కోలివుడ్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా రూ. 20 లక్షలు ఇంటి అద్దె చెల్లించడంలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ వివాదంలో పోలీసుల విచారణ ప్రారంభించారు. ఈ కేసులో నిజనిజాలను వారు వెళ్లడించారు. ఇదే క్రమంలో ఇంటి యజమానికి యువన్ శంకర్ రాజా నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం చేకూరేలా ఇంటి యజమాని ఆరోపించాడంటూ లాయర్ ద్వారా రూ. 5కోట్లకు పరువునష్టం దావా వేశారు.
కొన్నేళ్లుగా నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్ అద్దెకు ఉంటున్నాడు. అద్దె చెల్లించకుండా యువన్ ఇబ్బంది పెడుతున్నారని, ఇప్పటి వరకు రూ. 20 లక్షలు బకాయిలు ఉన్నాయని అజ్మత్ బేగం సోదరుడు మహ్మద్ జావిద్ తిరువల్లికేణి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఇలా చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో యువన్ శంకర్ రాజా అద్దె బకాయిలున్నట్లు తేలింది.
అదేవిధంగా యువన్ శంకర్ రాజా ప్రతినెలా అద్దె మొత్తం చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా విజయ్ నటిస్తున్న గోట్ సినిమా పనుల్లో యువన్ బిజీగా ఉండటం వల్ల ఇంటి యజమానికి అందుబాటులో లేరని తెలుస్తోంది. సినిమా ఆడియో విడుదల అనంతరం ఇంటి అద్దె చెల్లిస్తానని యువన్ శంకర్ రాజా తెలియజేసినట్లు సమాచారం. అయితే, యువన్ శంకర్ రాజా ఇల్లు ఖాళీ చేసేందుకు ప్రయత్నించగా.. అద్దె చెల్లించకుండా మోసం చేస్తారనే భయంతో ఇంటి యజమాని ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను వివరణ కోరగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇందులో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అనంతరం యువన్ శంకర్ రాజా తరపున లాయర్ ఇంటి యజమానికి నోటీసులు పంపారు. యువన్‌పై నిరంతరం పరువునష్టం కలిగేలా ఇంటి యజమాని ప్రవర్తిస్తున్నారని లాయర్ తెలిపారు. దీంతో రూ. 5 కోట్లు పరిహారం చెల్లించాలని, లేదంటే ఈ సివిల్ సమస్యను క్రిమినల్ కేసుగా మారుస్తామని నోటీసులో పేర్కొన్నారు. యువన్‌పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసి తీవ్ర మనోవేదనకు గురిచేశారని, దీంతో వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment