mahendrasingh dhoni
-
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం
-
ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పలువురు ప్రముఖులకు మంగళవారం పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో పద్మ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డులు అందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌తోపాటు పలువురు అవార్డు గ్రహీతలు పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సమిత్రా మహాజన్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర ప్రముఖలు హాజరయ్యారు. 69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం 3గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 73 మందికి పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
జింబాబ్వేపై గెలిచాక ధోనీ ఏం చేశాడు..?
హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తో క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువ సేన రిలాక్స్ అయింది. మూడో వన్డే ముగిసిన అనంతరం కొన్ని రోజుల నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న మహీ మళ్లీ మిస్టర్ కూల్ గా కనిపించాడు. మహీ చిన్న పిల్లాడిలా మారిపోయి యువ ఆటగాళ్లతో పోటీపడి గేమ్ లో పాల్గొన్నాడు. యువ ఆటగాళ్లతో సరదాగా గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు. భారత పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని యువ ఆటగాళ్లతో కలసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. అయితే మైదానంలో దికి ధోనీ దూకుడు ప్రదర్శించాడని మాత్రం భావించవద్దు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి వీడియో గేమ్ ఆడారు. స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా అంటూ తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఫుట్ బాల్ జట్లు స్పెయిన్, అర్జెంటీనా అంటూ విడిపోయి ధోని, ఉనద్కత్, కరుణ్ నాయర్, మన్దీప్ సింగ్‌లు వీడియో గేమ్ ఆడుతున్నట్లు మహీ పోస్ట్ చేసిన ఫొటోలో కనిపిస్తున్నారు. అక్షర్ పటేల్ మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు రెట్టించిన ధోనీ సేన రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం సాయంత్రం గం.4.30ని.లకు హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో తొలి టీ 20 ప్రారంభం కానుంది. -
నా భర్తను కలుసుకోబోతున్నా: ధోనీ భార్య
రాంచీ: వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన దేశం గర్వించేలా ఉందని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్ ధోనీ పేర్కొంది. ' గొప్ప పోరాటం చేశారు. కొన్ని గెలిచారు, కొన్ని ఓడారు. మీ త్యాగం అమూల్యం. తర్వలోనే నా భర్తను కలుసుకోబోతున్నా' అని ఆమె ట్వీట్ చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా భారత ఆటగాళ్లు గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలోనే ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నేపథ్యంలో ధోని తన పాపను చూడడానికి కూడా రాలేదు. రెండో సెమీస్ లో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన భారత ఆటగాళ్లు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. Fought Hard!Proud of the team!You win some and you lose some.All the sacrifices made are totally worth it!Finally will get to c my husband