
సంగీత దర్శకుడు ఇళయరాజా తన కేసును వెనక్కి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇళయరాజా 40 ఏళ్లకు పైగా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న గదిని ఖాళీ చేయాలంటూ ప్రసాద్ స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. ఇళయరాజా ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్టూడియో అధినేతలు ఇళయరాజాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: ఇళయరాజాకు ఎందుకు అనుమతివ్వరు
న్యాయమూర్తి ఎన్.సతీష్‌కుమార్ ఒక రోజు ధ్యానం చేసుకోవడానికి ఇవ్వాలన్న ఇళయరాజా కోరికను ఎందుకు అంగీకరించరని ప్రసాద్ స్టూడియో అధినేతలను ప్రశ్నించారు. అందుకు స్టూడియో అధినేతలు ఇళయరాజా తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని బదులిచ్చారు. దీనికి బదులివ్వాల్సిందిగా ఇళయరాజాను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇళయరాజా బుధవారం కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు.