ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం | President Kovind Presents Padma Awards | Sakshi
Sakshi News home page

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం

Published Tue, Mar 20 2018 8:31 PM | Last Updated on Tue, Mar 20 2018 8:39 PM

President Kovind Presents Padma Awards - Sakshi

న్యూఢిల్లీ :  రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పలువురు ప్రముఖులకు మంగళవారం పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకలో  పద్మ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌తోపాటు పలువురు అవార్డు గ్రహీతలు పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సమిత్రా మహాజన్‌, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు ఇతర ప్రముఖలు హాజరయ్యారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం 3గురికి పద్మ విభూషణ్‌, 9 మందికి పద్మ భూషణ్‌, 73 మందికి పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement