పవన్ 'కాటమరాయుడు' మొదలైంది | Pawan Kalyan karamarayudu starts rolling | Sakshi
Sakshi News home page

పవన్ 'కాటమరాయుడు' మొదలైంది

Published Wed, Sep 21 2016 2:54 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ 'కాటమరాయుడు' మొదలైంది - Sakshi

పవన్ 'కాటమరాయుడు' మొదలైంది

పవర్ స్టార్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్ ఈ రోజు (బుధవారం)  మొదలైంది. సర్థార్ గబ్బర్సింగ్తో డీలా పడిపోయిన పవన్ అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. చాలా రోజులు క్రితమే లాంచనంగా ప్రారంభమైనా.. డైరెక్టర్ మారిపోవటం, పవన్ రాజకీయంగా బిజీ కావటంతో ఈ సినిమాతో ఆలస్యమవుతూ వచ్చింది.

ప్రస్తుతం సికింద్రాబాద్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుండగా ఈ నెల 24 నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్కు హాజరుకానున్నాడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement