మ్యాస్ట్రో సారథ్యంలో ధనుష్‌..! | Dhanush croons a song for Maestro Ilayaraja | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 1:50 PM | Last Updated on Thu, Feb 22 2018 1:52 PM

Dhanush Ilayaraja - Sakshi

ధనుష్‌, ఇళయరాజా

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ధనుష్‌ గాయకుడిగానూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ధనుష్‌ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న మారి 2 సినిమా కోసం మేస్ట్రో ఇళయరాజా ఓ పాట పాడారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్‌ రాజా ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అందుకు ప్రతిగా ఇప్పుడు ఇళయరాజా సంగీతమందిస్తున్న ఓ సినిమాలో ధనుష్‌ పాట పాడనున్నాడు.

ఇటీవల ఇళయరాజ సంగీత దర్శకుడిగా 1000 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ భారీ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసైజ్ఞాని స్వరపరిచిన పలు సూపర్‌ హిట్ పాటలను ధనుష్ వేదిక మీద ఆలపించారు. ధనుష్ గానం నచ్చిన మేస్ట్రో తాను సంగీతమందిస్తున్న ఓ మరాఠి సినిమాలో ధనుష్ చేత పాట పాడిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement