ఆ ఇద్దరూ ట్రెండ్‌ మార్చారు! | The two people trends have changed! | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ ట్రెండ్‌ మార్చారు!

Published Sat, Apr 22 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఆ ఇద్దరూ ట్రెండ్‌ మార్చారు!

ఆ ఇద్దరూ ట్రెండ్‌ మార్చారు!

‘‘నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో ఇద్దరు రాజాలు (భారతీరాజా, ఇళయరాజా) ట్రెండ్‌ మార్చేశారు. సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసిన భారతీరాజా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన తనయుడు మనోజ్‌ ‘బేబి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు సీనియర్‌ నటుడు సుమన్‌. మనోజ్‌ హీరోగా డి. సురేశ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘బేబి’ని అదే పేరుతో తెలుగులో అనువదించారు.

శిరా గర్గ్, అంజలీరావు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పాలపర్తి శివకుమార్‌ శర్మ సమర్పణలో నిర్మాతలు బీవీఎన్‌ పవన్‌కుమార్, కొలవెన్ను ఆంజనేయప్రసాద్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సతీష్, హరీష్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను సుమన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ విడుదల చేశారు. ‘‘హారర్, సస్పెన్స్‌ చిత్రమైనా కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement