![Actress Shruti Haasan opens up about her weakness points - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/12/26/sh.jpg.webp?itok=0CaFGOr3)
దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తరచూ వార్తల్లో ఉండే నటి కూడా. ముఖ్యంగా అప్పుడప్పుడూ బాయ్ ఫ్రెండ్‌లతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ సంచలనం సృష్టిస్తుంటుంది. అయితే అన్నింటికీ మించి ప్రతిభ కలిగిన నటి ఈమె. అయితే తమిళంలో శృతిహాసన్ ప్రతిభకు తగ్గ విజయాలు ఇంకా రాలేదనే చెప్పాలి. తెలుగులో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నారు.
ప్రస్తుతం అక్కడ మెగాస్టార్ సరసన నటించిన వాల్తేరు వీరయ్య. బాలకృష్ణతో జత కట్టిన వీర సింహారెడ్డి చిత్రాలు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం విశేషం. అలాగే మరో స్టార్ హీరో ప్రభాస్‌తో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నటి శృతిహాసన్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ నటిగా పరిచయమైన కొత్తలో అందరూ తన హైట్ గురించే మాట్లాడుకునే వారిని చెప్పారు.
కొందరైతే ఇంత ఎత్తుగా ఉన్నావేంటి? నీ హైటే నీకు మైనస్ అంటూ కామెంట్స్ కూడా చేసేవారు అని చెప్పింది. అలాంటి కామెంట్స్ ఒక దశలో తనను బాధించాయని చెప్పారు. అయితే ఆ తర్వాత తన హైటే తనకు ప్లస్ పాయింట్ అన్నది గ్రహించానని చెప్పారు. తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల సరసన నటించే అవకాశం రావడానికి నా హైట్ నే కారణంగా మారిందని చెప్పారు. అయితే తనలోను కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వస్తున్నానని శృతిహాసన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment