
కమల్ సరసన?
‘అప్పా అమ్మా విళయాట్టు’... కమల్‌హాసన్ నటించనున్న తాజా చిత్రం తమిళ టైటిల్ ఇది.
‘అప్పా అమ్మా విళయాట్టు’... కమల్‌హాసన్ నటించనున్న తాజా చిత్రం తమిళ టైటిల్ ఇది. అంటే.. ‘అమ్మా నాన్న ఆట’ అని అర్థం. తెలుగు టైటిల్ కూడా అదే. ఈ చిత్రంలో కమల్ సరసన జరీనా వహాబ్, అక్కినేని అమల నటించనున్నారనే విషయం తెలిసిందే. వీళ్లతో పాటు తాజాగా శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది. మరో నాయికగా ఆమెను తీసుకోవాలనుకుంటున్నారట. పదహారేళ్ల వయసు, ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఎర్ర గులాబీలు.. ఇలా కమల్, శ్రీదేవి కాంబినేషన్‌లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి.
ఒకప్పుడు ఈ ఇద్దరిదీ హిట్ పెయిర్. ఒకవేళ నిజంగానే ‘అప్పా అమ్మా విళయాట్టు’లో శ్రీదేవి ఉంటే, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జంట తెరపై కనిపించినట్లవుతుంది. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలు స్వరపరచనున్నారట. పదకొండేళ్ల తర్వాత కమల్ సినిమాకి ఆయన పాటలు స్వరపరచనున్నారు.