
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న అతి కొద్దిమందిలో యువన్ శంకర్‌రాజా ఒకరు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడైన ఈయన ప్యార్ ప్రేమ కాదల్ అనే చిత్రం ద్వారా నిర్మాతగానూ మారారు. అందులో నటుడు హరీశ్ కల్యాణ్ కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా మామనిదన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన గోట్ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న యువన్ శంకర్ రాజా త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో ఆయన పేర్కొంటూ త్వరలో మోగాఫోన్ పట్టనున్నట్లు చెప్పారు. తాను దర్శకత్వం వహించే చిత్రంలో నటుడు శింబును కథానాయకుడిగా నటింపజేస్తానని చెప్పారు. ఈయనకు నటుడు శింబుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఈయన దర్శకత్వంలో నటించడానికి శింబు ఒకే చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

నటుడు శింబు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. తదుపరి కమలహాసన్ తన రాజ్ కమల్ పిలింస్ పతాకంపై నిర్మించనున్న భారీ యాక్షన్ ఎంటర్‌టెయిన్‌మెంట్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తరువాత యువన్‌శంకర్‌రాజా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment