మనలోని రామాయణం! | Teaser Talk: 'Manaloni' Ramayanam | Sakshi
Sakshi News home page

మనలోని రామాయణం!

Published Fri, Aug 12 2016 8:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

మనలోని రామాయణం!

మనలోని రామాయణం!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన ఊరి రామాయణం'. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరంలో బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తున్న పాట.. సినిమా థీమ్ను వివరిస్తుంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భుజంగయ్య అనే పల్లెటూరి పెద్ద మనిషి పాత్రలో అలరించనున్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మనుషులు, సంఘటనలతో కూడిన సహజమైన కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. టీజర్ చివరలో ప్రముఖ తార ప్రియమణి మెరిసి మాయమవుతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందనేది ఇంకా ఖరారు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement