Sruthi Haasan
-
నాన్నకు తెలియకుండా దేవాలయాలకు వెళ్లేదాన్ని.. కారణం ఇదే: శృతిహాసన్
నటుడు కమలహాసన్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చిత్ర పరిశ్రమలో ఎన్సైక్లోపిడియా అంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కమలహాసన్ నిత్య విద్యార్థి కూడా. అలాంటి కమల్ వారసుల ప్రతిభ గురించి ఇంకా చెప్పాలా. ఆయన పెద్ద కూతురు శృతిహాసన్ ఇప్పుడు ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. సంగీత దర్శకురాలు, గాయనీ, గీత రచయిత అంటూ ఆమెలో అదనపు ప్రతిభ కూడా ఉంది. తన తల్లిదండ్రుల గురించి ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పే శృతిహాసన్‌కు తండ్రి కమలహాసన్ అన్నా, తల్లి సారిక అన్నా చాలా ప్రేమ, గౌరవం. వాళ్లు విడిపోయినా, శృతిహాసన్ ఆ విషయాన్ని గౌరవిస్తారు. దీని గురించి ఇటీవల ఒక సమావేశంలో పేర్కొంటూ తన తల్లిదండ్రులు విడిపోవడం బాధాకరమేనన్నారు. అయితే విడిపోవడం వల్ల స్త్రీకి స్వేచ్ఛ వస్తుందని తనకు అప్పుడే తెలిసిందన్నారు. అదే విధంగా ఆర్థికపరమైన విషయాల గురించి తనకు అప్పుడే అవగతం అయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో విషయం ఏమిటంటే తన తల్లికి దైవభక్తి ఎక్కువని, తన తండ్రి నాస్తికుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఇంట్లో దేవుడి పేరు వినిపించేది కాదన్నారు. ఇక దేవాలయాలకు వెళ్లే అవకాశమెక్కడుంటుందని అన్నారు. అలాంటిది కొంత కాలం తరువాత దేవుడిపై నమ్మకం ఏర్పడిందన్నారు. దీంతో తన తండ్రికి తెలియకుండా దేవాలయాలకు వెళ్లి వచ్చేదానినని చెప్పారు. ఆ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉండేదన్నారు. ఇప్పటికీ ఆ అనుభవాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే తాను దేవాలయానికి వెళ్లే విషయాన్ని తన తండ్రికి తెలియకుండా చాలా కాలం జాగ్రత్త పడ్డానని పేర్కొన్నారు. దైవభక్తితో తనలో శక్తి పెరిగిందని అన్నారు. దైవభక్తే తననీ స్థాయికి చేర్చిందనే అభిప్రాయాన్ని నటి శృతిహాసన్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈమె నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. తదుపరి నటుడు ధనుష్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనిరుధ్ ఫస్ట్ సినిమా రీ-రిలీజ్
ధనుష్, శ్రుతీహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల అయింది. కోలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ధనుష్ సరసన శ్రుతి హాసన్ నటించింది. 2012లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ అయిన 'త్రీ' సినిమా ఇప్పుడు మరోసారి భారతదేశం అంతటా థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి సిద్ధంగా మేకర్స్ ఉన్నారు. ధనుష్ దర్శకత్వం వహించి, అనిరుధ్ రవిచందర్ సంగీత అరంగేట్రం చేసిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రం రామ్ (ధనుష్), జనని (శృతి హాసన్) తమ పాఠశాల రోజుల్లో ప్రేమలో పడటం నుంచి కథ ప్రారంభమవుతుంది. చివరికి పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ, రామ్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో వారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది, అతని అకాల మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి జనని ఏం చేసిందనేది కథ. ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చే ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూడొచ్చు.ఈ సినిమాతో అరంగేట్రం చేసిన అనిరుధ్ రవిచందర్ సంగీతం 3 సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సౌండ్‌ట్రాక్, ముఖ్యంగా ధనుష్ రచించి పాడిన వై దిస్ కొలవెరి డి పాట సంచలనంగా మారింది. -
మరోసారి బ్రేకప్ చేసుకున్న శ్రుతి హాసన్.?
-
'సలార్'ను నమ్ముకున్న శృతిహాసన్
చిత్రసీమలో అతి తక్కువ మంది బోల్డ్ అండ్ బ్యూటీలలో నటి శృతిహాసన్ ఒకరు. విశ్వనటుడు కమలహాసన్ వారసురాలైన ఈమె తండ్రికి తగ్గ తనయగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. నటిగా తన సినీ పయనాన్ని బాలీవుడ్లో 'లక్' చిత్రంతో ప్రారంభించినా ఎక్కువగా దక్షిణాదిలోనే చిత్రాలు చేస్తున్నారు. తాజాగా హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. (ఇదీ చదవండి: ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్) కేజీఎఫ్ చిత్రం ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో హాయ్ నాన్న చిత్రంలో నటిస్తున్నారు. నటి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా బహుముఖాలు కలిగిన శృతిహాసన్‌కు ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ మాతృభాష అయిన తమిళచిత్ర పరిశ్రమ ఈమె టాలెంటును పెద్దగా ఉపయోగించుకోవడం లేదనే చెప్పాలి. కారణాలు ఏమైనా విజయ్ సేతుపతికి జంటగా నటించిన 'లాభం' చిత్రం తర్వాత శృతిహాసన్ కోలీవుడ్‌లో కనిపించలేదు. పాన్ ఇండియా చిత్రం 'సలార్' విడుదల తర్వాత కోలీవుడ్ లోనూ ఈమె బిజీ అవుతారేమో చూడాలి. అయితే ఎప్పుడు ఏదో అంశంతో వార్తల్లో ఉండే శృతిహాసన్ తాజాగా తను ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకొని తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో పెద్దఎత్తున హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
నా గుండె నిండా, ప్రతి ఆలోచనలోనూ నువ్వే..: శృతిహాసన్
నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకుంటున్న హీరోయిన్ శృతిహాసన్. తమిళంలో ఈమె చివరిగా నటించిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే శృతిహాసన్‌కు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. అంతకుమించి మంచి విజయాలు ఉన్నాయి. ఇటీవల చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ సరసన నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. ఈ రెండు ఒకేసారి విడుదలై రెండూ సక్సెస్ సాధించి తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల జాబితాలో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే శృతిహాసన్.. శాంతను హజారిక అనే ఆర్టిస్ట్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా శృతి తన ప్రియుడిని ఉద్దేశిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ‘నువ్వు చాలా ఉత్తముడివి. నా హృదయం నీతోనే ఉంది. నా ప్రతి ఆలోచనలోనూ నువ్వే ఉన్నావు. నాకు వెలుగందించిన సూర్యుడివి కూడా నువ్వే. ఈ ప్రపంచంలో అదృష్టవంతురాలిని నేనే‘ అని రాసుకొచ్చింది. ఇందుకు ఆమె ప్రియుడు శాంతను బదులుగా ట్వీట్ చేస్తూ ‘ నా ప్రేయసి నువ్వే. నా ప్రపంచం నువ్వే. నా సూర్యుడు నువ్వే. నా కడలి నువ్వే. నువ్వు చాలా ఉత్తమ యువతివి‘ అని పేర్కొన్నారు. వీరి ప్రేమ ముచ్చట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: ప్రెగ్నెన్సీ వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన సునీత -
Shruti Haasan: నాకు బలహీనతలు ఉన్నాయ్.. ఆ కామెంట్స్ చాలా బాధించాయి
దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా. ముఖ్యంగా అప్పుడప్పుడూ బాయ్ ఫ్రెండ్లతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ సంచలనం సృష్టిస్తుంటుంది. అయితే అన్నింటికీ మించి ప్రతిభ కలిగిన నటి ఈమె. అయితే తమిళంలో శృతిహాసన్ ప్రతిభకు తగ్గ విజయాలు ఇంకా రాలేదనే చెప్పాలి. తెలుగులో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ మెగాస్టార్ సరసన నటించిన వాల్తేరు వీరయ్య. బాలకృష్ణతో జత కట్టిన వీర సింహారెడ్డి చిత్రాలు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం విశేషం. అలాగే మరో స్టార్ హీరో ప్రభాస్‌తో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నటి శృతిహాసన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ నటిగా పరిచయమైన కొత్తలో అందరూ తన హైట్ గురించే మాట్లాడుకునే వారిని చెప్పారు. కొందరైతే ఇంత ఎత్తుగా ఉన్నావేంటి? నీ హైటే నీకు మైనస్ అంటూ కామెంట్స్ కూడా చేసేవారు అని చెప్పింది. అలాంటి కామెంట్స్ ఒక దశలో తనను బాధించాయని చెప్పారు. అయితే ఆ తర్వాత తన హైటే తనకు ప్లస్ పాయింట్ అన్నది గ్రహించానని చెప్పారు. తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల సరసన నటించే అవకాశం రావడానికి నా హైట్ నే కారణంగా మారిందని చెప్పారు. అయితే తనలోను కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వస్తున్నానని శృతిహాసన్ పేర్కొన్నారు. చదవండి: (1990లోనే నాకు పోటీగా ఒక నటుడొచ్చాడు!) -
సిమ్రాన్ రికార్డును 22 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేసిన శృతి హాసన్
-
Shruti Haasan: శృతిమించిన అవతారం!
లోకనాయకుడు కమలహాసన్ వారసురాలు శృతిహాసన్ అంటే నిర్మొహమాటానికి నిదర్శనం. గ్లామరస్‌కు చిరునామా అంటారు. ఈ బ్యూటీ ఏం చెప్పినా సంచలనమే. ఏం చేసినా వార్త. వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచే శృతిహాసన్ సంగీత దర్శకురాలిగా, నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈమె హిందీ, తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బహుభాష నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శృతిహాసన్‌కు తెలుగులోనే మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణకు జంటగా వీర సింహారెడ్డి ,ప్రభాస్‌తో సలార్ అంటూ క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒకేసారి విడుదలకు సిద్ధం అవుతుండటం విశేషం. కాగా శృతిహాసన్‌ను చూడ్డానికి ఎవరైనా ఇష్టపడతారు. అలాంటిది ఎవరికి రుచించని గెటప్‌లో శృతిహాసన్ తన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. సింపుల్ జుట్టుతో కూడిన రోజు. జ్వరం, సైనస్ కారణంగా ఉబ్బిన ముఖం. నెలసరి రోజు వంటి వాటిని మీరు ఇష్టపడతారా అంటూ ఆ ఫొటోలకు కారణాలను పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో శృతి ఏమిటీ అవతారం? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?) -
ఆలస్యమైనందుకు క్షమించండి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోహీరోయిన్లు మొక్కలు నాటడమే కాకుండా సహానటులను నామినెట్ చేస్తున్నారు. ప్రభాస్, హీరోయిన్ శృతిహాసన్‌లు ఇచ్చిన చాలెంజ్‌ను రానా దగ్గుబాటి స్వీకరించాడు. ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లో రెండు మొక్కలు నాటిన ఫొటోలను ట్విటర్ షేర్ చేస్తూ ఆలస్యంగా చాలెంజ్ స్వీకరించినందుకు క్షమాపణలు కోరడమే కాకుండా.. తనను ఫాలో అయ్యే ప్రతిఒక్కరిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేశాడు. ‘కాస్తా ఆలస్యమైనందుకు క్షమించండి. రెండు మొక్కలు నాటాను. ఒకటి ఆదిపురుష్ ప్రభాస్, మరోకటి రాక్‌స్టార్ శృతిహాసన్. అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నన్ను ఫాలో అవుత్ను ప్రతి ఒక్కరిని నామినేట్ చేస్తున్నా. ఇది గ్రీన్ ఇండియా కోసమే’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: ‘మహేష్ బాబు ఇది మీ కోసమే’) Little delayed but here are 2 one for the #Adipurush #Prabhas and the other for The rockstar @shrutihaasan here you go!! #GreenIndiaChallenge nominating everyone who follows me and has the means to....go for it! RT for a greener India!! pic.twitter.com/NnsN1pNpsa — Rana Daggubati (@RanaDaggubati) August 20, 2020 ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి తమిళ హీరో విజయ్ తళపతిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, సమంతా, రాశికన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలసిందే. అయితే ఇటీవల రానా వివాహం తన గర్ల్‌ఫ్రెండ్ మిహీక బజాజ్‌తో రామనాయుడు స్టూడియోలో ఆగష్టు 8న కుటుంబ సభ్యుల మధ్య జరిగిని విషయం తెలిసిందే. దీంతో రానా-మిహీకలకు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి) -
అమ్మా, నాన్న విడిపోవడం సంతోషమే
సినిమా: అమ్మా, నాన్న విడిపోతే ఎవరైనా బాధ పడతారు. అలాంటిది నటి శ్రుతీహాసన్ మాత్రం తనకు సంతోషమే అంటోంది. కమలహాసన్, సారికలు విడిపోయి చాలా కాలం అయింది. కమలహాసన్ చెన్నైలో నివాసం ఉంటుంటే, సారిక ముంబాయిలో ఉంటున్నారు. వారి కూతుళ్లు అయిన శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లు అటు తల్లితోనూ, ఇటు తండ్రితోనూ అనుబంధాలను పెనవేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. అయితే తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి కూతుళ్లిద్దరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల తన తండ్రి కమలహాసన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఈమె ఒక భేటీలో పేర్కొంటూ ఆ విషయంపై తనదైన తీరుతో స్పందించింది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ.. తన జీవితంలో ముఖ్యమైన భాగం నాన్న కమలహాసన్, అమ్మ సారికలదేనని అంది. సాధారణంగా అమ్మానాన్న విడిపోతే ఇతరులకు వార్త అవుతుందేమో, మా కుటుంబంలో మాత్రం అది బాధాకరమైనదే అవుతుంది. అయితే తన వరకూ అమ్మా, నాన్న విడిపోవడం సంతోషకరమేనంది. ఎందుకంటే తన తల్లీ,తండ్రి ఇద్దరూ ఆర్టిస్టులే. ఇద్దరూ ఒకరిపై ఒకరు గొడవ పడుతూ మనశాంతి లేకుండా జీవించడం కంటే విడిపోయి వారి వారి జీవితాలను సంతోషంగా గడపడమే ఉత్తమం అంది. అమ్మానాన్న విడిపోవడం కష్టంగా ఉన్నా, కలిసి జీవించినప్పుడు పలు సమస్యలు వచ్చేవని అంది. అమ్మా,నాన్నలను ఒకటిగా కలపాలని తానూ భావించానని, అయితే వారు మళ్లీ కలిస్తే ఒకరిపై ఒకరు గొడవలు పడి మనశాంతికి దూరం అవుతారంది. అందుకే తానా ప్రయత్నం చేయలేదని నటి శ్రుతీహాసన్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా లాభం చిత్రంలో నటిస్తోంది. త్వరలో తెలుగులో రవితేజతో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదే విధంగా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించడానికి రెడీ అవుతోంది. -
వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్
సినిమా: కమలహాసన్ ఇద్దరు కూతుళ్లు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లు తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. వీరిలో శ్రుతీహాసన్ ఇప్పటికే స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. రెండో కూతురు అక్షరహాసన్ సైతం ఇదే ప్రయత్నంలో ఉంది. అయితే ఇద్దరూ హిందీ చిత్రాలతోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. శ్రుతీహాసన్ లక్ చిత్రంతో పరిచయం కాగా, అక్షరహాసన్ సమితాబ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే అమితాబ్‌బచ్చన్, తమిళ నటుడు ధనుష్‌తో కలిసి నటించింది. అయినా ఆ తరువాత ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. ఆ మధ్య అజిత్ హీరోగా నటించిన వివేగం చిత్రంలో గెస్ట్‌గా మెరిసింది. ఆ తరువాత ఇటీవల తన తండ్రి కమలహాసన్ నటుడు విక్రమ్ హీరోగా నిర్మించిన కడారం కొండాన్ చిత్రంలో కీలక పాత్రను పోషించింది. ఇలా ముఖ్య పాత్రల్లోనే కానీ హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో నటి అక్షరహాసన్‌కు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. అయితే అది సినిమాలో కాదు. వెబ్ సిరీస్‌లో. నేడు వెబ్ సిరీస్‌లు సినిమాలకు ధీటుగా నిర్మాణం జరుగుతున్నాయి. కాజల్ అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ వైపు దృష్టిసారిస్తున్నారు. శ్రుతీహాసన్ సైతం ఇటీవల ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌కు సై అంది. అక్షరహాసన్ తమిళ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది అంతే తేడా. ఈ వెబ్ సిరీస్ ద్వారా నవ దర్శకుడు శివశంకర్ పరిచయం కానున్నాడు. ఇందులో నటి అక్షరహాసన్‌తో పాటు నటి సునైనా, గాయత్రి నటిస్తున్నారు. దీన్ని దర్శకుడు విష్ణువర్ధన్ నిర్మించడం విశేషం. ఈయన ఇంతకు ముందు అరిందుమ్ అరియామలుమ్, అజిత్ హీరోగా ఆరంభం, బిల్లా వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా అక్షరహాసన్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ సెల్‌ఫోన్ ఇతి వృత్తంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుందని సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్ అక్షరహాసన్ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. -
నిజమే నటిస్తున్నా..
సినిమా: నిజమే కొత్త చిత్రంలో నటిస్తున్నానని స్పష్టం చేసింది నటి శ్రుతీహాసన్. నటుడు కమలహాసన్ పెద్ద కూతురు అయిన ఈ సంచలన నటి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా తను మాత్రం తన తండ్రి రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే తన వారసులు రాజకీయాల్లోకి రారని కమలహాసన్ చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారన్నది గమనార్హం. కాగా శ్రుతీహాసన్ నటించిన చిత్రం తెరపైకి వచ్చి రెండేళ్లకు పైనే అవుతోంది. కోలీవుడ్‌లో సింగం–3 తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. నిజానికి ఈ బ్యూటీకి తమిళం, తెలుగు, హింది మూడు భాషల్లోనూ క్రేజ్ ఉంది. అయినా నటించకపోవడానికి అవకాశాలు రాకా, లేక వస్తున్నా నిరాకరిస్తోందా? అన్నది ప్రశ్నార్ధకమే. తన తండ్రితో కలిసి తొలిసారిగా నటించడానికి సిద్ధం అయిన త్రిభాషా చిత్రం శభాష్‌నాయుడు మధ్యలోనే ఆగిపోయింది. సంగీత ఆల్బమ్స్, బుల్లితెర షోలతో కాలం గడిపేస్తున్న శ్రుతీహాసన్ సుధీర్ఘ విరామం తరువాత దక్షిణాదిలో నటించడానికి సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో ఎస్పీ.జననాథన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి శ్రుతీహాసన్ తమిళంలో ఒక చిత్రం చేయబోతున్న విషయం నిజమేనని తెలిపింది. అంతే కాదు మే నెలలో ఒక తెలుగు చిత్రంలోనూ నటించనున్నానని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందిలో ఒక చిత్రంలో నటిస్తోంది. దీంతో మళ్లీ ఈ సంచలన నటిని తెరపై వరుసగా చూడబోతున్నామన్న మాట. -
సైరాలో శ్రుతి ఉంటుందా?
సినిమా: ‘సైరా’లో శ్రుతి ఉంటుందా? ఇప్పుడిదే ఆసక్తిగా మారిన విషయం. సైరా అనగానే చాలా మందికి అర్థమై ఉంటుంది. అవును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత భారీ చిత్రం సైనా నరసింహారెడ్డి. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నటుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాహుబలి తరువాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లోనూ తెరకెక్కుతోంది. భారతీయ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులు పలువురు నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్ రైజింగ్‌స్టార్ విజయ్‌సేతుపతి వంటి వారు సైరాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అగ్రనటి నయనతార చిరంజీవికి జంటగా రాణి పాత్రలో నటిస్తుండగా, మిల్కీబ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా సంచలన నటి శ్రుతిహాసన్ కూడా మరో ముఖ్య పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. శ్రుతిహాసన్ దక్షిణాదిలో నటించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. తండ్రి కమలహాసన్‌తో కలిసి నటించిన శభాష్‌నాయుడు మధ్యలోనే ఆగిపోయింది. అది పూర్తి అవుతుందనే నమ్మకం లేదు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బుల్లితెరపైనా రియాలిటీషో చేస్తోంది. ఇక తనకు చాలా ఇష్టం అయిన సంగీత రంగంలో మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ బిజీగా ఉంది. అలాంటిది సైరానరసింహారెడ్డి చిత్రంలో నటించడానికి సై అంటుందా అన్నది ఆసక్తిగా మారింది. -
28 నుంచి బుల్లితెరపై..
సినిమా: ఈ నెల 28 నుంచి శ్రుతిహాసన్ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి రెడీ అవుతోంది. ఆమె తండ్రి కమలహాసన్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో అంటూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తే, తాజాగా ఆయన తనయ శ్రుతిహాసన్ హలో సాగో అంటూ బుల్లితెర ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీడియో సేవలందిస్తున్న వైవ్ సంస్థ, మోషన్ కంటెంట్ గ్రూప్‌తో కలిసి వైవ్ హలో సాగో పేరుతో చర్చావేదిక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఈ కార్యక్రమానికి సంచలన నటి శ్రుతిహాసన్ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తెలుగులో నంబర్‌ఒన్ యారీ పేరుతో ప్రసారం అవుతోంది. దానికి నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటుల వ్యక్తిగత విషయాలను వెల్లడించి ప్రేక్షకుల ముందు తమ మరో కోణాన్ని ఆవిష్కరిస్తారని నిర్వాహకులు తెలిపారు. తారలు తమ నిజ జీవితాల్లోని రహస్యాలను ప్రేక్షకులతో పంచుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి శ్రుతిహాసన్ ఈ సందర్భంగా స్పందిస్తూ సాధారణంగా ఎంటర్టెయిన్మెంట్ రంగానికి చెందిన వారు వారి అంతరంగ విషయాల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరన్నారు. అయితే ఈ వైవ్ హలో సాగో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తారల మరో ముఖాన్ని చూడగలరని చెప్పారు. తారలు నిజాయితీగా చెప్పే విషయాలు, వారి అందమైన జీవిత పయనాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా 13 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు వైవ్ యాప్‌తో పాటు సన్ టీవీలోనూ ఏకకాలంలో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. -
చిన్న చూపు చూడొద్దు
‘‘మహిళలకు గౌరవం లభించడం లేదంటే నేను ఒప్పుకోను. కొన్ని చోట్ల వాళ్లకు అవమానాలు ఎదురవుతున్న విషయం వాస్తవమే. అయితే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు గౌరవం పెరిగింది. మగవాళ్లకు సమానంగా దూసుకెళుతున్నారు. అనుకున్నది సాధిస్తున్నారు. అందుకే ప్రస్తుత సమాజంలో గౌరవం పెరిగింది. ఇతర వృత్తుల్లో నిరూపించుకున్న మహిళలను ఎలా గౌరవిస్తున్నారో సినిమా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుంటున్నవారినీ అలానే గౌరవించాలి. సినిమా వాళ్లు అని చిన్నచూపు చూడొద్దు’’ అంటున్నారు శ్రుతీహాసన్. అమెరికాలో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో కమల్, శ్రుతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పైవిధంగా పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘నేను హీరోయిన్ అయి దాదాపు పదేళ్లవుతోంది. ఈ జర్నీలో నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో ఉమెన్‌కి సేఫ్టీ ఉంది’’ అన్నారు. ప్రస్తుతం హిందీ చిత్రంలో నటిస్తున్నానని, అది పూర్తి కాగానే తండ్రి కమల్‌హాసన్ కాంబినేషన్లో మొదలై, తాత్కాలిక బ్రేక్ పడిన ‘శభాష్ నాయుడు’ షూటింగ్ ఆరంభిస్తామని శ్రుతీహాసన్ అన్నారు. -
లవ్ లండనింగ్!
శ్రుతిహాసన్ సౌతిండియన్ సినీ పరిశ్రమలో హాట్ అన్డ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగు, తమిళ సినిమాలతో నిరంతరం బిజీగా ఉంటారామె. ఎప్పుడైనా ఈ భారీ సినిమాల మధ్య కాస్త సమయం దొరికితే ఆ సమయంలో శ్రుతిహాసన్ ఏం చేస్తారో తెల్సా? చక్కగా బ్యాగు సర్దుకొని లండన్‌లో వాలిపోతారు. లండన్ అంతా తిరిగేస్తారు. అంతిష్టం శ్రుతిహాసన్‌కు లండన్ అంటే! మరి అంత ఇష్టం ఉన్నప్పుడు, లండన్‌లో ఉంటూ అక్కడ తిరగడమన్నది తనకు అంత ఆనందాన్ని ఇస్తున్నప్పుడు దానికో పేరు పెట్టుకోవాలి కదా అని శ్రుతి బాగా ఆలోచించి ఆలోచించి ‘లండనింగ్’ అని పేరు పెట్టుకున్నారు. ఇలాంటి పదం డిక్షనరీలో ఎక్కడా కనిపించదు. శ్రుతి తనకు లండన్‌పై ఉన్న ప్రేమను చెప్పేందుకు పెట్టుకున్న, కనిపెట్టుకున్న పదం అది. అక్కడే ఆమె ఒక లండన్ బేస్డ్ నటుడ్ని కలుసుకుందని, అతనితో ప్రేమలో ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే శ్రుతి దీని గురించి ఇప్పటికింకా బయటైతే ఏమీ చెప్పలేదు. -
తారుమారు
సినిమా కథల్లోలాగే సినిమా మేకింగ్‌లో కూడా ట్విస్టులుంటాయి. మన ఒళ్లో పడ్డ బంగారాన్ని ఇంకొకరికి అప్పజెప్పడం.. మనకి వర్కవుట్ కాదనుకున్నది ఇంకొకరికి బీభత్సంగా వర్కవుట్ అవ్వడం... మనకు ఫిట్ కాదనుకున్నది ఇంకొకరికి హిట్ అవ్వడం..ఇలాంటి ట్విస్టులు మారుమారు తారుమారు. ‘ప్రాప్తమున్న తీరానికి పడవ చేరుకుంటుంది’ అన్నాడొక కవి. ‘దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్’ అంటాడు ఉత్తర దేశపు యతి. ‘అంతా లలాట లిఖితం’ అనుకుంటాడు వేదాంతి. ఏమైనా అటుకులు చిటుకులు మారుతుంటాయి. త్రాసులోని పళ్లేలు ఉల్టాపల్టా అవుతుంటాయి. పూలు పండ్లవుతుంటాయి. పండ్లు పేస్ట్రీలవుతుంటాయి. రజనీకాంత్ అన్నట్టు ‘దక్కేది దక్కకుండా పోదు దక్కనిది ఎన్నటికీ దక్కదు’. మొన్న చూడండి... ‘ఆర్ ఎక్స్ హండ్రెడ్’ పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు తెలియదు... హీరో తెలియదు... హీరోయిన్ తెలియదు... కాని రెండు కోట్లతో తీసిన సినిమాకు 10 కోట్లు వచ్చాయని టాక్. ఈ సినిమా మొదట హీరో నిఖిల్ దగ్గరకు పోయిందట. సుధీర్ దగ్గరకు కూడా పోయిందట. కాని వాళ్లు రిజెక్ట్ చేశారు. ఆ సినిమా కోసం ఫోకస్ చేయాల్సిన కెమెరా ఎదుట నిలవాల్సింది ‘కార్తికేయ గుమ్మకొండ’ అని విధి నిర్ణయించినప్పుడు ఇలాంటి వైచిత్రే చోటు చేసుకుంటూ ఉంటుంది.సినిమాల్లో ఇవి మామూలే. అవకాశం రానంత వరకూ ఒక బాధ. అవకాశం వచ్చి వదులుకోవాల్సినప్పుడు ఇంకో బాధ. సరిగ్గా జడ్జ్ చేయకుండా వదిలేసి అది కాస్త హిట్ అయితే ఇంకో బాధ. ఇంద్రగంటి మోహనకృష్ణ రెండు హిట్స్ ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ కూడా మొదట వేరే హీరోల దగ్గరకు వెళ్లాయి. ‘జెంటిల్మెన్’ కోసం శర్వానంద్, వరుణ్‌తేజ్‌లను సంప్రదించాడు దర్శకుడు. కాని ఆ హిట్ నానీ అకౌంట్లో పడింది. ‘సమ్మోహనం’ కోసం కూడా నిఖిల్‌ని, నానిని అనుకుంటే ఆ సినిమాలోని కీలక సన్నివేశం టెర్రస్ సీన్ లాంటిది గతంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో సమంతతో తాను చేసి ఉన్నాడు కనుక నాని ఆలోచనలో పడ్డాడని ఫలితంగా ఆ మిఠాయి పొట్లం సుధీర్ జేబులో పడిందని సమాచారం. ‘బాహుబలి’ కోసం శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకుంటే ఆ బర్గండీ రంగు చీర ధరించే పాత్రకు రమ్యకృష్ణ హక్కుదారు కాలేదూ? సక్సెస్ అనే ఏనుగు మాల పట్టుకొని వీధిలోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అది మన మెడలో పడేలా చూసుకోవాలి. లేకుంటే అర్ధరాజ్యం, రాకుమారి ఎవరి పరమో అయిపోతుంది. ‘శతమానం భవతి’ మొదట సాయిధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. ఎందుకో వర్కవుట్ కాలేదు. రాజ్ తరుణ్‌కు కూడా ఈ సినిమా చిక్కాల్సింది. అయితే చిక్కించుకున్నవాడు శర్వానంద్. ఇక దర్శకుడు వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం మొదట అనుకున్నది ఎన్.టి.ఆర్‌ను అన్న సంగతి తెలిసిందే. జరిగిపోయిన సినిమాల కథ ఇలా ఉంటే జరుగుతున్న సినిమాల కథ కూడా కుతూహలం రేపుతోంది. శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’గా రవితేజను చూపించాలని సినిమా మొదలుపెట్టారు. హీరోయిన్గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకున్నారు. కాని అనూకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వివాదం ఎటుపోయి ఎటు వస్తుందని అనుకున్నారో ఏమో అనూ ఇమ్మాన్యుయేల్ ఓ స్టేట్మెంట్ ఇస్తూ నాగచైతన్యతో ‘ శైలజారెడ్డి అల్లుడు’ చేస్తున్నాను. ఆ డేట్స్ రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ డేట్స్‌తో క్లాష్ అవుతున్నాయి. అందుకే రవితేజ సినిమా నుంచి తప్పుకుంటున్నాను అన్నారు. వాస్తవం ఏదైనా ఈ అవకాశం ఇలియానాకు ప్రాప్తమైంది. బాలీవుడ్‌కు వెళ్లి తెలుగుకు ఆరేళ్లుగా దూరంగా ఉన్న ఇలియానా ఈ సినిమాతో మళ్లీ కనిపించనుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం, బుక్ మై షోలో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా పాత్రలు మారే తీరు తమిళంలో ఇంకా ఊపు మీద ఉంది. దర్శకుడు సి.సుందర్ అక్కడ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సంఘమిత్ర’ అనే సినిమా పనులు మొదలెట్టారు. లీడ్ రోల్ శ్రుతిహాసన్‌కు వెళ్లింది. జయం రవి, ఆర్య కీలక పాత్రలు. అంతా హ్యాపీనే అనుకుంటూ ఉన్నప్పుడు ట్విస్ట్ వచ్చింది. ‘సంఘమిత్ర’ టీమ్‌తో తనకు సెట్ కావడం లేదని, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదని, క్యాలెండర్ డిటేల్స్ కూడా చెప్పలేదని శ్రుతి ఆరోపించారు. సినిమా నిర్మాతలు ఇంకో వెర్షన్ చెప్పారు. శ్రుతితో ఎఫెక్టివ్‌గా పని చేయలేమని మేమే నిర్ణయించుకున్నాం అన్నారు. మరి సంఘమిత్ర పాత్రను ఎవరు చేయబోతున్నారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నయనతార, అనుష్క, హన్సిక ఇలా సౌత్‌లో చాలామంది టాప్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఫైనల్‌గా ‘ఎం.ఎస్.ధోని’లో నటించిన దిశా పాట్నీకి ఆ చాన్స్ వెళ్లింది. త్రిష కూడా ఇటీవల ఇలాగే తప్పుకున్నారు. విక్రమ్ హీరోగా ఆమె హీరోయిన్గా హరి దర్శకత్వంలో ‘సామీ స్క్వేర్’ అనే సినిమా మొదలైంది. ఇది గతంలో పెద్ద హిట్టయిన ‘సామీ’కి సీక్వెల్. మొదటి భాగంలో నటించినందున తనను రిపీట్ చేశారని త్రిష అనుకున్నట్టున్నారు. అయితే నిర్మాతలు కీర్తి సురేష్‌ను హీరోయిగా తీసుకుని త్రిష చేస్తున్నది సెకండ్ హీరోయిన్ పాత్ర అనే హింట్ ఇచ్చారు. ఒక రకంగా చూస్తే ఇది పూలమ్మిన చోట కట్టెలమ్మడం అవుతుంది. దాంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరుతో త్రిష తప్పుకుంటే ఆ నూకలు ‘ఐశ్వర్య రాజేష్’కు దక్కాయి. ఇలా తమిళ సాంబారుకు తెలుగు పోపు పడిన మరో ఘటన కూడా జరిగింది. సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా మొదలైతే అందులో అల్లు శిరీష్ ఒక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ లండన్‌లో షూటింగ్‌కు మరో తమిళ నటుడు ఆర్య శిరిష్ స్థానంలో హాజరైనట్టు తెలిసింది. ఏం జరిగిందో తెలియదు కానీ డేట్స్ ప్రాబ్లమ్‌తో నేనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను అని అల్లు శిరీష్ స్టేట్మెంట్ ఇచ్చారు. దర్శకుల విషయంలో కూడా మార్పుచేర్పులు జరగడం ఇటీవల జరుగుతోంది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’కు మొదట దర్శకుడిగా సంపత్ నందిను అనుకున్నారు. కానీ ఆ అవకాశం బాబీకి దక్కింది. ‘కాటమరాయుడు’ కోసం ఎస్.జె.సూర్య సైన్ చేశారు. కానీ షూటింగ్ కూడా మొదలయ్యే దశలో ఆ అవకాశం కిశోర్ పార్థసాని (డాలీ)కు దక్కింది. హిందీలో హిట్ అయిన ‘క్వీన్’ దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగులో అవకాశం నీలకంఠకు వెళ్లింది. హీరోయిన్గా తమన్నాను తీసుకున్నారు. అయితే దర్శకునికీ హీరోయిన్‌కు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని వార్తలు పొక్కాయి. దర్శకుడు మారాడు. నీలకంఠ స్థానంలో ‘ఆ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మెగాఫోన్‌ను ధరించాడు. సినిమా పేరు ‘దటీజ్ మహాలక్ష్మి’. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్ బయోపిక్ తేజ దర్శకత్వంలో హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. కాని కొన్ని రోజులకు ఈ సినిమా నుంచి తేజ తప్పుకోనున్నారట అనే లీకులు వినిపించాయి. చివరికి ఈ లీకులే నిజమైయ్యాయి. ఆ స్థానంలో దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత అయినా దర్శకుడు అయినా హీరో అయినా ఒక సినిమా గురించి ఆలోచించినప్పుడు మొదట కోరుకునేది సక్సెస్‌నే. కొన్ని పాత్రలు కొందరు చేస్తే బాగుంటుందని అనుకోవచ్చు. కాని అన్నిసార్లు అది కుదరక పోవచ్చు. వాటిని దక్కించుకున్నవారు అనుకున్నవారి కంటే బాగా చేసి మెప్పించవచ్చు. తెర వెనుక జరిగే ఈ విషయాలు సినీ అభిమానులకు ఆసక్తి కలిగించేవే. కాని థియేటర్లో వారు ప్రేక్షకులుగా కూచున్నప్పుడు తెర మీద ఏం కనిపిస్తున్నది తమను ఎలా మెప్పిస్తున్నదే ముఖ్యం. మార్పుచేర్పులతో కూడా సినిమాకు మంచే జరగాలని కోరుకుందాం. భానుమతి బదులు సావిత్రి పాత రోజులలో కూడా చాలా రీప్లే్లస్మెంట్స్ ఆర్టిస్టులకు లాభించాయి. ‘మిస్సమ్మ’లో మొదట భానుమతిని అనుకుని కొంచెం షూటింగ్ తర్వాత ఆమెను తొలగించి సావిత్రిని తీసుకున్నారు. ఆ సినిమాతో ఆమె స్టార్ అయ్యింది. అలాగే జానపదాలకు పేరు గడించిన అక్కినేనిని మొదట ‘పాతాళభైరవి’కి అనుకున్నారు. కానీ ఎన్.టి.ఆర్. తోటరాముడుగా స్టార్ అయ్యారు. సాంఘికాలతో గుర్తింపు పొందుతున్న ఎన్.టి.ఆర్‌ను ‘దేవదాసు’కు అనుకున్నారు. ఎ.ఎన్.ఆర్ ఆ పాత్ర వేసి కీర్తి పొందారు. ‘రక్తసంబంధం’ సినిమా మొదట ఎ.ఎన్.ఆర్కు వెళ్లింది. కానీ చెల్లెలి పాత్రలో సావిత్రి ఉంటే తమ జంటను యాక్సెప్ట్ చేయరేమో అన్న సందేహం ఆయన వ్యక్తం చేశారు. ఆ పాత్ర ఎన్.టి.ఆర్కు చాలా పేరు తెచ్చి పెట్టింది. ‘సాగర సంగమం’లో హీరోయిన్ వేషం మొదట జయసుధకు వెళ్లింది. కానీ జయప్రదకు ఆ పాత్ర రాసి పెట్టి ఉంది. ‘పడమటి సంధ్యారాగం’లో హీరోయిన్గా చేయాల్సింది సుహాసిని. కానీ ఎంతో చక్కగా ఆ పాత్ర పోషించి విజయశాంతి పేరు తెచ్చుకున్నారు. ‘ఖైదీ’ సూపర్‌స్టార్ కృష్ణ చేయాల్సింది. కానీ చిరంజీవికి దక్కి పెద్ద స్టార్ అయ్యారు. ‘సమరసింహారెడ్డి’ కథ మొదట వెంకటేశ్ దగ్గరకు వెళ్లింది. కానీ బాలకృష్ణ ఆ పాత్రతో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఇక రవితేజతో చేయాల్సిన ‘పోకిరి’ మహేశ్‌బాబుకు దక్కి ఆయన కెరీర్‌ను ఎంత మలుపు తిప్పిందో తెలిసిందే. – సినిమా డెస్క్, ఇన్పుట్స్: శివాంజనేయులు -
స్త్రీలోక సంచారం
::: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌లో న్యాయం ఉందా అని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన పోలింగ్‌కు 57 శాతం మంది ఆమెను సమర్థిస్తూ, 43 శాతం మంది ఆమెపై వస్తున్న ట్రోలింగ్‌ని సమర్థిస్తూ కామెంట్లు పెట్టారు. మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని చెత్త ప్రశ్నలతో అవమానించారన్న ఆరోపణపై లక్నోలోని పాస్‌పోర్ట్ సేవాకేంద్రం అధికారి వికాశ్ మిశ్రాను అక్కడి నుంచి బదలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ‘అల్పసంఖ్యాకులను బుజ్జగించడం మానకుంటే మీకు తగినశాస్తి జరిగి తీరుతుంది’ అంటూ సుష్మపై మొదలైన ట్రోలింగ్ నేటికీ కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో తాజాగా, ‘నీ భార్యను కొట్టి చెప్పు. ముస్లింలను మంచి చేసుకోవడానికి హిందువులను చెడు చేసుకోవద్దని’ అంటూ సుష్మ భర్త స్వరాజ్ కౌషల్‌కు కూడా ట్రోలింగ్లు వస్తున్నాయి ::: చిలక కోసం ఆన్లైన్లో 71 వేల రూపాయలు చెల్లించి, ఆ చిలక ఎంతకూ డెలివరీ కాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న శ్రీజా (32) అనే పక్షి ప్రేమికురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో ఉంటున్న శ్రీజ.. ‘కొనేందుకు మంచి చిలక ఎక్కడ దొరుకుతుందీ’ అంటూ ఆన్లైన్లో ఆరా తీస్తున్నప్పుడు వాట్సాప్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్న బాబీ అనే వ్యక్తి, తనొక చిలకల వ్యాపారినని, తన అకౌంట్లో డబ్బులు జమ చేస్తే చిలక డెలివరీ అవుతుందని నమ్మించి మోసం చేయడంతో.. అతడు తన ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడుకున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు ::: ‘నేను అయ్యంగార్ల అమ్మాయిని’ అని 2014లో శృతీహాసన్ స్పష్టం చేస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో.. ఆమె తండ్రి, సినీ నటుడు, ‘మక్కల్ నీది మయం’ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు కమలహాసన్పై సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ట్విట్టర్లో కమలహాసన్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘‘నా ఇద్దరు కూతుళ్లను స్కూల్లో చేర్పించేటప్పుడు దరఖాస్తు ఫారంలో ‘క్యాస్ట్ అండ్ రిలిజయన్’ కాలమ్‌ని నింపేందుకు తిరస్కరించానని’’ చెప్పడంతో వెంటనే ఆయన ప్రత్యర్థులు శృతీ వీడియోను తవ్వి తీసి ‘దీని సంగతేమిటి?’ అని ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టారు ::: జమ్ము–కాశ్మీర్లో రాళ్లు రువ్వే నిరసనకారులలో ఇప్పుడు కొత్తగా యువతులు కూడా కనిపిస్తుండడంతో వారిని నిరోధించేందుకు సెంట్రల్ రిజర్వు›్డ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్) 500 మంది మహిళా కమెండోలను రంగంలో దించింది. పంప్ యాక్షన్ గన్స్, షాట్ గన్స్, పెలెట్స్ గన్స్ పేల్చడంలో సుశిక్షితులై, స్థానికంగా హింస జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో దారితెన్నులపై అవగాహన ఉన్న ఈ కమెండోలు సమర్థంగా అల్లర్లను అడ్డుకోగలరని విశ్వసిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్. గతంలో నక్సల్స్‌ను నిలువరించేందుకు కూడా కొంతమంది మహిళా కమెండోలను అడవుల్లోని యుద్ధక్షేత్రానికి పంపింది. స్త్రీ మనస్ఫూర్తిగా సమ్మతించనిదే ఆమెతో సంగమించడం కూడా అత్యాచారమే అవుతుందనే చట్ట సవరణ ఒకటి ఒకటి ఈ ఆదివారం నుంచి స్వీడన్లో అమలులోకి వచ్చింది. భయపెట్టి, బలప్రయోగం చేసి, హింసించి స్త్రీని లోబరుచుకున్నప్పుడు మాత్రమే అది ‘అత్యాచారం’ అవుతుందని ఇప్పటి వరకు స్వీడన్ చట్టంలో ఉన్నదానికి భిన్నంగా, ఇలాంటివేమీ జరగకున్నా.. స్త్రీని నిస్సహాయ స్థితిలోకి నెట్టి, ‘వద్దు’ అనడానికి వీల్లేని పరిస్థితులు కల్పించి ఆమెను పొందడం కూడా ‘రేప్’ కిందికే వస్తుందని పేర్కొంటూ.. చూపులు, మాటలు, మరే విధమైన సంకేతాలు ఇవ్వకుండానే మగవాడు స్త్రీ ని శారీరకంగా ఆక్రమించడాన్ని ఇక మీదట నేరంగా పరిగణించడం జరుగుతుందని కొత్త చట్ట సవరణ స్పష్టం చేసింది ::: విక్టోరియా బర్జెస్ అనే ఫ్లారిడా మహిళ క్యూబా నుంచి ఫ్లారిడా వరకు స్టాండప్ పెడల్బోర్డు మీద 160 కి.మీ. ప్రయాణించి ఇలాంటి ఒక సాహసోపేతమైన పర్యటన చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. అట్లాంటిక్ జలసంధిపై ఏకబిగిన 28 గంటలపాటు విక్టోరియా ఎంతో ధైర్యంగా, ఒడుపుగా పెడలింగ్ చేశారు :: పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్.. గెడ్డంతో ఉన్న ఒక ఇస్లాం మత పెద్ద ఫొటోను మార్ఫింగ్ చేసి ఫొటోషాప్‌లో ఆయన ముఖం స్థానంలో తన ముఖాన్ని పెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనానికి కారణం అయ్యారు. ఈ చర్యతో ఒకవైపు ఆమెపై విమర్శలు కురుస్తుండగానే, ఏ మత పెద్ద ఫొటోనైతే రెహమ్ తనకు తెలియకుండా మార్ఫింగ్‌కి వాడుకున్నారో ఆ జింబాబ్వే మతపెద్ద ట్విటర్లో స్పందిస్తూ అది తన ఫొటో అని చెప్పగానే, ‘మీపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఇది కేవలం సరదాగా, నన్ను వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (భర్త ఇమ్రాన్ ఖాన్ పార్టీ) కార్యకర్తలపై సంధించిన విమర్శనాస్త్రం మాత్రమే అని ఆమె సమాధానం ఇచ్చారు ::: యు.కె.లోని ఒక ఇండియన్ రెస్టారెంట్లో భారతీయుల ఉద్దేశించి ఒక బ్రిటిష్ మహిళా పోలీసు అధికారి చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై స్పందించిన ఇంగ్లండ్ పోలీస్ శాఖ ఆమెను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని నార్తంబ్రియా పోలీస్ శాఖలో పని చేస్తున్న కటీ బ్యారెట్ అనే 22 ఏళ్ల ఆ కుర్ర ఆఫీసరమ్మ న్యూక్యాజిల్ ప్రాంతంలోని ‘స్పైస్ ఆఫ్ పంజాబ్’ అనే ఆ ఫుడ్ ఔట్‌లెట్‌కు తినడానికి వచ్చి, నోరు ఊరుకోక అక్కడ పనిచేస్తున్న భారతీయ వెయిటర్లను ఉద్దేశించి తన సహోద్యోగులతో జాత్యహంకార వ్యాఖ్యల్ని చేసినట్లు, వేరెవరో కస్టమర్ల ద్వారా తెలుసుకున్న బ్రిటన్ పోలీసులు కటీని విధుల నుంచి తొలగించారు ::: -
అబ్బీయా? హబ్బీయా?
మనం వర్కవుట్ కావడం లేదు. దేనికండీ వర్కవుట్ కాందీ?!ఏడడుగులకు. మరి హీరోయిన్లకు ఏం కావాలట?సెవెన్‌స్టెప్స్ వెయ్యాలంటేసెవెన్ ‘సీ’స్ అవతలికి వెళ్లాల్సిందేనట!తెలుక్కి ఫారిన్ అయిన ముంబై, ఢిల్లీ..చండీఘర్, గోవా, కేరళ.. ఇలా..అన్ని ప్రదేశాల నుంచీ మనం... హీరోయిన్లను తెచ్చుకుంటే..వేరే దేశాల వాళ్లను వీళ్లు భర్తలుగా తెచ్చుకుంటున్నారు!అబ్బీలు వద్దు.. హబ్బీలు కావాలంటున్నారు. ఇదండీ.. ఫారిన్ మొగుళ్ల కథ. పిజ్జాకీ పరాటాకీ ఫ్రెండ్షిప్ కుదిరిందిసూట్కీ పట్టుచీరకీ లెక్క కుదిరిందివాటమ్మా వాటీస్ దిస్సమ్మా అనుకుంటున్నారా?అవును మరి.. నువ్వా దరి నేనీ దరి..గుండె చెదిరి.. దేశీ గాళ్స్ విదేశీ బాయ్స్‌తో లవ్‌లో పడుతున్నారు.ఇప్పుడు పిజ్జా మనదైపోయింది.. పరాటా వాళ్లదైపోయిందిఇక్కడి వంటకాలు వాళ్లకూ వాళ్ల వంటకాలు మనకూ..ఇక్కడి ఆచారాలు వాళ్లకూ.. అక్కడ ఆచారాలూ మనకూ అలవాటైపోతున్నాయ్ హద్దులు చెరిగిపోతున్నాయ్..అంతా ప్రే‘మాయ’ణం చేసిన మేజిక్. మొన్న విదేశీ అబ్బాయ్ ఆండ్రీ కోశ్చివ్ని శ్రియ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇంకా విదేశీయులతో లవ్‌లో మన తారలు, ఆల్రెడీ పెళ్లాడిన జంటల గురించి సరదాగా చెప్పుకుందాం. మన ఇల్లూ (ఇలియానా) బేబీ పుట్టింది గోవా. పెరిగింది ముంబైలో. స్టార్ అయింది తెలుగులో. ఇక్కణ్ణుంచి హిందీకి వెళ్లి అక్కడా హీరోయిన్గా రన్ మొదలుపెట్టింది. నార్త్ టు సౌత్ ఈ బ్యూటీ జర్నీ జోరుగానే ఉంది. అంతేనా? ఈ జర్నీ ఇప్పుడు ఫారిన్ వరకూ వెళ్లింది. ఇది ఏడడుగుల జర్నీ. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆండ్రూ నాకు వెరీ స్పెషల్’ అని పలు సందర్భాల్లో పేర్కొన్న ఇలియానా ఆ మధ్య ‘హబ్బీ..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అంటే.. భర్త అన్నమాట. మూడు ముళ్లు పడిన సంగతి మాత్రం బయటపెట్టడంలేదు. ఏమైనా.. ఈ ఇద్దరూ ప్రస్తుతం రిలేషన్లో ఉన్నారు. ఇలియానా తర్వాత ఆ రేంజ్లో లవ్ న్యూస్‌లో ఉన్న మరో బ్యూటీ తాప్సీ. అదేంటో కానీ.. ఈ ముద్దుగుమ్మ లైఫ్ రెండు మూడేళ్లుగా స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతోంది. ‘వన్ లవ్’ అంటోంది. అవును మరి.. తాప్సీ లవ్‌లో పడింది డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో కదా. పైగా తాప్సీ ‘సూర్మ’ అనే సినిమాలో హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. స్పోర్ట్స్‌తో అలా లంకె కుదిరింది. ‘మథియాస్ బో నాకు చాలా కావల్సినవాడు’ అని కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు తాప్సీ. ఈ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషప్షిప్ ఉందని టాక్. ఇలా విదేశీ స్పోర్ట్స్మేన్తో లవ్‌లో పడితే పాపం.. మనవాళ్లు ఏం కాను? అనుకోవడానికి కాలేదు. దేశీ భామ అనుష్క శర్మ ప్రేమించింది దేశీ స్పోర్ట్స్‌మేన్ విరాట్ కోహ్లీనే కదా. తాప్సీ, ఇలియానా,.. ఈ ఇద్దరి తర్వాత ఈ మధ్య ఫ్రెష్‌గా విదేశీ లవ్ క్లబ్లో చేరిన భామ శ్రుతీహాసన్. పాప పట్టుచీర బ్యాచ్. లవ్‌లో పడింది సూట్ బ్యాచ్‌తో. లండన్‌కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో లవ్‌లో ఉన్నారు శ్రుతీహాసన్. ‘అవును లవ్‌లో ఉన్నా’ అని ఆమె చెప్పకపోయినా ఆ మధ్య ఓ పెళ్లికి మైఖేల్‌తో కలిసి శ్రుతివెళ్లడం, సూట్ వేసుకోవాల్సిన మైఖేల్ అచ్చ తమిళ పంచె కట్టుతో హాజరు కావడం, పింక్ కలర్ పట్టుచీరలో శ్రుతీహాన్ అతని పక్కనే మెరవడం.. నో డౌట్ సూట్‌కీ పట్టుచీరకీ జోడీ కుదిరిందని పించాయి. తండ్రి కమల్‌హాసన్‌కీ, తల్లి సారికకూ మైఖేల్‌ని పరిచయం చేశారు కూడా. మైఖేల్, శ్రుతి, సారిక కొన్ని ఫొటోల్లో కనిపించగా, పెళ్లి వేడుకలో కమల్, శ్రుతి, మైఖేల్ ఒకే వరసలో పక్కపక్కన కూర్చుని ఉండటం గమనార్హం. అలాగే శ్రుతీ రీసెంట్ బర్త్‌డేని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి జరుపుకోవటం కోసం లండన్ వరకూ వెళ్లింది. ఆయన ‘నా భర్త కాదు’... సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్ గురించి హాట్ గాళ్ మల్లికా శెరావత్ కొన్నాళ్ల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఫ్రెంచ్ టైకూన్ సిరిల్‌తో తన ప్రేమను, పెళ్లిని మల్లిక ఓపెన్‌గా ఒప్పుకోవడానికి ఇష్టడపటంలేదు. అయితే ఈ ఇద్దరి తీరు మాత్రం ‘సమ్‌థింగ్’ ఉందనే ఫీలింగ్ చాలామందికి కలిగించింది. ఏమీ లేకపోతే మల్లికాతో కలసి సిరిల్ ముంబై ఎందుకొస్తాడు? ప్యారిస్‌లో ఈ ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఎందుకు ఉంటారు? పైగా ఈ జంట ఉంటున్న అపార్ట్మెంట్ అద్దె (60 లక్షలు) సరిగ్గా కట్టకపోతే యజమాని కోర్టుకు ఈడ్చాడు కూడా. అప్పుడు మాత్రం అసలు ఆ అపార్ట్మెంట్ గురించి నాకేం తెలియదని మల్లికా అంది కానీ సిరిల్ ‘మంచి ఫ్రెండ్’ అంది. మరి.. ఆల్రెడీ ఈ జంట పెళ్లి చేసుకుందా? అనే క్వొశ్చన్‌కి ప్రస్తుతానికి నో ఆన్సర్. మరి.. శ్రియ పెళ్లాడినట్లు.. ఇలియానా, తాప్సీ, శ్రుతీహాసన్ కూడా తమ బాయ్‌ఫ్రెండ్‌తో మూడు ముళ్లు వేయించుకుంటారా? వెయిట్ అండ్ సీ. జీన్‌తో జింతా ప్రేమంటే ఇదేరా అంటూ ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడారు ప్రీతీ జింతా. ఈ నార్త్ బ్యూటీ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ‘ప్రేమంటే ఇదేరా’ గర్తుండే ఉంటుంది. ‘నైజామ్ బాబులు.. నాటు బాంబులు..’ అంటూ జోరుగా ఆడిపాడారు జింతా. ఈ సొట్టబుగ్గల సుందరి శ్రీమతి అయి రెండేళ్లయింది. అమెరికన్ బిజినెస్‌మేన్ జీన్ గుడ్ ఎనఫ్‌ను 2016లో ఆమె పెళ్లాడారు. అమెరికాలో బంధువుల ద్వారా జీన్‌తో జింతాకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సెలీనా జైట్లీ ఆ ఇద్దరు... వాళ్లకు నలుగురు. అవును.. సెలీనా జైట్లీ–పీటర్ హ్యాగ్లకు నలుగురు బిడ్డలు. రెండుసార్లు కవలలకు జన్మనిచ్చారామె. మన దేశీ తార సెలీనాకి ఏడేళ్ల క్రితం పీటర్‌తో దుబాయ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చివరికి వారి మధ్య బంధంగా మారింది. హోటల్ బిజినెస్ చేస్తుంటారు పీటర్. ఇండియా వచ్చి, సెలీనా పేరెంట్స్‌ని కలిసి, పెళ్లికి ఒప్పించారు. ఎంగేజ్మెంట్ జరిగే సమయానికి సెలీనా ప్రెగ్నెంట్. 2011లో పెళ్లయింది. 2012 మార్చిలో సెలీనా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు. 2017లో మరో ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చారామె. భర్తతో కలసి సింగపూర్‌లో ఉంటున్నారామె. – సినిమా డెస్క్ మైఖేల్ కోర్సలేతో శ్రుతీహాసన్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్తో మల్లికా శెరావత్ మథియాస్ బోతో తాప్సీ -
మేం విడిపోవడానికి శ్రుతీహాసన్ కారణం కాదు
కమల్‌హాసన్–శ్రీదేవి బ్రేక్ కే బాద్ మళ్లీ కలిశారా? కమల్ పొలిటికల్ లైఫ్‌లో గౌతమికి స్థానం ఉందా? కమల్ ఆరంభించిన పొలిటికల్ పార్టీ ‘మక్కళ్ నీది మయమ్’కి గౌతమి సపోర్ట్ చేయబోతున్నారా? అటు చెన్నై ఇటు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఒకటే చర్చ. ఈ చర్చకు గౌతమి ఫుల్స్టాప్ పెట్టారు. కమల్‌తో ఇప్పుడు తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారామె. సోషల్ మీడియా ద్వారా గౌతమి తన మనోభావాలను పంచుకున్నారు. ‘‘పాస్ట్ ఈజ్ పాస్ట్ అండ్ దేర్ ఆర్ రీజన్స్ ఫర్ ఇట్’’ అంటూ ఈ నెల 24న ఓ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ‘‘ఎవరి గురించైనా నేను ఏదైనా చెబుతున్నానంటే తప్పకుండా ఓ కారణం ఉంటుంది. 30 ఏళ్లుగా నన్ను తెలిసినవారికి నేనేంటో బాగా తెలుసు’’ అంటూ ‘ప్రూఫ్ అండ్ జడ్జ్మెంట్స్’ అంటూ మరో లెటర్‌ను మంగళవారం పోస్ట్ చేశారు గౌతమి. ఈ రెండు ఉత్తరాల ద్వారా ఆమె తన జీవితంలోని కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. వాటిలో కొన్ని సంగతులు.. ►మిస్టర్ కమల్‌హాసన్‌కు నా సపోర్ట్ లభిస్తుందన్న వార్తల్లో నిజం లేదు. ఆల్మోస్ట్ మా 13ఏళ్ల రిలేషన్‌షిప్‌కు 2016లో ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం పర్శనల్‌గా కానీ ప్రొఫెషనల్‌గా కానీ మరే విధంగా కానీ మిస్టర్ కమల్‌హాసన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం నా కూతురి (సుబ్బలక్ష్మి) భవిష్య , ఆర్థిక వనరులపైనే దృష్టిపెట్టాను ►మిస్టర్ కమల్‌హాసన్‌తో నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి మూడో వ్యక్తి ఎవరూ కారణం కాదు. మా బంధం చెడిపోవడానికి శ్రుతీహాసన్ కారణం అని చాలామంది చెప్పుకుంటున్నారని విన్నాను. అదేం లేదు. మేం విడిపోవడానికి పిల్లలెవరూ కారణం కాదు. శ్రుతి, అక్షరలను నేనిప్పటికీ పిల్లలుగానే చూస్తాను. అయినా.. ఇద్దరు పెద్దవాళ్లు ఒక రిలేషన్షిప్ నుంచి విడిపోవడానికి పిల్లలు కారణం కారనే నేను నమ్ముతాను. మిస్టర్ కమల్‌హాసన్ కొన్ని కొత్త కమిట్మెంట్స్ తీసుకున్నారు. అవి నా ఆలోచనలకు సరిపడలేదు. పైగా నా ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న భావన కలిగింది. ఆత్మాభిమానాన్ని వదులుకోదలచుకోలేదు. మా రిలేషన్ చెడిపోవడానికి ఇదొక్కటే కారణం. ►రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థ) నిర్మించిన సినిమాలకు, మిస్టర్ కమల్‌హాసన్ బయట సంస్థల్లో నటించిన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశాను. అప్పట్లో నా ఇన్కమ్ సోర్స్‌లో మేజర్ ఇదే. అయితే ‘దశావతారం, విశ్వరూపం’.. మరికొన్ని సినిమాలకు సంబంధించిన కొంత పారితోషికం ఇంకా రావాల్సి ఉంది. ►ప్రస్తుతం నా దృష్టంతా నేను నిర్వహిస్తున్న ‘లైఫ్ ఎగైన్ ఫౌండేషన్’, నా కూతురు భవిష్యత్ మీదే. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. -
'కాటమరాయుడు' మూవీ రివ్యూ
టైటిల్ : కాటమరాయుడు జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : పవన్ కళ్యాణ్, శృతిహాసన్, అలీ, తరుణ్ అరోరా, నాజర్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : కిశోర్ కుమార్ పార్థసాని (డాలీ) నిర్మాత : శరత్ మరార్ సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరోసారి అభిమానుల్లో జోష్ నింపేందుకు కాటమరాయుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజిత్ హీరోగా తెలుగులోనూ రిలీజ్ అయిన వీరుడొక్కడే సినిమాను కేవలం పవన్ ఇమేజ్ ను నమ్ముకొని రీమేక్ చేశారు. ఫ్యాన్స్ తన నుంచి ఆశించే అన్ని రకాల మాస్ మసాలా ఎలిమెంట్స్ తో పాటు తన పొలిటికల్ మైలేజ్ కు కావాల్సిన అంశాలతో ఈ సినిమాలో ఉన్నాయన్న నమ్మకంతో పవన్ చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించింది. కథ : కాటమరాయుడు(పవన్ కళ్యాణ్) రాయలసీమ ప్రాంతంలోని ఓ ఊళ్లో తిరుగులేని నాయకుడు. తప్పు జరిగితే ఎంతటి వాడినైన ఎదిరించటం, మాట వినకపోతే తాట తీసేయటం రాయుడికి అలవాటు. చిన్నప్పుడే ప్రేమ విఫలమవ్వటంతో అమ్మాయిలంటే ద్వేశించే రాయుడు, తనతో పాటు తన నలుగురు తమ్ముళ్లకు పెళ్లి చేయకుండా అలాగే ఉంచేస్తాడు. అప్పటికే ప్రేమలో పడ్డ కాటమరాయుడి తమ్ముళ్లు.. అన్నయ్య ప్రేమలో పడితేగాని తమకు పెళ్లిల్లు కావని ఎలాగైన రాయుడ్ని ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుంటారు. లాయర్ లింగ(అలీ)తో కలిసి అవంతిక(శృతిహాసన్)ను కాటమరాయుడికి దగ్గర చేస్తారు. అయితే ఈ ప్రయత్నంలో కాటమరాయుడికి గొడవలంటే అసలు పడదని, పక్షులు, జంతువులను కూడా ప్రేమించేంత గొప్ప మనసని చెప్పి అవంతికకు, రాయుడి మీద ప్రేమ పుట్టేలా చేస్తారు. అవంతికతో కలిసి వాళ్ల ఊరికి బయలుదేరిన రాయుడి మీద ట్రైన్ లో ఎటాక్ జరుగుతుంది. ఈ గొడవలో రాయుడు ఎలాంటి వాడో తెలుసుకున్న అవంతిక అతన్ని కాదని వెళ్లిపోతుంది. (కాటమరాయుడు ఎలా ఉందో తెలుసా..!) కానీ అవంతిక కోసం అన్ని వదులుకున్న రాయుడు ఎలాగైన అవంతిక ప్రేమను గెలుచుకోవాలని వాళ్ల ఊరికి వెళతాడు. తన మంచితనంతో వాళ్ల కుటుంబానికి దగ్గరవుతాడు. ఈ సమయంలోనే ట్రైన్ లో జరిగిన ఎటాక్ తన మీద కాదు అవంతిక కుటుంబం మీద అని తెలుసుకుంటాడు. అసలు అవంతిక కుటుంబం మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్ల బారినుంచి అవంతిక కుటుంబాన్ని రాయుడు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన అభిమానులకు విందుభోజనం లాంటి సినిమాను అందించాడు. హీరోయిజం, యాక్షన్, తో పాటు తన మార్క్ రొమాంటిక్ కామెడీని కూడా అద్భుతంగా పండించాడు. సినిమా అంతా వన్మన్ షోలా అంతా తానే అయి నడిపించి సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాడు. కేవలం పవన్ ఇమేజ్, నటన మూలంగానే సినిమాతో చూస్తున్నప్పుడు ఇది తెలిసిన కథే అన్న ఆలోచనే రాలేదేమో అనిపిస్తుంది. హీరోయిన్ గా శృతిహాసన్ పరవాలేదనిపించింది. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాతో లుక్స్ పరంగా నిరాశపరిచింది. విలన్ గా తరుణ్ అరోరా చిన్న పాత్రే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. రావు రామేష్ చేసిన పాత్ర విలనిజంతో పాటు మంచి కామెడీనీ పండించింది. లుక్ తో పాటు డైలాగ్ డెలివరీలోనే కొత్త దనం చూపించిన రావూ రమేష్ మరోసారి తనమార్క్ చూపించాడు. లాయర్ పాత్రలో అలీ పండించిన కామెడీతో పాటు సెకండాఫ్ లో పృథ్వీ చేసిన సీన్స్ ఆకట్టుకుంటాయి. పవన్ తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, చైతన్య కృష్ణ, కమల్ కామరాజులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కథను మరోసారి పవన్ లాంటి స్టార్ తో రీమేక్ చేయటం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసం చేసిన దర్శకుడు కిశోర్ కుమార్ పార్థసాని(డాలీ) మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా పవన్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. అనూప్ రూబెన్స్ తన సంగీతంతో పర్వాలేనిపించాడు. పవన్ ఇమేజ్ ను చాలా బాగా ఎలివేట్ చేసిన అనూప్, ఇతర సన్నివేశాల్లో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.మిరా మిరా మీసం, లాగే లాగే తప్ప మిగతా పాటలు పవన్ గత సినిమాలో స్థాయిలో లేవు. ముఖ్యంగా ఫారిన్ లోకేషన్స్ లో తీసిన రెండు పాటలు విజువల్ గా కూడా నిరాశపరిచాయి. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ సీన్స్ రామ్ లక్ష్మణ్ లు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : పవన్ కళ్యాణ్ రొమాంటిక్ సీన్స్ మైనస్ పాయింట్స్ : తెలిసిన కథ ఫారిన్ లొకేషన్స్ లో తీసిన సాంగ్స్ కాటమరాయుడు.. పవర్ స్టార్ అభిమానులకు పండుగ లాంటి సినిమా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
'ప్రేమమ్' మూవీ రివ్యూ
టైటిల్ : ప్రేమమ్ జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ సంగీతం : గోపిసుందర్ దర్శకత్వం : చందూ మొండేటి నిర్మాత : ఎస్ రాధాకృష్ణ, పిడివి ప్రసాద్, ఎస్ నాగవంశీ రొమాంటిక్ సినిమాల కేరాఫ్ అడ్రస్‌గా మారిన అక్కినేని ఫ్యామిలీ యువ కథానాయకుడు.., నాగచైతన్య హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు దర్శకుడు చందూ మొండేటి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది..? మలయాళీ ప్రేమకథలను టాలీవుడ్ జనాలకు నచ్చేలా చూపించటంలో చిత్రయూనిట్ సక్సెస్ సాధించారా? కథ : ప్రతీ వ్యక్తి జీవితంలోని మూడు దశల్లో కలిగే ప్రేమ కథలనే ప్రేమమ్‌లో సినిమాటిక్‌గా చూపించారు. 15 ఏళ్ల వయసులో పదోతరగతి చదువుతున్న విక్రమ్(నాగచైతన్య), ఆ ఊళ్లో కుర్రాళ్లంతా వెంటపడే అందమైన అమ్మాయి సుమ(అనుపమా పరమేశ్వరన్)ను ఇష్టపడతాడు. ఆ వయసులోనే కవితలతో ప్రేమలేఖలు రాస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అన్నిరకాల కష్టాలు పడతాడు. అంతా ఓకె అయ్యిందనుకున్న సమయంలో విక్రమ్, సుమల ప్రేమకథ అర్థాంతరంగా ముగిసిపోతుంది. అలా ఆ బాధను మర్చి పోయే ప్రయత్నంలోనే ఐదేళ్లు గడిచిపోతాయి. విక్రమ్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. ఆ వయసుల్లో ఉండే దూకుడుతో కాలేజీలో గ్యాంగ్ మెయిన్టైన్ చేస్తూ గొడవలు, సస్పెన్ష్లతో హీరోయిజం చూపిస్తుంటాడు. అదే సమయంలో కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అయిన సితార వెంకటేషన్(శృతిహాసన్)తో మరోసారి ప్రేమలో పడతాడు. కానీ విధి మరోసారి విక్రమ్ జీవితంతో ఆడుకుంటుంది. విక్రమ్, సితారల ప్రేమ కథ కూడా మధ్యలోనే ముగిసిపోతుంది. అలా మరికొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. విక్రమ్ ఎస్ రెస్టో పేరుతో రెస్టారెంట్ స్టార్ చేసి లైఫ్‌లో సెటిల్ అవుతాడు. కానీ సితార జ్ఞాపకాలు మాత్రం విక్రమ్‌ను వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో మరోసారి విక్రమ్ మనుసును ప్రేమ పలకరిస్తుంది. సింధు(మడోనా సెబాస్టియన్), విక్రమ్ జీవితంలోకి వచ్చిన మరో(మూడో) ప్రియురాలు. అసలు విక్రమ్ జీవితంలోకి వచ్చిన సింధు ఎవరు..? ఈ మూడో ప్రేమకథ అయినా సుఖాంతం అయ్యిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నటన పరంగా ప్రేమమ్ సినిమాతో వంద మార్కులు సాధించాడు నాగచైతన్య. తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. స్కూల్ ఏజ్‌లో కనిపించే అమాయకత్వం, కాలేజ్ కుర్రాడిగా హీరోయిజం, లైఫ్ సెటిల్ అయిన తరువాత వచ్చే మెచ్యూరిటీ లాంటి వేరియేషన్స్‌ను చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా మూడు దశల్లోనూ లుక్, ఫిజిక్ విషయంలో నాగచైతన్య తీసుకున్న కేర్ సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్లుగా అనుపమా పరమేశ్వరన్, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. అనుపమా ఓన్ డబ్బింగ్ కాస్త ఇబ్బంది పెట్టిన నటన పరంగా మాత్రం ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో ప్రవీణ్, కృష్ణచైతన్య, శ్రీనివాస్ రెడ్డి, నోయల్, 30 ఇయర్స్ పృథ్వి తమ పరిథి మేరకు మెప్పించారు. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల అతిథి పాత్రలకు థియేటర్స్‌లో విజిల్స్ పడుతున్నాయి. సాంకేతిక నిపుణులు : ఇప్పటికే సక్సెస్ ఫుల్ సినిమాగా ప్రూవ్ చేసుకున్న సినిమాను రీమేక్ చేసి, ఒరిజినల్ స్థాయిని అందుకోవటం చాలా కష్టం. కానీ ఆ రిస్క్ చేయడానికి ముందుకు వచ్చిన చందూ మొండేటి మంచి విజయం సాధించాడు. కథా కథనాలలో ఎక్కడ మలయాళ సినిమా అన్న భావన కలుగకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ప్రేమమ్‌కు మరో ఎసెట్ గోపిసుందర్ సంగీతం, సినిమా రిలీజ్‌కు ముందే ఆడియోతో ఆకట్టుకున్న గోపిసుందర్ నేపథ్య సంగీతంతోనూ అలరించాడు. ముఖ్యంగా ఎవరే పాట ఆడియోతో పాటు విజువల్‌గా కూడా సూపర్బ్ అనిపించేలా ఉంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య నటన కథ సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ లెంగ్త్ ఓవరాల్‌గా ప్రేమమ్.. నాగచైతన్య కెరీర్లో బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న 'అందమైన ప్రేమకథల రొమాంటిక్ జర్నీ' - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
పవన్ 'కాటమరాయుడు' మొదలైంది
పవర్ స్టార్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్ ఈ రోజు (బుధవారం) మొదలైంది. సర్థార్ గబ్బర్‌సింగ్‌తో డీలా పడిపోయిన పవన్ అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. చాలా రోజులు క్రితమే లాంచనంగా ప్రారంభమైనా.. డైరెక్టర్ మారిపోవటం, పవన్ రాజకీయంగా బిజీ కావటంతో ఈ సినిమాతో ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుండగా ఈ నెల 24 నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు హాజరుకానున్నాడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. -
'నవంబర్ నుంచి షూటింగ్ చేయోచ్చన్నారు'
తన ఆఫీస్‌లో ప్రమాదానికి గురై కొంత కాలంగా షూటింగ్‌లకు దూరమైన లోకనాయకుడు కమల్ హాసన్ త్వరలో తిరిగి కెమెరా ముందుకు రానున్నాడు. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న ఈ గ్రేట్ యాక్టర్ నవంబర్ నుంచి తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయన్ని కమల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 'నవంబర్ నుంచి నేను షూటింగ్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్స్ చెప్పారు. మీ ప్రేమ కారణంగానే ఇంత త్వరగా కోలుకున్నాను. మీరు చూపించిన అభిమానాన్ని శభాష్ నాయుడు, ఇతర చిత్రాల ద్వారా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తా..' అంటూ కామెంట్ చేశారు కమల్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో శృతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.Doctors say I am fit to work from Nov possibly. All that love does heal faster. Thanks folks. I'll return that love via Naidu/Kundu & more— Kamal Haasan (@ikamalhaasan) 11 September 2016 -
కొత్త హీరోతో శృతి ఐటమ్ సాంగ్
తన కెరీర్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ చేసింది శృతి హాసన్. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కావటంతో కాదలేక ఆ ప్రాజెక్ట్ ఒప్పుకుంది. తరువాత చాలా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చినా.. నిర్మొహమాటంగా కాదనేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఐటమ్ నంబర్‌కు సై అంటోంది ఈ బ్యూటి. అది కూడా ఓ యంగ్ హీరో తొలి సినిమాలో స్పెషల్ సాంగ్‌కు ఓకె చెప్పింది.కన్నడలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న నిఖిల్ కుమార్ సరసన స్పెషల్ సాంగ్‌కు రెడీ అవుతోంది శృతి. కన్నడ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడి సినిమా కావటంతో పాటు, భారీగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేయటంతో శృతి ఈ సాంగ్ చేయడానికి అంగీకరించిందట. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాగ్వర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.