ఫిబ్రవరిలో 'మన ఊరి రామాయణం' | prakash raj, mana oori ramayanam to release in February | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో 'మన ఊరి రామాయణం'

Published Sat, Jan 16 2016 2:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

ఫిబ్రవరిలో 'మన ఊరి రామాయణం'

ఫిబ్రవరిలో 'మన ఊరి రామాయణం'

తన విలక్షణ నటనతో సౌత్, నార్త్ ఇండస్ట్రీలను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్.., నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ధోని, ఉలవచారు బిర్యానీ లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ రాజ్ త్వరలోనే మరో కొత్త కాన్సెప్ట్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు మన ఊరి రామాయణం అనే టైటిల్ను ఫైనల్ చేశాడు.

తన సొంతం నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్,  ఫస్ట్ కాపీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో మన ఊరి రామయణం సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement