
మంచు మోహన్ బాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రఘువీర గద్యాన్ని పాటగా మలుస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరిగాయి. చిత్ర సంగీత దర్శకుడు ఇళయారాజాతో మోహన్ బాబు, రత్నబాబు సమావేశమయ్యారు. ‘ఇది గద్యంలాగా ఉంది. దీనికి ట్యూన్ చెయ్యడం ఎలా కుదురుతుంది? చాలా కష్టం’ అని ఇళయరాజా అనడంతో.. ‘మీకే కుదురుతుంది సార్. మీరు చేయంది లేదు’ అని చెప్పి ‘రఘువీర గద్యం’ రాత ప్రతిని ఆయనకు అందజేశారు మోహన్ బాబు.
‘11వ శతాబ్దంలో శ్రీరాముని ఘనతను చాటి చెబుతూ వేదాంత దేశికర్ అనే మహనీయుడు రఘువీర గద్యం రాశారు. ఆ గద్యాన్ని అద్భుతమైన పాటగా ప్రేక్షకులకు అందించనున్నాం. తెలుగులో ఇంతవరకూ రాని ఒక విభిన్న కథా కథనాలతో రూపొందుతోన్న చిత్రమిది. మోహన్ బాబు పవర్‌ఫుల్ రోల్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇదివరకు విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మెడలో రుద్రాక్ష మాలతో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన మోహన్ బాబు రూపానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయనకి ఇది వన్నాఫ్ ది బెస్ట్ లుక్స్ అవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, స్టైలిస్ట్: విరానికా మంచు.
Comments
Please login to add a commentAdd a comment