‘పాట మాధుర్యాన ప్రాణాలు విడుతునే’ అనడంలోనే పాట గొప్పతనం తెలుస్తోంది. సంగీత, సాహిత్యాల మేళవింపుతోనే పాటకు ఆ మాధుర్యం అబ్బుతుంది. కచేరి పాటలకన్నా సినిమా పాటలు ఎవరైనా ఎక్కువగా వింటారు. నాటి సినిమాల్లో పాట సాహిత్యానికి సంగీతం సమకూర్చగా నేటి రోజుల్లో సంగీత బాణికి పాటను కూరుస్తున్నారు. ఏదైనా శ్రోతలకు కావాల్సింది పాట మాధుర్యం. కొందరికి పాత పాటలు బాగా నచ్చవచ్చు. కొందరికి కొత్తవే నచ్చవచ్చు. మరికొందరికి పాత, కొత్త రెండూనూ. అది వారి వారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది.