Ilayaraja songs
-
ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు, వారందరికి షాక్!
సంగీత దర్శకుడు ఇళయరాజా పిటిషన్‌పై ఎకో, అగీ ఆడియో సంస్థలకు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. వివరాలు.. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలను సీడీ, క్యాసెట్ రూపంలో విక్రయించడానికి ఎకో, అగి రికార్డింగ్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఒప్పందం కాలం ముగిసినా రెన్యువల్ చేయకుండా ఆ సంస్థలు తన పాటలను విక్రయిస్తుండడంతో ఇళయరాజా ఆ సంస్థలపై 2017లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఎకో, అగి ఆడియో సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇళయరాజా మరోసారి అప్పీలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అందులో ఒప్పంద కాలం పూర్తి అయిన తరువాత ఇళయరాజా పాటలను ఎకో, అగి రికార్డింగ్ సంస్థలు వాణిజ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆడియో సంస్థలు బదులు పిటిషన్ వేసుకోవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 31వ తేదికి వాయిదా వేసింది. కాగా చాలా కాలంగా మనస్పర్థల కారణంగా దూరంగా ఉన్న ఇళయరాజా, ఆయన సోదరుడు గంగై అమరన్ ఇటీవల అనూహ్యంగా కలుసుకోవడం విశేషం. -
కాదలన్ కాదలిక్కుమ్ రీమిక్సింగ్ పాట
-
ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!
-
ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘పాట మాధుర్యాన ప్రాణాలు విడుతునే’ అనడంలోనే పాట గొప్పతనం తెలుస్తోంది. సంగీత, సాహిత్యాల మేళవింపుతోనే పాటకు ఆ మాధుర్యం అబ్బుతుంది. కచేరి పాటలకన్నా సినిమా పాటలు ఎవరైనా ఎక్కువగా వింటారు. నాటి సినిమాల్లో పాట సాహిత్యానికి సంగీతం సమకూర్చగా నేటి రోజుల్లో సంగీత బాణికి పాటను కూరుస్తున్నారు. ఏదైనా శ్రోతలకు కావాల్సింది పాట మాధుర్యం. కొందరికి పాత పాటలు బాగా నచ్చవచ్చు. కొందరికి కొత్తవే నచ్చవచ్చు. మరికొందరికి పాత, కొత్త రెండూనూ. అది వారి వారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఏ పాట నచ్చినా అందులో మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఆ పాట కూర్చిన రికార్డింగ్ రూమ్‌లో అది ఎలా వినిపిస్తుందో మన శ్రవణానికి అలాగే వినిపించాలి. పాట ప్రసారంలో కొంత నష్టం జరగొచ్చు. ఎక్కువ జరిగితే మాత్రం పాట మాధుర్యాన్ని కోల్పోతాం. ఒకప్పుడు ఎల్పీ రికార్డులు, పూల్ టేపులు, క్యాసెట్లు, తర్వాత సీడీలు, డీవీడీల, ఎంపీ 3ల రూపాల్లో మనకు పాటలు చేరాయి. రికార్డులు దెబ్బతిన్న, టేపులు నలిగినా, సీడీ, డీవీడీలు, గీతలు పడిన పాట వినసొంపులు పోయేవి. మళ్లీ మళ్లీ రికార్డులు చేయడానికి అప్పుడు మాస్టర్ కాపీలను భద్రంగా ల్యాబ్‌లో దాచేవారు. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, ఐ ఇయర్ రేడియో, ట్యూన్ ఇన్ రేడియో, స్పాటిఫై, డీజర్, పండోరా, సౌండ్ క్లౌడ్ లాంటి ‘మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్’ చాలా వచ్చాయి. వీటి ద్వారా పాట ప్రసారంలో ‘నష్టం’ చాలా తక్కువ. తాజాగా టైడల్ అనే మరో యాప్ వస్తోంది. అందులో నష్టం మరీ, మరీ తక్కువ. అయితే వారు తీసుకునే సోర్స్‌ను బట్టి పాట నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పాత పాటలు చాలా దెబ్బతిని ఉన్నాయి. ఇక్కడకే మనకు పాటలను మరమ్మతు చేసే మాంత్రికుడు సౌండ్ ఇంజనీర్ శ్రీజేష్ నాయర్ సేవలు అవసరం. పాత, కొత్త తేడా లేకుండా ఏ పాటనైనా ఆయన మునుపటిలా మరమ్మతు చేసి ఇవ్వగలరు. ‘జోధా అక్బర్, కామినీ, గ్యాంగ్స్ ఆఫ్ వాసేయ్‌పూర్ –2 సినిమాలకు ఆయన రీ రికార్డింగ్ మిక్సర్గా పనిచేశారు. వాసేయ్‌పూర్ చిత్రానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఆయన పాత పాటలను మరమ్మతు చేసి వాటిని వినిపించడం కోసం 2017లో ‘ది మాస్టరింగ్ ప్రాజెక్ట్’ పేరిట ఓ యూట్యూబ్ చానెల్‌ను పెట్టారు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్య వచ్చిన హిందీ, తమిళ్, మలయాళం పాటలలో తనకు నచ్చిన పాటలను మరమ్మతు చేసి, వాటిని తన చానెల్ ద్వారా వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చానెల్‌కు దాదాపు 50 వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1994లో విడుదలైన ‘కాదలన్’ చిత్రంలో ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన పాటలను ఆయన మొదట మరమ్మతు చేశారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఉదిత్ నారాయణన్ పాడిన ‘కాదలన్ కాదలిక్కుమ్’ అనే పాటను ఇప్పుడు వింటుంటే నిన్ననే రికార్డు చేసినట్లు ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు 430 పాటలను మరమ్మతుచేసి రీలోడ్ చేయగా, వాటిలో 169 పాటలు రెహమాన్ సమకూర్చినవి, 38 పాటలు ఇళయరాజా సమకూర్చినవి ఉన్నాయి. శ్రీజేష్ నాయర్ మరమ్మతు చేసిన వాటిలో ‘జియా జలే, దిల్ సే రే, తాల్ సే తాల్ మిలా, హే కాలీ కాలీ హాంకే, ముష్కిల్ బడా ఏ ప్యార్ హై లాంటి మధురమైన పాటలు ఎన్నో ఉన్నాయి. ఇదివరకు దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం ఉదయం ‘చిత్రహార్’ కార్యక్రమం పేరిట వచ్చే పాటలను వింటున్నప్పుడు వాటిలో చాల దెబ్బతిన్న పాటలు నాయర్‌కు కనిపించాయట. అప్పటికి ‘డాల్బీ నాయిస్ రిడక్షన్’ వ్యవస్థ స్పీకర్లలలో ఉన్నప్పటికీ ఎక్కువ ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ దిశగా తాను కషి చేయాలని నాయర్ నిర్ణయానికి వచ్చాడట. అప్పటి నుంచి పాటలలోని సంగీతపరంగా చోటు చేసుకున్న లోపాలను గుర్తించి రీమిక్సింగ్ మొదలు పెట్టారు. అందుకోసం ఆయన ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ‘అవిడ్ ప్రో టూల్స్, ఏడిఎక్స్ ట్రాక్స్‌లతోపాటు ఇతర సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు. నాయర్ మరమ్మతు చేసిన కొన్ని పాటలు అస్సలు వాటికన్నా బాగున్నాయని ఆయన చానెల్ సబ్స్క్రైబర్లు ప్రశంసిస్తుంటే, ఆయన ఒరిజనల్ పాటలో లేకున్నా కొన్ని చోట్ల బాస్ (మంద్ర ధ్వని), మరి కొన్ని చోట్ల ట్రెబుల్ (మూడింతల పిచ్) పెంచుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఒరిజనల్ పాటలో లేకపోయినా అక్కడ సంగీత దర్శకుడు రాబట్టాలనుకున్న పరిపూర్ణతను దష్టిలో పెట్టుకొని తాను మరమ్మతు చేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. -
బోస్టన్‌లో ఇళయరాజా పాటల హోరు
బోస్టన్: తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బోస్టన్ లో ఇళయరాజా పాటల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. బోస్టన్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగువారిలో గాన మాధుర్యం ఉన్న కళకారులను ప్రోత్సాహించే ఉద్దేశంతో నాట్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మధుచారి ఆధ్వర్యంలో 21 మందితో గాయనీ, గాయకులతో కూడిన మధురవాణి బృందం ఇళయరాజా స్వరపరిచిన పాటలను పాడి ప్రేక్షకులను అలరించింది. ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదభరితంగా సాగింది. ఐదుగురితో కూడిన వ్యాఖ్యతల బృందం మధ్య మధ్యలో ఇళయారాజా సాధించిన సంగీత విజయాలు.. ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తూ.. కార్యక్రమానికి వన్నె తెచ్చారు. సెయింట్ లూయిస్, న్యూజెర్సీల నుంయి విచ్చేసిన నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ సభ్యులు మోహన్ కృష్ణ మన్నవ , శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీ వెనిగళ్ల తదితరులు నాట్స్ బోస్టన్ విభాగం చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఇంకా ఈ పాటల కార్యక్రమంలో పాల్గొన్న మధురవాణి బృంద సభ్యులను, వ్యాఖ్యాతలను శాలువలతో ఘనంగా సత్కరించారు. స్థానిక తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ ఏరియా ప్రెసిడెంట్ సీతారాం అమరవాదితో పాటు పలువురు స్థానిక తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దాదాపు 250 మందికి పైగా స్థానిక తెలుగు వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళయారాజా పాటల సందడిలో మధురానుభూతులు పొందారు. ఇళయరాజా పాటల కార్యక్రమం మధురవాణిని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు ఈ బృందంలో పాడిన గాయని, గాయకులకు నాట్స్ బోస్టన్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ గొంది గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటల కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో నాట్స్ టీం సభ్యులు కూడా ఎంతో కృషి చేశారని... ఇదే ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలను బోస్టన్ లో చేపడతామని శ్రీనివాస్ గొంది ప్రకటించారు -
ఇళయరాజాపై హైకోర్టులో కేసు
పెరంబూరు(చెన్నై): సంగీత జ్ఞాని ఇళయరాజాకు వ్యతిరేకంగా చిత్ర నిర్మాతలు చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఏ వేదికపైనా పాడరాదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, గత ఐదేళ్లుగా తన పాటలకు రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి చెక్‌పెట్టేలా ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ తదితర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పీటీ సెల్వకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగీతాన్ని అందించిన పాటలపై తనకే హక్కంటూ వాటిపై ఇళయరాజానే రాయల్టీ పొందడం చట్ట విరుద్ధమన్నారు. పాటల రాయల్టీలో చిత్ర నిర్మాతకు కనీసం 50 శాతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశామన్నారు. -
ఇళయరాజా పాటతో మైమరిచిన గజేంద్రుడు!
చెన్నై: సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఓ పాటను పాడి ఏనుగును నిద్రపుచ్చిన వీడియో సామాజిక మాధ్యాల్లో వైరల్ అవుతోంది. కేరళ రాష్ట్ర తిరుచ్చూర్‌కు చెందిన మావటి శ్రీకుమార్ ఒక ఏనుగును పెంచుతున్నాడు. ఇది గత కొంత కాలంలో నిద్రలేమితో బాధపడుతోంది. ఏనుగును నిద్రపుచ్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు శ్రీకుమార్. చివరికి ఒక సినిమా పాటలు లాలిపాటగా పాడాడు. ఆ పాటతో ఏనుగు హాయిగా నిద్రపోతుంది. ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. శ్రీకుమార్ పాడిన పాట సంగీత జ్ఞాని ఇళయరాజ 1984లో సంగీతం సమకూర్చిన, మమ్ముట్టి నటించిన ఓ మలయాళ చిత్రంలోని పాట కావడం విశేషం. -
కమల్ సరసన?
‘అప్పా అమ్మా విళయాట్టు’... కమల్‌హాసన్ నటించనున్న తాజా చిత్రం తమిళ టైటిల్ ఇది. అంటే.. ‘అమ్మా నాన్న ఆట’ అని అర్థం. తెలుగు టైటిల్ కూడా అదే. ఈ చిత్రంలో కమల్ సరసన జరీనా వహాబ్, అక్కినేని అమల నటించనున్నారనే విషయం తెలిసిందే. వీళ్లతో పాటు తాజాగా శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది. మరో నాయికగా ఆమెను తీసుకోవాలనుకుంటున్నారట. పదహారేళ్ల వయసు, ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఎర్ర గులాబీలు.. ఇలా కమల్, శ్రీదేవి కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి. ఒకప్పుడు ఈ ఇద్దరిదీ హిట్ పెయిర్. ఒకవేళ నిజంగానే ‘అప్పా అమ్మా విళయాట్టు’లో శ్రీదేవి ఉంటే, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జంట తెరపై కనిపించినట్లవుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరచనున్నారట. పదకొండేళ్ల తర్వాత కమల్ సినిమాకి ఆయన పాటలు స్వరపరచనున్నారు.