Watch Video:బెంగళూర్‌ కేఫ్‌లో పేలిన టైం బాంబ్‌ | Bengaluru Blast At Rameshwaram Cafe - Sakshi
Sakshi News home page

Watch Video:బెంగళూర్‌ రామేశ్వరం కేఫ్‌లో పేలిన టైం బాంబ్‌

Published Fri, Mar 1 2024 2:27 PM | Last Updated on Fri, Mar 1 2024 8:08 PM

Bengaluru Blast at Rameshwaram Cafe Updates - Sakshi

సాక్షి, బెంగళూరు: నగరంలో సంభవించిన భారీ పేలుడు.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్‌ రామేశ్వరం కేఫ్‌ వద్ద టైం బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్‌ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. టిఫిన్‌ బాక్స్‌లో ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. 

తొలుత బ్లాస్ట్‌కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ టీం సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్‌లో సిలిండర్లు డ్యామేజ్‌ కాలేదని గుర్తించింది. అదే సమయంలో.. బోల్ట్‌లు, నట్లు, ఎలక్ట్రిక్‌ వైర్లను.. వాచ్‌ను(టైం బాంబ్‌ కోసం ఉపయోగించేది) గుర్తించింది.  మరోవైపు రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది.

సీసీఫుటేజీ ఆధారంగా ఉదయం 11 గం. ప్రాంతంలో కేఫ్‌లోని సింక్‌ వద్ద ఓ ఆగంతకుడు బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాక.. 12గం.46ని. సమయంలో బాంబు పేలింది. ఆ బ్యాగ్‌లోని టిఫిన్‌ బాక్స్‌లోని బాంబ్‌ పేలుడుకు కారణమని.. ఇది ఉగ్రదాడే అయ్యి ఉంటుందని  ఎన్‌ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది.

ఏం జరిగిందంటే..
రామేశ్వరం కేఫ్‌కు నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది కస్టమర్లు వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మొత్తం తొమ్మిది మందిని బ్రూక్‌ఫీల్డ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. అందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్‌ మోహన్‌ చెప్పారు. 

అంతకు ముందు..
‘‘సిలిండర్‌ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్‌ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్‌ ఫైర్‌ స్టేషన్‌ అధికారి చెప్పారు.

ఇదీ చదవండి: కలాం స్ఫూర్తి.. రామేశ్వరం కేఫ్‌ నెల బిజినెస్‌ 4 కోట్లపైనే!

ఇదిలా ఉంటే.. రామేశ్వరం కేఫ్‌ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో తాను మాట్లాడానని.. పేలుడు గురించి ఆరా తీశానని బీజేపీ నేత, ఎంపీ తేజస్వి యాదవ్‌ ట్వీట్‌ చేశారు. ఇది సిలిండర్‌ బ్లాస్ట్‌ కాదని.. కస్టమర్‌ ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్‌ వల్లే పేలుడు జరిగిందని.. ఇది ముమ్మాటికే బాంబు పేలుడంటూ పోస్ట్‌ చేశారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement