Ilaya Raja
-
నా సొంత సోదరిని కోల్పోయినట్లు ఉంది: స్టార్ హీరో ఎమోషనల్
ప్రముఖ సంగీత దర్శకుడు, పాటల రచయిత ఇళయరాజా ఇంట్లో విషాద నెలకొంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి(47) క్యాన్సర్‌తో కన్నుమూశారు. చికిత్స కోసం శ్రీలంక వెళ్లిన భవతారిణి.. అక్కడే కోలుకోలేక మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ఆమె మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు విశాల్ విచారం వ్యక్తం చేశారు. తాను ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..!) విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' నేను అభిమానించే ప్రియమైన భవతారిణి. ఈ వార్త విని నా హదయం బరువెక్కింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నువ్వు ఇకపై మాతో ఉండనందుకు క్షమించు. మమ్మల్ని విడిచిపెట్టి దేవుళ్ల దగ్గరికి వెళ్లిపోయావ్. నిన్ను ఇళయరాజా సర్ కూతురిగా, యువన్ సోదరిగా, వాసుకి కజిన్‌గా కంటే ఎక్కువగా.. నా సొంత సోదరిగా మిమ్మల్ని మిస్ అవుతున్నా. మీరు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారనుకోలేదు. గత కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులను ఎందుకు కోల్పోతున్నానో తెలియదు. ఈ పరిణామాలు నా జీవితాన్నే తప్పుగా అర్థం చేసుకునేలా కనిపిస్తున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని.. మీ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. మీరు లేని లోటును అధిగమించే శక్తిని పొందాలని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. Dear Bavatha. I write this with a heavy heart and unable to digest it. Am really sorry you are not going to be with us anymore and left us to be with the gods. I miss u as a sister, as my own, more than I knew you as Ilayaraja sir’s daughter or Yuvan’s sister or Vasuki’s cousin.… — Vishal (@VishalKOfficial) January 26, 2024 -
మళ్లీ ఎందుకు?.. సంచలనంగా మారిన ఇళయరాజా కామెంట్స్!
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు, సంగీత దర్శకుడు దీనా మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంగీత రంగంలో అపర చాణుక్యులుగా ముద్ర వేసుకున్న ఇళయరాజాను వ్యతిరేకించి ఇక్కడ మనుగడ సాగించటం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆయన్ని ఎదుర్కోవడానికే మరో సంగీత దర్శకుడు దీనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా ఎంపికయ్యా రు. కాగా ఈ సంఘానికి ప్రస్తు త కార్యవర్గ పదవీ బాధ్యతలు ముగియనున్నాయి. దీంతో ఈ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సంగీత దర్శకుడు దీనా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలోనే ఇళయరాజాకు, ఆయనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుత దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దీనాతో ఇళయరాజా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సినీ రంగంలో మొట్టమొదటిసారిగా సంగీత కళాకారుల సంఘం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సంఘాన్ని ప్రారంభించింది ఎంపీ శ్రీనివాసన్ అని తెలిపారు. సంఘానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే సంఘానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలనే నిబంధన కూడా ఉందన్నారు. అందువల్ల నువ్వు ఇప్పటికే రెండుసార్లు సంఘం అధ్యక్షత బాధ్యతలను నిర్వహించావని.. మూడోసారి ఎందుకు పోటీ చేస్తున్నావని ఇళయ రాజా ప్రశ్నించారు. ఈసారి కొత్త తరానికి అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. ఈ సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే తాను ఆ విషయం గురించి లోతుగా పోదలచుకోలేదని.. సంఘం సభ్యులు కోరిక మేరకే అధ్యక్షుడిగా అంగీకరించాలని అంటున్నారు. అయితే దీన్ని ఇళయరాజా వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన దీనా కాలానుగుణంగా సంఘం నిబంధనలు మారుతాయని అన్నారు. ఇళయరాజా అన్నయ్యను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఇళయరాజాను కలిసి వాస్తవ పరిస్థితులు వివరిస్తానని దీనా స్పష్టం చేశారు. -
పాటగా రఘువీర గద్యం
మంచు మోహన్ బాబు లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రఘువీర గద్యాన్ని పాటగా మలుస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరిగాయి. చిత్ర సంగీత దర్శకుడు ఇళయారాజాతో మోహన్ బాబు, రత్నబాబు సమావేశమయ్యారు. ‘ఇది గద్యంలాగా ఉంది. దీనికి ట్యూన్ చెయ్యడం ఎలా కుదురుతుంది? చాలా కష్టం’ అని ఇళయరాజా అనడంతో.. ‘మీకే కుదురుతుంది సార్. మీరు చేయంది లేదు’ అని చెప్పి ‘రఘువీర గద్యం’ రాత ప్రతిని ఆయనకు అందజేశారు మోహన్ బాబు. ‘11వ శతాబ్దంలో శ్రీరాముని ఘనతను చాటి చెబుతూ వేదాంత దేశికర్ అనే మహనీయుడు రఘువీర గద్యం రాశారు. ఆ గద్యాన్ని అద్భుతమైన పాటగా ప్రేక్షకులకు అందించనున్నాం. తెలుగులో ఇంతవరకూ రాని ఒక విభిన్న కథా కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. మోహన్ బాబు పవర్ఫుల్ రోల్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇదివరకు విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మెడలో రుద్రాక్ష మాలతో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన మోహన్ బాబు రూపానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్లో ఆయనకి ఇది వన్నాఫ్ ది బెస్ట్ లుక్స్ అవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, స్టైలిస్ట్: విరానికా మంచు. -
కేసు వెనక్కి తీసుకున్న ఇళయరాజా!
సంగీత దర్శకుడు ఇళయరాజా తన కేసును వెనక్కి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇళయరాజా 40 ఏళ్లకు పైగా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న గదిని ఖాళీ చేయాలంటూ ప్రసాద్ స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. ఇళయరాజా ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్టూడియో అధినేతలు ఇళయరాజాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: ఇళయరాజాకు ఎందుకు అనుమతివ్వరు న్యాయమూర్తి ఎన్.సతీష్‌కుమార్ ఒక రోజు ధ్యానం చేసుకోవడానికి ఇవ్వాలన్న ఇళయరాజా కోరికను ఎందుకు అంగీకరించరని ప్రసాద్ స్టూడియో అధినేతలను ప్రశ్నించారు. అందుకు స్టూడియో అధినేతలు ఇళయరాజా తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని బదులిచ్చారు. దీనికి బదులివ్వాల్సిందిగా ఇళయరాజాను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇళయరాజా బుధవారం కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
నరుడి బతుకు నటన... ఈశ్వరుడి తలపు ఘటన
బాలూ ఇళయరాజాల స్నేహం ఈశ్వరుడి తలపు అనిపిస్తుంది. తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి దర్శకుడు భారతీరాజా పూనికతో చెన్నై చేరుకున్న ఇళయరాజా అతని ఇద్దరు సోదరులు మొదట బాలూ ట్రూప్‌లోనే చేరారు. ఇళయరాజా బాలు దగ్గర గిటార్ వాయించేవారు. ఆ తర్వాత ఇళయరాజా ‘అన్నక్కిళి’తో సంగీత దర్శకుడుగా మారారు. బాలు–ఇళయరాజాల స్నేహం దాదాపు నలభై ఏళ్ల నాటిది. వారిరువురూ కలిసి గొప్ప పాటలు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇచ్చారు. ‘నా ట్యూన్ వల్ల నువ్వు గొప్పవాడివయ్యావ్’ అని ఇళయరాజా అంటే ‘నీ ట్యూన్‌ను నేను పాడటం వల్లే నువ్వు పెద్దవాడివయ్యావ్’ అని బాలు సరదాగా అనుకునేవారు. బాలు–ఇళయరాజా కాంబినేషన్లో వందల పాటలు సంగీత ప్రియులకు స్ట్రెస్ బస్టర్స్‌గా మారాయి. ‘ఇలాగే ఇలాగే సరాగమారితే’ (వయసు పిలిచింది), ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ (మౌనగీతం), ‘ఈ లోకం అతి పచ్చన’ (వసంత కోకిల), సుమం ప్రతి సుమం సుమం (మహర్షి), కీరవాణి (అన్వేషణ), ఉరకలై గోదావరి (అభిలాష), ఈనాడే ఏదో అయ్యింది (ప్రేమ), ఆమని పాడవే హాయిగా (గీతాంజలి) ఎన్ని చెప్పినా మరొకటి మిగిలిపోయే పాట ఉంటుంది. ఇళయరాజా కోసం బాలు గొంతుకు స్ట్రయిన్ ఇస్తూ గీతాంజలిలో ‘నందికొండ వాగుల్లోనా’ పాడారు. ఆయనే మళ్లీ ‘ఇంద్రుడు చంద్రుడు’ కోసం ‘నచ్చిన ఫుడ్డు’ పాటకు గొంతు పోయేలా పాడి ఇబ్బంది పడ్డారు. అయినా ఇళయరాజా కోసం ఇదంతా ప్రేమగా చేసేవారు. ఇళయరాజా కంపోజ్ చేసిన ‘సాగర సంగమం’ పాటలు బాలూకు గొప్ప పేరు తెచ్చి పెట్టాయి. అందులోని ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ పాట సంగీతాభిమానులకు ఎంతో ఇష్టమైనది. వీరి మధ్యే కాకుండా వీరి కుటుంబాల మధ్య కూడా స్నేహం ఉంది. ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ప్రేమ విషయంలో అమ్మాయి వాళ్ల ఇంట్లో మాట్లాడింది బాలూనే. యస్పీబీ కుమారుడు యస్పీ చరణ్ నిర్మించే సినిమాలకు రాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుంటారు. రాజా మేనల్లుళ్లు వెంకట్ ప్రభు (దర్శకుడు), ప్రేమ్‌జీ అమరన్ (నటుడు–సంగీతదర్శకుడు) కూడా యస్పీ చరణ్‌తో తరచూ సినిమాలు చేస్తారు. ఇలాంటి అనుబంధంలో మనస్పర్థలు లేవా? అంటే ఉన్నాయి. ‘నా పాటలను నా అనుమతి లేకుండా వేదికల మీద పాడొద్దు. పాడితే రాయల్టీ చెల్లించాలి’ అని ఒక సందర్భంలో కోప్పడ్డా కొద్ది రోజులకే ఇద్దరూ కలిసిపోయారు. బాలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన వెంటనే ‘త్వరగా తిరిగిరా బాలూ’ అంటూ చెమర్చిన కళ్లతో ఓ వీడియో పంచుకున్నారు ఇళయరాజా. హీరో ఎవరైనా గొంతు బాలూదే(డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను డబ్బింగ్ ఆర్టిస్టుగా మార్చింది సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆ రోజుల్లో చక్రవర్తి చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. ‘మన్మథలీల’ (1976)లో కమలహాసన్‌కు డబ్బింగ్ చెబుతూ అందులోని ఒక బ్రాహ్మణుడి పాత్రకు బాలు గొంతు సూట్ అవుతుందని చెప్పించారు. ఆ తర్వాత ‘కల్యాణ రాముడు’ (1979) సినిమా నుంచి కమల్ హాసన్‌కు బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. దాదాపు తెలుగులో డబ్ అయిన అన్ని కమల్ సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. వసంత కోకిల, నాయకుడు, డాన్స్‌మాస్టర్, గుణ, మైకేల్ మదన్కామరాజు, విచిత్రసోదరులు... ఇవన్నీ ముఖ్యమైనవి. ‘దశావతారం’లో పది కమల్ పాత్రలకు పది విధాలుగా కేవలం రెండున్నర రోజుల్లో డబ్బింగ్ ముగించారు బాలు. హీరో నరేశ్ ‘నాలుగు స్తంభాలాట’కు, హీరో జగపతిబాబు ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాకు బాలు డబ్బింగ్ చెప్పారు. కె.భాగ్యరాజాకు కూడా బాలు గొంతు బాగా సూట్ అయ్యేది. కె.భాగ్యరాజా తెలుగులో డబ్బింగ్ చేసిన ‘డార్లింగ్ డార్లింగ్’, ‘అమ్మాయిలు ప్రేమించండి’, ‘చిన్నరాజా’, ‘నేనూ మీవాడినే’ వంటి సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పి భాగ్యరాజాను తెలుగువారికి దగ్గర చేశారు. తమిళ నటుడు విసు నటించిన తెలుగు సినిమాలు ‘ఆడదే ఆధారం’, ‘ఇల్లు–ఇల్లాలు–పిల్లలు’ సినిమాల్లో విసుకు డబ్బింగ్ చెప్పారు. ‘రుద్రవీణ’లో జెమినీ గణేశన్‌కు చెప్పిన డబ్బింగ్ చాలా ప్రతిభావంతమైనది. ‘అన్నమయ్య’లో సుమన్ శ్రీవేంకటేశ్వర స్వామి పాత్ర ధరిస్తే బాలూయే డబ్బింగ్ చెప్పి ఆయనకు పేరు రావడానికి కారకులయ్యారు. బాలు తమిళంలో నాగార్జునకి, రజనీకాంత్‌కి, బాలకృష్ణకి డబ్బింగ్ చెప్పారు. అన్నింటికి మించి అటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం తెలుగులో డబ్ అయినప్పుడు గాంధీ పాత్రకు ఎంతో అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు బాలు. అందులో రకరకాల వయసుల్లో ఉన్న గాంధీకి రకరకాల ధ్వని స్వభావంతో చెప్పే తీరు ఔత్సాహికులకు పాఠం లాంటిది. దేశంలోని పది మంది గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టులను లెక్కిస్తే వారిలో బాలు తప్పక వస్తారు. చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు(మిమిక్రీ ఆర్టిస్ట్ బాలు) బాలు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్‌ను బట్టి, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్‌ను బట్టి పాడి తాను పాడినట్టుగా కాకుండా పాత్ర పాడినట్టుగా అనిపించగలరు. దాసరి తీసిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ (1977)లో నటుడు మాడా ‘పేడి’ పాత్ర ధరిస్తే ఆ పాట కోసం బాలూ ‘చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు’ పాడారు. ఆ పాట బాలూకు, మాడాకు చిరకాల కీర్తి తెచ్చి పెట్టింది. మాడాకు జీవితకాలం ఆ పాత్రే భుక్తి కల్పించిందని చెప్పవచ్చు. గతంలో కిశోర్ కుమార్ ‘హాఫ్టికెట్’ సినిమా కోసం స్త్రీ,పురుష గొంతుల్లో పాడారు. బాలు కూడా అలా గొంతు మార్చి తన ప్రతిభ చాటుకున్నారు. రాజేంద్రప్రసాద్ తీసిన ‘మేడమ్’ సినిమా కోసం స్త్రీ వేషంలో ఉన్న రాజేంద్రప్రసాద్ పాటను స్త్రీ గొంతుతో బాలు పాడారు. ఇలా మేల్ సింగర్ పూర్తి స్త్రీ గొంతుతో పూర్తి పాట పాడటం ఒక రికార్డ్. అల్లు రామలింగయ్య కోసం బాలు పాడిన ‘ముత్యాలు వస్తావా’ పాట పెద్ద హిట్. ‘మనుషులంతా ఒక్కటే’ (1976) కోసం అల్లు రామలింగయ్య, రమాప్రభల మీద చిత్రీకరించిన పాట సినిమా హిట్ కావడానికి ఒక కారణమైంది. కొంచెం ముక్కుతో పాడి అచ్చు అల్లు పాడినట్టే అనిపించారు బాలు. కామెడీ నటులకు బాలు పాడిన పాటలు కూడా హిట్ అయ్యాయి. రాజబాబుకు ‘తాతా–మనవడు’ కోసం ‘సోమా మంగళ బుధ’ పాడారు బాలు. పద్మనాభంకు బాలు పాడిన ‘ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు’ (దేశోద్ధారకులు–1973) కూడా పెద్ద హిట్టే. ‘ప్రతిఘటన’ (1985) సినిమాలో సుత్తి వేలుకు బాలూ పాడిన ‘తందనాన భళ తందనాన’ ఆ సమయంలో ఒక ఉద్వేగగీతంగా నిలిచింది. శుభలేఖ సుధాకర్‌కు ‘రెండు జళ్ల సీత’ కోసం బాలు పాడిన ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’ ఇప్పటికీ ఒక వినోద గీతమే. కామెడీ స్టార్ అలీకి పాడిన ‘చినుకు చినుకు అందెలలో’ (శుభలగ్నం) పెద్ద హిట్. బాలుఅనే శంఖంలో ఎన్నో తీర్థాలు. రాగాలు. రసాలు. అందులో హాస్యరసం కూడా తరించింది. సుశీలమ్మ – బాలు బాలసుబ్రహ్మణ్యం విజయంలో ఆయన వాటా ఎంత ఉందో ఆయనతో పాటు గొంతు కలిపిన సుశీలమ్మ వాటా కూడా అంత ఉంది. బాలూ కంటే ఎంతో సీనియర్ అయినప్పటికీ సుశీలమ్మ బాలూను ప్రోత్సహించారు. బాలు అంత హుషారుగా తనను తాను ఉత్సాహపరుచుకుని యుగళగీతాలు ఆలపించారు. వీరిద్దరి హిట్స్ లెక్కబెట్టే కొలది వస్తూనే ఉంటాయి. ‘మానసవీణ మధుగీతం’ (పంతులమ్మ), ‘ఝుమ్మందినాదం సయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), ‘ఇది పున్నమి వెన్నెల రేయి’ (ప్రేమ లేఖలు), ‘మావిచిగురు తినగానే’ (సీతామాలక్ష్మి), ‘గోరంత దీపం కొండంత వెలుగు’ (గోరంత దీపం), ‘శ్రీరస్తు శుభమస్తు’ (పెళ్లిపుస్తకం) లాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. కమర్షియల్ సినిమాల జోరు పెరిగి మాస్ సాంగ్స్ కావాలని నిర్మాతలు పట్టుబట్టినప్పుడు, దర్శకులు కోరినప్పుడు సుశీల బాలూతో కలిసి అలాంటి మాస్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా చక్రవర్తి ఆమెను ఒప్పించి బాలూతోటి ‘గుగ్గుగుగ్గు గుడిసుంది’ (డ్రైవర్ రాముడు) పాడించారు. అలాగే వీళ్లద్దరూ ‘వేటగాడు’లో ‘పుట్టింటోళ్లు తరిమేశారు’ పాడారు. అక్కినేనికి బాలు పాడిన డ్యూయెట్స్‌లో ఎన్నో హుషారైనవి సుశీల పాడారు. వాటిలో ‘ఒక లైలా కోసం’ (రాముడు కాదు కృష్ణుడు), ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న’ (ప్రేమాభిషేకం), ‘తొంగి తొంగి చూడమాకు చందమామా’ (శ్రీరంగ నీతులు)..లాంటివి ఎన్నో ఉన్నాయి. కృష్ణకు ‘ఇదిగో తెల్ల చీర’ (ఊరికి మొనగాడు), శోభన్‌బాబుకు ‘వెల్లువచ్చి గోదారమ్మ’ (దేవత), చిరంజీవికి ‘గోరింట పూసింది’ (ఖైదీ) హిట్ పాటలకు లెక్క లేదు. సుశీల పాడిన ‘పాలకడలిపై శేషతల్పమున’ పాటను పాడి చిన్నప్పుడు పాటల పోటీలో ప్రైజులు తెచ్చుకున్నానని బాలు చాలాసార్లు చెప్పుకున్నారు. -
కోలుకుంటున్న ఎస్పీ బాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలు కుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం సాయంత్రం ఒక బులెటిన్ విడు దల చేసింది. వెంటిలేటర్ అమర్చిన స్థితిలోనే వైద్యుల బృందం బాలుకు చికిత్స అందిస్తోందని పేర్కొంది. ప్లాస్మా చికిత్స: మంత్రి విజయభాస్కర్ తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ శనివారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి బాలుకు అందుతున్న వైద్య చికిత్స వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా చికిత్స అందిస్తు న్నారని, వెంటిలేటర్‌పైనే మరో రెండు రోజు లు ఉంచి చికిత్స కొనసాగిస్తారని తెలిపారు. కన్నీళ్ల పర్యంతమైన ఇళయరాజా.. ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియ గానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కన్నీటి పర్యంతం అవుతున్నట్టుగా తమిళంలో ఒక వీడియోను విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే... ‘బాలు తొందరగా లేచిరా. మన జీవితం కేవలం సినిమాతో ముగిసిపో యేది కాదు. సినిమాతో ప్రారంభమైనది కూడా కాదు. ఎక్కడో స్టేజీల్లో ఇద్దరం కలిసి ప్రారంభించిన సంగీత కచేరీలోని సంగీతం మన జీవితంగానూ, మనకు ముఖ్యమైన జీవితాధారంగా మారింది. ఆ స్టేజీ కచేరీల్లో ప్రారంభమైన మన స్నేహం, సంగీతం, స్వరాలు ఎలా ఒకటికి ఒకటికి ఎలా పెనవేసుకుని ఉంటాయో అలా మన స్నేహం ఏనాడు చెదిరిపోలేదు. మనం తగవులు వేసుకున్నపుడు స్నేహమే, తగవులు లేన ప్పుడూ స్నేహమే అనే సంగతి నీకూ నాకూ తెలుసు. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను, నీవు కచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది’ అని ముగించారు. -
క్లాప్‌కి ఇళయరాజా క్లాప్
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టి హీరోగా రూపొందనున్న చిత్రం ‘క్లాప్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. పృథ్వి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఐబి కార్తికేయన్, యం. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున ్న ‘క్లాప్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా క్లాప్ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తమిళ వెర్షన్‌కు హీరో నాని క్లాప్ ఇచ్చారు. దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తదితరులు ‘క్లాప్‘ బౌండెడ్ స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ– ‘‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పాను. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలకంటే మా సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ కథపై ఏడాది వర్క్ చేశాను. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు పృథ్వి ఆదిత్య. ‘‘మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.. కథ విని ఇంప్రెస్ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. ఇళయ రాజాగారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ నెల 17నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, మధురైలలో షూటింగ్ జరుపుతాం. నాలుగు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రవీణ్ కుమార్, సహ నిర్మాతలు: ఫై.ప్రభ ప్రేమ్, జి.మనోజ్, జి.శ్రీహర్ష. -
ఇళయరాజా పాటతో మైమరిచిన గజేంద్రుడు!
చెన్నై: సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఓ పాటను పాడి ఏనుగును నిద్రపుచ్చిన వీడియో సామాజిక మాధ్యాల్లో వైరల్ అవుతోంది. కేరళ రాష్ట్ర తిరుచ్చూర్‌కు చెందిన మావటి శ్రీకుమార్ ఒక ఏనుగును పెంచుతున్నాడు. ఇది గత కొంత కాలంలో నిద్రలేమితో బాధపడుతోంది. ఏనుగును నిద్రపుచ్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు శ్రీకుమార్. చివరికి ఒక సినిమా పాటలు లాలిపాటగా పాడాడు. ఆ పాటతో ఏనుగు హాయిగా నిద్రపోతుంది. ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. శ్రీకుమార్ పాడిన పాట సంగీత జ్ఞాని ఇళయరాజ 1984లో సంగీతం సమకూర్చిన, మమ్ముట్టి నటించిన ఓ మలయాళ చిత్రంలోని పాట కావడం విశేషం. -
నలుగురు ప్రపూర్ణులు!
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఈసారి నలుగురికి కళా ప్రపూర్ణ, క్రీడా ప్రపూర్ణలతో గౌరవించాలని ఆంధ్రి విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 31న జరగనున్న వర్సిటీ 85వ స్నాతకోత్సవ నిర్వహణపై శుక్రవారం సాయంత్రం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించారు. కళాప్రపూర్ణకు ముగ్గురి పేర్లు, క్రీడా ప్రపూర్ణకు ఒకరి పేరును సభ్యులు ప్రతిపాదించారు. వీటిని గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. కళాప్రపూర్ణకు మ్యాజిక్ మాయిస్ట్రో ఇళయరాజా, ప్రఖ్యాత గాయని రావు బాలసరస్వతి, సినీ గేయ రచయిత చంద్రబోస్.. క్రీడా ప్రపూర్ణకు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ల పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సాహిత్యంలోనూ ఈసారి కళాప్రపూర్ణ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కన్వెన్షన్ సెంటర్లో నిర్వహణపైఅభ్యంతరాలు కొత్తగా నిర్మంచిన కన్వెన్షన్ సెంటర్లో స్నాతకోత్సవం నిర్వహించాలనే నిర్ణయాన్ని పలువురు సభ్యులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాత భవనంలో నిర్వహిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత భవనానికి మరమ్మతులు అవసరమని, వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సర్దిచెప్పారని తెలిసింది. స్నాతకోత్సవ మందిరం మరమ్మతులు నెల రోజుల్లో పూర్తిచేయించాలని సభ్యులు సూచించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రవేశాలు, త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరిశోధన ప్రవేశాల సెట్(ఏపిఆర్‌సెట్)పై చర్చ జరిగింది.. గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీలలో అర్హత కలిగిన వారిని కొనసాగించాలని, అర్హత లేకుండా ప్రవేశం పొందిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన జివోను వర్సిటీ ఆమోదించినట్లు సమాచారం. వీటితో పాటు వర్సిటీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు ఏయూ మైదానం కేటాయించడం తదనంతర అంశాలపై సైతం పాలక మండలి సభ్యులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్పష్టత లేని గవర్నర్ పర్యటన స్నాతకోత్సవానికి గవర్నర్ రాక ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 29 నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. గవర్నర్ వచ్చి.. అన్నీ సజావుగా సాగితే సుదీర్ఘ కాలం తర్వాత పూర్తిస్థాయి స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో 318 మందికి పీహెచ్‌డీలు, అవార్డులు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్ ఆచార్య కె.గాయత్రీదేవి, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వర రావు, సభ్యులు ఆచార్య ఎం.ప్రసాద రావు, జి.శశి భూషణ రావు, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర, డాక్టర్ పి.సోమనాధ రావు, ఆచార్య ఎన్.బాబయ్య, ఆచార్య కె.రామమోహన రావు తదితరులు పాల్గొన్నారు. -
నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
పాత్రల నేపథ్యాన్నీ, స్వభావాన్నీ పాటలోకి తెస్తూనే దాన్ని కవిత్వంగా పలికించడం గీత రచయితలకు సవాల్ లాంటిది. ఆరాధన చిత్రంలోని ‘అరె ఏమైందీ/ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ’ పాట కోసం ఆచార్య ఆత్రేయ ఈ పని అనాయాసంగా చేయగలిగారు. ‘నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది’ అన్నప్పుడు నాయికానాయకుల అంతరాలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయి. దాన్నే కొనసాగిస్తూ వచ్చే మరో చరణం పూర్తిగా ఉటంకించదగినది. ‘బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు మనిషౌతాడు’. ఇళయరాజా అద్భుతంగా సంగీతం సమకూర్చిన ఈ పాటను ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. చిరంజీవి, సుహాసిని అభినయించారు. తమిళ దర్శకుడు భారతీరాజానే ఈ 1987 నాటి రీమేక్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. -
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం
-
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పలువురు ప్రముఖులకు మంగళవారం పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో పద్మ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌తోపాటు పలువురు అవార్డు గ్రహీతలు పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సమిత్రా మహాజన్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర ప్రముఖలు హాజరయ్యారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం 3గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 73 మందికి పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
మ్యాస్ట్రో సారథ్యంలో ధనుష్..!
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ధనుష్ గాయకుడిగానూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ధనుష్ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న మారి 2 సినిమా కోసం మేస్ట్రో ఇళయరాజా ఓ పాట పాడారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అందుకు ప్రతిగా ఇప్పుడు ఇళయరాజా సంగీతమందిస్తున్న ఓ సినిమాలో ధనుష్ పాట పాడనున్నాడు. ఇటీవల ఇళయరాజ సంగీత దర్శకుడిగా 1000 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ భారీ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసైజ్ఞాని స్వరపరిచిన పలు సూపర్ హిట్ పాటలను ధనుష్ వేదిక మీద ఆలపించారు. ధనుష్ గానం నచ్చిన మేస్ట్రో తాను సంగీతమందిస్తున్న ఓ మరాఠి సినిమాలో ధనుష్ చేత పాట పాడిస్తున్నారు. -
ట్రిపుల్ ట్రీట్
సంగీతప్రియులకు ఓ శుభవార్త. ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్’ అవార్డు వచ్చిందని ఆనందంలో ఉన్న ఈ సంగీత జ్ఞాని అభిమానుల ఆనందాన్ని డబుల్.. కాదు ట్రిపుల్ చేశారు ఆయన తనయులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా. తండ్రి ఇళయరాజాతో కలసి ఈ ఇద్దరూ ఓ సినిమాకి పాటలు సమకూర్చనున్నారు. సోదరుడు కార్తీక్ రాజాతో కలిసి యువన్ శంకర్ రాజా తన సొంత ప్రొడక్షన్ హౌస్ వైయస్సార్ ఫిలింస్‌పై ‘మామనిదన్’ అనే సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకే ముగ్గురూ స్వరాలందిస్తారు. ఇంతకుముందు తండ్రి కంపోజిషన్‌లో తనయులు, తనయుల కంపోజిషన్‌లో తండ్రి పాడినప్పటికీ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పాటలివ్వడం ఇదే తొలిసారి. కచ్చితంగా ట్రిపుల్ ట్రీట్ అనే చెప్పాలి. శ్రీను రామస్వామి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. -
ఆ ఇద్దరూ ట్రెండ్ మార్చారు!
‘‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో ఇద్దరు రాజాలు (భారతీరాజా, ఇళయరాజా) ట్రెండ్ మార్చేశారు. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసిన భారతీరాజా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన తనయుడు మనోజ్ ‘బేబి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సీనియర్ నటుడు సుమన్. మనోజ్ హీరోగా డి. సురేశ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘బేబి’ని అదే పేరుతో తెలుగులో అనువదించారు. శిరా గర్గ్, అంజలీరావు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పాలపర్తి శివకుమార్ శర్మ సమర్పణలో నిర్మాతలు బీవీఎన్ పవన్‌కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సతీష్, హరీష్ స్వరపరచిన ఈ సినిమా పాటలను సుమన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. ‘‘హారర్, సస్పెన్స్ చిత్రమైనా కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
ఫిబ్రవరిలో 'మన ఊరి రామాయణం'
తన విలక్షణ నటనతో సౌత్, నార్త్ ఇండస్ట్రీలను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్.., నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ధోని, ఉలవచారు బిర్యానీ లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ రాజ్ త్వరలోనే మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు మన ఊరి రామాయణం అనే టైటిల్‌ను ఫైనల్ చేశాడు. తన సొంతం నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో మన ఊరి రామయణం సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించారు. -
రెట్టింపు ఆనందం!
తమిళ హీరో ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. నటుడిగా జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇక, ‘కొలవెరి..’ పాటను తనదైన శైలిలో పాడి గాయకునిగా కూడా ఎంత ప్రసిద్ధి పొందారో తెలిసిందే. కేవలం తన చిత్రాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోల చిత్రాలకు కూడా పాటలు పాడుతుంటారు ధనుష్. అడపా దడపా గేయ రచయితగా కూడా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం తన సతీమణి ఐశ్యర్యా ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ‘వై రాజా వై’ చిత్రం కోసం ధనుష్ ఓ పాట రాశారు. ఈ పాటను సంగీతజ్ఞాని ఇళయరాజా పాడారు. ‘‘పాట రాసినప్పుడు కలిగిన ఆనందంకన్నా ఈ పాటను ఇళయరాజా స్వరంలో వింటున్నప్పుడు కలిగిన ఆనందం రెట్టింపు’’ అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ధనుష్. మరో రెండు రోజుల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు. -
డౌన్... డౌన్... అంటున్న శ్రుతీహాసన్
అప్పుడు శ్రుతీహాసన్‌కి ఆరేళ్లు. నాన్న కమల్‌హాసన్ చెయ్యి పట్టుకుని రికార్డింగ్ స్టూడియోకి వెళ్లింది. అక్కడ సంగీత దర్శకుడు ఇళయరాజా ఉన్నారు. ‘పాట పాడతావా’ అనడిగారు సరదాగా. ‘ఓ’ అని తలూపేసింది. ఇళయరాజా చెప్పినట్టుగా పాట కూడా పాడేసింది. ఆ పాట ‘దేవర్‌మగన్’ సినిమాలో ఉంటుంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో పాటలు పాడింది శ్రుతి. ఇప్పుడు కూడా తను కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లోనూ అడపా దడపా పాడుతుంటారామె. ఆ మధ్య విడుదలైన ‘ఓ మై ఫ్రెండ్’, ‘3’ చిత్రాల్లో తన మధురమైన గాత్రాన్ని వినిపించారు. తాజాగా కూడా తన గళాన్ని వినిపించారామె. ‘డౌన్ డౌన్ డౌన్ డుప్పా...’ అనే పల్లవితో సాగుతుందా పాట. అల్లు అర్జున్, శ్రుతీహాసన్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రేసుగుర్రం’ సినిమాలో పాట ఇది. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తున్నారు. వాటిలో ‘డౌన్ డౌన్..’ని శ్రుతీహాసన్‌తో పాడిస్తే బాగుంటుందనుకోవడం, శ్రుతి కూడా ఉత్సాహంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంటనే జరిగిపోయాయి. ఈ పాట చాలా ఫన్నీగా ఉందని, చాలా హుషారైన పాట అని శ్రుతి పేర్కొన్నారు. నల్లమలుపు బుజ్జి, డా.కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. -
గీత స్మరణం
పల్లవి పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే ॥ అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్ ॥ చరణం : 1 చిరుగాలి పరదాలే గలగలలాడి చెవిలోన లోలాకూ జతగా పాడి ॥ బంగరు దేహం సోలుతుంది పాపం చ ల్లనీపూటా కోరుకుంది రాగం నీవే అన్నావే నే పాడాలంటూ ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్ ॥ చరణం : 2 ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే రేరాణి తాపంలో వెల్లువై పొంగే ॥ చింతలన్ని తీర్చే మంచు పువ్వు నీవే మెత్తగా లాలీ నే పాడుతాలే విరిసే హరివిల్లే ఊరించే వేళా మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్ ॥ చిత్రం : తూర్పు సిందూరం (1990); రచన : సిరివెన్నెల సంగీతం : ఇళయరాజా; గానం : ఎస్.పి.బాలు నిర్వహణ: నాగేశ్