రామేశ్వరంలో కాటమరాయుడు | pawanKalyan karamarayudu next schedule in rameshwaram | Sakshi
Sakshi News home page

రామేశ్వరంలో కాటమరాయుడు

Published Sun, Oct 2 2016 2:50 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

రామేశ్వరంలో కాటమరాయుడు - Sakshi

రామేశ్వరంలో కాటమరాయుడు

సర్థార్ గబ్బర్సింగ్ సినిమా తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో స్పీడు పెంచాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. పవన్ కూడా షూటింగ్లో పాల్గొంటుండటంతో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఇప్పటికే రెండో షెడ్యూల్కు సంబందించిన ప్రణాళిక కూడా సిద్ధం చేశారు చిత్రయూనిట్. ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ను ఆధ్యాత్మిక నగరం రామేశ్వరంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement