తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్..! | Nikhil kumar Jaguar Movie Budget 75 Crores | Sakshi
Sakshi News home page

తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్..!

Published Fri, Jul 29 2016 1:18 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్..!

తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్..!

స్టార్ ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు కూడా భారీ బడ్జెట్ సినిమాలతో పరిచయం అవ్వాలంటే భయపడతారు. రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, అఖిల్ లాంటి హీరోలు అలా భారీ బడ్జెట్ సినిమాలతో పరిచయమయ్యి నష్టపోయారు. ఈ ఇద్దరు హీరోలు పరిచయం అయ్యింది దాదాపు 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలతోనే. ఇప్పుడు ఈ రికార్డ్ లన్నింటినీ బ్రేక్ చేస్తూ తన తొలి సినిమాకే 75 కోట్ల బడ్జెట్తో బరిలో దిగుతున్నాడు ఓ యంగ్ హీరో.

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ కుమార్ జాగ్వర్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 75 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరిస్తున్న జాగ్వర్ యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు. కన్నడ మార్కెట్ పరంగా చూస్తే మాత్రం ఇంత భారీ బడ్జెట్ చాలా పెద్ద రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది.

బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి సినిమాలకు కథ అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్, ఈ సినిమాకు కథ అందిస్తుండగా, బాలకృష్ణ హీరోగా మిత్రుడు సినిమాను తెరకెక్కించిన మహదేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్న జాగ్వర్ ఫస్ట్ లుక్ను ఈ నెల 31న కన్నడ, తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement