రామేశ్వరంలో పాఠాలు | varun tej movie shooting in rameshwaram | Sakshi
Sakshi News home page

రామేశ్వరంలో పాఠాలు

Published Sat, Jul 28 2018 4:17 AM | Last Updated on Sat, Jul 28 2018 4:17 AM

varun tej movie shooting in rameshwaram - Sakshi

అదితీరావ్‌ హైదరీ, వరుణ్‌తేజ్‌

పుస్తకాలు, బ్యాగు కాకుండా స్క్రిప్ట్స్‌ పేపర్స్, కాస్ట్యూమ్స్‌ పట్టుకుని స్కూల్‌కి వెళ్లారు వరుణ్‌ తేజ్‌ అండ్‌ అదితీరావ్‌ హైదరీ. ఆ స్కూల్‌ అడ్రస్‌ హైదరాబాద్‌ది కాదు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా స్పేస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఇందులో అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్కూల్‌లో జరుగుతోంది. ఈ షూట్‌ లోకేషన్‌ ఫొటోను షేర్‌ చేశారు అదితీరావ్‌ హైదరీ. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌ 21న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement