డౌన్... డౌన్... అంటున్న శ్రుతీహాసన్ | sruthi haasan saying down...down | Sakshi
Sakshi News home page

డౌన్... డౌన్... అంటున్న శ్రుతీహాసన్

Published Wed, Feb 19 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

డౌన్... డౌన్... అంటున్న శ్రుతీహాసన్

డౌన్... డౌన్... అంటున్న శ్రుతీహాసన్

 అప్పుడు శ్రుతీహాసన్‌కి ఆరేళ్లు. నాన్న కమల్‌హాసన్ చెయ్యి పట్టుకుని రికార్డింగ్ స్టూడియోకి వెళ్లింది. అక్కడ సంగీత దర్శకుడు ఇళయరాజా ఉన్నారు. ‘పాట పాడతావా’ అనడిగారు సరదాగా. ‘ఓ’ అని తలూపేసింది. ఇళయరాజా చెప్పినట్టుగా పాట కూడా పాడేసింది. ఆ పాట ‘దేవర్‌మగన్’ సినిమాలో ఉంటుంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో పాటలు పాడింది శ్రుతి. ఇప్పుడు కూడా తను కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లోనూ అడపా దడపా పాడుతుంటారామె. ఆ మధ్య విడుదలైన ‘ఓ మై ఫ్రెండ్’, ‘3’ చిత్రాల్లో తన మధురమైన గాత్రాన్ని వినిపించారు. తాజాగా కూడా తన గళాన్ని వినిపించారామె. ‘డౌన్ డౌన్ డౌన్ డుప్పా...’ అనే పల్లవితో సాగుతుందా పాట.
 
  అల్లు అర్జున్, శ్రుతీహాసన్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రేసుగుర్రం’ సినిమాలో పాట ఇది. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తున్నారు. వాటిలో ‘డౌన్ డౌన్..’ని శ్రుతీహాసన్‌తో పాడిస్తే బాగుంటుందనుకోవడం, శ్రుతి కూడా ఉత్సాహంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంటనే జరిగిపోయాయి. ఈ పాట చాలా ఫన్నీగా ఉందని, చాలా హుషారైన పాట అని శ్రుతి పేర్కొన్నారు. నల్లమలుపు బుజ్జి, డా.కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement