సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా బారినపడి గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలు కుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం సాయంత్రం ఒక బులెటిన్ విడు దల చేసింది. వెంటిలేటర్ అమర్చిన స్థితిలోనే వైద్యుల బృందం బాలుకు చికిత్స అందిస్తోందని పేర్కొంది.
ప్లాస్మా చికిత్స: మంత్రి విజయభాస్కర్
తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ శనివారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి బాలుకు అందుతున్న వైద్య చికిత్స వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. కరోనా నుంచి కోలుకునేందుకు ప్లాస్మా చికిత్స అందిస్తు న్నారని, వెంటిలేటర్‌పైనే మరో రెండు రోజు లు ఉంచి చికిత్స కొనసాగిస్తారని తెలిపారు. కన్నీళ్ల
పర్యంతమైన ఇళయరాజా..
ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియ గానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కన్నీటి పర్యంతం అవుతున్నట్టుగా తమిళంలో ఒక వీడియోను విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే... ‘బాలు తొందరగా లేచిరా. మన జీవితం కేవలం సినిమాతో ముగిసిపో యేది కాదు. సినిమాతో ప్రారంభమైనది కూడా కాదు. ఎక్కడో స్టేజీల్లో ఇద్దరం కలిసి ప్రారంభించిన సంగీత కచేరీలోని సంగీతం మన జీవితంగానూ, మనకు ముఖ్యమైన జీవితాధారంగా మారింది. ఆ స్టేజీ కచేరీల్లో ప్రారంభమైన మన స్నేహం, సంగీతం, స్వరాలు ఎలా ఒకటికి ఒకటికి ఎలా పెనవేసుకుని ఉంటాయో అలా మన స్నేహం ఏనాడు చెదిరిపోలేదు. మనం తగవులు వేసుకున్నపుడు స్నేహమే, తగవులు లేన ప్పుడూ స్నేహమే అనే సంగతి నీకూ నాకూ తెలుసు. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను, నీవు కచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది’ అని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment