![NIA Announces Rs 10 Lakh Reward For Information On Bengaluru - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/7/rameshwaram.jpg.webp?itok=C7rYwd9k)
ప్రకటించిన జాతీయ దర్యాప్తు సంస్థ
న్యూఢిల్లీ: బెంగళూరులో మార్చి ఒకటో తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడి సమాచారం అందిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బుధవారం ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేసింది. కేఫ్‌లోకి అడుగుపెట్టేటపుడు ఆ వ్యక్తి క్యాప్, మాస్‌్క, కళ్లద్దాలు ధరించి ఉన్నాడని ఎన్‌ఐఏ పేర్కొంది. నిందితుడు జాడ తెలిపిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎన్‌ఐఏ హామీ ఇచి్చంది.
ఈస్ట్ బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. శక్తివంత పేలుడు పదార్ధం(ఐఈడీ) వాడటంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగించడం తెల్సిందే. మొదట కర్ణాటక పోలీసులు కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, పేలుడు పదార్ధాల చట్టాల కింద కేసు నమోదుచేశారు. ముంబైలో నవంబర్ 26న ఉగ్రదాడి తర్వాత ప్రత్యేకంగా ఉగ్రసంబంధ ఘటనలపై దర్యాప్తు కోసం ఎన్‌ఐఏను 2008లో ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment