Rameshwaram
-
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్‌కు ఫుడ్ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. -
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: NIA ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు!
న్యూఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఛార్జిషీట్ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది.ఐసిస్ అల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్ హుస్సేన్ షాబీబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మజ్ మునీర్, ముజామిల్ షరీఫ్‌లు ఈ కేసులో నిందితులు. వీళ్లపై ఐపీసీ సెక్షన్లు, యూఏపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. .. వీళ్లు నలుగురు డార్క్ వెబ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిసి ఈ నలుగురు భారీ కుట్ర పన్నారు. మార్చి 1వ తేదీన బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో దాడి జరిగింది. మార్చి 3వ తేదీన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. షాజీబ్ అనే వ్యక్తి కేఫ్‌లో బాంబ్ పెట్టాడు. తాహా, షాబీజ్ ఇద్దరూ శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్లు. NIA Chargesheets 4 in Rameshwaram Cafe Blast Case pic.twitter.com/BnEBy29Khp— IANS (@ians_india) September 9, 2024 2020లో అల్ హింద్ ఉగ్రసంస్థ మూలాలు బయటపడగానే.. వీళ్లు పరారయ్యారు. వీళ్లు ఉగ్ర మూలాలు ఉన్న మరో ఇద్దరు నిందితులతో డార్క్ వెబ్‌లో జత చేరారు. టెలిగ్రామ్ ద్వారా వీళ్ల మధ్య సంభాషణలు జరిగాయి. క్రిఫ్టో కరెన్సీలతో వీళ్ల లావాదేవీలు సాగాయి. ఆ డబ్బుతో బెంగళూరులో మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలనుకున్నారు. అయితే..అయోధ్య ప్రాణప్రతిష్ట రోజున( జనవరి 22, 2024) బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై బాంబు దాడి చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కానీ, అది ఫలించలేదు. దీంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని ఎన్ఐఏ తెలిపింది. -
తమిళనాడు ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు
చెన్నై: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనను తమిళనాడు ప్రజలతో ముడిపెడుతూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.అయితే.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దీంతో కేంద్ర మంత్రిపై మధురైలో కేసు నమోదు అయింది. తాజగా ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ జీ. జయచంద్రన్ సెప్టెంబర్ 5 తేదీకి వాయిదా వేశారు. -
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
బెంగళూరు: సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో మంగళవారం(మే21) ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించింది. కేసులో కొందరు అనుమానితులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.రాత్రి వరకు దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో విచారణను ఎన్ఐఏ మార్చి3వ తేదీన ప్రారంభించింది. ఏప్రిల్ 12న పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ అహ్మద్, బాంబు పెట్టిన వ్యక్తిగా భావిస్తున్న ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. -
తమిళులకు కేంద్రమంత్రి క్షమాపణలు
సాక్షి, చెన్నై: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడి ప్రాంతం గురించి శోభా కరంద్లాజే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదం కావడంతో తమిళులుకు ఆమె క్షమాపణలు చెప్తూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ‘సోదరులు, సోదరీమణులకు నా క్షమాపణ. కృష్ణగిరి అడవుల్లో శిక్షణ పొంది, రామేశ్వరం కేఫ్ పేలుడుతో ముడిపడి ఉన్న నిందితుడి గురించే మాట్లాడాను. అయినప్పటికీ నా మాటలు మీకు బాధ కలిగించాయని నేను భావిస్తున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని కరంద్లాజే ఎక్స్.కామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. To my Tamil brothers & sisters, I wish to clarify that my words were meant to shine light, not cast shadows. Yet I see that my remarks brought pain to some - and for that, I apologize. My remarks were solely directed towards those trained in the Krishnagiri forest, 1/2 — Shobha Karandlaje (Modi Ka Parivar) (@ShobhaBJP) March 19, 2024 కరంద్లాజే గతంలో ఏం వ్యాఖ్యలు చేశారంటే? రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ విచారణలో తేలింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై బీజేపీ మహిళా నేత, కేంద్రమంత్రి కరంద్లాజే విమర్శలు చేశారు. సీఎం సంఘ విద్రోహ కార్యకాలపాల్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పలు సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. శోభా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎలాంటి అధికారం లేదు ‘శోభా మీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చర్యలు తీసుకోవాలి. అలాంటి వాదనలు చేసేందుకు మీకు ఎలాంటి అధికారం లేదని అన్నారు. శోభాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరుణంలో శోభా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టడంపై వివాదం సద్దు మణిగింది. -
బెంగళూర్ కేఫ్ పేలుడుతో జగిత్యాలకు లింక్?
సాక్షి, బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో.. తెలంగాణ జిల్లా జగిత్యాలకు సంబంధం ఉందా?.. తాజా అరెస్టుతో ఆ దిశగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ NIA మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే అతని స్వస్థలం జగిత్యాల కావడం.. పైగా అతనొక మోస్ట్ వాంటెడ్ కావడంతోకీ అంశం తెర మీదకు వచ్చింది.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో.. నిషేధిత పీఎఫ్ఐ కీలక సభ్యుడు సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అతన్ని ఎన్ఐఏ వైఎస్సార్ జిల్లా(ఏపీ) మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసింది. బెంగళూరు పేలుడు కేసులో.. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సలీం స్వస్థలం జగిత్యాల కేంద్రంలోని ఇస్లాంపురా. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని.. NIA సెర్చ్ టీం మైదుకూరులో అదుపులోకి తీసుకుంది. రామేశ్వరం కెఫ్ బాంబు పేలుడులో.. ఇతని హస్తమున్నట్టు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సలీంతో పాటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్, నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి కోసం ఇప్పుడు ఎన్ఐఏ టీంలు గాలింపు చేపట్టాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఉగ్రమూలాలకు కేరాఫ్‌గా జగిత్యాల పేరు పలుమార్లు వినిపించింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసు లింకుతో మరోసారి జగిత్యాల్లో ఉగ్రమూలాలపై చర్చ నడుస్తోంది. గతంలో జగిత్యాలతో పాటు కరీంనగర, నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బెంగళూరు పేలుడు కేసు.. NIA కీలక ప్రకటన
ఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) శనివారం కీలక ప్రకటన చేసింది. అనుమానితుడి కొత్త ఫొటోలను విడుదల చేసి.. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరింది. ఇందుకుగానూ రూ.10 లక్షల రివార్డు కూడా ఉంటుందని ఫోన్ నెంబర్లు, మెయిల్ అడ్రస్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మార్చి 1వ తేదీ మధ్యాహ్నాం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. బస్సులో వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌ను కేఫ్‌లో వదిలివెళ్లడం.. కాసేపటికే అది పేలడం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఫుటేజీల ఆధారంగా అనుమానితుడి కదలికలను దర్యాప్తు బృందం పరిశీలించింది. అయితే.. ఆ రోజు రాత్రి సమయంలో బళ్లారి బస్టాండ్‌లో అనుమానితుడు సంచరించినట్లుగా పేర్కొంటూ ఓ ఫుటేజీని నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. ఘటన తర్వాత.. తుమకూరు, బళ్లారి, బీదర్, భట్కల్.. ఇలా బస్సులు ప్రాంతాలు మారుతూ.. మధ్యలో దుస్తులు మార్చుకుంటూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. చివరకు అతను పుణే వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైనంత త్వరలో అతన్ని పట్టుకుని తీరతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే తమకు తెలియజేయాలని ఎన్ఐఏ ప్రజల్ని కోరుతోంది. పేలుడు జరిగిన రెండ్రోజులకు.. అంటే మార్చి 3వ తేదీన రామేశ్వరం బ్లాస్ట్ కేసులోకి యాంటీ-టెర్రర్ ఏజెన్సీ NIA దిగింది. ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. రెండేళ్ల కిందటి బళ్లారి బాంబు పేలుడుతో పోలికలు ఉండేసరికి.. ఆ పేలుడుకు కారణమైన నిందితుడ్ని జైల్లోనే అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఇక మరోవైపు బెంగళూరులో స్కూళ్లకు బాంబు బెదిరింపులకు సంబంధించిన కేసుల్ని సైతం పరిశీలిస్తోంది. అంతేకాదు.. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న ఓ గ్రూప్‌ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇక.. ఇప్పుడు రామేశ్వరం కేఫ్‌లో అనుమానితుడి చిత్రాలు విడుదల చేసి.. ఆచూకీ తెలిపిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచడంతో పాటు పది లక్షల రివార్డు సైతం ప్రకటించింది ఎన్ఐఏ. NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase. 📞 Call 08029510900, 8904241100 or email to info.blr.nia@gov.in with any information. Your identity will remain confidential. #BengaluruCafeBlast pic.twitter.com/ISTXBZrwDK — NIA India (@NIA_India) March 9, 2024 -
పటిష్ట భద్రత మధ్య తెరుచుకున్న రామేశ్వరం కేఫ్
కర్నాటకలోని బెంగళూరులో గల రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగి వారం రోజులు దాటింది. తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య రామేశ్వరం కేఫ్‌ను తిరిగి తెరిచారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేఫ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. కేఫ్‌ను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెరిచారు. అయితే శనివారం నుంచి వినియోగదారులకు సేవలు అందించనున్నారు. కస్టమర్లను తనిఖీ చేయడానికి కేఫ్ ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల అనుమానాస్పద కార్యకలాపాలపై కేఫ్ సిబ్బంది దృష్టి సారించనున్నారు. రామేశ్వరం కేఫ్ సహ వ్యవస్థాపకులు రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ‘ఏదైతే జరగకూడదని భావించామో అదే జరిగింది. మరింత భద్రతతో ఉండేందుకు ఇదొక పాఠం. శివుని ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భంగా మా కేఫ్‌ను తిరిగి ప్రారంభించాం. శనివారం జాతీయ గీతం ప్లే చేస్తూ రెస్టారెంట్‌ను కస్టమర్ల కోసం తెరుస్తాం’ అని తెలిపారు. కాగా కేఫ్‌ను పూలతో అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. #WATCH | Bengaluru, Karnataka: Checking of the customers being done at the Rameshwaram cafe. The cafe has reopened for people, 8 days after the blast. pic.twitter.com/kwclTU4ksE — ANI (@ANI) March 9, 2024 -
Rameshwaram Cafe Bomb Blast: యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్ కాల్
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నుంచి ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సినీ ఫక్కీలో తృటిలో తప్పించుకున్నాడు. శుక్రవారం(మార్చ్ 1)మధ్యాహ్నం ఒంటిగంటకు పేలుడు జరిగిన సమయంలో బిహార్‌కు చెందిన టెకీ కుమార్ అలంకృత్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ చేస్తున్నాడు. పేలుడు జరడానికి కొద్ది క్షణాల ముందు అలంకృత్‌కు అతడి తల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడటం కోసం అలంకృత్ కేఫ్ బయటికి వచ్చాడు. ఇంతలో కేఫ్ లోపల పేలుడు జరిగింది. ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. ఘటన తర్వాత అలంకృత్ మాట్లాడుతూ‘నేను లంచ్ కోసం కేఫ్‌కు వచ్చాను. ఇడ్లీ తినడం పూర్తి చేసి దోశ తినడం స్టార్ట్ చేద్దామనుకునే లోపు మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ పట్టుకుని బయటికి వెళ్లాను. ఇంతలో పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలిందేమో అని మొదట అనుకున్నాను. ఎలా ఉన్నావు. తిన్నావా.. లేదా అని అడగడానికి మా అమ్మ ఫోన్ చేసింది. అమ్మ నుంచి ఫోన్ రాకపోయి ఉంటే నేను ఉండేవాడిని కాదు’అని అలంకృత్ చెప్పాడు. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌లో కీలకంగా ఏఐ -
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో కీలకంగా AI
బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తన పరిశీలనాంతరం ఇది ఉగ్రదాడిగా భావిస్తుండగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైతం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీనే ఈ కేసు మొత్తానికి కీలకంగా మారింది. బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి.. ప్రధాన అనుమానితుడి ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. ఆ నిందితుడి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐఈడీ(Intensive Explosive Device)ను బ్యాగ్‌లో తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ముసుగు తొలగించి.. ఇందుకోసం భద్రతా సంస్థలు ఏఐ(Artificial Intelligence) సాయం తీసుకుంటున్నాయి. ఏఐ ఆధారిత ఫేషీయల్ రికగ్నిషన్ సాంకేతిక సాయంతో.. బ్యాగ్‌ను వదిలి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టబోతున్నారు. అనుమానితుడెవరో తెలిసిపోయిందని.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌ను ఉపయోగించి ఆ వ్యక్తిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. మరోవైపు ఏఐ టెక్నాలజీ సాయంతో అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించారు. అతని ఫొటోల్ని సేకరించుకుని ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది బెంగళూరు నగర నేర పరిశోధన విభాగం. Bengaluru blast: Suspected accused captured in CCTV #Bengaluru #Karnataka #Blast #RameshwaramCafe #RameshwaramCafeBlast pic.twitter.com/jNM6BFnPVH — Fresh Explore (@explorefresh24) March 2, 2024 బెంగుళూరులో.. అదీ టెక్నాలజీ కారిడార్లోనే ఈ పేలుడు జరగడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. భద్రతాపరంగా మరింత నిఘా, చర్యలు పెంచాల్సిన అవసరాన్ని ఈ పేలుడు ఘటన తెలియజేస్తోందని నిపుణలు అంటున్నారు. అలాగే.. అనుమానిత వ్యక్తులను పట్టుకునేందుకు AI లాంటి అత్యాధునిక సాంకేతికతను అధికారికంగా వినియోగించడం ఎంత అవసరమో కూడా చెబుతోందంటున్నారు. రెండేళ్ల కిందటి.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో.. మొత్తం 10 మంది గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. 2022 నవంబర్‌లో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్ బాంబు పేలింది. దీంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బృందం ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విచారణకు పూర్తి సహకారం: కేఫ్ యాజమాన్యం తమ ప్రాంగణంలో బాంబు దాడి జరగడంపై రామేశ్వరం కేఫ్ యాజమాన్యం స్పందించింది. విచారణలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాకారం అందిస్తామని.. అలాగే పేలుడులో గాయపడిన వాళ్లకు తాము అండగా నిలుస్తామని కేఫ్ ఎండీ దివ్య రాఘవేంద్ర రావు ప్రకటించారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం ఉదయం.. బ్రూక్‌ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్లో ఉన్న రామేశ్వరం కేఫ్. నెత్తిన క్యాప్.. ముఖానికి ముసుగు.. భుజాన బ్యాగ్‌తో ఆ ఆగంతకుడు కేఫ్‌కు వచ్చాడు. అతని వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 11గం.30.ని. ప్రాంతంలో బస్సు దిగి నేరుగా కేఫ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. పావు గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మధ్యలో తన భుజానికి ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లోని సింక్ వద్ద ఉన్న డస్ట్‌బిన్ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. సరిగ్గా అతను వెళ్లిపోయిన గంటకు ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ బాంబు పేలింది. ఫొటోలు వచ్చాయి: సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు. ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం అని అన్నారాయన. #Marksmendaily : #JustiIn #Karnataka CM #Siddaramaiah visits #RameshwaramCafe, a day after an explosion took place here in #Bengaluru @siddaramaiah #RameshwaramCafeBlast #BengaluruCafeBlast #bombblast pic.twitter.com/ptoGaYePHL — Marksmen Daily (@DailyMarksmen) March 2, 2024 అలాగే.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు.‘‘ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారాయన. -
హైదరాబాద్ నగరంలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
-
బెంగుళూరు బ్లాస్ట్ లో నిందితుడిని గుర్తించిన పోలీసులు
-
‘రామేశ్వరం కేఫ్’ ఘటనపై ఉన్నతస్థాయి సమావేశం నేడు!
బెంగళూరులోని రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు నేడు(శనివారం) మఖ్యమంత్రి సిద్ధరామయ్య సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రామేశ్వరం కేఫ్‌లో గుర్తు తెలియని బ్యాగ్‌ను ఉంచారని, ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుడు సంభవించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కర్ణాటక పోలీసుల ఫోరెన్సిక్ బృందం ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 307, 471, యూఏపీఏలోని 16, 18, 38 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దర్యాప్తు బృందం తనిఖీలు చేస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ ‘ఈ కేసు దర్యాప్తు కోసం మేము పలు బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి ఆధారాలు సేకరించాం. పేలుడు సంభవించిన సమయంలో బీఎంటీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ కనిపించింది. అనుమానితుడు ఆ బస్సులో వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటాం. పేలుడు కోసం టైమర్‌ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్ఎస్ఎల్ బృందం విచారణ జరుపుతోంది’ అని తెలిపారు. #WATCH | A team of FSL, Bomb Disposal Squad and Dog Squad conducts an investigation at the explosion site at The Rameshwaram Cafe in Bengaluru’s Whitefield area. pic.twitter.com/iJf7rVvcwN — ANI (@ANI) March 2, 2024 -
Rameshwaram Cafe Bomb Blast: రవ్వ ఇడ్లీ తీసుకుని, ‘బ్యాగు’ను వదిలి..
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించిన ఆసక్తికర మరో అప్డేట్ ముందుకు వచ్చింది. అనుమానితుడు తన బ్యాగ్‌ను రెస్టారెంట్లో ఉంచే ముందు, రవ్వ ఇడ్లీని తీసుకోవడం చూశానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు. రామేశ్వరం కేఫ్ వైట్‌ఫీల్డ్ అవుట్‌లెట్‌లో పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరిస్తూ ‘పేలుడు జరిగినప్పుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు. నేను దానిని తీసుకోగానే, దానిలో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను మా సిబ్బందికి కాల్ చేయగా, వారు రెస్టారెంట్లో పేలుడు జరిగిందని చెప్పారు. తొలుత వంటగదిలో ఏదో కారణంగా పేలుడు సంభవించిందని అనుకున్నాను. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. దీంతో కస్టమర్లున్న ప్రాంతంలో పేలుడు జరిగిందని గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్, మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించింది. Bengaluru cafe blast suspect caught on CCTV. Wearing a cap 👇#RameshwaramCafe#BengaluruBlast pic.twitter.com/NjlnEiAOzL — Stranger (@amarDgreat) March 2, 2024 అతను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక మూలన కూర్చున్నాడు. ఆ ఇడ్లీలను తీనేశాక, రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే ముందు బ్యాగ్‌ను ఒక మూలన ఉంచాడు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన చోట సిలిండర్లు లేవు. నేను ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చాను. రామేశ్వరం కేఫ్, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డ.. రెండింటిలో ఎలాంటి తేడా లేదు. మా అవుట్లెట్కు జరిగిన నష్టం తీవ్రంగా బాధిస్తోంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తుంది. కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు పేర్కొన్నారు. -
Bengaluru Cafe Bomb Blast Video: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
-
హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
Watch Video:బెంగళూర్ కేఫ్‌లో పేలిన టైం బాంబ్
సాక్షి, బెంగళూరు: నగరంలో సంభవించిన భారీ పేలుడు.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టైం బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. టిఫిన్ బాక్స్‌లో ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. తొలుత బ్లాస్ట్‌కి సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. కేఫ్‌లో సిలిండర్లు డ్యామేజ్ కాలేదని గుర్తించింది. అదే సమయంలో.. బోల్ట్‌లు, నట్లు, ఎలక్ట్రిక్ వైర్లను.. వాచ్‌ను(టైం బాంబ్ కోసం ఉపయోగించేది) గుర్తించింది. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. సీసీఫుటేజీ ఆధారంగా ఉదయం 11 గం. ప్రాంతంలో కేఫ్‌లోని సింక్ వద్ద ఓ ఆగంతకుడు బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాక.. 12గం.46ని. సమయంలో బాంబు పేలింది. ఆ బ్యాగ్‌లోని టిఫిన్ బాక్స్‌లోని బాంబ్ పేలుడుకు కారణమని.. ఇది ఉగ్రదాడే అయ్యి ఉంటుందని ఎన్ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది. ఏం జరిగిందంటే.. రామేశ్వరం కేఫ్‌కు నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది కస్టమర్లు వస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మొత్తం తొమ్మిది మందిని బ్రూక్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. అందరికీ ప్రాణాపాయం తప్పిందని కర్ణాటక డీజీపీ అశోక్ మోహన్ చెప్పారు. అంతకు ముందు.. ‘‘సిలిండర్ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్ ఫైర్ స్టేషన్ అధికారి చెప్పారు. ఇదీ చదవండి: కలాం స్ఫూర్తి.. రామేశ్వరం కేఫ్ నెల బిజినెస్ 4 కోట్లపైనే! An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. #Karnataka pic.twitter.com/7PXndEx2FC — ANI (@ANI) March 1, 2024 #WATCH | Karnataka | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited. Whitefield Fire Station says, "We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing… pic.twitter.com/uMLnMFoHIm — ANI (@ANI) March 1, 2024 Just spoke to Rameshwaram Café founder Sri Nagaraj about the blast in his restaurant. He informed me that the blast occurred because of a bag that was left by a customer and not any cylinder explosion. One of their employees is injured. It’s seems to be a clear case of bomb… — Tejasvi Surya (@Tejasvi_Surya) March 1, 2024 ఇదిలా ఉంటే.. రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజ్‌తో తాను మాట్లాడానని.. పేలుడు గురించి ఆరా తీశానని బీజేపీ నేత, ఎంపీ తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. ఇది సిలిండర్ బ్లాస్ట్ కాదని.. కస్టమర్ ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు జరిగిందని.. ఇది ముమ్మాటికే బాంబు పేలుడంటూ పోస్ట్ చేశారాయన. -
దివ్యమైన ఫుడ్చైన్: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..?
కందిపొడితో కలిసిన తాజా నేతి వాసన. కొబ్బరి పచ్చడిలో తాజా కరివేపాకు, మినపప్పుతో వేసిన పోపు వాసన వీధి చివరకు వస్తోంది. ముక్కు చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఓ రెస్టారెంట్. లోపలకి వెళ్లేవాళ్లు, సంతృప్తిగా బయటకు వచ్చే వాళ్లు, క్యూలో ఉన్న వాళ్లను చూస్తే లోపల టేబుల్ దొరకడం కష్టమే, రష్ బాగానే ఉందనిపిస్తోంది. తలెత్తి చూస్తే విశాలమైన బోర్డు కుడివైపు ‘ద రామేశ్వరం కేఫ్’ అని ఇంగ్లిష్‌లో ఉంది. తమిళ రుచి అనుకునే లోపే ఎడమవైపు అదే పేరు కన్నడ భాషలో ఉంది. మధ్యలో చక్కటి ముగ్గుతో మూర్తీభవించిన దక్షిణాది సంప్రదాయం కనువిందు చేస్తోంది. బెంగళూరులో ఉన్న ఈ రెస్టారెంట్ తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు వేడి వేడిగా వడ్డిస్తూనే ఉంటుంది. ఈ రెస్టారెంట్ల యజమాని పాతికేళ్లు కూడా నిండని దివ్య. తాత, తండ్రుల వ్యాపార సామ్రాజ్యాన్ని ఈ అమ్మాయి వారసత్వంగా అందుకున్నదేమో అనుకుంటాం. కానీ ఇది పూర్తిగా ఆమె ఆలోచనే. మెక్‌డీ... కేఎఫ్సీలేనా! ఫుడ్ చైన్‌ను మించిన వ్యాపారం మరొకటి ఉండదని నమ్మింది దివ్య. సీఏ చేసిన తర్వాత ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో ఎంబీఏలో చేరినప్పటి నుంచి ఫుడ్ చైన్ బిజినెస్‌లో నెగ్గుకురావడం గురించిన మెళకువలు నేర్చుకోవడంలో మునిగిపోయింది. పాశ్చాత్య దేశాల్లో పుట్టిన మెక్ డీ, కేఎఫ్సీలను మనం ఆదరిస్తున్నాం. అలాగే దక్షిణాది రుచులను దేశమంతటా విస్తరించడం ఎందుకు సాధ్యం కాదు... అనుకుంది. మార్కెటింగ్ వ్యూహాలను తెలుసుకుంది. కోర్సు పూర్తి అయిన వెంటనే తన ఆలోచనను ఇంట్లో వాళ్ల ముందు బయటపెట్టింది. భర్త రాఘవరావు ఆహార పరిశ్రమల రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతడు మాత్రమే ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఇక మిగిలిన వారంతా – ‘సీఏ, ఐఐఎమ్‌లో పీజీ చేసిన అర్హతలకు పెద్ద కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం దొరుకుతుంది, హాయిగా ఉద్యోగం చేసుకోక ఇంత చదువూ చదివి ఇడ్లీలు, దోశెలు, ఊతప్పాలా’ అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఆమె తన అభీష్టాన్ని నెరవేర్చుకుని తీరాలని నిర్ణయించుకుంది. ఇపుడామె కారం పొడి చల్లిన నెయ్యి దోశెలు, స్పాంజిలాగ మెత్తని ఇడ్లీలు, ఊతప్పం, గుంత పొంగనాలు, మూడు రకాల చట్నీలు, సాంబారు... ఈ ఘుమఘుమలు బెంగళూరు నుంచి మన హైదరాబాద్‌ను తాకి, దేశందాటి దుబాయ్‌కి కూడా చేరాయి. ఇకపై సింగపూర్‌కి విస్తరించాలనేది దివ్య లక్ష్యం. తన ఫుడ్ చైన్‌కి ‘ద రామేశ్వరం కేఫ్’ అని పెట్టడానికి కారణం తాను అత్యంత ఎక్కువగా గౌరవించే మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సొంతూరు రామేశ్వరం (తమిళనాడు రాష్ట్రం) కావడమే అంటోంది. పెద్ద కలలు కనమని చెప్పిన కలామ్‌కి తన విజయాన్ని అంకితం చేసింది దివ్య. ఇది చదవండి: ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్! -
రంగనాథుని సేవలో మోదీ
సాక్షి, చెన్నై/ తిరుచిరాపల్లి: కొద్దిరోజులుగా శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న ప్రధాని మోదీ అందులో భాగంగా శనివారం తమిళనాడులోని ద్వీప పట్టణం ‘శ్రీరంగం’లోని ప్రఖ్యాత శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ధోతి, అంగవస్త్రం, రుద్రాక్షమాలతో తమిళ సంప్రదాయ ఆహార్యంలో ఆలయానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఆలయ నిర్వహణ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి వేదాలు పఠిస్తూ పండితులు తోడు వచ్చారు. మోదీ ఆ తర్వాత రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. రామానుజాచార్య, చక్రత్తాళ్వార్ సన్నిధాలను సందర్శించారు. ఆలయ ఏనుగు ఆండాళ్ ఆశీ్వరాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మౌతార్గాన్ వాయిస్తూ ఆహ్వానం పలకడం విశేషం. భారత ప్రధాని రంగనాథ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి. 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తమిళ కవి కంబ రచించిన కంబ రామాయణాన్ని ఈ సందర్భంగా మోదీ పారాయణం చేశారు. తమిళనాడులోని ప్రఖ్యాత వైష్ణవదేవాలయాల్లో రంగనాథాలయం ముఖ్యమైనది. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. రామేశ్వరం ఆలయంలోనూ... శనివారం మధ్యాహ్నం మోదీ రామేశ్వరం వెళ్లారు. అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. 22 పవిత్ర తీర్థాలలో స్నానం చేశారు. ప్రాచీన శివాలయమైన ప్రఖ్యాత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తి, భజన కార్యక్రమాల్లో పాల్గొని భజన చేశారు. రామయణ గాథతో ఈ ఆలయానికి గాఢానుబంధం ఉంది. అనంతరం పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు, స్థానికులతో మోదీ మాట్లాడారు. రాత్రి రామేశ్వరంలోని రామకృష్ణ మఠంలో బస చేశారు. ఆదివారం ఉదయం ఆయన మళ్లీ రామేశ్వరం అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేసి మరోమారు రామనాథస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సమీప గ్రామంలోని కోడండరామస్వామి దర్శనంతో మోదీ మూడు రోజుల తమిళనాడు పర్యటన పూర్తవుతుంది. తిరుచిరాపల్లిలో రోడ్ షో తిరుచిరాపల్లి పురవీధుల్లో జనం మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూలవర్షం కురిపించారు. వారందరికీ వనక్కమ్ అంటూ మోదీ అభివాదం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ మార్గమంతా మార్మోగిపోయింది. అక్కడి నుంచి శ్రీరంగం వైపుగా మోదీ రోడ్‌షో కొనసాగింది. -
చూడటానికి కిరాణా కొట్టులా... కానీ నెలకు 4 కోట్ల ఆదాయం
-
Special Trains: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్–రామేశ్వరం–సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా పలు రైళ్లు కేటాయించడం జరిగిందని రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ గురువారం వెల్లడించారు. చదవండి: పెగసస్ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్ సికింద్రాబాద్–రామేశ్వరం (07685) ప్రత్యేక రైలు మార్చి 22, 29, ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28, జూలై 5, 12, 19, 26 తేదీలలో నడుస్తుంది. రామేశ్వరం–సికింద్రాబాద్ (07686) ప్రత్యేకరైలు మార్చి 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28, మే 5, 12, 29, 26, జూన్ నెలలో 2, 9, 16, 23, 30, జూలై 7, 14, 21, 28 తేదీలలో నడుస్తుందని తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా గుంటూరు–విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు తాత్కాలికంగా అదనపు ఏసీ చైర్ కార్ కోచ్‌ను జత చేసి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. గుంటూరు – విశాఖపట్నం (17239/17240) రైలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు అదనపు ఏసీ కోచ్‌తో నడవనున్నట్లు తెలిపారు. -
‘యాదాద్రి’ గోపురంపై రామాయణ గాథ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర రాజగోపురంపై రామాయణానికి సంబంధించిన చిత్రాలపై ఆడియో పవర్ ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ నిర్వహించారు. రామాయణం, ఇతర ఇతిహాసాలను ప్రొజెక్టర్ ద్వారా తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు వీటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. భక్తులు ఉత్తర రాజగోపురం వైపు ఉన్న పచ్చికలో కూర్చొని కట్టడాలను వీక్షించే అవకాశం ఉన్నందున్న.. శ్రీనృసింహస్వామి, ప్రహ్లాద చరిత్రను కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును వైటీడీఏ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. -
శ్రీలంక నేవీ అదుపులో 55 మంది తమిళ జాలర్లు
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 55 మంది జాలర్లతోపాటు 8 మర పడవలను శ్రీలంక నావికాదళం ఆదివారం అదుపులోకి తీసు కుంది. ఈ నెల18న రామేశ్వరం నుంచి కట్చ తీవు దీవికి 500 బోట్లలో వెళ్లిన మత్స్య కారుల్లో 43 మందిని, 6 బోట్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుందని మత్స్యశాఖ తెలిపిం ది. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. జాలర్లందరినీ వెంటనే విడిపించాలని, ఇప్పటి వరకు శ్రీలంక ఆధీనంలో ఉన్న మొత్తం 73 పడవలను విడుదల చేయించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. తమ వారిని విడు దల చేసే వరకు నిరాహార దీక్ష చేపడతామని మత్స్యకారుల సంఘం హెచ్చరించింది. -
రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న కేసీఆర్
-
రామేశ్వరంలో పాఠాలు
పుస్తకాలు, బ్యాగు కాకుండా స్క్రిప్ట్స్ పేపర్స్, కాస్ట్యూమ్స్ పట్టుకుని స్కూల్‌కి వెళ్లారు వరుణ్ తేజ్ అండ్ అదితీరావ్ హైదరీ. ఆ స్కూల్ అడ్రస్ హైదరాబాద్‌ది కాదు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో జరుగుతోంది. ఈ షూట్ లోకేషన్ ఫొటోను షేర్ చేశారు అదితీరావ్ హైదరీ. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
తమిళనాడు: రామేశ్వరం జిల్లాలో కలకలం
-
శ్రీదేవీ కోరిక నెరవేర్చిన కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ : కోట్లాది అభిమానులను కన్నీటిలో ముంచి, ఈ లోకం విడిచి వెళ్లిన శ్రీదేవీ అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని హరిద్వార్‌లో కూడా నిర్వహించారు. గత వారం రామేశ్వరంలో ఆమె అస్థికలు కలిపిన తర్వాత, నిన్న(గురువారం) హరిద్వార్ వద్ద కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. హరిద్వార్ షూటింగ్ సమయంలో 1993లో ఆమె మళ్లీ అక్కడికి వస్తానని మొక్కుకున్నారని, ఈ క్రమంలో శ్రీదేవీ కోరిక నెరవేర్చడానికి రెండోసారి కూడా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. హరిద్వార్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు, ఆయన సోదరుడు అనిల్ కపూర్, శ్రీదేవీ క్లోజ్ ఫ్రెండ్, డిజైనర్ మనీష్ మల్హోత్రాలు పాల్గొన్నారు. కపూర్ కుటుంబానికి చెందిన పూజారులు శివ్ కుమార్ పాలివాల్, మనీష్ జైస్వాల్‌లు హరిద్వార్‌లోని వీవీఐపీ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి కంఖల్‌లో ఉన్న హరిహర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఉత్తరఖాండ్ వ్యవసాయ మంత్రి సుబోద్ యూనియల్, హరిద్వార్ మేయర్ మనోజ్ గార్గ్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్‌లు కూడా ఈ పూజ కార్యక్రమానికి విచ్చేశారు. రామేశ్వరంలో జరిగిన కార్యక్రమానికి బోని కపూర్, తన కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి వెళ్లారు. మరణించిన వారి అస్థికలు నదుల్లో కలపడం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే. నదీతీర్థాల్లో కర్మకాండలు ఆచరించిన అనంతరం పవిత్ర నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవీ, దుబాయ్ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవీ మరణం కోట్లాది మంది అభిమానులను తీవ్ర దుఃఖసాగరంలో ముంచివేసింది. -
21న మదురైలో కమల్ పార్టీ ప్రకటన
-
21న మదురైలో కమల్ పార్టీ ప్రకటన
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ తమిళనాడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. 21న రామేశ్వరం నుంచి మదురై జిల్లాలోని ఒత్తకడై వరకూ పర్యటించనున్న కమల్ అదే రోజు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నెల 21న ఉదయం దివంగత రాష్ట్రపతి కలాం నివాసం నుంచి కమల్ పర్యటన మొదలుకానుంది. ఉదయం కలాం పాఠశాలను సందర్శించాక జాలర్ల సంఘాల నేతలతో కమల్ మాట్లాడతారు. రామనాథపురం, పరమకుడి జంక్షన్, మానామదురైలలో జరిగే సభలలో ప్రసంగిస్తారు. -
నేటి నుంచి మరో 3 రైళ్లలో ఆర్టీసీ టికెట్లు
తిరుపతి అర్బన్: తిరుమలకు రైళ్ల ద్వారా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం సోమవారం నుంచి మరో 3 రైళ్లలో ఆర్టీసీ టికెట్లు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రైల్వే డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్(సీసీఎం) గుణశేఖర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల యాత్రికుల కోసం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టీసీ సహకారంతో తిరుమలకు ప్రయాణ టికెట్లు ఇప్పిస్తున్నామన్నారు. ఇందులో రోజుకు సుమారు 170 మంది యాత్రికుల వరకు రైల్వే–ఆర్టీసీ సంయుక్త సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. తిరుమలకు రైళ్లలో వచ్చే యాత్రికుల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తమిళనాడులోని రామేశ్వరం వరకు నడుస్తున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌తో పాటు కొయంబత్తూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(మధ్యాహ్నం 1:30 గంటకు తిరుపతికి వచ్చే రైలు) రైళ్లలో ఆర్టీసీ సిబ్బంది యాత్రికులకు టికెట్లు అందజేస్తారన్నారు. యాత్రికులు రైల్వేస్టేషన్లో దిగగానే నేరుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
రామేశ్వరంలో కాటమరాయుడు
సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో స్పీడు పెంచాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. పవన్ కూడా షూటింగ్లో పాల్గొంటుండటంతో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే రెండో షెడ్యూల్‌కు సంబందించిన ప్రణాళిక కూడా సిద్ధం చేశారు చిత్రయూనిట్. ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌ను ఆధ్యాత్మిక నగరం రామేశ్వరంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. -
నేడు కలాంకు అంతిమయానం !
-
నేడు కలామ్ అనంత యానం!
పృథ్వీయాప తేజోవాయురాకాశములారా..! ఇతడు మీ పుత్రుడు. తన శస్త్రాలకు మీ పేర్లే పెట్టుకున్న మీ ప్రియ భక్తుడు. తన పాంచ భౌతిక దేహమును మీకు సమర్పిస్తున్నాడు. గైకొని ధన్యులు కండు. అభ్ర మాలికలారా! అడ్డు తొలగండి... ఇతని ప్రయాణ పథము శుభ్రజ్యోత్స్న వలె కాంతులీనవలె. ఓ చందమామా! ఇతడు నీ మేనల్లుడు. నీకంటే చల్లనివాడు. అనంతయానానికి పయనమైనాడు. పున్నమి ఘడియలు ప్రవేశించకున్నా సరే, పూర్ణేందు రూపం దాల్చి దారి చూపు. దివిజాంగనలారా! దోసిట సౌగంధికా పుష్పాలతో నిలిచి ఉండండి. పూలవాన కురిపించదగిన పుణ్య చరితుడితడు. మీ చెంతకు వస్తున్నాడు. రామేశ్వరానికి చేరిన కలాం పార్థివ దేహం * ప్రత్యేక విమానంలో మదురైకి, అక్కడి నుంచి హెలికాప్టర్లో తరలింపు * ఢిల్లీ నుంచి వెంట వచ్చిన వెంకయ్య, పారికర్ * నేడు పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు * పేక్కరుంబు గ్రామంలో ఉదయం 11 గంటలకు నిర్వహణ రామేశ్వరం/న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ అబ్దుల్ కలాం సొంతగడ్డ శోక జనసంద్రమైంది.. తమ ముద్దుబిడ్డను చివరిసారిగా చూసుకునేందుకు వేల సంఖ్యలో ప్రజానీకం కన్నీటితో పోటెత్తింది. కలాం పార్థివదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బుధవారం ఆయన స్వస్థలమైన రామేశ్వరానికి తీసుకువచ్చారు. తొలుత ఢిల్లీ నుంచి తమిళనాడులోని మదురైకి ప్రత్యేక వాయుసేన విమానంలో తీసుకువచ్చారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య.. కలాం భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛముంచి నివాళి అర్పించారు. తర్వాత కలాం భౌతిక కాయాన్ని హెలికాప్టర్ ద్వారా రామేశ్వరానికి పది కిలోమీటర్ల దూరంలోని మండపం ప్రాంతానికి చేర్చారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు ఢిల్లీ నుంచి కలాం పార్థివ దేహం వెంట వచ్చారు. మరో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వారితో కలిశారు. అప్పటికే మండపం ప్రాంతానికి తమిళనాడు సీఎం జయ సూచన మేరకు పలువురు మంత్రులు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, నటుడు విజయ్‌కాంత్, కలాం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ దిగగానే పెద్దసంఖ్యలో అభిమానులు అటువైపు తోసుకురాగా.. భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. అనంతరం కలాం పార్థివ దేహాన్ని ఒక సైనిక వాహనంపై ఉంచి రోడ్డు మార్గంలో రామేశ్వరానికి తరలించారు. ఈ సందర్భంగా పది కిలోమీటర్ల మార్గం పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇరువైపులా నిలబడి నివాళి అర్పించి, కలాం రామేశ్వరానికి అందించిన సేవలను కొనియాడారు. కలాం పార్థివ దేహాన్ని రాత్రి 8 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి.. అనంతరం ఇక్కడి పళ్లివాసల్ వీధిలోని ఆయన పూర్వీకుల ఇంటికి తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలకు ప్రముఖులు.. గురువారం రామేశ్వరంలో జరుగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఇక తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున కలాం అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని సీఎం జయలలిత బుధవారం ప్రకటించారు. కలాం అంటే తనకు ఎంతో గౌరవమని, తన తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుగురు మంత్రులను పంపుతున్నట్లు చెప్పారు. కలాం అంత్యక్రియలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం ఊమెన్‌చాందీ తదితర సీఎంలు హాజరు కానున్నారు. దేశం ఒక రత్నాన్ని కోల్పోయింది: మోదీ దేశం ఒక అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందని ప్రధాని మోదీ బుధవారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ప్రజలు ఎంతగానో ప్రేమించే, ఆరాధించే వ్యక్తి ఆయన. ప్రపంచం నుంచి ఆయన కొంతే తీసుకున్నారు. తాను మాత్రం అంతా ఇచ్చారు. పరిస్థితులకు ఆయన ఎప్పుడూ లొంగిపోలేదు. భారత రక్షణ రంగానికి ఆయనే హీరో. అణు, అంతరిక్ష రంగాల్లో విజయాలతో మన దేశం గర్వపడేలా చేశారు..’ అని తెలిపారు. కాగా కలాం విజ్ఞానం దేశానికి ఎంతో మేలు చేసిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచ నేతల నివాళి వాషింగ్టన్: కలాం మృతికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాల అధినేతలు ఘనంగా నివాళి అర్పించారు. కలాం లక్షలాది భారతీయులకు స్ఫూర్తినిచ్చారని, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని కొనియాడారు. కలాం కిందిస్థాయి నుంచి దేశ నాయకుడిగా ఎదిగారని, అమెరికన్ల తరఫున ఆయనకు నివాళి అర్పిస్తున్నానని ఒబామా చెప్పారు. ఆయన భారత్, అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారాన్ని పెంచారని కొనియాడారు. కలాం భారత్, రష్యాల అనుబంధానికి కృషి చేశారని పుతిన్.. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కలాం మృతికి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, సింగపూర్ అధ్యక్ష ప్రధానులు టోనీ టాన్ కెంగ్ యామ్, లీ సీన్ లూంగ్‌లు కూడా నివాళి అర్పించారు. వివిధ దేశాధినేతలు కలాం సేవలను కొనియాడారు. అధికార లాంఛనాలతో.. చెన్నై, సాక్షి ప్రతినిధి: కలాం అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పేక్కరుంబు గ్రామంలో ఆయన బంధువులు ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఇస్లాంసంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కలాం స్మారక మండపం: కలాం జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయేలా రామేశ్వరంలో భారీ స్మారక మం డపం నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పేక్కరుంబు గ్రామంలో కలాం పార్థివదేహాన్ని ఖననం చేస్తున్న స్థలానికి సమీపంలో ఉన్న 1.32 ఎకరాల ప్రభుత్వ భూమిలో మండపం నిర్మిస్తారు. -
రామేశ్వరానికి కలాం భౌతికకాయం తరలింపు
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థీవ దేహాన్ని తీసుకుని ప్రత్యేక విమానం బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి మధురైకి బయల్దేరింది. కలాం భౌతికకాయంతో సైనిక వాహనం ఈరోజు ఉదయం 7 గంటలకు.. ఆయన నివాసం 10 రాజాజీ మార్గ్ నుంచి పాలం చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో కలాం పార్థివదేహాంతో పాటు కేంద్రమంత్రులు మనోహర్‌పారికర్, వెంకయ్యనాయుడు బయల్దేరి వెళ్లారు. అక్కడి నుంచి వైమానికదళ హెలికాప్టర్లో కలాం పార్థివదేహాన్ని రామేశ్వరం తీసుకెళతారు. అక్కడ బుధవారం సాయంత్రం 7 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటలకు రామేశ్వరంలోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కలాం అంత్యక్రియలకు ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు. -
కలిసి వెళితే కలదు లాభం...
యాత్రలకు ఎంత మంది కలిసి వెళితే, అంత లాభం’ అంటున్నారు హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌కి చెందిన వి.రామరాజు. ఆయన విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఈ వారం జమ్మూ, కాశ్మీర్ విహారయాత్రకు వెళుతున్నారు. అందులో ప్రత్యేకత ఏముందీ? అంటారా... అయితే చదవండి... ‘‘నేనూ, నా సతీమణి స్వర్ణకుమారి ప్రతి ఏడాదీ విహారయాత్రలకు వెళ్లడం ఓ అలవాటుగా చేసుకున్నాం. ఈ వారంలో మనదేశ స్వర్గసీమగా భావించే జమ్మూ, కాశ్మీర్‌కు బయల్దేరుతున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. నాతో కలిసి మరో తొంభైమంది ప్రయాణిస్తున్నారు. అంతా మా బంధువులు! నాలుగేళ్లక్రితం పదిమంది గ్రూప్‌గా యాత్రలకు వెళ్లడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ సంఖ్య వందకు చేరువవుతోంది. రెండేళ్ల క్రితం 65 మందిమి కలిసి దక్షిణ భారతదేశం తిరిగొచ్చాం. కన్యాకుమారి, రామేశ్వరం అన్నీ చుట్టొచ్చాం. అంతకుముందు ఏడాది హిమాలయ యాత్రకు వెళ్లాం. హరిద్వార్, రుషికేష్ చూసొచ్చాం. ఏడాదిన్నరక్రితం ఉత్తరభారతదేశానికి 75 మందిమి ఒక గ్రూప్‌గా కలిసి వెళ్లాం. ఇప్పుడు 91 మందిమి వెళుతున్నాం. మా గ్రూప్‌లో అందరూ దాదాపు 60 దాటినవాళ్ళే! అన్నీ ప్రయోజనాలే! జమ్మూ-కాశ్మీర్ పదిరోజుల యాత్రకు నెల ముందుగానే ట్రావెల్స్‌లో బుక్ చేసుకున్నాం. 35 సీట్లు ఉన్న 3 బస్సులలో ప్రయాణం. మాతో ప్రతి బస్సుకు ఒక ట్రావెల్ గైడ్ కూడా ఉంటాడు. వెళ్లిన చోట ఇద్దరు వ్యక్తులు ఒకే హోటల్ గదిలో ఉండేట్టయితే ఒక్కొక్కరికి (మొత్తం ఛార్జీలు, భోజనంతో సహా) రూ.15,000/-లు. ముగ్గురు ఒకే గదిలో ఉండేట్టయితే ఆ ముగ్గురికీ రూ.31,000/-. ముందు ట్రావెల్ ఏజెంట్‌ని కలిసినప్పుడు జమ్మూకాశ్మీర్ యాత్ర ఒక్కొక్కరికి రూ.18000/- అని చెప్పాడు. కాని 91 మందితో గ్రూప్ అనేసరికి ఒక్కొక్కరికి రూ.3 వేలు తగ్గింపు లభించింది. సాధారణంగా ఏ వేడుకల్లోనో బంధువులం కలుస్తాం. హడావిడిగా వెళ్లిపోతాం. అదే ఇలా వెళితే కనీసం పది రోజులకు పైగా అంతా కలసి ఉంటాం. భోజనాలైనా, తిరగడమైనా కలిసే చేస్తాం. సరదాగా ఉండటం వల్ల అందరితో చనువు ఏర్పడుతుంది. పెద్ద వయసు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రయాణంలో కిలోమీటర్ల కొద్దీ తిరుగుతారు. అయినా చిన్న నొప్పి అని కూడా ఎవరూ అనరు. అంత ఉల్లాసంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మనకి మరో తొంభైమంది తోడుగా ఉన్నారన్న భరోసా ఉంటుంది. తమిళనాడు, ఉత్తరాంచల్ వెళ్లినప్పుడు... రైలు టికెట్లు, హోటల్స్ అన్నీ మేమే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాం. ఖర్చులన్నీ కలిపి చివరగా అందరం పంచుకున్నాం. ఆ విధంగా చాలా తక్కువ డబ్బులకే ప్రయాణాలు చేసిన సందర్భాలున్నాయి. ఈసారి సంఖ్య ఎక్కువైందని ట్రావెల్ బస్సులు బుక్ చేసుకున్నాం’’అని తెలిపారు. ఎక్కువ మంది కలిసి గ్రూప్‌గా యాత్రలకు వెళితే కొత్త ప్రాంతాల్లో మరింత భరోసాగా గడిపిరావచ్చు. ఖర్చూ కలిసి వస్తుంది. కలిసి ఇలా టూరు వెళితే మరిన్ని ప్రయోజనాలు మీరూ స్వయంగా తెలుసుకుంటారు. - నిర్మలారెడ్డి -
ఆందోళన వద్దు!
తాము అధికారంలోకి వస్తామని, దాడులకు ముగింపు పలుకుతామని జాలర్లకు బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ భరోసా ఇచ్చారు. ఆందోళన వీడాలని, శాశ్వత పరిష్కారంతో జాలర్ల జీవితాల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు. సాక్షి, చెన్నై: బీజేపీ జాలర్ల విభాగం నేతృత్వంలో రామేశ్వరంలో శనివారం కడల్ తామరై(సముద్రంలో కమలం) నినాదంతో సభ జరిగింది. ఇందులో బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ పాల్గొని ప్రసంగించారు. శ్రీలంక నావికాదళం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పైశాచికత్వం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని, తద్వారా జాలర్ల జీవితాల్లో వెలుగును నింపుతామన్నారు. తమిళ జాలర్లకు శ్రీలంకతో, గుజరాత్ జాలర్లు పాక్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జాలర్లపై జరుగుతున్న దాడులకు ఒకే ఒక పరిష్కార మార్గం కేంద్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం ద్వారానే సాధ్యమన్నారు. ఇందుకు మోడీ అంగీకరించారని, అధికార పగ్గాలు చేపట్టాక, జాలర్ల కోసం ప్రత్యేక శాఖ ఏర్పడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. దాడులకు తాత్కాలిక పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కారం చూపించి తీరుతామని భరోసా ఇచ్చారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర జాలర్లపై, తమిళుల సమస్యలపై రాష్ట్ర పార్టీ పలు అంశాల్ని పేర్కొంటుందని, తద్వారా తాము అధికారంలోకి వస్తే, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాడులపై మహిళా జాలర్లు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, దీన్నిబట్టి ఇక్కడి జాలర్లకు ఏ మేరకు న్యాయం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. జాలర్ల సమస్యలు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదని, ఒక్క కేంద్రం ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, జాలర్లందరూ తమకు అండగా ఉండాలని, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక శాతం బీజేపీ, మిత్ర పక్షాల ప్రతినిధుల్ని రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు పంపించాలని పిలుపునిచ్చారు. మోడీ వస్తున్నారని ఆయన జాలర్లకు, తమిళ ప్రజలకు అండగా నిలబడే విధంగా హామీ ఇస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో బీజేపీ జాతీయ నాయకుడు ఇలగణేశన్ మాట్లాడుతూ, ఎనిమిదో తేదీన మోడీ తన ప్రసంగం ద్వారా పొత్తుల వివరాల్ని వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, జాతీయ కార్యదర్శి మురళీ ధర్ రావు, మహిళా నాయకులు వానతీ శ్రీనివాసన్, తమిళిసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.