ట్రిపుల్‌ ట్రీట్‌ | Ilaiyaraaja, Karthik Raja and Yuvan Shankar Raja join hands for Vijay Sethupathi, Seenu Ramaswamy film | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ట్రీట్‌

Published Sun, Jan 28 2018 12:45 AM | Last Updated on Sun, Jan 28 2018 12:45 AM

Ilaiyaraaja, Karthik Raja and Yuvan Shankar Raja join hands for Vijay Sethupathi, Seenu Ramaswamy film - Sakshi

యువన్‌ శంకర్‌ రాజా, ఇళయరాజా, కార్తీక్‌ రాజ

సంగీతప్రియులకు ఓ శుభవార్త. ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్‌’ అవార్డు వచ్చిందని ఆనందంలో ఉన్న  ఈ సంగీత జ్ఞాని అభిమానుల ఆనందాన్ని డబుల్‌.. కాదు ట్రిపుల్‌ చేశారు ఆయన తనయులు యువన్‌ శంకర్‌ రాజా, కార్తీక్‌ రాజా. తండ్రి ఇళయరాజాతో కలసి ఈ ఇద్దరూ ఓ సినిమాకి పాటలు సమకూర్చనున్నారు.

సోదరుడు కార్తీక్‌ రాజాతో కలిసి యువన్‌ శంకర్‌ రాజా తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ వైయస్సార్‌ ఫిలింస్‌పై ‘మామనిదన్‌’ అనే సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకే ముగ్గురూ స్వరాలందిస్తారు. ఇంతకుముందు తండ్రి కంపోజిషన్‌లో తనయులు, తనయుల కంపోజిషన్‌లో తండ్రి పాడినప్పటికీ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పాటలివ్వడం ఇదే తొలిసారి. కచ్చితంగా ట్రిపుల్‌ ట్రీట్‌ అనే చెప్పాలి. శ్రీను రామస్వామి దర్శకత్వం వహించనున్న  ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి హీరోగా నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement