గీత స్మరణం | song composed by ilayaraja | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Tue, Nov 5 2013 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

గీత స్మరణం

గీత స్మరణం

 పల్లవి
 పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
 ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే    ॥
 అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
 కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్
 ॥
 చరణం : 1
 చిరుగాలి పరదాలే గలగలలాడి
 చెవిలోన లోలాకూ జతగా పాడి    ॥
 బంగరు దేహం సోలుతుంది పాపం
 చ ల్లనీపూటా కోరుకుంది రాగం
 నీవే అన్నావే నే పాడాలంటూ
 ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్
 ॥
 చరణం : 2
 ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
 రేరాణి తాపంలో వెల్లువై పొంగే    ॥
 చింతలన్ని తీర్చే మంచు పువ్వు నీవే
 మెత్తగా లాలీ నే పాడుతాలే
 విరిసే హరివిల్లే ఊరించే వేళా
 మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్
 ॥
 
 చిత్రం : తూర్పు సిందూరం (1990); రచన : సిరివెన్నెల
 సంగీతం : ఇళయరాజా; గానం : ఎస్.పి.బాలు
 
 నిర్వహణ: నాగేశ్
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement