజనాల కోసం? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ అభిమాని అని... హత్యాయత్నం జరిగిన రోజే ‘ఈనాడు’ రాసేసింది. దీనికోసం వైఎస్ జగన్ – శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫ్లెక్సీని సాక్ష్యంగా చూపించింది. కానీ ఆ ఫ్లెక్సీ అప్పటికప్పుడు సృష్టించినదని, నకిలీదని ఆ తరవాత తేలింది. అసలు ‘ఈనాడు’కు ఈ ఫ్లెక్సీ బొమ్మ ఎవరు పంపారు? ♦ నిందితుడి సొంత ఊళ్లో ఇసుక కుప్పపై కప్పిన ఫ్లెక్సీని హత్యాయత్నం జరిగిన మూడురోజుల తరవాత అక్కడ చూశామని అక్కడకు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు పేర్కొన్నారు. కానీ నిందితుడి సోదరుడు ఇచ్చి న వాంగ్మూలంలో మాత్రం... ఆ ఫ్లెక్సీ లేదని, వానలకు పోయిందని చెప్పాడు. వీటిలో ఏది నిజం? వానలకు పోతే ఆ తరవాత పోలీసులకు ఎలా దొరికింది? అంటే అది అప్పటికప్పుడు సృష్టించినదనుకోవాలా? ♦ నిందితుడి జేబులో ఓ లేఖ దొరికింది. అందులో... తనకేమైనా అయితే తన అవయవాలు దానం చేయాలని కూడా పేర్కొన్నాడు. ఒకవేళ రామోజీరావు ప్రవచిస్తున్న సిద్ధాంతం ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతోనే... ఆయనకు సానుభూతి రావాలనే ఇదంతా చేస్తే తనకేమైనా అవుతుందనే భయం ఉంటుందా? వేరొకరు చెబుతున్నట్టుగా చేసినప్పుడే... తనకు ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు రామోజీ? ♦ జగన్‌ను చంపాలనుకుంటే మాంసం కోయడానికి ఉపయోగించే పెద్ద కత్తి వాడేవాడినని, ఆ ఉద్దేశం లేదు కాబట్టే చిన్న కత్తి వాడానని నిందితుడు చెప్పినట్టు కూడా ‘ఈనాడు’ బాక్సు కట్టి మరీ వేసేసింది. ఎయిర్‌పోర్టులో జనం ఉంటుండగా... అంతమంది మధ్యలోకి వెళ్లేటపుడు పెద్ద కత్తి తీసుకెళ్లడం సాధ్యమా? చిన్నదైతే కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడని అర్థం కావటం లేదా? అలాంటి సందేహాలు రామోజీకి రావా? ♦ నిందితుడిపై పోలీసు కేసులేవీ లేవంటూ పోలీసులకు, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకున్న హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు కాదా? 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించలేదా? అన్ని అబద్ధాలు చెప్పి శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చి ంది? ♦ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ఫుడ్స్కు వచ్చే ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరు వాడుతూ ఉంటారు. శ్రీనివాసరావు తమ దగ్గర ఉద్యోగం చేస్తున్నారనేది ఫ్యూజన్ ఫుడ్స్ చెప్పినదే. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఫ్యూజన్ ఫుడ్స్ ఇచ్చి నవే. కానీ బయోమెట్రిక్ హాజరులో ఎన్నడూ శ్రీనివాసరావు వేలిముద్రలు రికార్డు కాలేదని దాన్ని విశ్లేషించిన వర్గాలు చెబుతున్న మాట. ఇదంతా కుట్ర అనటానికి ఇది కూడా ఒక సాక్ష్యాధారమే కదా? ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విశాఖపట్నంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ విశాఖ ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. ‘‘ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరయ్యేవారు. దానికోసం ఆయన విశాఖ ఎయిర్‌పోర్టుకు రావటం... హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయంలో దిగటం చేసేవారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు పథకం ప్రకారం ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారు’’ అని ఎన్ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇదంతా తెలుసుకున్నాకే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారనే అనుమానాలున్నాయి. మరి ఇలా సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసే అవకాశం ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఉంటుందా? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అయితే... ఆయనకు తెలుగుదేశం నేత హర్షవర్దన్ చౌదరి ఉద్యోగమెందుకు ఇస్తాడు? అది కూడా ఎయిర్ పోర్టు పోలీసులకు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి మరీ!!. కుట్ర కోణంలో ఇదే అసలు కోణం కదా? లోతైన దర్యాప్తు అవసరం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అడుగుతున్నదొక్కటే. హత్యాయత్నం జరిగిందని ఇప్పటికే ఎన్ఐఏ తే ల్చి... చార్జిషీట్లో కూడా దాన్ని ధ్రువీకరించింది. అయితే ఈ హత్యాయత్నం వెనక ఉన్నదెవరు? దానికి సహకరించింది ఎవరు? కుట్ర ఎవరిది? ఇవన్నీ తేలాలని, దీనికోసం దర్యాప్తునువేగవంతం చేసి... పూర్తి స్థాయి చార్జిషీటును వెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుతున్నారు. ఇదే అభ్యర్థనతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణలో భాగంగానే ఎన్ఐఏకు కోర్టు నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానంగా కౌంటర్ వేసిన ఎన్ఐఏ.. దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నామనే చెప్పింది తప్ప ముగించినట్లు పేర్కొనలేదు. కానీ ముగించేసినట్లుగా... కుట్ర కోణం లేదని తేల్చేసినట్లుగా ‘ఈనాడు’ దివాలాకోరు రాతలు రాస్తుండటమే అసలైన దుర్మార్గం. -
NIA: ముంబైలో 'డేంజర్ మ్యాన్'... పోలీసుల హై అలర్ట్..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎన్ఐఏ హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు సహా మహారాష్ట్రలోని అన్ని దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మెయిల్స్ పంపింది. ఇండోర్‌కు చెందిన ఓ ప్రమాదకర వ్యక్తి మంబైలోని ప్రవేశించాడని, అతడు చైనా, పాకిస్థాన్, హాంకాంగ్‌లో శిక్షణ తీసుకుని వచ్చాడని హెచ్చరించింది. ఈ డేంజర్ మ్యాన్ పేరు సర్ఫరాజ్ మిమాన్. ఇతనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ కాపీలను ఎన్ఐఏ అన్ని దర్యాప్తు సంస్థలకు పంపింది. కొద్ది రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్ఫరాజ్ మిమాన్ గురించి ఎన్ఐఏకు మెయిల్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో సర్ఫరాజ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి అతని కోసం గాలిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఫిబ్రవరి 25న ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఆయుధాల శిక్షణ తీసుకునేందుకు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు థానే వెస్ట్‌కు చెందిన ముబారక్ ఖాన్ కాగా.. మరొకరు తమళనాడుకు చెందిన అబ్దుల్లా అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. చదవండి: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. -
ఎన్ఐఏ మెరుపు దాడులు.. మూడు రాష్ట్రాల్లో 60 చోట్ల సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం మెరుపు దాడులు చేపట్టింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 60 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. గత ఏడాది కోయంబత్తూరు, మంగళూరు నగరాల్లో జరిగిన రెండు వేరువేరు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ దాడులు చేపట్టింది. కాగా గతేడాది అక్టోబర్ 23న తమిళనాడులోని కోయంబత్తూరులో కొట్టె ఈశ్వరన్ ఆలయం ముందు కారులో సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనుమానిత ఉగ్రవాది జమేషా మబీన్ మరణించాడు. దీనిపై అక్టోబర్ 27న ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసింది. జమీజా ముబీన్ తన సహచరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఐసిస్‌తో కలిసి ఆలయ సముదాయాన్ని దెబ్బతియాలనే ఉద్ధేశంతో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అదే విధంగా 2022 నవంబర్ 19న కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తోపాటు ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్తున్న నిందితుడు మహ్మద్ షరీక్ కూడా గాయపడ్డాడు. ఈ కేసుపై డిసెంబర్లో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. పలు కేసుల్లో నిందితుడు షరీక్ రాష్టరాంష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్కు చెందిన అనుమానితుల కదలికలు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: IT Raids on BBC: బీబీసీపై ఐటీ సర్వే -
అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి బెంగళూరులో అరెస్టయ్యాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), బెంగళూరు పోలీసులు కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో థణిసంద్రలోని ఓఇంట్లో ఉన్న ఇతడిని అరెస్ట్ చేశారు. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న అరీఫ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో టెలీగ్రాం, డార్క్‌నెట్ ద్వారా సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిసింది. ఇతడి కదలికలపై ఎన్ఐఏ కొన్ని రోజులుగా నిఘా ఉంచింది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న ఆరీఫ్‌ను పట్టుకుని, ఒక లాప్టాప్, రెండు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13న బెంగళూరులోని ఇంటిని ఖాళీ చేసి యూపీకి వెళ్తున్నట్టు ఇతడు ఇంటి యజమానికి చెప్పాడని పోలీసులు వివరించారు. గత నవంబర్‌లో శివమొగ్గలో ఐఎస్ ప్రేరేపిత ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. -
కటకటాల నుంచి స్వేచ్ఛ
రెండేళ్లకుపైగా ఉత్తరప్రదేశ్ జైల్లో మగ్గిన కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్ బెయిల్ మంజూరై ఎట్టకేలకు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2020 అక్టోబర్‌లో దుండగుల అమానుషత్వానికి బలైపోయిన పందొమ్మిదేళ్ల దళిత యువతి భౌతికకాయాన్ని పోలీసులు ఆమె తల్లిదండ్రుల అభీష్టానికి విరుద్ధంగా తరలించుకుపోయి, తామే అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ప్రయత్ని స్తున్నారన్న సంగతి తెలిసి వెళ్తున్న కప్పన్‌ను యూపీ పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేశారు. పాత్రికేయ వృత్తిలో ఉండేవారికి ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. ఉద్యమకారులకూ, పోలీసు లకూ మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడైనా...అవినీతి, మాఫియా సామ్రాజ్యాల గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడైనా వారికి సమస్యలు ఎదురవుతుంటాయి. సిద్దిఖీ కప్పన్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు అంత్యక్రియల ప్రాంతానికి వెళ్లకుండా ఆయన్ను అడ్డుకోవడానికేనని అందరూ అనుకున్నారు. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. ఒక సాధారణ పాత్రికేయుడని అందరూ అనుకుంటున్న కప్పన్‌ను పోలీసులు ఉగ్రవాద సమర్థకుడిగా చిత్రిస్తూ వరస కేసులు పెట్టారు. అప్పటికింకా నిషేధానికి గురికాని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు సలహాదారుగా చిత్రించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)కింద కేసు పెట్టారు. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వీకరించింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా రంగంలోకొచ్చి నేరారోపణలు చేసింది. ఆయనతోపాటు మరో అయిదుగురు కూడా ఈ కేసులన్నిటా సహ నిందితులుగా ఉన్నారు. ఈ ఆరోపణలు ఏమేరకు నిలబడతాయో, కప్పన్, ఆయన సహచరులు నిర్దోషులుగా బయటికొస్తారో లేదో మున్ముందు తేలుతుంది. అయితే నిరుడు సెప్టెంబర్‌లో కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ లేవనెత్తిన ప్రశ్న కీలకమైనది. ‘ప్రతి పౌరుడికీ తన అభిప్రాయాలు వ్యక్తంచేసే స్వేచ్ఛ ఉంది. హథ్రాస్ బాధితురాలికి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటే అది చట్టం దృష్టిలో నేరమెలా అవుతుంది?’ అని ఆయన నిలదీశారు. అదుపులోనికి తీసుకున్న సమయంలో కప్పన్ వాహనం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్న కొన్ని కాగితాలు జస్టిస్ లలిత్‌కు అభ్యంతరకరమైనవిగా కనబడలేదు. అప్పటికే దీర్ఘకాలం జైల్లో ఉన్నందువల్ల, అరెస్టు చేసినప్పుడున్న పరిస్థితులను, ఈ కేసులోని ప్రత్యేకతలనూ పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించడానికి మరో నాలుగు నెలలు పట్టింది. ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ కేసు చిత్రమైనది. తన బ్యాంకు ఖాతా నుంచి సహ నిందితుడి ఖాతాకు కప్పన్ రూ. 5,000 బదిలీ చేయటం దీని సారాంశం. యూఏపీఏ కేసులో బెయిల్ లభించినవారు సమర్పించే పూచీకత్తులు సరిచూడటానికి 90 రోజులు తీసుకోవచ్చు గనుక కప్పన్ బయటికొచ్చేందుకు ఇంత సమయం పట్టింది. కప్పన్ ఒక్కరే కాదు... దేశంలో ఇదే మాదిరి యూఏపీఏ కేసుల్లో ఇరుక్కొని జైలుపాలైనవారు మరో అయిదుగురున్నారని నిరుడు డిసెంబర్లో పాత్రికేయుల పరిరక్షణ సంఘం(సీపీజే) తెలిపింది. మణిపూర్ పాత్రికేయుడు కిషోర్‌చంద్ర వాంఖెమ్ను 2019లో జాతీయ భద్రతా చట్టం(నాసా) కింద అరెస్టు చేశారు. నిజానికి కప్పన్ యూపీ నివాసి కాదు. ఆయన ఢిల్లీ కేంద్రంగా ఒక మలయాళ మీడియా సంస్థకు పనిచేస్తున్నారు. అందువల్ల కప్పన్పై యూపీ పోలీసులకైనా, అక్కడి రాజకీయ నాయకత్వానికైనా వ్యక్తిగత కక్ష ఉండే అవకాశం లేదు. మరైతే ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఎవరు కప్పన్పై కేసులు పెట్టడానికి పూనుకున్నట్టు? హథ్రాస్ అమానుషం చుట్టూ అలుముకున్న పరిస్థితులనూ, ఈ ఉదంతంవల్ల ప్రభుత్వానికి కలగబోయే అప్రదిష్టనూ పరిగణనలోకి తీసుకుని మీడియా కథనాలను నియంత్రించాలన్న లక్ష్యంతో, పాత్రికేయులను భయభ్రాంతుల్ని చేసే ఉద్దేశంతో యూపీ సర్కారు ఈ చర్యకు దిగిందని పాత్రికేయ సంఘాలు అప్పట్లో ఆరోపించాయి. ఈమాదిరి కేసులు విచారణకు రావాలంటే కింది స్థాయి కోర్టుల్లోనే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. ఈలోగా బెయిల్ కోసం ఉన్నత స్థాయి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సివస్తుంది. అక్కడ వెంటనే ఉపశమనం లభించటం సులభం కాదు. అప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షల కేసుల్లో ఇదొకటవుతుంది గనుక సహజంగానే జాప్యం చోటుచేసుకుంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ ప్రక్రియంతా నిందితులకూ, వారి కుటుంబాలకూ ఒక శిక్షలాంటిదే. ప్రస్తుత కేసుల్లో కప్పన్‌కు బెయిల్ రావటానికే 28 నెలలు పట్టింది. ఇక కేసు విచారణ పూర్తయి, తీర్పు వెలువడటానికి మరెన్నేళ్లు పడుతుందో? తీర్పు ప్రతికూలంగా వెలువడితే మళ్లీ జైలుకూ, ఆ తర్వాత అప్పీల్‌కూ పోవాలి. ఆ తర్వాత మళ్లీ బెయిల్, విచారణకు హాజరుకావడం షరా మామూలు. అడపా దడపా జరిగే ఉగ్రవాద ఘటనలను సాకుగా చూపి ప్రభుత్వాలు ఈ కఠినమైన చట్టాలు తీసుకొచ్చాయి. ఉన్న చట్టాలకు సవరణలద్వారా పదునుపెట్టాయి. చట్టసభల్లో చర్చ జరిగినప్పుడల్లా తమ చర్యలను గట్టిగా సమర్థించుకున్నాయి. దుర్వినియోగానికి ఆస్కారం లేనివిధంగా పకడ్బందీ నిబంధనలు చేర్చామని స్వోత్కర్షకు పోయాయి. సాధారణ పౌరులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేనేలేదని చెప్పాయి. ఆచరణలో మాత్రం జనం తరఫున ప్రశ్నిస్తున్న ఉద్యమకారులు, నిజాలను ధైర్యంగా వెలికితీసేందుకు ప్రయత్నించే పాత్రికేయులు ఈ చట్టాలకు బలైపోతున్నారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కనుక దీన్ని అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం తగిన ఆదేశాలివ్వాలి. -
గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు.. నిందితుడు ముర్తజాకు మరణశిక్ష
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయంలోకి చొరబడి కత్తితో భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీని దోషిగా తేల్చిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. అతనికి మరణశిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 121 ప్రకారం నిందితుడికి మరణశిక్ష విధించినట్లు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. పోలీస్ సిబ్బందిపై దాడి చేసినందుకు సెక్షన్ 307 ప్రకారం జీవిత ఖైదు కూడా విధించినట్లు పేర్కొన్నారు. కాగా దాదాపు తొమ్మిది నెలల క్రితం గతేడాది ఏప్రిల్‌లో గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికే చెందిన ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి.. ఆలయం వద్ద కత్తితో వీరంగం సృష్టించి.. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అక్కడే సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకోబోగా పదునైన కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో నిందితుడితోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఉగ్ర కుట్రలో భాగంగానే నిందితుడు ఆలయంలోకి ప్రవేశించి భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో తనకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)తో సంబంధాలున్నట్లు నిందితుడు అంగీకరించాడు. ఐసీసీ్ కోసం పోరాడుతున్నట్లు, ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అబ్బాసీని ఎన్ఐఏకోర్టు దోషిగా తేల్చింది. తాజాగా అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గోరఖ్‌పూర్ సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన అబ్బాసీ.. 2015లో ఐఐటీ ముంబయి నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. అయితే 2017 నుంచి అబ్బాసీ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చదవండి: ఫుట్‌పాత్‌పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్ -
ఆ దాడి వెనుక తెలంగాణ మావోలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా టార్రెమ్ పోలీస్‌స్టేషన్ పరిధి టేకల్ గుడియం సమీపంలో పోలీసులపై జరిగిన దాడి ఘటన వెనుక తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలే కీలకంగా వ్యవహరించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ ఘటనకు సూత్రధారులుగా 23మంది పేర్లను పేర్కొన్న ఎన్ఐఏ.. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చింది. 2021 ఏప్రిల్ 3న జరిగిన ఈ దాడి ఘటనలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్లకు చెందిన పోలీసులు 22మంది మృతి చెందగా, 35మందికిపైగా గాయపడ్డారు. సుమారు 21 నెలలపాటు విచా రణ జరిపిన ఎన్ఐఏ అధికారులు... దాడిలో 350 నుంచి 400 మంది వరకు సాయుధ మావోయి స్టులు పాల్గొన్నప్పటికీ కేసులో (ఆర్సీ–02/ 2021/ఎన్ఐఏ/ఆర్పీఆర్) 23మందిపైన చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. సంచలనం కలిగించిన తారెం ఘటన పోలీస్ సాయుధ బలగాలపై మెరుపుదాడి చేసిన ఆ ఘటన కేసును మొదట బీజాపూర్ జిల్లాలోని టార్రెమ్ పోలీస్‌స్టేషన్ ఎఫ్ఐఆర్ నం.06/2021 ప్రకారం నమోదు కాగా, తర్వాత ఎన్ఐఏ ద్వారా 2022 జూన్ 5వ తేదీన తిరిగి నమోదు చేశారు. భద్రతా దళాలు సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులపై బారెల్ గ్రెనేడ్ లాంచర్(బీజీఎల్)లు, ఆటోమేటిక్ ఆయుధాలతో కా ల్పులు జరిపి రాకేశ్వర్ సింగ్ మన్హాస్ అనే కోబ్రా జవాన్‌ను కూడా అపహరించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తెలంగాణ అగ్రనేతలే సూత్రధారులు... 21 నెలల విచారణ తర్వాత ఎన్ఐఏ తన దర్యా ప్తులో దాడి వెనుక సీపీఐ(మావోయిస్ట్) సీనియర్ నేతల పాత్ర ఉందని తేల్చింది. ఐపీసీలోని సెక్షన్లు– 120 రెడ్‌విత్/302 – 307, 396, 149, 121 మరియు 121ఎలతో పాటు భారతీయ ఆయుధ చట్టం, 1959లోని సెక్షన్లు– 25(1ఏ) – 27, ఈ చట్టం 1908లోని సెక్షన్ – 3, 4 – 6 మరియు సెక్షన్లు– 16, 18, 18ఏ, 20, యుఏ(పీ) చట్టం, 1967లోని 38ల కింద కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కమిటీ సలహాదారుడు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతితోపాటు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ గంగన్న, కేంద్ర నాయకులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, సుజాత అలియాస్ పోతుల కల్పన (మల్లోజుల కోటేశ్వర్రావు భార్య), ఉమ్మడి వరంగల్‌కు చెందిన సాగర్ అలియాస్ అన్నే సంతోష్, రఘు రెడ్డి అలియాస్ వికాస్, నిర్మల అలియాస్ నిర్మలక్కలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పొడియం హిద్మా అలియాస్ హిడ్మన్న, మద్నా అలియాస్ జగ్గు దాదాలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర, దండకారణ్యం, ఏరియా కమిటీలకు చెందిన 15 మంది పేర్లను ఎన్ఐఏ ప్రధానంగా పేర్కొంది. -
నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిజామాబాద్‌లో పీఎఫ్ఐపై నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. 11 మంది నిందితులపై నేరారోపణ మోపింది. నిందితులపై 120B, 132A, UA(p)17,18, 18A,18B సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. శిబిర నిర్వహికుడు అబ్దుల్ ఖాదర్‌తో పాటు మరో 10 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు ఎన్ఐఏ గుర్తించింది. భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలను పీఎఫ్ఐ చేస్తున్నట్లు ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పీఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్లు పేర్కొంది. పీఎఫ్ఐలో రిక్రూట్ అయిన తర్వాత ముస్లిం యువకులను యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిగినర్స్ కోర్సు ముసుగులో దాడులపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. కత్తి, కొడవలి, ఇనుప రాడ్ల తో ఎలా దాడులు చేయాలో శిక్షణలో నేర్పిస్తున్నట్లు గుర్తించింది. ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. సున్నిత ప్రాంతంలో ఏవిధంగా దాడులు చేయాలో పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని విచారించిన ఎన్ఐఏ.. పీఎఫ్ఐ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా.. ఇప్పటికే పీఎఫ్ఐ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. చదవండి: ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో సోలార్ పవర్! -
నార్కో టెర్రరిజం కేసులో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా తేవడం, వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఉగ్రవాదం వ్యాప్తికి వాడుతున్నారంటూ నమోదైన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో సోదాలు జరిపింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధమున్న గ్యాంగ్స్టర్ల నివాసాల్లోనూ సోమవారం దాడులు కొనసాగాయి. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులైన గ్యాంగ్స్టర్లు గోల్డీ బ్రార్, జగ్గూ భగ్‌వాన్‌పురియా ఇళ్లలో అధికారులు సోదా చేశారు. ఢిల్లీసహా 50 చోట్ల దాడులు చేసి ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారుల మధ్య ఏర్పడుతున్న కొత్త నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నంచేశామని ఒక ఎన్ఐఏ అధికారి చెప్పారు. దేశ, విదేశాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న గ్యాంగ్స్టర్లపై గత నెల 26లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఈ ముమ్మర సోదాలు జరిపింది. ఈ గ్యాంగ్స్టర్లలో కొందరు భారత్ నుంచి పారిపోయి కెనడా, పాకిస్తాన్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి నుంచే భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! -
ఉదయ్‌పూర్ టైలర్ హత్యకేసులో హైదరాబాద్‌కు లింకులు?
సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్‌లో షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో ఎన్ఐఏ మంగళవారం సోదాలు చేసింది. సంతోష్‌నగర్‌లో తావీద్ సెంటర్ నిర్వహిస్తున్న.. బిహార్‌కు చెందిన మహ్మద్ మున్వార్ హుస్సేన్ అశ్రఫి అనే వ్యక్తి అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ విచారించింది. ఈ నెల 14న జైపూర్‌లోని ఎన్ఐఏ ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. చదవండి: (ఉదయ్‌పూర్ హత్య కేసు.. మరో కీలక విషయం వెలుగులోకి..) -
పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా...
సాక్షి, హైదరాబాద్: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగానే కుట్ర సాగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో యూ పీవాసి ఇక్బాల్ ఖానా (ప్ర స్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ కుట్రను అమలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మేరకు గురువారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు హైదరాబాదీలతో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసింది. పేలుడుకు కుట్ర పన్నింది ఇలా... ► ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన మహ్మద్ నాసిర్ ఖాన్ హై దరాబాద్ మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉండేవాడు. అతని సోదరుడు ఇమ్రాన్ మాలిక్ స్వస్థలంలో ఉండేవాడు. ► ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా 1993 నుంచి నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నాడు. అతనిపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాక్‌కు పారిపోయి లాహోర్‌లో ఉంటున్నాడు. ► అక్కడి నుంచే ఐఎస్ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. లష్కరే తోయిబాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ► ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా ఇమ్రాన్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. స్థానిక పదార్థాలతో పేలుళ్లు జరపడం ఎలా? అని ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ యూ ట్యూబ్‌లోని కొన్ని వీడియోలు పంపాడు. ► గతంలో పాక్‌కు వెళ్లిన నాసిర్ అక్కడ ఉగ్రవాద శిక్షణ పూర్తి చేసి వచ్చాడు. బాంబుల తయారీ నుంచి గూఢచర్యం వరకు వివిధ అంశాల్లో అతను శిక్షణ పొందాడు. ► వేగంగా వెళ్లే రైళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించి భారీ ప్రాణనష్టం సృష్టించాలని ఇక్బాల్ చెప్పడంతో ఈ ఏడాది మేలో సిటీకి వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు సొంతంగా బాంబు తయారీ... దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టాలని నిర్ణయించుకొని చిక్కడపల్లి, హబీబ్నగర్లలోని దుకాణాల్లో కొన్న సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు తయారు చేశారు. ► గాజు సీసాలోకి ఈ పదార్థాలను ఇంజెక్షన్ సిరంజిల ద్వారా నింపి 16 గంటల్లో పేలి జరిగి మంటలు చెలరేగేలా కుట్రపన్నారు. ► ఈ ఏడాది జూన్ 15న రెడీమేడ్ వస్త్రాల పార్శిల్లో ఈ సీసాను ఉంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దర్భంగ వెళ్లే దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో దీన్ని బుక్ చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ పేలుడు ఆలస్యమైంది. 17న దర్భంగ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి పార్సిల్‌ను అన్లోడ్ చేశాక స్వల్ప పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. ► దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ... ఇక్బాల్ ఖానా, నాసిర్, ఇమ్రాన్లతోపాటు వారికి పరోక్షంగా సహకరించిన యూపీవాసులు హాజీ సలీం, ఖఫీల్ అహ్మద్‌లను అరెస్టు చేసింది. ► సికింద్రాబాద్ పార్శిల్ ఆఫీస్‌లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరు తో ఇచ్చిన పాన్ కార్డు కాపీనీ ఇక్బాలే వాట్సాప్ ద్వారా పంపాడని ఎన్ఐఏ గుర్తించింది. -
దర్బంగా పేలుడు కేసు మరో ఉగ్రవాదిని గుర్తించిన NIA
-
దర్భంగా పేలుడు కేసులో ఉగ్ర కుట్ర..!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈనెల 17న బీహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పార్సిల్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే హైదరాబాద్‌లో ఉంటున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. నిందితులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్ బిహార్ నుంచి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలు తరలించారు. ఈ క్రమంలో అధికారులు సికింద్రబాద్ స్టేషన్లో అన్నదమ్ముల సీసీఫుటేజ్‌ని సేకరించారు. వీరు ఈ నెల 15న సోఫియాన్ పేరు మీద పార్శిల్ బుక్ చేశారు. ఇక నిందితులు దర్భంగా రైలును పేల్చేయాలని కుట్ర పన్నారని.. తద్వారా భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలని భావించినట్లు అధికారులు తెలిపారు. అర్షద్ కోసం ఎన్ఐఏ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. అతడు దర్భంగా రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. దర్యాప్తులో ఈ దుస్తుల పార్సిల్ సికింద్రాబాద్‌లో బుక్ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ ఎన్ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్, యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. ఈ కేసులో రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్ హజీ సలీమ్ ఖాసీం, మహ్మద్ కాఫిల్ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారణ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది. చదవండి: ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా -
‘ప్రదీప్ శర్మకు నా భర్త కలెక్షన్ ఏజెంట్’
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం సృష్టించిన పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఎన్ఐఏ అధికారుల వద్దకు వచ్చి తన భర్త ప్రదీప్ శర్మకు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని తెలిపింది. గుంజన్ సింగ్(30) అనే మహిళ తన భర్త అనీల్ సింగ్ ప్రదీప్ శర్మకు సంబంధించిన అసాంఘిక కార్యకలపాల్లో పాలు పంచుకునేవాడని.. అతడికి కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని ఆరోపించింది. ఈ సందర్భంగా గుంజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లైన నాటి నుంచి నా భర్త తనకు పోలీసులతో మంచి సంబంధాలున్నాయని చెప్పి నన్ను పలుమార్లు బెదిరించాడు. పరంవీర్ సింగ్ కోసం పని చేసిన ప్రదీప్ శర్మ, బచ్చి సింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయనేవాడు. అంతేకాక వారికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలను నా భర్త చూసుకునేవాడు. ఓసారి ఏకంగా నా తలకు తుపాకీ గురి పెట్టి నన్ను బెదిరించాడు. పోలీసులతో అతడికి ఉన్న సంబంధాల వల్లే నా భర్త ఇంతకు తెగించి ఉంటాడని నేను భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇప్పటికే గుజన్ తన భర్త మీద ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకుని ఆరు గంటలపాటు విచారించింది. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
రూం నంబర్ 1964 వేదికగా సచిన్ వజే అక్రమాలు
ముంబై: ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం సృష్టించిన కేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వజేని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో వజే అక్రమాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలోని ఓ ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ గది వేదికగా చేసుకుని వజే తన దోపిడి కార్యకలపాలను కొనసాగిస్తున్నాడని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. పైగా దీని బిల్లును మరో వ్యాపారవేత్త చేత కట్టించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘సచిన్ వజే ముంబైలోని నారిమాన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్లో రూం నంబర్ 1964 వేదికగా తన కార్యకలపాలు కొనసాగిస్తున్నాడు. సుశాంత్ సదాశివ్ ఖమ్కర్ పేరు మీదుగా నకిలీ ఆధార్ కార్డుతో హోటల్లోకి చెక్ ఇన్ అవుతున్నట్లు తెలిసింది. ఈ రూమ్ కూడా ఓ వ్యాపారవేత్త పేరు మీద బుక్ అయ్యింది. దాదాపు 12 లక్షల రూపాయలు చెల్లించి 100 రోజుల కోసం సదరు వ్యాపారవేత్త ఈ గదిని బుక్ చేసుకున్నాడు. దీన్ని సచిన్ వజే వినియోగిస్తున్నాడు. సదరు బిజినెస్ మ్యాన్‌కు సచిన్ వజే గతంలో ఓ వివాదంలో సాయం చేశాడు. అందుకు ప్రతిఫలంగా అతడు ఈ గదిని బుక్ చేశాడు’’ అని తెలిపారు. ‘‘వజే చివరగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇన్నోవాలో వచ్చి హోటల్లో చెక్ ఇన్ అయ్యాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న ల్యాండ్ క్రూయిజర్‌లో వెళ్లాడు. ప్రస్తుతం ఈ రెండు వాహనాలను కూడా సీజ్ చేశాం. వజే కార్యకలాపాల గురించి డిపార్ట్మెంట్లో అందరికి తెలుసు. దీనికి సంబంధించి మా దగ్గర ఆధారులున్నాయి. ప్రస్తుతం డిప్యూటి కమిషనర్ హోదా వరకు ఓ 35 మందిని ప్రశ్నించాము. కొందరి స్టేట్మెంట్స్ రికార్డు చేశాం.. కొందరివి మౌఖికంగా విన్నాం. త్వరలోనే సచిన్ వజే సహచరులను కొందరిని అరెస్ట్ చేస్తాం’’ అని ఎన్ఐఏ అధికారి తెలిపారు. ప్రారంభంలో అంబాని ఇంటి వద్ద బాంబు-బెదిరింపు కేసును విచారించిన సచిన్ వజే ఇప్పుడు హిరాన్ కేసులో ప్రధాన నిందితుడు. ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తులో భాగంగా దక్షిణ ముంబైలోని మరో హోటల్, ఒక క్లబ్, పొరుగున ఉన్న థానేలోని ఒక ఫ్లాట్‌లో గురువారం సోదాలు చేసింది. ఎన్ఐఏ అధికారులు వజే మహిళా సహచరుడిని విమానాశ్రయం నుంచి అదుపులోకి తీసుకుంది. ఈ రెండు కేసులకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ హోదా వరకు 35 మంది అధికారులను ఎన్ఐఏ విచారించింది. చదవండి: ఆ పేలుడు పదార్దాలు తెచ్చింది వాజేనే! -
ఆ పేలుడు పదార్దాలు తెచ్చింది వాజేనే!
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలోని ఒక వాహనంలో కనుగొన్న జిలటెన్ స్టిక్స్‌ను పోలీసు అధికారి సచిన్ వాజేనే సమీకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే ఆ పేలుడు పదార్థాలను వాజే ఎక్కడనుంచి సంపాదించారన్నది చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. అంతే కాకుండా వాజే, అతని డ్రైవర్ కలిసి సదరు ఎస్‌యూవీని అంబానీ ఇంటివద్ద పార్క్ చేసినట్లు సైతం కనుగొన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. స్పాట్లో వాజే ఉన్నట్లు చూపే సీసీటీవీ ఫుటేజ్ లభించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటికి సమీపాన కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మార్చి 13న అరెస్టు, సస్పెన్షన్‌కు గురైన పోలీసు అధికారి వాజే, ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. విచారణలో భాగంగా ముంబై పోలీసు కమిషనర్ ఆఫీసు కాంపౌండ్ సీసీటీవీ ఫుటేజ్‌ను సైతం ఎన్ఐఏ సేకరించనుంది. దీని ద్వారా వాజే కదలికలు మరింతగా తెలుస్తాయని ఎన్ఐఏ భావిస్తోంది. కమిషనర్ ఆఫీసు సీసీటీవీ ఫుటేజ్‌ని, డీవీఆర్‌లను ధ్వంసం చేయడానికి యత్నాలు జరిగినా, సింహభాగం ఫుటేజ్ సురక్షితంగానే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ధ్వంసంలో వాజే పాత్రపై ఎన్ఐఏ ఆరా తీయనుంది. ఇప్పటికే సాకేత్ సొసైటీ సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్‌లను ధ్వంసం చేయడానికి వాజే యత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఆదివారం మిథి నది నుంచి ఎన్ఐఏ ఒక ల్యాప్‌టాప్, ప్రింటర్, రెండు హార్డ్ డిస్కులు, రెండు నెంబర్ప్లేట్లు, రెండు డీవీఆర్స్, రెండు సీపీయూల్లాంటి కీలకమైన ఆధారాలను సేకరించింది. ఇన్నోవా నడిపింది కూడా అతనే పేలుడు పదార్ధాలున్న స్కార్పియోకు తోడుగా వచ్చిన ఇన్నోవాను సచిన్ వాజేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. స్కార్పియోను వాజే డ్రైవర్ నడుపుతూ తెచ్చి ఉంటాడని తెలిపాయి. ఈ కేసులో ఎన్ఐఏ విచారణకు ముందు ఏటీఎస్ విచారణ జరిపింది. అయితే వాజే పేరు ఇందులో రావడంతో ఆయన సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడవచ్చని ఏటీఎస్ భావించింది. దీంతో వాజే కదలికలపై నిఘా పెట్టిందని అధికారులు వివరించారు. ఈ నిఘా ఆపరేషన్ ఏటీఎస్ డీఐజీ శివ్‌దీప్ లాండే నేతృత్వంలో జరిగింది. నిఘా కారణంగానే ఇన్నోవా ఇప్పటికీ సురక్షితంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక పేలుడు పదార్ధాలున్న స్కార్పియో, అంబానీ ఇంటి వద్ద నిలపడానికి ముందు ఫిబ్రవరి 19-21 మధ్య కమిషనర్ ఆఫీసులోఉంది. ఫిబ్రవరి 17న దాని ఓనర్ హిరేన్ స్కార్పియోను ములంద్ బ్రిడ్జి వద్ద వదిలి మర్నాడు తన బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని పోలీసులు కనుగొన్న తర్వాత 19 తారీఖున కమిషనర్ ఆఫీసుకు తెచ్చారు. అనంతరం 21న హౌసింగ్ సొసైటీకి, 24న అంబానీ ఇంటివద్దకు వాజే తరలించారని పోలీసు వర్గాలు తెలిపాయి. చదవండి: వాజే టార్గెట్ వంద కోట్లు -
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఆకస్మిక తనిఖీలు
-
సీబీఐ, ఈడీ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు: సుప్రీం
న్యూఢిల్లీ: విచారణ జరిపే, అరెస్ట్ చేసే అధికారాలున్న సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ తదితర అన్ని దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతీ పోలీస్ స్టేషన్‌లోని ప్రధాన ద్వారం, లోపలికి, బయటకు వెళ్లే మార్గాలు, ఇంటరాగేషన్ సెల్స్, లాకప్ గదులు, కారిడార్లు, రిసెప్షన్ ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మానవ హక్కుల ఉల్లంఘనలను నియంత్రించేందుకు పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దావూద్ ప్రమేయంపై ఎన్ఐఏ కూపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం ముఠా ప్రమేయం ఉండచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు వివరించింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని జాతి వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించాయని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వరాదని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది. నిందితులకు ఉన్నతస్ధాయి దౌత్య వర్గాలతో ఉన్న సంబంధాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎన్ఐ ప్రత్యేక న్యాయస్దానానికి నివేదించింది. నిందితుల్లో ఒకరైన రమీస్ తాను టాంజానియాలో డైమండ్ వ్యాపారం చేస్తానని, ఆ బంగారాన్ని తాను దుబాయ్‌లో విక్రయించానని తెలిపాడని ఎన్ఐఎ వివరించింది. దావూద్ ఇబ్రహీంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ దావూద్ ఇబ్రహీం ఆగడాలపై వెల్లడించిన వివరాలతో పాటు ఆఫ్రికాలో దావూద్ ముఠా కార్యకలాపాలపై అమెరికా ట్రెజరీ విభాగం ప్రచురించిన ఫ్యాక్ట్ షీట్ వివరాలను ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్ధానానికి వివరించింది. చదవండి : లేటు వయసులో దావూద్ ఘాటు ప్రేమ! -
మంచిర్యాలలో ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు
సాక్షి, మంచిర్యాల : ఒక మహిళ మావోయిస్టుకు చికిత్స కోసం వస్తే.. స్పందించి వైద్యం చేయడంతో సదరు డాక్టర్ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. మంచిర్యాల బస్టాండ్‌కు సమీపంలోని రిటైర్డు ప్రభుత్వ డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో శుక్రవారం ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు చేపట్టింది. నిన్న మధ్యాహ్నం దాదాపుగా 7 గంటలు పాటు సోదాలు నిర్వహించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో భాగంగా రిటైర్డ్ డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో నుంచి రెండు ఫోన్లు, హార్డ్ డిస్క్, విప్లవ సాహిత్యం పుస్తకాన్ని సీజ్ చేసి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ మావోయిస్టుకు వైద్యం అందించినట్లు ఆధారాలు ఉన్న కారణంగానే సోదాలు చేసినట్లు సదరు వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... 'కొద్దిరోజుల క్రితం తన వద్దకు నిర్మల అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వస్తే వైద్యం చేశాను. ఆమె ఇటీవల పోలీసులకు లొంగిపోవడంతో.. ఆమె పేరు నర్మద అలియాస్ నిర్మల అని తెలిసింది. ఆమె నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు ఇంట్లో సోదాలు చేసి.. నా నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యుడిగా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో విధులు నిర్వర్తించి, మంచి పేరు తెచ్చుకున్నందుకే మావోయిస్టు సానుభూతిపరుడిగా భావించి సోదాలు చేశారు. గతంలో ఎప్పుడో బుక్ ఎగ్జిబిషన్లో కొనుగోలు చేసిన ఒక పుస్తకం, సీడీ, ఓ పాత న్యూస్ పేపర్లోని వార్తల కారణంగా అనుమానించి ప్రశ్నించారు. అంతేకాక వాటితో పాటు రెండు ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లారు' అని అన్నారు. -
‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్ చదువుకుంటే మంచిది’
న్యూఢిల్లీ: భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. విదేశాలకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్ఐఏకి ఈ బిల్లు అధికారం ఇస్తోంది. (చదవండి : ఎన్ఐఏకి కోరలు) ఇక ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు. ఆ మాటకు హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. ఈ మాటల అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సభ నుంచి బయటికొచ్చిన అనంతరం ఓవైసీ ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని జాతివ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. జాతీయవాదులు, జాతివ్యతిరేకులు అని తేల్చేందుకు బీజేపీ దుకాణమేదైనా షురూ చేసిందా. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడేక్రమంలో హోమంత్రి అమిత్‌షా మావైపు వేలు చూపించి బెదిరించేయత్నం చేశారు. ఆయన కేవలం హోంమంత్రి మాత్రమే. దేవుడు కాదు. సభలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడినికి ఆయన నిబంధనలు చదువుకుంటే మంచిది’అన్నారు. -
‘ప్రజ్ఞ పోటీ చేయకుండా నిషేధించలేం’
ముంబై: భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలంటూ వచ్చిన పిటిషన్‌ను ముంబైలోని ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ఆ అధికారం తమకు లేదనీ, ఎన్నికల అధికారులే ఆ పని చేయగలరంది. మాలేగావ్ పేలుళ్లలో తన కొడుకును కోల్పోయిన నిసార్ సయ్యద్ ఈ పిటిషన్ వేశారు. ఈ పేలుళ్ల సూత్రధారి ప్రజ్ఞా సింగేననే ఆరోపణలు ఉన్నందున ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఆయన కోరారు. ఆమెకు మంజూరయిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలన్నారు. ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి వీఎస్ పడాల్కర్ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ‘మాకు అలాంటి అధికారం లేదు. ఎన్నికల్లో పోటీచేయకుండా మేం ఎవ్వరిపైనా నిషేధం విధించలేం’ అని పేర్కొన్నారు. -
‘సంఝౌతా’లో అసిమానంద్ నిర్దోషి
పంచకుల: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2007 నాటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో హరియాణాలోని పంచకులలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి జగ్దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసులో పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలని రహీలా వకీల్ అనే పాక్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు పంపిన నోటీసులు తమకు అందలేదని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము భారత్‌కు రాకుండా అధికారులు వీసాలు నిరాకరించారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని ఎన్ఐఏ న్యాయవాది రాజన్ మల్హోత్రా ఖండించారు.ఈ కేసులో అసిమానంద్ ఇప్పటికే బెయిల్‌పై బయట ఉండగా, మిగతా ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. అసలేం జరిగింది? ఢిల్లీ నుంచి లాహోర్‌కు వెళుతున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 2007, ఫిబ్రవరి 18న రాత్రి 11.53 గంటలకు హరియాణాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ను దాటగానే శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్ పౌరులే. అక్షర్ధామ్(గుజరాత్), సంకట్మోచన్ మందిర్(వారణాసి), రఘునాథ్ మందిర్(జమ్మూ) సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు ప్రతీకారంగానే నిందితులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిపారని ఎన్ఐఏ చార్జిషీట్లో తెలిపింది. భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు ఈ ఉగ్రదాడిలో చాలామంది పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారనీ, దోషులను శిక్షించేందుకు భారత విచారణ సంస్థలు సరైనరీతిలో పనిచేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాకు సమన్లు జారీచేసి నిరసన తెలిపింది. మతవిద్వేషానికి కేరాఫ్ అసిమానంద్ పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా కమర్పకూర్‌లో స్వామి అసిమానంద్ జన్మించాడు. పాఠశాల స్థాయిలోనే హిందుత్వ సంస్థ పట్ల ఆకర్షితులయ్యాడు. 1971 సైన్స్ విభాగంలో డిగ్రీ చేశాక వన్‌వాసీ కల్యాణ్ ఆశ్రమంలో సేవకుడిగా చేరాడు. క్రైస్తవ మిషనరీలకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలివ్వడలో దిట్ట. 1990ల్లో గుజరాత్‌లోని దంగ్ జిల్లాలో శబరి ధామ్ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని మక్కా మసీదు, మహారాష్ట్రలోని మాలేగావ్, రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో అసిమానంద్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ మూడు కేసుల్లోనూ అసిమానంద్ నిర్దోషిగా తేలారు. -
శ్రీనివాస్‌కు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు రిమాండ్ పొడిగించింది. శ్రీనివాస్ తరఫున న్యాయవాది సలీం బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 26కు వాయిదా వేసింది. నిందితుడి రిమాండ్‌ను మార్చి 8 వరకు పొడిగించింది. -
బయటపడుతున్న సిట్ విచారణలో డొల్లతనం
-
నక్సల్స్ మనీలాండరింగ్‌పై ఎన్ఐఏ నిఘా
న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడే మావోయిస్టు నేతలు, వారి సానుభూతిపరులపై జాతీయ పరిశోధన సంస్థ(ఎన్ఐఏ)దృష్టి సారించింది. వీరి కార్యకలాపాలపై విచారణకు గాను ఎన్ఐఏలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ ఇటీవల ఇందుకు ఆమోదం తెలిపింది. జార్ఖండ్ మావోయిస్టు నేత సందీప్ యాదవ్‌కు చెందిన రూ.86 లక్షల ఆస్తులను గత ఫిబ్రవరిలో ఈడీ అటాచ్ చేసింది. బిహార్‌కు చెందిన ప్రద్యుమ్న శర్మ, ప్రమోద్‌శర్మ అనే సీనియర్ మావోయిస్టు నేతలకు చెందిన సుమారు రూ.68 ఆస్తులను కూడా మనీలాండరింగ్ కేసులో అటాచ్ చేసిన నేపథ్యంలో ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. -
ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వారికి న్యాయ సహాయం
- వారు అమాయకులు: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ - మతతత్వ అజెండాతోనే ముస్లింలపై వేధింపులు - ముస్లిం యువత డబ్బు, ప్రలోభాలకు లొంగొద్దు - దేశానికి సేవ చేసేందుకు వారు ముందుకు రావాలి - ఐసిస్ అనేది సైతాన్ అక్రమ సంతానమని వ్యాఖ్య హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన యువకులు అమాయకులని, వారికి తమ పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి టోలిచౌకి మహ్మది లై న్స్‌లోని మహ్మదీయ జామా మసీదులో జరిగిన షబే ఖదర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ.. గతంలో కూడా ఎందరో హైదరాబాద్ ముస్లిం యువకులను పోలీసులు అక్రమ కేసుల్లో ఇరికించారని, అయితే అల్లా దయ వల్ల వారిని కోర్టులు నిర్దోషులుగా ప్రకటించాయని చెప్పారు. ఈసారి కూడా పోలీసులకు పట్టుబడ్డ యువకులు నిర్దోషులని తాము నమ్ముతున్నామని, గత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయ సహా యం అందించేందుకు నిర్ణయించామని తెలిపారు. కేం ద్రం మతతత్వ అజెండాను అమలుపరుస్తోందని, ఇందులో భాగంగానే ముస్లింలను వేధిస్తున్నారని ఆరోపించారు. బీఫ్ పేరిట పాలక పార్టీ నాయకులు, పోలీసులు ముస్లిం యువకులను వేధిస్తున్నారని, హరియాణాలో బీఫ్ రవాణా చేస్తున్నారని ఇద్దరు ముస్లిం యువకులను పోలీసులు అక్రమ కేసులో అరెస్ట్ చేసి చితకబాదారని చెప్పారు. ఐసిస్ అనేది సైతాన్ అక్రమ సంతానమని అసద్ వ్యాఖ్యానించారు. ఐసిస్ ఉచ్చులో చిక్కుకుని కొందరు విధ్వంసం సృష్టిస్తున్నారని, రక్తపాతం అనేది ఇస్లాంలో లేదన్న విషయం ఖురాన్లో స్పష్టంగా ఉందని చెప్పారు. ముస్లింల రక్షకుడు అల్లా ఒక్కడే అని, ముస్లిం యువకులు డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా దేశానికి సేవ చేయాలని సూచించారు. చదువుకున్న ముస్లిం యువకులు వక్రమార్గాల వైపు పయనించకుండా పేద ముస్లింలకు సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, మసీద్ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.