
ఏనుగుకు జోలపాట పాడుతున్న మావటి శ్రీకుమార్
చెన్నై: సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఓ పాటను పాడి ఏనుగును నిద్రపుచ్చిన వీడియో సామాజిక మాధ్యాల్లో వైరల్ అవుతోంది. కేరళ రాష్ట్ర తిరుచ్చూర్‌కు చెందిన మావటి శ్రీకుమార్ ఒక ఏనుగును పెంచుతున్నాడు. ఇది గత కొంత కాలంలో నిద్రలేమితో బాధపడుతోంది. ఏనుగును నిద్రపుచ్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు శ్రీకుమార్. చివరికి ఒక సినిమా పాటలు లాలిపాటగా పాడాడు. ఆ పాటతో ఏనుగు హాయిగా నిద్రపోతుంది. ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. శ్రీకుమార్ పాడిన పాట సంగీత జ్ఞాని ఇళయరాజ 1984లో సంగీతం సమకూర్చిన, మమ్ముట్టి నటించిన ఓ మలయాళ చిత్రంలోని పాట కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment