కొత్త హీరోతో శృతి ఐటమ్ సాంగ్ | Sruthi Haasan to sizzle ina special song in jaguar | Sakshi
Sakshi News home page

కొత్త హీరోతో శృతి ఐటమ్ సాంగ్

Published Wed, Aug 24 2016 12:28 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

కొత్త హీరోతో శృతి ఐటమ్ సాంగ్

కొత్త హీరోతో శృతి ఐటమ్ సాంగ్

తన కెరీర్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ చేసింది శృతి హాసన్. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కావటంతో కాదలేక ఆ ప్రాజెక్ట్ ఒప్పుకుంది. తరువాత చాలా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చినా.. నిర్మొహమాటంగా కాదనేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఐటమ్ నంబర్కు సై అంటోంది ఈ బ్యూటి. అది కూడా ఓ యంగ్ హీరో తొలి సినిమాలో స్పెషల్ సాంగ్కు ఓకె చెప్పింది.కన్నడలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న నిఖిల్ కుమార్ సరసన స్పెషల్ సాంగ్కు రెడీ అవుతోంది శృతి. 
 
కన్నడ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడి సినిమా కావటంతో పాటు, భారీగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేయటంతో శృతి ఈ సాంగ్ చేయడానికి అంగీకరించిందట. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాగ్వర్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా దాదాపు 75 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement